For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగ 'ధీర' రివ్యూ

By Staff
|

Magadheera
Magadheera

సంస్థ: గీతా ఆర్ట్స్

నటీనటులు: రామ్ చరణ్, కాజల్, దేవ్ గిల్, శ్రీహరి, సూర్య, శరత్ బాబు, సునీల్, బ్రహ్మానందం, హేమ,

చిరంజీవి, కిమ్ శర్మ, ముమైత్ ఖాన్, సుబ్బరాయ శర్మ, రావ్ రమేష్ తదితరులు

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు

సంగీతం: యం.యం.కీరవాణి

సినిమాటోగ్రఫి: సెంథిల్ కుమార్

కథ: విజయేంద్ర ప్రసాద్

స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: యస్.యస్.రాజమౌళి

నిర్మాత: అల్లూ అరవింద్

తేది: 31/07/2009

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన రెండవ చిత్రం మగధీర. మగధీర సినిమా కథ 1609 లో జరిగిన సంఘటన మీద నడుస్తుంది. కథ విషయానికి వస్తే 1609 సంవత్సరం లో కాలభైరవ (రామ్ చరణ్) ఉదయఘర్ సామ్రాజ్యంలో సమరయెధుడు, సైనికులకు శిక్షణ ఇస్తుంటాడు. శేనాధిపతి రణధీర్ (దేవ్ గిల్) యువరాణి మిత్రవింద(కాజల్) పై ఆశపడతాడు, కానీ మిత్రవింద కాలభైరవను ప్రేమిస్తుంది. పర్యావసానంగా కాలభైరవ మరియు రణధీర్ ల మధ్య యుధ్ధం జరిగి వారు ప్రాణాలు కోల్పోతారు. ఉదయఘర్ పై దండెత్తిన షేర్ ఖాన్(శ్రీహరి) కూడా పోరాటంలో ప్రాణాలు కోల్పోతాడు. ఇలా చనిపోయిన వారు హర్ష(రామ్ చరణ్), ఇందు(కాజల్) గా పునర్జన్మలో ప్రేమించుకొంటారు, ఇప్పుడు కూడా పూర్వజన్మలోని పాత్రలు తారసపడతాయి. మిగిలిన కథ వారెలా తమ పూర్వజన్మను తెలుసుకున్నారు, ఎలా వారి ప్రేమను గెలిపించుకున్నారు అనేది.

తన తొలి చిత్రంలో తను ఏమి చెయ్యగలనో చూపించిన రామ్ చరణ్ తన రెండవ సినిమాతో తన నటనాచాతుర్యాన్ని చూపించాడు. కాలభైరవ మరియు హర్షగా చక్కటి నటనను ప్రగర్శించాడు. ముఖ్యంగా కాలభైరవ పాత్రలో తన నటనతో, గుఱ్ఱపు స్వారీలతో, కత్తి యుధ్ధాలతో ఆకట్టుకొంటాడు. రామ్ చరణ్ కు మరో అనూకూలాంశం డ్యాన్స్. ముఖ్యంగా 'బంగారు కోడి పెట్ట' పాట లో అదరకొట్టేసాడు.

కాజల్ చాలా అందంగా, చలాకీగా కనిపించి, ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా యువరాణి మిత్రవింద పాత్రలో చాలా ఆకర్షణీయంగా కనిపించింది. కానీ ఎమోషనల్ సీన్లలో తన నటనను మెరుగుపరచుకోవాల్సి వుంది.

మిగిలిన పాత్రల విషయానికొస్తే శ్రీహరిది చిన్న పాత్రే అయినా చాలా ముఖ్యమైన పాత్ర. ఇందులో శ్రీహరి అద్భుతంగా నటించారు. ముఖ్యంగా షేర్ ఖాన్ గా తన గెటప్ మరియు డైలాగ్స్ చాలా బాగున్నాయి. రణధీర్ పాత్రలో నటించిన దేవ్ గిల్ తన పాత్రకు న్యయం చేసారు. రావ్ రమేష్ అఘోరా గా తన డైలాగ్స్ తో భయపెట్టే స్వరంతో ఆకట్టుకుంటారు. సునీల్ తన కామెడీతో పర్వాలేదనిపించుకున్నారు, కానీ బ్రహ్మానందం, హేమల కామెడీ ఆకట్టకోలేకపోయింది. కిమ్ శర్మ మరియు ముమైత్ ఖాన్ ఐటెమ్ సాంగ్స్ లో కనిపిస్తారు. ముమైత్ ఖాన్ సన్నబడింది నాజూగ్గా కనిపించింది.

రాజమౌళి మరో సారి తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకొన్నారు. కథ ముందుగానే అర్థమైపోయినా ఆసక్తికరంగా చెప్పడంలో సఫలీకృతులయ్యారు. కథనం ఆకట్టుకొంటుంది. ప్రేమకథను చూపడంలో విఫలం అవుతన్న రాజమౌళి ఈ చిత్రంలో పర్వాలేదనిపించుకున్నారు.

యం.యం.కీరవాణి సంగీతం కాస్త నిరాశపరిచినా పాటలు స్ర్కీన్ పై చక్కగా కనిపిచాయి. యం.యం.కీరవాణి, కళ్యాణ్ మాలిక్ లు సమకూర్చన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా వుంది.

సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ కృషి ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. పీటర్ హెయిన్ ఫైట్స్ బాగున్నాయి. రమారాజమౌళి స్టైల్స్ బాగున్నాయి.

"Last But Not The Least" సినిమాను అద్భుతమైన సాంకేతిక విలువలతో, భారీగా నిర్మించిన అల్లూ అరవింద్ ప్రయత్నం అభినందనీయం.

మొత్తంగా సినిమా మొదటి భాగం ఆసక్తికరంగా వుంది. ఫ్లాష్ బ్యాక్ తర్వాత కాస్త స్లోగా నడుస్తుంది.

చివరగా ఈ సినిమాకు అరుంధతి సినిమా కథలో కొన్ని పోలికలు వున్నయి, మరి రికార్డుల విషయం వేచిచూడాలి....

 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more