For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లరి నరేష్ 'డాన్ శీను'(మడతకాజా రివ్యూ)

  By Srikanya
  |

  నటీనటులు :అల్లరి నరేష్, స్నేహా ఉల్లాల్, సుబ్బరాజు, జయప్రకాశ్, ఆహుతి ప్రసాద్, ఆశిశ్ విద్యార్థి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చలపతిరావు తదితరులు.

  మాటలు: వేగేశ్న సతీశ్

  పాటలు: సీతారామశాస్త్రి, భాస్కరభట్ల, సురేంద్రకృష్ణ

  సంగీతం: శ్రీవసంత్

  ఛాయాగ్రహణం: అడుసుమిల్లి విజయ్‌కుమార్

  కూర్పు: మార్తాండ్ కె. వెంకటేశ్

  కళ: బాబ్జీ

  ఫైట్స్: రామ్-లక్ష్మణ్

  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేకానంద కూచిభొట్ల

  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సీతారామరాజు దంతులూరి.

  నిర్మాత: వేదంరాజు టింబర్

  ఏం మహేష్ బాబు, రవితేజ తన రూట్ లోకి వచ్చి కామిడీ చెయ్యటం లేదా..తాను వాళ్ల రూట్ లోకి వెళ్లి పోకిరి,డాన్ శీను,మిరపకాయ లాంటి సినిమా చెయ్యలేడా అనుకున్నట్లున్నాడు అల్లరి నరేష్. అందుకే ఈ మడతకాజా కథని ఎంచుకున్నాడు. అందులోనూ ఇప్పుడు ఇలాంటి కథలకే డిమాండ్ ఉందని కూడా అర్దం చేసుకున్నట్లున్నాడు దర్శకుడు.ఈ కథతో హిట్ కొడితే నెక్ట్స్ మహేష్ లేదా రవితేజని పట్టచ్చు అనే ఆలోచనతో కథ తయారుచేసుకున్నట్లు అనిపిస్తుంది. అయితే అల్లరి నరేష్ కి తన స్టామినా ఫన్ అని తెలుసు కాబట్టి యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టకుండా ఈ కథని లాగించేయటం కొంత రిలీఫ్. అల్లరి నరేష్ గత చిత్రాలతో పోలిస్తే అంత నవ్వు రాదు కానీ ఓవరాల్ గా ఫరవాలేదనిపిస్తుందీ చిత్రం.

  కళ్యాణ్ (అల్లరి నరేష్) వైజాగ్ లో పోలీస్ ఇన్ఫార్మర్ గా చేస్తూంటాడు. కళ్యాణ్ కి కండబలం లేదు,గుండె బలం లేదు. ఉన్నదంతా బుద్ది బలమే. మాటలలో మడతపెట్టేస్తూంటాడు.అలా మాటలతో బ్రతికేస్తున్న అతను స్నేహ(స్నేహ ఉల్లాల్) తో ప్రేమలో పడతాడు. ఆమె కెపి(ఆహుతి ప్రసాద్) అనే డాన్ కూతురు. తన తెలివి తేటలతో తన ప్రెండ్స్ (వెన్నెల కిషోర్, ధర్మవరపు)లతో ఆ అమ్మాయే వచ్చి ఐలవ్ యు చెప్పేలా చేయించుకుంటాడు. ఆ అమ్మాయిని కూడా మడతెట్టేశాక అస్సలు మడత మొదలవుతుంది. ఇంటర్నేషనల్ డాన్ నందా(ఆశిష్ విధ్యార్ధి) బ్యాంకాక్ లో ఉండి హైదరాబాద్ లో ఇల్లిగల్ బిజినెస్ నడుపుతూంటాడు. అతని హైదరాబాద్ ఆపరేషన్స్ ని స్నేహ తండ్రి కెపీ, జెపి(జయప్రకాష్ రెడ్డి) చూస్తూంటారు. వారిద్దరూ ఎప్పుడూ కొట్టుకుంటూ డాన్ దందాని పాడు చేస్తూంటారు. దాంతో నందా కి ఓ ఐడియా వస్తుంది. జెపి కొడుకు సుబ్బరాజుని ..కెపీ కూతురు స్నేహకి ఇస్తే సమస్య సమిసి పోతుందని..మరో ప్రక్క కళ్యాణ్ కి ఆ డాన్ పని చూడమని పై నుంచి ఆర్డర్స్. తన డ్యూటిని చేసుకుంటూ కళ్యాణ్ ఆ డాన్ ని ఎట్లా బుద్ది చెప్పి, తన లవర్ ని తన దాన్ని చేసుకున్నాడనేది మిగతా కథ.

  కథ చదివిన వాళ్లవరికైనా వెంటనే పోకిరి,డాన్ శీను,మిరపకాయ సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే ఆ కథల్లో ఉన్నంత కూడా ఈ సినిమాలో లాజిక్ లేకుండా పోయింది. అయితే ఇంతకుముందే అల్లరి నరేష్ తన కథల్లో లాజిక్ వెతకవద్దని గట్టిగా వార్నింగ్ ని పత్రికాముఖంగా ఇచ్చేసాడు కాబట్టి ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలి. ఇక నరేష్ ఎప్పటిలాగే నవ్వించటానికి ప్రయత్నించాడు. దర్శకుడు పాత కథనే కొత్తగాచెప్పాలని ప్రయత్నించి మళ్లీ పాతగానే చెప్పాడు. స్నేహా ఉల్లాల్ లో ఛార్మ్ తగ్గినట్లు కనపడుతోంది. లేక అల్లరి నరేష్ ప్రక్కన చేయటమేమిటా అని బాధపడుతూ చేసిందా అని చాలా సీన్స్ లో అనిపిస్తుంది. ఇలాంటి కథలకు డైలాగులే ప్రాణం. కానీ ఎందుకనో కబడ్డి..కబడ్డి వంటి సినిమాలకు అదిరిపోయే డైలాగులురాసిన వేగశ్న సతీష్ ఇందులో పెద్దగా పండించలేకపోయాడు. నటుల్లో జయప్రకాష్ రెడ్డి ఎప్పటిలాగే చెలరేగిపోయాడు. వెరైటి గెటప్ లతో ఆలి బాగానే నవ్విస్తాడు. ధర్మవరపు, వెన్నెల కిషోర్ ఓకే. కెమెరా,ఎడిటింగ్ బాగున్నాయి. దర్సకుడు అనుభవం ప్రతీ సీన్ లోనూ కనపడుతుంది.మంచి కథను ఎన్నుకుంటే చక్కగా తీయగలడు అనిపిస్తుంది.

  ఫైనల్ గా మడతకాజా రెగ్యులర్ అల్లరి నరేష్ సినిమాలకు కాస్త తక్కువైనా కాస్సేపయినా నవ్వుకోవటానికి ఓ లుక్కేయవచ్చు. ఇక నరేష్ తన స్లాట్ లోకి రవితేజ,మహేష్,వెంకటేష్ వంటి స్టార్స్ వచ్చేస్తున్నారు కాబట్టి తన కామెడీలో మరింత వేరియేషన్ చూపాల్సిన అవసరం ఉంది. లేకపోతే అదే టిక్కెట్టుకు దూకుడులో మహేష్ నవ్విస్తూంటే...మడతకాజా వైపు ఎందుకు వెళ్లాలనే సందేహం సాధారణ ప్రేక్షకుడుకి వస్తుంది.

  English summary
  Allari naresh is coming with his latest movie Madatha kaja. His latest movies seema tapaakai and aha naa pellanta scored good marks and hence this movie too raised expectations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X