twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లాక్ మనీ మూవీ రివ్యూ

    మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన జనతా గ్యారేజ్, మన్యంపులి, కనుపాప సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. తెలుగులో ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకొన్న మోహన్‌లాల్ మరోసారి బ్లాక్ మనీ సినిమాతో మ

    By Rajababu
    |

    Rating:
    2.5/5
    Star Cast: మోహన్‌లాల్, అమలాపాల్, బిజూ మీనన్
    Director: జోషి

    ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన చిత్రాలు, తెలుగులోకి డబ్బింగ్ అయిన ఆయన సినిమాలు ఘనవిజయాన్ని సాధించాయి. జనతా గ్యారేజ్, మన్యంపులి, కనుపాప సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. తెలుగులో ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకొన్న మోహన్‌లాల్ మరోసారి బ్లాక్ మనీ సినిమాతో ముందుకొచ్చారు. ఈ చిత్రం 2012లో మలయాళంలో ఘన విజయం సాధించిన రన్ బేబీ రన్ చిత్రానికి మాతృక. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఏమున్నాయో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్తాం.

     కెమెరామెన్, సీనియర్ ఎడిటర్ ప్రేమ..

    కెమెరామెన్, సీనియర్ ఎడిటర్ ప్రేమ..

    వేణు (మోహన్‌లాల్) వీడియో జర్నలిస్టు. రాయటర్ అనే సంస్థలో కెమెరామెన్‌గా పనిచేస్తుంటాడు. రేణుక (అమలా పాల్) భారత్ విజన్ అనే టెలివిజన్ సంస్థలో సీనియర్ ఎడిటర్‌గా పనిచేస్తుంటుంది. వారిద్దరూ ఒకర్నొకరు ప్రేమించుకొంటారు. పెళ్లి చూసుకోవాలని కూడా నిర్ణయించుకొంటారు. పెళ్లికి ముందు వేణుతో కలిసి ఓ కుంభకోణాన్ని బట్టబయలు చేస్తుంది. ఆ కుంభకోణం విషయంలో వేణును మోసగించాల్సి వస్తుంది. దాంతో వారిద్దరూ విడిపోతారు.

    ఇబ్బందుల్లో కెమెరామెన్..

    ఇబ్బందుల్లో కెమెరామెన్..

    చాలా రోజుల తర్వాత ఓ రాజకీయ నేత (సాయికుమార్) చేసే మర్డర్‌ను లైవ్‌గా చిత్రీకరించాలని ప్లాన్ చేస్తారు. ఓ వ్యక్తిని మర్డర్ చేసే తతంగాన్ని అంతా చిత్రీకరిస్తారు. కానీ ప్లాన్ బెడిసి కొడుతుంది. దాంతో వారు ఇబ్బందుల్లో పడుతారు. వేణు, రేణుకల కోసం పోలీసులు గాలిస్తుండటంతో వారు ఓ ఇంటిలో దాచుకొంటారు. ప్రియుడు వేణును రేణుక ఎందుకు మోసగించింది? మర్డర్ చిత్రీకరించే సమయంలో ఏం జరిగింది? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? చివరికి వేణు, రేణుక పెళ్లి చేసుకొన్నారా అనే ప్రశ్నలకు సమాధానమే బ్లాక్ మనీ కథ.

    జర్నలిస్టుగా మోహన్ లాల్

    జర్నలిస్టుగా మోహన్ లాల్

    వీడియో జర్నలిస్టుగా మోహన్ లాల్ ఆ పాత్రలో జీవించారు. కెమెరామెన్‌గా ఆయన చూపించిన హావభావాలు ప్రేక్షకుడిని ఆకట్టుకొంటాయి. కీలక సన్నివేశాలలో ఆయన నటన, డైలాగ్స్ డెలివరి బాగున్నాయి. ఇలాంటి పాత్రలు పోషించడం మోహన్‌లాల్‌కు కొట్టిన పిండి అని చెప్పవచ్చు.

    ఒకే అనిపించిన అమలాపాల్

    ఒకే అనిపించిన అమలాపాల్

    సీనియర్ ఎడిటర్‌గా అమలాపాల్ తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది. నటన ఎక్కువగా ఫెర్ఫార్మెన్స్ చేయలేని పాత్ర పోషించనప్పటికీ పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చింది. కెరీర్‌ కోసం పాకులాడే జర్నలిస్టు పాత్రలో ఒదిగిపోయింది.

    ప్రేక్షకులకు తెలియని నటులు

    ప్రేక్షకులకు తెలియని నటులు

    మిగితా పాత్రల్లో బిజు మీనన్, అపర్ణా నాయర్, సాయి కుమార్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించారు. వీరంతా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోవడం కారణంగా వారు ఆ పాత్రల్లో గుర్తుండిపోవడం కష్టం.

    ఫొటోగ్రఫీ.. సంగీతం పర్వాలేదు..

    ఫొటోగ్రఫీ.. సంగీతం పర్వాలేదు..

    చాలా సీరియస్‌గా సాగే ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అదనపు బలంగా మారింది. కీలక ఎపిసోడ్స్‌ను ఆర్డీ రాజశేఖర్ చాలా చక్కగా తెరకెక్కించారు. సాధారణ సన్నివేశాన్ని కూడా తెరపైన ఆసక్తిగా చూపించడంలో తన ప్రతిభను రాజశేఖర్ కనబరిచారని చెప్పవచ్చు. రతీష్ వెగ అందించిన సంగీతం బాగున్నది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

     కథ ఎంపిక భేష్..

    కథ ఎంపిక భేష్..

    జర్నలిజం నేపథ్యంగా కథను దర్శకుడు జోషి ఎంచుకోవడం అభినందనీయం. కానీ తెలుగు నేటివిటికి సరిపోయే కథ కాకపోవడం కొంత ప్రతికూల అంశం. కథలో మరిన్ని ట్విస్టులకు చోటువున్నా వాటిపై దృష్టిపెట్టకపోవడం వల్ల అతి సాధారణమైన సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగడానికి ఆస్కారం ఉంటుంది.

    రొటీన్ కథనం..

    రొటీన్ కథనం..

    దర్శకుడు జోషి ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించే కథను ఎంచుకోవడం వరకు బాగున్నది. కథ అంతా ఒకే నోట్‌లో సాగడం వల్ల ప్రేక్షకుడు కొంత ఇబ్బందికి గురికావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వాటిలో మీడియాలో స్టింగ్ ఆపరేషన్ ఎలా చేస్తారు. కెమెరాల పనితీరు ఎలా ఉంటుంది. కుంభకోణాలు వెలికి తీయడంలో జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి. రాజకీయ నేతల కుట్రలకు జర్నలిస్టులు ఎలా బలి అవుతారు అనే అంశాలను జోషి చక్కగా ప్రస్తావించారు.

     కమర్షియల్ హంగులకు దూరంగా

    కమర్షియల్ హంగులకు దూరంగా

    కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం బ్లాక్ మనీ చిత్రానికి మైనస్ పాయింట్. వినోదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే తెలుగు ప్రేక్షకులకు కొంత ఇబ్బందే అనిపిస్తుంది. కాకపోతే విభిన్నమైన కథాంశాలను కోరుకొనే ప్రేక్షకుల ఆదరణ లభించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. క్లైమాక్స్‌లో దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది. పలు స్టింగ్ ఆపరేషన్లలో ఒకే రకమైన సీన్లను చూపించడం వల్ల ప్రేక్షకుడు బోర్‌గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కథకు బ్లాక్ మనీ అనే టైటిల్ ఏమాత్రం సరితూగకపోవడం ఈ సినిమాకు ప్రధాన సమస్య అని చెప్పవచ్చు.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ అంశాలు
    కథ
    మోహన్ లాల్ యాక్టింగ్

    నెగిటివ్ అంశాలు
    సినిమాలో కమర్షియల్ హంగులు లేకపోవడం
    కథనం
    గుర్తింపు పొందిన నటులు లేకపోవడం

    తెర వెనుక, తెర ముందు..

    తెర వెనుక, తెర ముందు..

    సినిమా: బ్లాక్ మనీ
    నటీనటులు: మోహన్ లాల్, అమలా పాల్, బిజు మోహన్
    నిర్మాత: సయ్యద్ నిజాముద్దీన్
    సంగీతం: రతీష్ వెగ
    సినిమాటోగ్రాఫర్: ఆర్డీ రాజశేఖర్
    దర్శకుడు: జోషి

    English summary
    Black Money is the story revolving around the present day politics and big-wigs trying to exchange their money into white, whilst their secret mission is recorded by a video journalist, who cracks it all up. The movie is a dubbed version of 2012 Malayalam movie titled 'Run Baby Run'. Director Joshiy narrated the story in a interesting manner unraveling each and every twist one by one. Interval twist is good and though pre climax is routine, climax is good.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X