Madharaasi First Review: మదరాసి మూవీ ఫస్ట్ రివ్యూ
తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్ కథా నాయకుడిగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మదరాసి. తమిళంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్, మలయాళ నటుడు బిజు మీనన్, విక్రాంత్, షాబీర్, రుక్మిణి వసంత్ తదితరులు నటించారు. సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాపై సెన్సార్ అధికారుల రివ్యూ, ఇతర అంశాల వివరాల్లోకి వెళితే..
మదరాసి సినిమా కథ విషయానికి వస్తే.. తమిళనాడులో నార్త్ ఇండియా మాఫియా, రెండు స్పెషల్ టాస్క్ ఫోర్స్ మధ్య జరిే యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రంలో రఘు అనే యువకుడి పాత్రలో శివకార్తీకేయన్ నటిస్తున్నాడు. మాఫియాను ఎదురించే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కథలో లవ్, పగ, ప్రతీకారం, త్యాగం, ఫ్రెండ్‌షిప్, రెండు గ్రూపుల మధ్య వార్ లాంటి అంశాలు హైలెట్ అని తెలిసింది.

మదరాసి సినిమాను తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం, శ్రీకర్ ప్రసాద్ అక్కినేని ఎడిటర్‌గా, సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమాకు కీలకంగా మారిన సన్నివేశాలకు నాక్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ఎక్స్, బీస్ట్ బెల్స్ కంపెనీలు విజువల్ ఎఫెక్ట్ వర్క్ చేశాయి.
భారీ అంచనాలతో సొంతం చేసుకొన్న మదరాసి చిత్రాన్ని ఇటీవల సెన్సార్ అధికారులు వీక్షించారు. ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్‌పై వారు పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని కొన్ని హింసాత్మక సన్నివేశాలను, రక్తపాతంత కూడిన సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని డైలాగ్స్, సన్నివేశాలపై కత్తెర మార్కులు వేశారు. ఈ సినిమాలోనే కొన్ని సంభాషణలు మార్చుకోవాలని సూచించారనే విషయం చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది.
అయితే లవ్, బ్రేకప్, సెంటిమెంట్, యాక్షన్ తదితర అంశాలు కీలకంగా మారిన ఈ సినిమాలో నిడివి కూడా భారీగా పెరిగిపోయింది. ఈ సినిమా రన్ టైమ్ సుమారుగా 2 గంటల 45 నిమిషాలు అంటే.. సుమారుగా 165 నిమిషాలు. ఇటీవల కాలంలో అత్యధిక రన్‌టైమ్‌లో వచ్చిన చిత్రాల్లో మదరాసి కూడా ఒకటిగా నిలువబోతున్నది. ఈ సినిమాపై ఇప్పటికే తమిళంలోనే కాకుండా దక్షిణాదిలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మదరాసి చిత్రం దర్శకుడు ఏఆర్ మురగదాస్‌కు ఛాలెంజింగ్‌గా నిలిచింది. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన సరైన హిట్ లేకపోవడంతో ఈ మూవీపైనే భారీగా ఆశలు పెట్టుకొన్నారు. ఈ సినిమా విజయం ఆయన మళ్లీ సక్సెస్ బాట పట్టించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వస్తున్న ఈ సినిమా గురించిన అప్ డేట్స్ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











