For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Maaran Review – ధనుష్, మాళవికల 'మారన్' ఎలా ఉందంటే?

  |

  రేటింగ్ : 2 /5

  సినిమా:మారన్
  ఓటీటీ : డిస్నీ+హాట్ స్టార్
  దర్శకుడు : కార్తీక్ నరేన్
  నటీనటులు: ధనుష్, మాళవిక మోహనన్, సముద్రఖని,
  నిర్మాతలు : స్మృతి వెంకట్, రాంకీ, కృష్ణ కుమార్ బాలసుబ్రహ్మణ్యం, మహేంద్రన్
  సంగీతం : జీవి. ప్రకాష్ కుమార్
  సినిమాటోగ్రఫీ : వివేకానంద సంతోషం

  కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం 'మారన్' నేరుగా డిజిటల్ రిలీజ్ అయింది. మార్చి 11న సాయంత్రం 5 గంటలకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలయింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ మాళవిక మోహన్ ధనుష్ సరసన హీరోయిన్‌గా నటించింది. కార్తీక్ నరేన్ స్వయంగా రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళం భాషలలో విడుదల చేశారు. ఈ సినిమా మీద టీజర్, ట్రైలర్ మంచి అంచనాలు పెంచడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఈ మేరకు ఆకట్టుకుంది అనేది సమీక్షలో తెలుసుకుందాం.

   మారన్ కథ ఏంటంటే ?

  మారన్ కథ ఏంటంటే ?

  చిన్నప్పుడే నిజాయితీగల జర్నలిస్ట్ అయిన తండ్రి(రాంకీ) చావు కళ్లారా చూసిన మారన్ ( ధనుష్) తాను కూడా ఒక నిజాయితీ గల జర్నలిస్ట్ గా మారతాడు. కష్టపడి ఓ చోట ఉద్యోగం సంపాదించి హ్యాపీగా గడిచిపోతుంది అని అనుకుంటున్న తరుణంలో తన స్నేహితుడైన ఒక ఎస్సై ప్రోద్బలంతో ఒక స్టింగ్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ స్టింగ్ ఆపరేషన్ లో పళని (సముద్రఖని) అనే ఒక మాజీ మంత్రి ఎన్నికల విషయంలో ఈవీఎం ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనే విషయం తెలుస్తుంది.. ఈ విషయం బయటపెట్టిన మారన్ మీద కొంతమంది ఆగంతుకులు ఎటాక్ చేస్తారు. అనుకోని పరిస్థితుల్లో మారన్ చెల్లి అతని కళ్ళ ముందే చనిపోతుంది. అయితే ఆమె పోస్టుమార్టం చనిపోలేదని విషయం అర్థం చేసుకున్న మాత్రం తన చెల్లిని ఎలా కాపాడుకో గలిగాడు ? అతని లైఫ్ లో తార (మాళవికా మోహనన్) పాత్ర ఏమిటి?.చెల్లిని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

  మారన్ సినిమాలో ట్విస్టులు :

  మారన్ సినిమాలో ట్విస్టులు :


  సినిమా మొదలైన నాటి నుంచి ఎక్కడో చూసిన సీన్లు చూస్తున్నామని భావన కలుగుతుంది. ఎందుకంటే సినిమాలో తర్వాత ఏం జరగబోతోంది? అనే విషయం ఈజీగా అర్థం అయిపోతుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి, బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఉంది, ఇన్వెస్టిగేటివ్ స్టోరీ కూడా ఉంది. కానీ ఈ సినిమా చూస్తుంటే తర్వాత జరిగే విషయం ఏమిటి అని చాలా సులభంగా ఊహిస్తారు. సినిమా మొత్తానికి కీలకమైన విషయం ఏదైనా ఉందా? అంటే అది కేవలం సినిమా చివరిలో ఉన్న ట్విస్ట్. ఈ ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంది. కేవలం ఈ ఒక్క ట్విస్ట్ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు.

  దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే :

  దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే :


  కార్తీక్ నరేన్ స్క్రీన్‌ప్లే అంత గొప్పగా లేదు. నిజానికి ఆయన టేకింగ్ గురించి పెద్దగా మాట్లాడకుండా ఉంటే బెటర్. తీసుకున్న ప్లాట్ దాని పేసింగ్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్, అన్నీ అనేక విధాలుగా కన్ఫ్యూజన్ విధంగా ఉన్నాయి. కార్తీక్ చాలా పాత కధని తీసుకుని ఓటీటీకి సరిపడే విధంగా తీర్చిదిద్దినట్టు అనిపించింది. మారన్‌లో అసలు పూర్తిగా ఏమాత్రం కొత్తదనం లేదు. చూసిన దాన్ని బట్టి, చూస్తే రాసుకున్న పాయింట్ ను నేరుగా రివీల్ చేసేందుకు ప్రయత్నించారు. దర్శకుడిగా తొలి సినిమా (ధ్రువంగల్ పత్తినారు... డి-16)తో పేరు తెచ్చుకున్న కార్తీక్ నరేన్ ఇలాంటి 'మారన్' తీశాడంటే నమ్మడం కష్టం. ఒక్క థ్రిల్ మూమెంట్ లేకుండా ఫ్లాట్‌గా, రొటీన్ సన్నివేశాలతో 'మారన్' సాగింది. హీరోను స్టైలిష్ గా చూపించడం, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం మీద పెట్టిన దృష్టి... కథ, కథనాలపై పెట్టలేదు. సినిమాలో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్, రాజకీయ నాయకులు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారనే పాయింట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంచి థ్రిల్లర్ తీసే అవకాశాలు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోకుండా వదిలేశాడు.

  నటీనటుల విషయానికి వస్తే

  నటీనటుల విషయానికి వస్తే


  స్కిప్ట్ అంతా చాలా వీక్‌గా ఉండటంతో ధనుష్ నటన కూడా ఈ సినిమాను కాపాడలేక పోయిందనే చెప్పాలి. తమిళంలో మెరవాలని అసలు పెట్టుకున్న మాళవికా మోహనన్ కి కూడా సినిమా దెబ్బ వేసిందని చెప్పాలి. ధనుష్ - మాళవిక మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. కొన్ని సీన్స్ ఎందుకు క్రియేట్ చేశారో తెలియదు. ఇక సముద్రఖని, రాంకీ, జయప్రకాశ్, మహేంద్రన్ తదితరుల పాత్రలు కూడా సోసోనే అనిపించాయి.

  టెక్నికల్ విషయానికి వస్తే:

  టెక్నికల్ విషయానికి వస్తే:


  జి వి ప్రకాష్ నేపథ్య సంగీతం చాలా బాగుంది. సస్పెన్స్ అనుభూతిని ఇవ్వాల్సి వచ్చినప్పుడు అది సస్పెన్స్‌గానూ, సినిమా చూస్తున్న జనాలకుఎమోషనల్ ఫీలింగ్‌ని అందించాల్సి వచ్చినప్పుడు ఎమోషనల్‌గానూ సరిగ్గా అందించారు. తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ కూడా బాగా సెట్ అయ్యాయి. వివేకానంద సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు అనిపించింది. ఎడిటింగ్ మీద ఇంకా దృష్టి పెట్టాల్సింది కానీ ఇంకా కట్ చేస్తే సినిమా మిగలదు అనుకుని ఉంటారేమో.

  Recommended Video

  Dhanush Tweets About Manju Warrior Character In His Next Movie | Filmibeat Telugu
   ఫైనల్ గా :

  ఫైనల్ గా :


  'మారన్' రొటీన్ తమిళ్ డబ్బింగ్ సినిమా.ఒకసారి సరదాగా చూసేయొచ్చు.

  English summary
  సినిమా:మారన్ ఓటీటీ : డిస్నీ+హాట్ స్టార్ దర్శకుడు : కార్తీక్ నరేన్ నటీనటులు: ధనుష్, మాళవిక మోహనన్, సముద్రఖని, నిర్మాతలు : స్మృతి వెంకట్, రాంకీ, కృష్ణ కుమార్ బాలసుబ్రహ్మణ్యం, మహేంద్రన్ సంగీతం : జీవి. ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ : వివేకానంద సంతోషం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం 'మారన్' నేరుగా డిజిటల్ రిలీజ్ అయింది. మార్చి 11న సాయంత్రం 5 గంటలకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలయింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ మాళవిక మోహన్ ధనుష్ సరసన హీరోయిన్‌గా నటించింది. కార్తీక్ నరేన్ స్వయంగా రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళం భాషలలో విడుదల చేశారు. ఈ సినిమా మీద టీజర్, ట్రైలర్ మంచి అంచనాలు పెంచడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఈ మేరకు ఆకట్టుకుంది అనేది సమీక్షలో తెలుసుకుందాం.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X