twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆకట్టుకోలేని క్షేత్రం(రివ్యూ)

    By Bojja Kumar
    |

    jagapathi babu-priyamani
    చిత్రం : క్షేత్రం
    బ్యానర్ : శ్రీబాలాజీ మూవీస్
    దర్శకత్వం : టి. వేణుగోపాల్
    సంగీతం : కోటి
    నిర్మాత : గోవింద రాజులు
    విడుదల : డిసెంబర్ 29, 2011
    తారాగణం : ప్రియమణి, జగపతిబాబు, కిక్ శ్యాం, ఆదిత్య మీనన్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, అన్నపూర్ణ, హేమ, శివ పార్వతి, సురేఖ వాణి, ఉత్తేజ్, కొండవలస తదితరులు...

    ఈ మధ్య వరుస ప్లాపులు చవి చూసిన ప్రియమణి తాజాగా అరుంధతి రేంజ్ లో రూపొందిన 'క్షేత్రం' సినిమా ద్వారా తన అదృష్టం పరీక్షించుకోవడానికి వచ్చింది. గ్లామర్ రేస్ లో వెనక బడ్డ ఈ తార అనుష్క, చార్మి లాంటి వారి రూట్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై కన్నేసింది. ఈ చిత్రంలో జగతిపబాబు, కిక్ శ్యాం ప్రధాన పాత్రలో నటించారు. మరి ఈ క్షేత్రం విశేషాలు ఏమిటో రివ్యూలో చూద్దాం...

    కథలోకి వెళితే..
    లక్ష్మి నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ట విషయంలో గొడవలు రావడంతో నరసింహ రాయుడు(జగపతిబాబు), నాగ పెంచలమ్మ(ప్రియమణి)లు కోట శ్రీనివాసరావు, ఆదిత్య మీనన్ చేతిలో హత్యకు గురవుతారు. అడవిలో ఉన్న లక్ష్మి నరసింహ స్వామి విగ్రహాన్ని గుడిలోకి తీసుకువస్తే ట్రస్టుకు సంబంధించిన డబ్బు పేదలకు పంచ బడుతుంది. దీని వల్ల తమకేంటి లాభం అనే దుర్మార్గపు ఆలోచన చేసి ఈ దారుణానికి పాల్పడతారు. చనిపోయిన తర్వాత నాగ పెంచలమ్మ ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నరసింహ రాయుడి అంశతో పుట్టిన చక్రి(శ్యాం)ని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన సుహాని దేహంలోకి నాగపెంచలమ్మ ఆత్మ ప్రవేశిస్తుంది. తన భర్తను చంపిన వారిపై ఎలా పగ తీర్చుకుందనేది థియేటర్లో చూడాల్సిందే.

    విశ్లేషణ : సినిమా కథ, కథనం బాగానే ఉన్నప్పటికీ, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని కమర్సియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కథను చూపే విధానం, స్క్రీన్ ప్లే తీరు, నటీనటుల నుంచి కావాల్సిన భావోద్వేగాలను పలికించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. దీంతో సినిమా టీవీ సీరియల్ మాదిరి తయారైంది. అవసరం లేకున్నా అరుంధతి, చంద్రముఖి లాంటి చిత్రాలను అనుకరించే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. పాత్రల రూపకల్పన అస్సలు బాగోలేదు. జగపతి బాబు ఎమోషనల్ డైలాగులు నవ్వుతెప్పించడం ఒక కారణం అయితే, ఆయన పాత్రకు అర్థం లేకుండా పోవడం మరో మైనస్ పాయింట్...ఇలా అనేక రకాలుగా సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

    ప్రియమణి నటన ఫర్వాలేదు, జగపతిబాబు గెటప్ పవర్ పుల్ గా ఉందికానీ, పెర్పార్మెన్స్ మాత్రం ఆ రేంజ్లో లేదు. పరురుచూపి మాటలు ఫర్వా లేదు, పాటలు సంబంధం లేకుండా ఉన్నాయి. కోటి సంగీతం, బ్యాంగ్రౌండ్ స్కోరు ఆకట్టుకోలేదు. కోట శ్రీనివాసరావుది రొటీన్ రోల్, ఆదిత్య మీనన్ ఫర్వాలేదు. బ్రహ్మీ ఇలా కనిపించి అలా మాయం అయ్యాడు. కిక్ శ్యాం తన పాత్రకు న్యాయం చేశాడు. ఇతర నటీనటులు వారివారి పాత్రల మేరకు రాణించారు. ఓవరాల్ గా సినిమా....అన్ని వర్గాల ప్రేక్షకులను నిరాశ పరిచిందనే వాదన సినీ సర్క్యూట్ లో వినిపిస్తోంది.

    English summary
    Kshetram has generated the interest as it sports a hit pair – Jagapathi Babu and Priyamani. The other interesting factor is the subject – God. The makers of the film has not publicized much and sent out a feeling that the film was something similar to films like Arundathi and Chandramukhi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X