For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చెలరేగిపోయాడు (‘ఆగడు’ రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.5/5

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  "నన్ను మీరు ఆడియో పంక్షన్ లో హీరోయిన్ ని పొగిడినట్లు పొగడకండి"...ఇలాంటి ఖతర్నాక్ డైలాగులు ఎవరు సినిమాలో ఉంటాయి... ఖచ్చితంగా అది శ్రీను వైట్ల సినిమా అయ్యిండాలి అన్నంతగా తనదైన శైలిని తెలుగు తెరపై పరుస్తున్న దర్శకుడు శ్రీనువైట్ల. ఆయన చిత్రం రాబోతోందంటే ఖచ్చితంగా అది నవ్వుల విందే అని ఫిక్స్ అయిపోతారు. అలాంటిది మహేష్ వంటి స్టార్ హీరోతో ఆయన కలిస్తే..అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి..ఆ విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. అందుకేనేమో...టైటిల్ కు తగ్గట్లే ఎక్కడా తన పంచ్ లను,కామెడీ ఎపిసోడ్స్ ని మిస్ అవకుండా కథ లేకపోయినా పరుగెత్తే కథనంతో తన దూకుడు మరోసారి చూపించాడు. మసాలా కామెడీ ఎంటర్టైనర్ ని అందించాడు.

  యీక్షన్ కామెడీ... ఇప్పటి టాలీవుడ్ భాక్సాఫీస్ గెలుపు సూత్రం అని నమ్మి స్టార్ హీరోలు వరసగా చేస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. కొద్దిగా రివేంజ్, బోల్డు కామెడీతో ఎప్పటిలాగే శ్రీను వైట్ల తనదైన శైలి పంచ్ లు, యాక్షన్ ఎపిసోడ్స్ లగేజీ తో దిగిపోయాడు. అతని కామెడీ టింజ్ కు సూపర్ స్టార్ సూపర్బ్ ఫెరఫార్మెన్స్ తోడయ్యి...థియోటర్లలను నవ్వులలో ముంచెత్తుతోంది. చూసేవారికి పెద్దగా శ్రమ లేకుండా ఓ హీరో, విలన్, చిన్న లవ్ స్టోరీ, మధ్యలో బుల్లి రివేంజ్, దానికి తగ్గ సెంటిమెంట్ పెట్టుకుని శ్రీను వైట్ల కామెడీకే పూర్తి స్ధానం ఇస్తూ చెలరేగిపోయాడు. అయితే ఫస్టాఫ్ లో ఉన్నంత కామెడీని సెకండాఫ్ లో తీసుకురాకుండా కథలోకి వచ్చి...యాక్షన్, రివేంజ్ తో నడపాడు. ఇంటర్వెల్ సైతం ట్విస్ట్ లు ఏమీ పెట్టుకోకుండా...ప్లాట్ గా వేసాడు.

  అయితే ఒకటి మాత్రం నిజం...ఇలాంటి కథ మహేష్ బాబు కాకుండా మరొకరు అయితే ఎంత వరకూ మోయగలరనేది అనుమానమే. అటు బ్రహ్మానందం డాన్స్ ఎపిసోడ్స్, ఇటు శృతి హాసన్ హాట్ ఐటం సాంగ్, మధ్య మధ్యలో మహేష్ బాబు తన సినిమాల్లోంచే కథలు తీసుకుని ఎదుటివారికి చెప్తూ బోల్తా కొట్టించే తీరు ఈ సినిమాకు బోనస్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే మీలో ఎవరు కోటీశ్వరుడు(మీలో ఎవరు పోటుగాడు) టైప్ ఎపిసోడ్, ఆ తర్వాత వచ్చే మహేష్ ఫ్లూట్ డాన్స్ హైలెట్ గా నిలుస్తాయి. దూకుడు లోని హిట్ ఫార్ములాను దగ్గర పెట్టుకుని చేసినట్లున్న ఈ చిత్రం మహేష్ ఖాతాలో మరో మంచి హిట్ ని నమోదు చేస్తుందనటంలో సందేహం లేదు.

  అనాధ అయిన శంకర్(మహేష్) ని చేరదీస్తాడు పోలీస్ అధికారి రాజారావు(రాజేంద్రప్రసాద్) . కానీ అనుకోని పరిస్ధితుల్లో రాజరావు పొరపాటుపడి ఓ కేసులో శంకర్ బోస్టన్ స్కూల్ కి పంపుతాడు. శంకర్ అక్కడే పెరిగి పెద్దవాడయ్యి... ఎనకౌంటర్ శంకర్ గా బయిటకు వస్తాడు. డైరక్ట్ గా బుక్కపట్నం లో డ్యూటీకి దిగిపోతాడు. అక్కడ అరాచకాలు చేస్తున్న విలన్ దామోదర్ అలియాస్ దాము (సోనూసూద్) ని అడ్డుకోవటానికి పోలీస్ యూనిఫాం తో తన దైన శైలిలో చెలరేగిపోతాడు. అంతేకాకుండా దాము కట్టబోతున్న పవర్ ఫ్లాంట్ ప్రాజెక్టుని సైతం ఆపుచేయిస్తాడు. ఈ లోగా దాము గురించి మరో షాకింగ్ నిజం తెలుస్తుంది. అప్పుడు దాము సామ్రాజ్యాన్నీ పూర్తిగా కూలదోయటం మొదలెడతాడు. అసలు ఎనకౌంటర్ శంకర్ కి, దాము కి ఉన్న రిలేషన్ ఏమిటి..కథలో స్వీట్స్ సరోజ(తమన్నా) పాత్ర ఏమిటి...డిల్లీ సూరి (బ్రహ్మానందం) కథలోకి ఎంట్రీ ఇలా ఇచ్చి..ఏం చేస్తాడు...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  విశ్లేషణకు వస్తే... ఈ కథ కొత్తదీ కాదు...అలాగని కథనమూ అద్బుతంగా లేదు. చాలా రొటీన్ కథకు, చాలా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అందించారు శ్రీను వైట్ల. అయితే అది మహేష్ సినిమా కావటం, కామెడీ పండటం తో ఆ సమస్య హైలెట్ కాలేదు. అలాగే... ఫస్టాఫ్ మీద పెట్టిన దృష్టి సెకండాఫ్ మీద అసలు పెట్టలేదనిపిస్తుంది. ఒక్కసారి ట్విస్ట్ లు రివిల్ అయ్యాక...చాలా సాదాసీదా సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అలాగే సోనూసూద్ నెగిటివ్ క్యారెక్టర్ ని సైతం ఎలివేట్ చెయ్యకపోవటంతో కొన్ని చోట్ల సీన్స్ నడుస్తున్నాయి కానీ హీరో ప్యాసివ్ గా మిగిలిపోవాల్సి వచ్చింది. ఇక తెలుగు సినిమాకు కీలకంగా నడిచే ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా సాదాగా, ఇంకా చెప్పాలంటే ప్లాట్ గా ఉన్నాయి.

  స్లైడ్ షోలో విశ్లేషణ పూర్తిగా...

  అదే పెద్ద మైనస్

  అదే పెద్ద మైనస్

  శ్రీను వైట్ల మార్క్ కామెడీ, మహేష్ ఫెరఫార్మెన్స్ తప్పిస్తే సినిమాలో ఏమీ లేదు. హీరో గురించి, అతని పనుల గురించి విలన్ కి పూర్తిగా తెలిసే సరికే క్లైమాక్స్ కు వచ్చేస్తే...సినిమాలో చర్చ...ప్రతి చర్యకు అవకాశమెక్కడుంటుంది. అలాంటి స్క్రీన్ ప్లేలో కిక్కేముంటుంది...అదే ఈ సినిమాకు జరిగింది. పూర్తి ప్యాసివ్ పాత్రను తో కథను రాసుకున్నారు. అలాగే ఇలాంటి పెద్ద హీరోల సినిమాల్లో ఉండే ట్విస్ట్ లు ఏమీ లేవు. రైటింగ్ డిపార్టమెంట్ వీక్ అనే చెప్పాలి.

  ఫ్లాష్ బ్యాక్ అలాగే..

  ఫ్లాష్ బ్యాక్ అలాగే..

  ఇలాంటి చిత్రాలకు కీలకంగా నడిచే ఫ్లాష్ బ్యాక్ సైతం బలంగా లేదు. దాన్ని నుంచి పుట్టే సింగిల్ లైన్ తో కథను నడిపాలనుకున్నప్పుడు అది మరింత బలంగా ఉంటే బాగుండేది. శ్రీను వైట్ల గత చిత్రం బాద్షాను గుర్తు చేసే ప్లాష్ బ్యాక్ ఇబ్బంది గానే అనిపిస్తుంది.

  శృతిహాసన్ ఐటం

  శృతిహాసన్ ఐటం

  ప్రారంభం రోజు నుంచీ ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ పబ్లిసిటీ చేస్తున్నారు. సోనూసూద్ ఇంట్లో జరిగే ప్రెవేట్ పంక్షన్ లో డాన్స్ చేసినట్లు చూపే ఈ సాంగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది అంతే. అంతేకానీ అంచనాలకు తగ్గట్లుగా అయితే లేదు.

   డైలాగులు

  డైలాగులు

  ఈ సినిమా స్క్రిప్టు కు ఏకైక బలం డైలాగులు. అదీ మహేష్ పలకటం. అయితే అవీ కొన్ని చోట్ల సీన్ కు సంభంధం లేకుండా ప్రాసను పట్టుకుని వచ్చేయటం జరిగింది. అలాంటివి కాస్త ఎడిట్ చేసుకుని ఉంటే బాగుండే్ది.

  బ్రహ్మీ

  బ్రహ్మీ

  మొదటి నుంచీ శ్రీను వైట్ల ప్రతీ సినిమాలో బ్రహ్మానందం హైలెట్ గా ఓ పాత్ర ఉంటూ వస్తోంది. ఇందులోనూ డిల్లీ సూరి అంటూ ఓ పాత్రను వేయించారు. అలాగే సెకంఢాఫ్ లో తాజాగా హిట్టైన హీరోల పాటలను తీసుకుని స్టెప్ట్స్ వేయించి నవ్వించారు. అంతకుమించి బ్రహ్మానందం చేసిందేమీ లేకపోయినా సినిమా ఎస్సెట్ లో ఒకరనే చెప్పాలి.

  మహేష్ బాబు

  మహేష్ బాబు

  మొదటి నుంచీ చెప్పుకుంటున్నట్లుగా ఇది మహేష్ వన్ మ్యాన్ షో. మహేష్ ఇమేజ్..మహేష్ మ్యాజిక్...వంటి అంశాలు దృష్డిలో పెట్టుకుని అల్లిన కథ ఇది. మహేష్ లేకపోతే ఈ కథను చివరి వరకూ భరించటం కష్టం.

  టెక్నికల్ గా...

  టెక్నికల్ గా...

  కెమెరా డిపార్టమెంట్ గుహన్..ఎప్పటిలాగే మహేష్ సినిమాలో తన మ్యాజిక్ ని చూపాడు. మంచి విజువల్స్ తో సినిమాని మరింత రిచ్ గా చూపే ప్రయత్నం చేసాడు. అలాగే ఎడిటర్ వర్మ ఫస్టాఫ్ బాగా టైట్ గా ఎడిట్ చేసారు. సెకండాఫ్ ను కూడా అదే పేస్ లో ఉండేలా డైరక్టర్ ప్లాన్ చేసి ఎడిటర్ చేత చేయిస్తే బాగుండేది.

  పాటలు

  పాటలు

  తమన్ ఆడియో రెగ్యలర్ మహేష్ సినిమాల్లా హిట్ కాలేదు. అయితే అంతా సినిమా రిలీజ్ అయ్యాక ఎక్కుతాయనుకున్నారు. అయితే అదీ పెద్దగా కనపడటం లేదు. రెండు పాటలు మినహా చెప్పుకోదగ్గ రీతిలో లేవు.

   ప్రొడక్షన్ వ్యాల్యూస్, డైరక్షన్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్, డైరక్షన్

  శ్రీను వైట్ల దర్శకత్వం గురించి కొత్తగా చెప్పుకునేదేమీ లేదు. అయితే కథమీద మరింత శ్రద్ద పెట్టి ఉంటే ఖచ్చితంగా ఇంతకన్నా మెరుగైన ఫలితం కనిపించి ఉండేది. అలాగే... నిర్మాతలు సినిమాకు బాగా ఖర్చు పెట్టారు. బాగా పబ్లిసిటీ చేసారు. వాళ్లను ఎక్కడా వంక పెట్టలేని విధంగా ఈ సినిమాకు పనిచేసారు.

  ఎవరెవరు

  ఎవరెవరు

  బ్యానర్:14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్

  నటీనటులు :మహేష్ బాబు, తమన్నా, డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు

  రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్,

  రచనా సహకారం: ప్రవీణ్ వర్మ,

  సంగీతం: ఎస్.ఎస్.థమన్,

  సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్,

  ఆర్ట్: ఎఎస్ ప్రకాష్,

  ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ,

  పాటలు: భాస్కర్ భట్ల, శ్రీమణి

  కో-డైరెక్టర్: చలసాని రామారావు,

  ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి,

  నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర,

  విడుదల తేదీ: 19, సెప్టెంబర్ 2014.

  కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

  ఫైనల్ గా శ్రీనువైట్ల దూకుడు దగ్గరే ఆగినట్లు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తూంటే. ఎన్టీఆర్ చేసిన బాద్షాని, దూకుడుని కలిపి వండినట్లున్న ఈ చిత్రం పూర్తిగా మహేష్ బాబు ఛరిష్మా మీద రూపొందింది. అయితే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండటం, మహేష్ చిత్రం కావటంతో ఫ్యామిలీలు సైతం కదిలి వచ్చే అవకాసం ఉంది. అది ఏ మేరకు జరుగుతుందనే దానిని బట్టి...చిత్రం విజయం రేంజి ఆధారపడి ఉంటుంది.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Mahesh Babu and Tamanna starrer 'Aagadu' released today with hit talk. Aagadu is action entertainer movie in which, Super star Mahesh Babu playing the lead role and it is said to be that he will be seen totally different role, which he never attempted in his career.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X