twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లవ్‌‌స్టోరీ విత్ ఫాదర్ సెంటిమెంట్ (లవ్‌లీ రివ్యూ)

    By Bojja Kumar
    |

    నటీనటులు : ఆది, శాన్వి, రాజేంద్రప్రసాద్, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, చిన్మయి, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, ఆహుతి ప్రసాద్, తాగుబోతు రమేష్, సత్యకృష్ణ, వినయ ప్రసాద్, హర్షవర్ధన్
    సంగీతం : అనూప్ రూబెన్స్
    ప్రొడక్షన్స్ : ఆర్ జె సినిమాస్
    సమర్పణ : ఆర్ ఆర్ మూవీ మేకర్స్
    ఎడిటింగ్ : గౌతంరాజు
    ఫైట్స్ : రామ్ లక్ష్మణ్
    నిర్మాత : బి.ఎ.రాజు
    దర్శకత్వం : బి. జయ

    ఆకాష్(ఆది) ప్రాక్టికల్‌గా అందరితో సరదాగా కలిపోయే యువకుడు. ఆడవారన్నా, ప్రేమన్నా పెద్దగా ఇంట్రస్టు ఉండదు. అతని ఫ్రెండ్ కిట్టు(వెన్నెల కిషోర్) ఫేస్‌బుక్‌ ద్వారా లల్లి(చిన్మయి) అనే అమ్మాయితో ఆన్ లైన్ స్నేహం చేస్తుంటాడు. ఫోన్లు, చాటింగులే తప్ప ఇద్దరు ఎప్పుడూ చూసుకోరు. ఒక రోజు ఇద్దరూ కలవాలనుకుంటారు. లల్లిపై ప్రేమ పెంచుకున్న కిట్టు ఆమె వద్దంటే తట్టుకునే ధైర్యం లేక....తన బదులు తన స్నేహితుడు ఆకాష్‌ను పంపుతాడు. ఇటు లల్లి కూడా తను వెల్లకుండా తన ఫ్రెండ్ లావణ్య(శాన్వి)ని పంపుతుంది. ఈ క్రమంలో తొలి చూపులోనే ఆకాష్, లావణ్య ఒకరిపై ఒకరు మనసు పారేసుకుంటారు. తమ ఫస్ట్ మీటింగులో ఆకాష్ బిహేవియర్ చూసిన లావణ్య తండ్రి మంగళంపల్లి మహారథి(రాజేంద్రప్రసాద్) అతనిపై అయిష్టాన్ని పెంచుకుంటాడు. అయితే కూతురు అంటే ఎంతో ఇష్టపడే మహారథి.....తనకు ఇష్టం లేకున్నా ఆకాష్‌తో ఆమె ప్రేమకు ఒప్పుకున్నాడా? లేక ఇంకేమైనా చేశాడా? అనేది తెరపై చూడాల్సిందే.

    తొలి సినిమా 'ప్రేమ కావాలి' చిత్రంతో నటన, ఫైట్స్, డాన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ సూపర్ అనిపించుకున్న ఆది...లవ్‌లీ చిత్రంలో మరింత మంచి పెర్పార్మెన్స్ కనబరిచాడు. గత సినిమా కంటే ఇంకాస్త మెరుగయ్యాడనే చెప్పాలి. హీరోయిన్ శాన్వి గుడ్ ఎంట్రీ అని చెప్పొచ్చు. క్యూట్‌గా ఆకట్టుకుంది. నటన, డాన్సుల విషయంలో ఇంకాస్త పరిణితి చెందాల్సి ఉంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ హ్యూమరస్ సీన్లలోనూ, ఎమోషనల్ సీన్లలో తనదైన నటన ప్రదర్శించాడు. వెన్నెల కిషోర్ చాలా రోజుల తర్వాత ప్రాధాన్యం ఉన్న పాత్రలో అలరించాడు. అతనికి జంటగా చిన్మయి బాగా సూటయింది. ముఖ్యంగా తెలంగాణ యాసలో చిన్మయి డైలాగులు బాగున్నాయి. పరుచూరి గోపాల కృష్ణ, ఆముతి ప్రసాద్, హర్షవర్ధన్ తదితరులు వారి వారి పాత్రల మేరకు నటించారు.

    ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిన సినిమా సెకండాఫ్‌లో టెంపో తగ్గి నేరేషన్ స్లో అయిపోయింది. క్లైమాక్స్ పేలవంగా ఉండటం కూడా సినిమాకు పెద్ద మైనస్ పాయింట్. దర్శకురాలు చాలా చోట్ల ముఖ్యమైన సన్నివేశాల్లో చిన్న చిన్న పొరపాట్లు చేసింది. అనూప్ రూబెన్స్ సంగీతం, శ్యాం డైలాగులు సినిమాకు ప్లస్ పాయింట్స్. ఆది డాన్స్, ఫైటింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది.

    రొమాంటిక్ ట్రాక్ బాగా పండటం, ఫ్యామిలీ జనాలకు నచ్చే అంశాలు ఉండటం వల్ల సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. మొత్తం మీద ఈసినిమా యావరేజ్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. మరి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

    English summary
    Lovely Movie is a average Youthful and Family Entertainer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X