For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బైబై 'సూపర్ కౌబాయ్' (రివ్యూ)

  By Srikanya
  |
  Super Cowboy
  Rating
  -జోశ్యుల సూర్య ప్రకాష్
  సినిమా: సూపర్ కౌబాయ్
  బ్యానర్: ఎస్.జి.ఎస్.ఎంటర్టైన్మెంట్స్
  నటీనటులు: లారెన్స్, పద్మప్రియ, లక్ష్మీ రాయ్, సంధ్య, సాయికుమార్, నాసర్,
  మనోరమ, డిల్లీ గణేష్, ఇరవరసు, వాయపురి, రమేష్ కన్నా, సెంధిల్ తదితరులు.
  మాటలు: శ్రీరామ కృష్ణ
  సంగీతం: జివి ప్రకాష్ కుమార్
  ఎడిటింగ్: రాజా మహమ్మద్
  కెమెరా: అజగప్పన్
  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శింబు దేవన్
  నిర్మాత: డిఎస్ రావు
  విడుదల తేదీ: 07,మే, 2010

  స్టైల్, ముని, రాజాధిరాజా అంటూ వరస చిత్రాలతో భయపెట్టిన రాఘవ లారెన్స్ ఈ సారి కౌబాయ్ గెటప్ తో దిగాడు. దానికి తగ్గట్లుగా భారీ ఖర్చుతో పదిహేడో శతాబ్దం నాటి వాతావరణాన్ని క్రియోట్ చేస్తూ నిర్మాతలు కూడా అతనికి టెక్నికల్ గా సపోర్టు ఇచ్చారు. అంతేగాక ప్రాజెక్టుకు క్రేజ్ రప్పించేందుకు 23వ హింసించే రాజు పులకేసి వంటి విలక్షణమైన కామిడీ చిత్రం తీసిన దర్శకుడు శింబు దేవన్ ని డైరక్టర్ గా ఎన్నుకున్నాడు. ఇలా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా లారెన్స్ ని, అతని నటనను ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. అంతేగాక దర్శకుడు పులికేసిలో రాజుల కాలం నాటి వాతావరణంలో కథ చెబుతూ సెటేర్స్ వేసినట్లే...ఈ సారి వెస్ట్రన్ కౌబాయ్ సినిమాలపై వ్యంగ్యాస్తంగా ఈ చిత్రాన్ని సంధించాడు. అయితే కౌబాయ్ కల్చర్ మనకి పూర్తి స్ధాయిలో పరిచయం లేని వాతావరణం కావటంతో అర్ధం కాని, ఇంకా చెప్పాలంటే అర్ధం లేని కామిడీగా మిగిలిపోయింది. దాంతో ఖర్చు, శ్రమ నిర్మాతలకే కాక ప్రేక్షకుడుడి కూడా వృధా అయింది.

  17వ శతాబ్దంలో జరిగే ఈ కథలో ఓ సాధారణ వాచెమెన్ సింహాచలం(లారెన్స్) టైం బాగోక(మనది కూడా) ఓ టెక్సాస్ వజ్రం దొంగతనం కేసులో ఇరుక్కుని ఉరిశిక్షకు సిద్దపడతాడు. అప్పుడు కొంతమంది కౌబాయ్స్ అతన్ని రెగ్యులర్ గా అన్ని కౌబాయ్ చిత్రాల్లో చేసినట్లుగానే ఉరి తీసే సమయంలో తుపాకీతో కాల్చి రక్షించి తమతో తీసుకువెళ్ళతారు. కొంత దూరం వెళ్ళాక తమ దగ్గర అట్లాంటి వజ్రం మరోటి ఉందని, అయితే తాము చెప్పినట్లు వింటేనే అది ఇస్తామని ఓ కండీషన్ పెడతారు. సరేనన్న సింహాచలం అదేంటని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు తమ ప్రాతంలో సింహం(లారెన్స్ డబుల్) అనే గొప్ప నాయకుడు, ఉద్యమకారుడు ఉండేవాడని, అతను గత రెండు మూడేళ్ళుగా కనపడటం లేదని అంటారు. అయితే ఇప్పుడేంటి అన్న సింహాచలంలో అతను కూడా నీ పోలికలతోనే ఉన్నాడు కాబట్టి నువ్వు అలాగే నటించి తమ శత్రువు నల్ల తాచు(నాజర్) ని దెబ్బకొట్టాలంటారు. తప్పని సరి పరిస్ధితుల్లో ఓ గ్రామానికి నాయకుడిగా ఒప్పుకున్న సింహాచలం అక్కడే ఉన్న ఓ అమ్మాయి(లక్ష్మీ రాయ్) తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత నాజర్ ని ఎదిరిస్తాడు. ఆ క్రమంలో అతను ఏ కష్టాలు పడ్డాడు అనేది మిగతా కథ.

  అక్షయ్ కుమార్ చాందినీ చౌక్ టు చైనా చిత్రాన్ని గుర్తు చేసే ఈ చిత్రం పలు హాలీవుడ్ కౌబాయ్ చిత్రాలు, మెకన్నాస్ గోల్డ్, ఇండియానా జోన్స్ వంటి ఎడ్వంచర్ ఫిల్మ్ లలోని హైలెట్స్ ను సెటైర్ చేస్తూ తీసారు. అయితే అల్లుకున్న కథనం ఇబ్బంది కరంగా ఉండటం సినిమాకు మైనస్ గా మారింది. ఏ సీన్ కా ఆ సీన్ కాంప్లిక్ట్ చూసుకున్నారు కానీ టోటల్ గా కథలో నెగిటివ్ ఫోర్స్ ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. సాయికుమార్, నాసర్ విలన్స్ గా కనపడుతూంటారు కానీ వారి విలనీని పూర్తి స్ధాయిలో ఎస్టాబ్లిష్ చేయరు. అలాగే హీరోకు ఏ విధమైన ఇబ్బంది పెట్టకూడదని డెషిషన్ తీసుకునన్నట్లుగా బిహేవ్ చేస్తూంటారు. ఇక లారెన్స్ పాటల్లో చూపిన శ్రద్ద ఎందుకనో నటనపై చూపరు. ఇక పద్మప్రియ ఉన్నది కాసేపయినా అదరకొడ్తుంది. లక్ష్మీ రాయ్, సంధ్య ఓకే అనిపిస్తారు. విలన్ గా సాయికుమార్ మేకప్ బాగుంది. మనోరమ, ఇల్లవరసు, డిల్లీ గణేష్ వంటి సీనియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదమీ లేదు. సినిమాలో హైలెట్ గా నిలిచింది రెడ్ ఇండియన్స్ ని హీరో కలుసుకున్నప్పుడు అక్కడ పరిచయమయ్యే ట్రాన్స్ లేటర్. సినిమా మొత్తం ఆ కొండ జాతి వారి బాషని ట్రాన్స్ లేట్ చేస్తూ నవ్విస్తూంటాడు. అలాగేక్లైమాక్స్ లో వచ్చే ట్రెజర్ హంట్ లో నిధి కనపడినప్పుడు అక్కడ స్పాన్సర్ యాడ్ కనిపించటం, నిధికి దారి అని అక్కడో టోల్ గేట్ ఉండటం దర్శకుడులోని వ్యగ్యాన్ని పట్టిస్తుంది. మిగతా విభాగాలు కెమెరా, ఎడిటింగ్ తమ పని తాము శ్రద్దగానే చేసుకుపోయాయి. దర్శకుడు కౌబాయ్ వాతావరణం కాకుండా మరో నేపధ్యం తీసుకుని ఉంటే గ్యారెంటీగా చిత్రం వర్కవుట్ అయ్యేదనిపిస్తుంది.

  ఈ కౌబాయ్ లపై వ్యగ్య చిత్రం ఆ తరహా హాలీవుడ్ చిత్రాలు రెగ్యులర్ గా చూసేవారికి బాగా నచ్చుతుంది. ఆ నేఫధ్యం అలవాటు లేనివారికి అర్దంకాక విసుగుతెప్పింస్తుంది. అలాగే లారెన్స్ డాన్స్ ల గురించి అయితే వెళ్ళటం అనవరసరం..ఎందుకంటే ప్రత్యేకమైన స్టెప్స్ ఏమీలేవు..అవి పెద్ద హీరోల కోసం దాచాడేమో అనిపిస్తుంది. ఇక కొంతకాలం లారెన్స్ హీరోగా రెస్ట్ తీసుకుంటే అందరికీ రిలీఫ్ దొరుకుతుంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X