For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Krishna and His Leela మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: సిద్దు జొన్నలగడ్డ, సీరత్ కపూర్, శ్రద్దాకపూర్, షాలిని వద్నికట్టి, వైవా హర్ష
  Director: రవికాంత్ పేరేపు

  కరోనావైరస్ సృష్టించిన సంక్షోభం సినిమా పరిశ్రమను అతలాకుతలం చేసింది. సినిమా షూటింగులు, థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులకు వినోదం కరువైంది. అయితే థియేటర్లు మూత పడిన నేపథ్యంలో ప్రేక్షకులకు ఓటీటీ ఫ్లాట్‌ఫాంలే దిక్కు అయ్యాయి. అలాంటి సమయంలో సినీ దర్శక, నిర్మాతలు తమ సినిమాల రిలీజ్‌ను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

  ఇప్పటికే జ్యోతిక నటించిన పొనుమందాల్ వందాల్, కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్, అలాగే అమితాబ్ నటించిన గులాబో సితాబో చిత్రాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యాయి. తాజాగా యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, సీరత్ కపూర్, శ్రద్దాకపూర్, షాలిని వద్నికట్టి హీరోయిన్లుగా నటించిన కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బలం, బలహీనలు, ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ, కథనాల గురించి తెలుసుకోవాల్సిందే.

  కథ ఏమిటంటే..

  కథ ఏమిటంటే..

  అప్పుడే ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేరేందుకు సిద్దమయ్యే యువకుడు కృష్ణ (సిద్దు జొన్నలగడ్డ)కు సత్య (శ్రద్దా శ్రీనాథ్)‌తో బ్రేకప్ జరుగుతుంది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సత్యను వదులుకోవడం కష్టంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో తన కాలేజీలో చదివే రాధ (షాలిని వద్నికట్టి) అనే యువతితో ప్రేమలోపడుతాడు. వారి ప్రేమ చిగురు తొడుగుతున్న సమయంలోనే కృష్ణకు జాబ్ రావడంతో బెంగుళూరుకు వెళ్లిపోతాడు. అలా రాధకు దూరమైన కృష్ణకు సత్య మళ్లీ దగ్గరవుతుంది. బెంగళూరులో తన సోదరి ఫ్రెండ్ రుక్సార్ (సీరత్ కపూర్)‌పై ఒకరకమైన ఆకర్షణ పెరుగుతుంది.

  కథలో ట్విస్టులు

  కథలో ట్విస్టులు

  కృష్ణకు సత్య మళ్లీ చేరువ కావడంతో రాధ పరిస్థితి ఏమిటి? సత్యతో అఫైర్‌ను కొనసాగించాడా? లేక రాధతోనే ఉండి సత్యను వదులుకొన్నాడా? రాధ, సత్యతో ఉన్న రిలేషన్‌కు కృష్ణ ఎలా జస్టిఫై చేశాడు. రుక్సార్‌తో వ్యవహారం ఎలా ముగిసింది. ఫ్యామిలీలో తన తల్లి, తండ్రి బ్రేకప్ కృష్ణపై ఎలాంటి ప్రభావం చూపించింది. తండ్రి లేని జీవితాన్ని కృష్ణ ఎలా ఫీలయ్యాడు? చివరకు తనలో ఉన్న అసంతృప్తికి తండ్రి తనకు ఎలాంటి పరిష్కారాన్ని చూపించాడు అనే ప్రశ్నలకు సమాధానమే కృష్ణ అండ్ హిజ్ లీల మూవీ కథ.

  ఫస్టాఫ్ రివ్యూ

  ఫస్టాఫ్ రివ్యూ

  కృష్ణ, సత్య మధ్య బ్రేకప్‌తో కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్ర కథ మొదలవుతుంది. ఆ తర్వాత రాధకు చేరువ కావడం, ఆ వెంటనే వైజాగ్ నుంచి కృష్ణ జాబ్ కోసం బెంగళూరుకు వెళ్లడం లాంటి అంశాలు చకచకా జరిగిపోతాయి. వైజాగ్‌లో రాధతో, బెంగళూరులో సత్యతో రిలేషన్ మధ్య కథ ఊగిసలాడుతుంది. మధ్యలో రుక్సార్ గ్లామర్ యాడ్ చేసి సినిమాను యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా మార్చే ప్రయత్నం చేశారు. అలా యూత్‌కు సంబంధించిన పూర్తి ఎలిమెంట్స్ ఇప్పటి యువత ఫేస్ చేసే అంశాలను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు దర్శకుడు రవికాంత్.

  సెకండాఫ్ రివ్యూ..

  సెకండాఫ్ రివ్యూ..

  ఇక సెకండాఫ్‌లో రాధా, సత్య మధ్య నలిగిపోయే కృష్ణ పరిస్థితి ప్రధాన కథాంశంగా మారుతుంది. ఇద్దరిని వదులుకోలేని పరిస్థితుల్లో పడే ఎమోషనల్ అంశాలతో కథ ముందుకు వెళ్తుంది. ఇలాంటి కథలోకి తన తల్లిదండ్రులు (ఝాన్సీ, సంపత్ కుమార్) ఎపిసోడ్‌ను కథలోకి పట్టుకొచ్చి మరింత భావోద్వేగాన్ని, నాటకీయతను జోడించే ప్రయత్నం చేశారు. అయితే తల్లిదండ్రులు బ్రేకప్ అంశాన్ని మరింత ఎమోషనల్‌గా మార్చే స్కోప్ ఉన్నప్పటికీ.. దర్శకుడు హడావిడిగా ముగించేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక చివర్లలో రాధ, సత్య రిలేషన్లకు కృష్ణ ఎలా ముగింపు, జస్టిఫై చెశారనేది దర్శకుడు రవికాంత్ చూపించిన సొల్యూషన్ చాలా రొటీన్‌గానే ఉంది.

  దర్శకుడు రవికాంత్ ప్రతిభ

  దర్శకుడు రవికాంత్ ప్రతిభ

  దర్శకుడు రవికాంత్ ఎంచుకొన్న పాయింట్‌ను పూర్తిస్థాయి కథగా, ఆసక్తికరమైన కథనంగా మార్చే విషయంలో ఫర్‌ఫెక్ట్‌గా బాలెన్స్ చేశారు. పాత్రలకు ఎంచుకొన్న నటీనటులు, వారితో ఫెర్ఫార్మెన్స్ రాబట్టుకొన్న విధానం చూస్తే కొత్త దర్శకుడు అనే ఫీలింగ్ కలగదు. సిద్ద జొన్నలగడ్డతో కలిసి కథలో భాగం పంచుకొని.. రచయితగా తన మెచ్యూరిటీని ప్రూవ్ చేసుకొన్నారు. వరల్డ్ ఫేమస్ లవర్, అర్జున్ రెడ్డి, జర్సీ లాంటి సినిమాల ప్రభావం ఎక్కువగానే కనిపించినప్పటికీ.. తన మార్కును చూపించడంలో ఎలాంటి తడబాటుకు గురికాలేదనే విషయం స్పష్టంగా కనిపించింది. సంపత్ కుమార్ (తండ్రి) క్యారెక్టర్‌ను కథలోకి పట్టుకొచ్చి స్టోరిని ముగించిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దపట్టింది. సెకండాఫ్‌లో కథ కాస్త నత్త నడక నడినట్టు అనిపించింది.. దానిని సరిచేసుకోగలిగి ఉంటే సినిమా మరింత ఉత్తేజంగా, ఉల్లాసంగా, ఉద్వేగంగా మారి ఉండేదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది.

  సిద్దు జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్

  సిద్దు జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్

  ఇక కృష్ణగా అనేక రకాల ఎమోషన్స్ ఉన్న పాత్రను సిద్దు అవలీలగా మెప్పించాడు. సినిమా భారాన్ని మొత్తం ఆది నుంచి అంతం వరకు తన భుజాలపై మోసి సినిమాను మరో మెట్టు ఎక్కించారు. తన ఎంట్రీతో మరో యువ హీరో ఇండస్ట్రీకి వచ్చాడనే ఫీలింగ్ కల్పించడంలో సిద్దు సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న యువ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా తెరపైన మెచ్యురిటీని ప్రదర్శించాడు. కొత్త హీరో అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారనిపిస్తుంది. అలాగే రచయితగా, ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో కూడా రాణించారని చెప్పవచ్చు

  శ్రద్దా శ్రీనాథ్, షాలిని, సీరత్ కపూర్

  శ్రద్దా శ్రీనాథ్, షాలిని, సీరత్ కపూర్

  సత్యగా శ్రద్దా శ్రీనాత్ మరోసారి పరిణతితో కూడిన నటనను ప్రదర్శించారు. గత చిత్రాలతో పోల్చుకొంటే నటిగా మంచి మార్కులే కొట్టేశారు. కొంచెం పొగరు, కొంచె ప్రేమ కలబోసిన సత్య పాత్రలో ఒదిగిపోయారు. ఇక రాధ పాత్రలో షాలిని తన పెర్ఫార్మెన్స్‌ ఆకట్టుకొన్నారు. ఎమోషనల్‌తో కూడిన పాత్రకు న్యాయం చేశారని చెప్పవచ్చు. రాధ పాత్రలో ఉండే సెన్సిబులిటీని అర్ధం చేసుకొని తెరపైన పండించడం షాలిని ప్లస్ పాయిట్ అని చెప్పవచ్చు. ఇక సీరత్ కపూర్ అందాల పంట పడించడానికే పరిమితమయ్యారు. సీరత్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం కారణంగా తెరపైన గ్లామర్‌గానే కనిపించారు.

  సపోర్టింగ్ రోల్స్‌లో

  సపోర్టింగ్ రోల్స్‌లో

  ఇక కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రంలో సపోర్టింగ్ క్యారెక్టర్లకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వైవా హర్ష కామెడీతో సినిమాను ఆహ్లాదకరంగా మార్చేశారు. సింగిల్ పేరెంట్‌గా ఝాన్సీ సూపర్‌గా కనిపించారు. సంపత్ తన రాకతో కథను ఎమోషనల్‌గా మార్చే ప్రయత్నం చేశారు. రాజ్ మదిరాజ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఫర్యాలేదనిపించారు.

  సాంకేతిక నిపుణుల పనితీరు

  సాంకేతిక నిపుణుల పనితీరు

  తెర వెనుక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రానికి బలం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. కథలోని ఎమోషనల్ సన్నివేశాలను గానీ, లేదా ఫన్ మూమెంట్స్ గానీ ఎలివేట్ చేయడంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఉపయోగపడింది. సినిమాటోగ్రఫి కూడా సినిమా మరో స్పెషల్ ఎట్రాక్షన్. సానీల్ డియో, సాయిప్రకాశ్ పనితనం బాగుంది. వైజాగ్ అందాలతో ప్రేక్షకుడిని కట్టపడేశారని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో కాస్త ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ శ్రద్ధ పెట్టి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. సంజయ్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు భేష్ అని చెప్పవచ్చు

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  ఎమోషనల్‌, యూత్, ఫన్ ఎలిమెంట్స్ కలబోసిన చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీల. ప్రేక్షకుడికి చక్కని అనుభూతులు పంచుతంది. ముఖ్యంగా ఎక్కడో తన జీవితంలో జరిగే సంఘటనలు కనెక్ట్ చేయడానికి అవకాశం లేకపోలేదు. అన్ని అంశాలతో కథను బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. దర్శకుడి విజన్‌ను హీరోగా సిద్దు మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. అయితే ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫాం మీద కంటే నేరుగా థియేటర్లలో రిలీజ్ చేస్తుంటే అన్ని రకాలుగా మంచి ఫీడ్‌బ్యాక్ లభించి ఉండేదనడంలో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. ఇది ఓటీటీ సినిమా కాదు.. థియేట్రికల్ ఎక్సీపిరియెన్స్ ఫీలయ్యే సినిమా అని చెప్పవచ్చు.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  • నటీనటులు ఫెర్ఫార్మెన్స్
  • మ్యూజిక్
  • సినిమాటోగ్రఫి
  • డైరెక్షన్

  మైనస్ పాయింట్

  • సెకండాఫ్‌లో స్లో నేరేషన్
  • క్లైమాక్స్ రొటీన్‌గా ఉండటం
  • కథను మరింత ఎమోషనల్‌గా మలచలేకపోవడం
  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, సీరత్ కపూర్, శ్రద్దాకపూర్, షాలిని వద్నికట్టి

  దర్శకుడు: రవికాంత్ పేరేపు

  నిర్మాత: సంజయ్ రెడ్డి

  రచన సహకారం: రవికాంత్ పేరేపు, సిద్దు జొన్నలగడ్డ

  సంగీతం: శ్రీచరణ్ పాకాల

  సినిమాటోగ్రఫి: సానీల్ డియో, సాయిప్రకాశ్

  ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, రవికాంత్ పేరేపు, సిద్దు జొన్నలగడ్డ

  రిలీజ్ డేట్: 2020-06-25

  ఓటీటీ: నెట్ ఫ్లిక్స్

  English summary
  Krishna and His Leela movies concept based on new generation's confused relations and love story. Directed by Ravikanth Perepu, starred by Sidhu Jonnalagadda, Seerat Kapoor, Shraddha Srinath, Shalini Vadnikatti. This movie released in Netflix on June 25th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X