twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాస్‌ చిత్రం 'లీలామహల్‌'

    By Staff
    |

    Leelamahal Center
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    చిత్రం: లీలామహల్‌ సెంటర్‌
    నటీనటులు: ఆర్యన్‌ రాజేష్‌, సదా, అతుల్‌ కులకర్ణి,
    సుమన్‌, సూర్య, ఎంఎస్‌ నారాయణ,
    ధర్మవరపు సుబ్రమణ్యం, కృష్ణ భగవాన్‌, రఘుబాబు
    సంగీతం: ఎస్‌ఎ రాజ్‌కుమార్‌
    దర్శకత్వం: దేవీ ప్రసాద్‌
    నిర్మాత: సిహెచ్‌ మోహన్‌, ముళ్ళపూడి సురేంద్రబాబు

    విజయవంతమైన 'ఆడుతూ పాడుతూ' చిత్రంతో తొలిసారి తెలుగుతెరకు పరిచయమైన దర్శకుడు దేవీ ప్రసాద్‌ చాలా గ్యాప్‌ తర్వాత వరస ఫ్లాప్‌ల హీరో ఆర్యన్‌ రాజేష్‌ తో తీసిన చిత్రం 'లీలామహల్‌ సెంటర్‌' . నాలుగేళ్ళ క్రితం అజిత్‌, షాలిని జంటగా శరణ్‌ దర్శకత్వంలో తమిళంలో విజయవంతమైన తెలుగులోకి అనువాదమైన 'అద్భుతం' సినిమాకు జిరాక్స్‌ కాపీగా వచ్చిన ఈ సినిమా విజయం తెలుగు ప్రజల మెమరీ మీద ఆధారపడి ఉంటుంది.

    కథ: లీలా మహల్‌ థియేటర్‌ను అడ్డాగా చేసుకుని కిరాయి రౌడీ ప్రభు (ఆర్యన్‌) కార్యకలాపాలు సాగిస్తుంటాడు. ఒకరోజు జికె (అతుల్‌ కులకర్ణి) వచ్చి అతనికో కాంట్రాక్టు అప్పగిస్తాడు. ఆ కాంట్రాక్టు ప్రకారం అతను అంజలి అనే అమ్మాయిని కిడ్నాప్‌ చేయాలి. అంజలి ఎవరు? సాక్షాత్తు పోలీసు కమిషనర్‌(సుమన్‌) కూతురు. పోలీసు కమిషనర్‌ ఎప్పుడో పద్దెనిమిదేళ్ళ క్రితం జికెకి నమ్మక ద్రోహం చేస్తాడు. మాఫియా డాన్‌ అయిన జికెకు పద్దెనిమిదేళ్ళు జైలు శిక్ష పడేలా చేస్తాడు. అంజలిని కిడ్నాప్‌ చేసి పోలీసు కమిషన ర్‌పై ప్రతీకారం తీర్చుకోలన్నది జికె పట్టుదల.

    ఆ అసైన్‌ మెంట్‌ అందుకున్న యంగ్‌ డాన్‌ ప్రభు రంగంలోకి దిగుతాడు. కాంట్రాక్టు ప్రకారం ప్రభు అంజలిని కిడ్నాప్‌ చేస్తే, అంజలి సినిమా సంప్రదాయం ప్రకారం ప్రభు మనసును కిడ్నాప్‌ చేస్తుంది. కిడ్నాప్‌ డ్రామా పూర్తయ్యేసరికి ప్రేమ డ్రామా మొదలవుతుంది. కమిషనర్‌ తన కూతురిని బజారు రౌడీకిచ్చి పెళ్ళి చేయాల్సివచ్చినందుకు చంకలు గుద్దుకున్న జికెకి అసలు విషయం తెలుస్తుంది. అంజలి కమిషనర్‌ కూతురు కాదని, తన కూతురేనని, తాను జైలుకి వెళ్ళినప్పుడు కమిషనర్‌ ఆ చంటి పిల్లను చేరదీసి పెంచి పెద్ద చేస్తాడని తెలుసుకుంటాడు. తన కూతురిని ప్రభు పెళ్ళి చేసుకోకూడదని జికె చేసే కుతంత్రాలు... వాటన్నిటిని హీరో ఎదుర్కొని విజయం సాధించడం ఇవన్నీ షరామామూలే.

    మంచి కొత్త పాయింట్‌ గల ఈ కథకి మూలం హాలీవుడ్‌లో ఉంది. దీనిని యండమూరి వీరేంద్రనాథ్‌ తెలుగులో 'సంపూర్ణ రామాయణం' పేరుతో తెలుగులోకి దించారు. ఈ సినిమా 'స్టోరీలైన్‌' (రీమేక్‌ రైట్స్‌ కాదు)ను నిర్మాతలు తమిళం నుంచి కొనుగోలు చేయడం విశేషం. స్టోరీలైన్‌ను మాత్రమే కొనిగోలు చేయడం కొత్త ట్రెండే. మూల కథలోలేని టెర్రరిస్టుల గోలను ఇంటర్వల్‌, క్లెయిమాక్స్‌ల కోసం చేర్చడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఆర్యన్‌ రాజేష్‌ ఆకారం కానీ, వాయిస్‌ కానీ రౌడీ పాత్రకు ఏమాత్రం నప్పలేదు.అయినా సినిమాలో ఉన్న కొత్త పాయింట్‌ వల్ల ప్రేక్షకులు ఆకర్షితులయ్యే అవకాశముంది. ధర్మవరపు సుబ్రమణ్యం రకరకాల వేషాలతో కామెడీని బాగా పండించాడు. 'బాలమణమ్మో' పాట మాస్‌కి బాగా పట్టింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X