twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాప్‌కార్న్‌ 'మల్లీశ్వరి'

    By Staff
    |

    Mallishwari
    చిత్రం: మల్లీశ్వరి
    నటీనటులు: వెంకటేష్‌, కత్రినాకైఫ్‌, స్మిత, కోట శ్రీనివాస్‌రావు,
    బాలయ్య, సునీల్‌, బ్రహ్మనందం, నరేష్‌, తనికెళ్ళ భరణి తదితరులు
    సంగీతం: కోటి
    రచన: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
    నిర్మాత: డి.సురేష్‌బాబు
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.విజయభాస్కర్‌

    వెంకటేష్‌-కె.విజయభాస్కర్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'నువ్వునాకు నచ్చావ్‌' పెద్ద ఎంటర్‌టైనర్‌. ఆద్యంతం నవ్వులు కురిపించిన ప్రేమకథ. అదే కాంబినేషన్‌లో వచ్చిన 'మల్లీశ్వరి' అదే మాదిరిగా ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం ఈ కాంబినేషన్‌ త్రయం సగం మాత్రమే విజయం సాధించింది. 'మల్లీశ్వరి' కూడా వినోదమే ప్రధానంగా సాగే చిత్రమే ఐనప్పటికీ, 'కామెడీ' శాతం చాలా తక్కువ. త్రివిక్రమ్‌ రచనల్లో కనిపించే ఆ పంచ్‌ డైలాగ్స్‌ కూడా ఇందులో పెద్దగా లేవు. వెంకటేష్‌ నటించిన 'వసంతం' తరహాలో సింపుల్‌గా సాగే సినిమా అది.

    పాత చిత్రాలతో ఈ సినిమా పోల్చడం తప్పే కానీ, ఈ సినిమా పాత సన్నివేశాలను, పాత ఫార్మూలానే ఫాలో అయినప్పుడు పోలిక తప్పదు. కూసింత సేపు నవ్వుకోవడానికి మాత్రం సినిమా బాగుంటుంది. ఆ విధంగా ఐతే చూడదగ్గ చిత్రమే. కానీ 'మల్లీశ్వరి' అంటే ఎంతో గొప్పగా ఉంటుందనుకుంటే నిరాశపడాల్సి వస్తుందని హెచ్చరిక. యువరాణి వంటి హీరోయిన్‌ కావాలి అందుకే భారీ పారితోషికమైనా కత్రినా కైఫ్‌ను ఏరికోరి తీసుకున్నామని దర్శక, నిర్మాతలు చెప్పారు. కానీ సినిమాలో మాత్రం ఆ 'ఫీల్‌' ఏమీలేదు. మామూలు యాడ్స్‌లలో బాగుండే కత్రినా ఇందులో సాధారణంగా అన్పించింది. ఆమెకు నటనలో మార్కులు శూన్యం. వెంకటేష్‌, కోట శ్రీనివాస్‌రావు బాగా చేశారు ఈ సినిమాలో.

    కథ చాలా పాతది. జమిందారీ కుటుంబానికి చెందిన మల్లీశ్వరికి 21 ఏళ్ళు రాగానే వారసత్వంగా ఆస్తి చెందుతుంది. ఆ ఆస్తిని కొట్టేసేందుకు మల్లీశ్వరిని తప్పించాలని చనిపోయిన జమీందారు రెండో భార్య కొడుకు కోట భవానీ శంకర్‌ (కోట శ్రీనివాసరావు) ప్రయత్నిస్తాడు. దీంతో ఆమెను సేఫ్‌గా ఉంచేందుకు వైజాగ్‌ పంపిస్తారు. అక్కడ పెళ్ళి కోసం తపించేపోయే బ్యాంక్‌లో అకౌంటెంట్‌గా పనిచేసే ప్రసాద్‌ (వెంకటేష్‌) పరిచయం అవుతాడు. ఆమెతో ప్రేమలో పడ్డ ప్రసాద్‌ పెళ్ళికోసం ప్రతిపాదిస్తాడు. ఈ లోపే, ఆమెను చంపేందుకు రౌడీలు ప్రయత్నించడంతో ప్రసాద్‌ ఆమెను కాపాడి తిరిగి హైదరాబాద్‌కు తీసుకొస్తాడు. ఇక సినిమా అంతా ఆమెను కోట మనుషుల నుంచి ప్రసాద్‌ కాపాడడమే.

    పెళ్ళి కోసం తపించే పోయే పాత్రలో వెంకటేష్‌ కామెడీ బాగా పండించాడు. ఐతే, కత్రినా, వెంకటేష్‌ల మధ్య ప్రేమ సన్నివేశాలు పెద్దగా పండలేదు. కోట మరోసారి తన వెరైటీ విలనిజాన్ని ప్రదర్శించాడు. హీరోయిన్‌ను కాపాడేందుకు హీరో చివర్లో దొంగగా మచ్చబడేలా ప్రవర్తించడం, హీరోయిన్‌ చివర్లో పెళ్ళి కుదిరాక రియలైజ్‌ కావడం వంటి సీన్లు మరీ మూస. త్రివిక్రమ్‌ ఈ సారి కామెడీ పండించడంలో దారుణంగా ఫెయిలయ్యాడు.

    ఒన్‌లైన్‌ కామెడీ డైలాగ్‌లతో ఎక్కువ కాలం సినిమాలు తీయలేమని బహుశా తెలిసివచ్చి ఉంటుంది ఈ చిత్రంతో. రాంగోపాల్‌వర్మ క్షణక్షణంలో మాదిరిగా యాక్షన్‌, కామెడీ కలపాలని విజయ్‌భాస్కర్‌ ప్రయత్నించాడు కానీ దురదృష్టవశాత్తూ విజయ్‌భాస్కర్‌ వర్మ కాదు. సెకాండాఫ్‌ మరీ పెద్దగా ఉండడం, కోటీ రోటీన్‌ సంగీతం మరో మైనస్‌ పాయింట్స్‌. ఐతే, టైంపాస్‌కు చూడే చిత్రం కాబట్టి పెద్దగా డబ్బులు వేస్ట్‌ అయ్యాయని ఫీలింగ్‌ రాదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X