»   » టెలీపతి కాన్సెప్టు కొత్తగా ఉంది, కానీ... (‘లంక’ రివ్యూ)

టెలీపతి కాన్సెప్టు కొత్తగా ఉంది, కానీ... (‘లంక’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

హైదరాబాద్: ఒకప్పటి హీరోయిన్ రాశి ప్రధాన పాత్రలో 'లంక' అనే సినిమా అనౌన్స్ కాగానే పోస్టర్ చూసి చాలా మంది ఉలిక్కిపడ్డారు. ఆ పోస్టర్లలో రాశి లుక్ కాస్త భయంకరంగా ఉండటమే. సినిమా టైటిల్, ఆమె లుక్ చూసి ఇదేదో రొటీన్ హారర్, దెయ్యాల సినిమా అనే భావించారు చాలా మంది.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీముని ఈ సినిమా ద్వారా 'టెలిపతి' అనే కొత్త కాన్సెప్టును తెలుగు ప్రేక్షుకులకు పరిచయం చేసే ప్రయత్నం చేసాడు. అసలు ఏమిటీ 'టెలిపతి'... దీని గురించి దర్శకుడు ఏం చెప్పే ప్రయత్నం చేసాడు? అతడు చెప్పిన టెలిపతి కాన్సెప్ట్ ప్రేక్షకలకు కనెక్ట్ అయిందా? అనేది రివ్యూలో చూద్దాం.


కథ విషయానికొస్తే...

కథ విషయానికొస్తే...

స్వాతి(ఐనా సాహ) మళయాలంలో పెద్ద హీరోయిన్. శరత్(సిజ్జూ) అనే వ్యక్తి ద్వారా ప్రమాదం ఉండటంతో అతడి నుండి తప్పించుకుని చర్చి ఫాదర్ సహాయంతో యూఎస్ వెళ్లడానికి హైదరాబాద్ వస్తుంది. అయితే వీసా రావడానికి వారం సమయం ఉండటంతో గ్యాపులో శరత్ కంట పడకుండా ఉండేందుకు సాయి (సాయి రోనక్) అండ్ ఫ్రెండ్స్ తీస్తున్న షార్ట్ ఫిల్మ్ లో నటించేందుకు ఒప్పుకుంటుంది. ఆమె పెద్ద హీరోయిన్ అనే విషయం సాయి అండ్ ఫ్రెండ్స్ కి ఇంకా అప్పటికి తెలియదు. ఊరి చివర ఉన్న బంగ్లాను షూటింగ్ స్పాట్ గా ఎంచుకుంటారు. ఆ బంగ్లాలో రెబెకా విలియమ్స్(రాశి) అనే మహిళ ఉంటుంది. చనిపోయిన తన ఇద్దరు పిల్లలు తనతోనే బ్రతికి ఉన్నట్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంది రెబెకా. ఆమె అలా ప్రవర్తించడం వెనక టెలిపతి అనే అతీత శక్తి అని గ్రహించిన స్వాతి... రెబెకా సహాయంతో తాను కూడా టెలిపతిని నేర్చుకుంటుంది. అసలు టెలిపతి అంటే ఏమిటి? అది నేర్చుకుంటే ఎలాంటి శక్తులు వస్తాయి? స్వాతి ప్రమాదం నుండి ఎలా బయట పడింది? సిజ్జూ ఆమె కోసం ఎందుకు వెతుకుతున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.


పెర్ఫార్మెన్స్ పరంగా....

పెర్ఫార్మెన్స్ పరంగా....

పెర్పార్మెన్స్ పరంగా చెప్పుకుంటే.... రెబెకా పాత్రలో రాశి ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించింది. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా ఆమెకు పెద్దగా అవకాశం కల్పించినట్లు కనిపించదు. ఉన్నంతలో రాశి ఆకట్టుకుంది. హీరోయిన్ స్వాతి పాత్రలో ఐనా సాహ అందం పరంగా, ఇటు పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకోలేదు. పోలీసాఫీసర్ పాత్రలో సుప్రీత్, సత్యం రాజేష్, సాయి రోనక్, సిజ్జు, లీనా సిద్ధు, సత్య, సుదర్శన్ తదితరులు వారి వారి పాత్రల మేరకు నటించారు.


టెలిపతి అంటే ఏమిటి?

టెలిపతి అంటే ఏమిటి?

ఒక మనిషి మరో మనిషి మనస్సులోని ఆలోచనను చెప్పగలగడం ఒక విశేష శక్తిగా పేర్కొంటారు. అమెరికాలో ఒకరుంటారు-ఇండియాలో మరో వ్యక్తి వుంటాడు. వారిరువురూ ఫోను సైతం చేసుకోరు. అయినా ఇండియాలో వున్న వ్యక్తి ఒకానొక సమయంలో ఏమి ఆలోచిస్తున్నాడో అదే సమయంలో అ విషయాన్ని అమెరికాలో వున్న వ్యక్తి చెబుతాడు. తరువాత పరిశీలీంచిన వారికి యిది అద్భుతంగా ఇంద్రియాతీతశక్తిగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రక్రియకు టెలిపతి (Telepathy) అని పేరు పెట్టారు. మరికొందరు యీ టెలిపతి శక్తి ద్వారా మరో వ్యక్తి యిష్టానికి వ్యతిరేకంగాను పనిచేయంచవచ్చు.


దర్శకుడి పనితీరు

దర్శకుడి పనితీరు

ఒక సాధారణ కథకు టెలిపతి అనే కాన్సెప్టును జోడించి.... సినిమాను డిఫరెంటుగా ప్రజెంట్ చేయాలని దర్శకుడు ప్రయత్నించాడు. అయితే కథను నేరేట్ చేసే క్రమంలో అనేక ఉపకథలు జోడించి ప్రేక్షకులను గంధరగోళానికి గురి చేసాడు. టెలిపతి కాన్సెప్టును కూడా ప్రేక్షకులకు అర్థం అయ్యేలా ప్రజెంట్ చేయలేక పోయాడు. మొదటి నుండి చివరి వరకు సినిమా ఎటు నుండి ఎటు పోతుందో తెలియని అయోమయంలో ప్రేక్షకుడు కొట్టుమిట్టాడే పరిస్థితి. సినిమాలో సస్సెన్స్, ట్విస్టులు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే లేదు.


టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు, బ్యాగ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉంది. సినిమా నిర్మాణ విలువలు యావరేజ్. ఎడిటింగ్ యావరేజ్. మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు.


బలాలు, బలహీనతలు

బలాలు, బలహీనతలు

+కథ
+సెకండాఫ్
+క్లైమాక్స్


-స్క్రీన్ ప్లే
-ఫస్టాఫ్


ఫైనల్ వర్డ్

ఫైనల్ వర్డ్

ప్రేక్షకుడికి సంతృప్తినివ్వని ‘లంక'


లంక

లంక

రాశి, సాయి రోనక్, ఐనా సాహ, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు, రాజేష్, సత్య, సుదర్శన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్: లెనిన్, డ్యాన్స్: స్వర్ణ, కళ: హరివర్మ, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: వి.రవికుమార్, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.రవిబాబు, పి.ఆర్.ఓ: వంశీశేఖర్, నిర్మాతలు: నామన దినేష్-నామన విష్ణు కుమార్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీముని!English summary
Lanka movie review. LANKA directed by Sri Muni, produced by Namana Dinesh and Namana Vishnu Kumar on Rolling Rocks Entertainments banner presented by Namanam Sankara Rao and Sundari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu