For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హా..మహాత్మా!!( రివ్యూ)

  By Srikanya
  |

  Mahatma

  Rating

  -సూర్య ప్రకాష్ జోశ్యుల
  బ్యానర్: గోల్డెన్ లయిన్ ఫిలింస్
  నటీనటులు: శ్రీకాంత్, బావన, జయప్రకాష్ రెడ్డి, ఉత్తేజ్, రామ్ జగన్,
  పరుచూరి వెంకటేస్వరరావు, జ్యోతి, ఆహుతి ప్రసాద్ తదితరులు.
  సంగీతం: విజయ్ ఆందోని
  కెమెరా: శరత్
  ఎడిటింగ్: శంకర్
  ఫైట్స్: విజయ్
  డైలాగులు: పరుచూరి బ్రదర్శ్
  కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కృష్ణవంశి
  నిర్మాత: సి.ఆర్.మనోహర్
  రిలీజ్ డేట్: 09,అక్టోబర్ 2009

  శ్రీకాంత్ వందవ చిత్రం..కృష్ణవంశి దర్శకత్వంలో అంటూ విపరీతమైన పబ్లిసిటితో ఎక్సపెక్టేషన్స్ తో వచ్చిన మహాత్మలో మ్యాటర్ మాత్రం ఆ రేంజిలో లేదు. గత కాలంలో తెలుగు సినిమా వదిలేసిన డ్రామాను వెలికితీయటం మాత్రమే చేయగలిగింది. అలాగే గాంధీ మహాత్ముడు సిద్దాంతాలను ఈ తరానికి అన్వయిస్తూ అల్లుకున్న సన్నవేశాలు కూడా ఆచరణయోగ్యంగా లేవు...సరికదా ఆయన సిద్దాంతం జీవితంలో అమలు చేయటం ఇంత కష్టమా అని అనుమానించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇలాంటి పాయింట్ తో వచ్చిన లగేరహో మున్నాభాయిలో ఉన్న స్పష్టత ఇక్కడ కనపడకపోవటం విషాదకరం. అప్పటికీ ఫస్టాఫ్ మొత్తం సెటప్ కే తీసుకుని గాంధీని ప్రక్కన పెట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ తో నింపారు. అదే ఈ సినిమాను గట్టెంక్కించాలి.

  ఓ కరుడుగట్టిన రౌడీ గాంధీ సిద్దాంతాలను అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయి అంటూ చర్చించటం ఈ కథ ముఖ్య ఉద్దేశం. దాసు(శ్రీకాంత్) ఓ వీధి రౌడి. తన పరిధిలో సెటిల్ మెంట్స్ చేసుకుంటూ బ్రతికే అతనికి లోకల్ పొలిటీషియన్ దాదా(జయప్రకాష్ రెడ్డి) పరిచయమవుతాడు. అతన్ని గుడ్డిగా నమ్మి పనిచేసుకుంటూడగా ఓ విషయంలో దాదా నిజ స్వరూపం తెలుస్తుంది. దాంతో అతనికి దాసు ప్రత్యర్ధిగా మారి ఎమ్మల్యేగా నిలబడి ఓడించి దెబ్బ కొడదామనుకుంటాడు. ఏ పార్టీలోనూ టిక్కెట్టు దొరక్క సొంతంగా మహాత్మా పార్టీ పెడతాడు.అలాగే ఈ క్రమంలో దాసుకు కృష్ణవేణి(భావన) అనే లాయర్ పరిచయమవుతుంది. ఆమె సలహాపై తను పెట్టిన పార్టీ గుర్తు గాంధీ కావటంతో ఆ సిద్దాంతాలను అమలు చేయాలనుకుంటాడు. అక్కడ నుంచి దాసు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు..విలన్స్ కి ఎలా బుద్ది చెప్పాడు అనేది మిగతా కథ.

  ఎత్తుకున్న పాయింట్ వరకూ దర్శకుడుని మెచ్చుకోవాల్సిందే అయితే ఎగ్జిక్యూషనే కరెక్టుగా లేదనిపిస్తుంది. అందులోనూ అసలు ఎత్తుకున్న గాంధీ సిద్దాంతం చర్చ కన్నా మధ్యలో వచ్చే రాజకీయం గోల ఎక్కువైంది. అందులోనూ అసలు పాయింట్ కి ఇంటర్వెల్ వరకూ రాకుండా కథనం నడుస్తుంది. దాంతో ఫస్టాఫ్ లో శ్రీకాంత్ సినిమాల్లో చేరాలని (ఖడ్గంలో రవితేజ)సీన్స్, ఛార్మి ఐంటం సాంగ్ వస్తాయి. పోనీ సెకెండాప్ లో నన్నా గాంధీ సిద్దాంతాలపై చర్చ జరుగుతుందేమని ఆశిస్తాం. అదీ కనపడదు. ఇక ఇవి ప్రక్కన పెడితే దర్శకుడుగా కృష్ణవంశి ప్రతిభ చాలా సన్నివేశాల్లో మెరుస్తుంది. అలాగే వివిధ దేశనాయకుల గెటప్ లలో రామ్ జగన్ కనపడటం మంచి ఆలోచన. వీటితో పాటు ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ అనే పాటలో విజువల్స్ గుర్తుండిపోతాయి. నటుల్లో క్రూడ్ పొలిటీషన్ గా జయప్రకాష్ రెడ్డి అదరకొట్టాడు. బ్రహ్మానందం కథకు ఏమీ ఉపయోగం లేదు. పోస్టర్ వ్యాల్యూ కోసం పెట్టుకున్నట్లున్నారు. అలాగే పరుచూరి వెంకటేశ్వరరావు, జ్యోతి, ఉత్తేజ్ యధావిధిగా చేసుకుపోయారు. టైటిల్ సాంగ్ ని సిరివెన్నల కలకాలం గుర్తుండిపోయేలా రాశారు.

  కెమెరా ఓ మోస్తరుగా ఉంది. సంగీతం ఇచ్చిన విజయ్ ఆంటోని డలైమో..డలైమో సాంగ్ ఇక్కడ ఇంతకు ముందే డిష్యుం..డిష్యుం అనే చిత్రంలో వచ్చి హిట్ అయిందనే సంగతి తెలుసుకుని ఉంటే బావుండేది. ఆఖరుగా శ్రీకాంత్ కొన్ని చోట్ల చిరంజీవిని అనుకరించినట్లు కనపడటం వందవ చిత్రానికి వన్నె తెచ్చేది కాదు. పరుచూరి సంభాషణలు పస తగ్గాయని స్పష్టంగా అర్ధమవుతుంది.

  ఏదైమైనా గాంధీ సిద్దాంతం అనేది ప్రక్కన పెట్టి ఓ మామూలు కమర్షియల్ సినిమా చూస్తున్నామనుకుంటే కొంత వరకూ తృప్తిపడచ్చు. బి, సి సెంటర్లు కొంత వరకూ భరిస్తారు గానీ ఎ సెంటర్లు అనుమానమే.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X