For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైఎస్ఆర్ బయోపిక్: యాత్ర మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Recommended Video

  Yatra Movie Review యాత్ర మూవీ రివ్యూ | Filmibeat Telugu

  Rating:
  3.0/5
  Star Cast: మమ్ముట్టి, సుహాసిని మణిరత్నం, జగపతిబాబు, అనసూయ
  Director: మహీ వీ రాఘవ్

  తెలుగు సినిమా గర్వించతగ నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన మహానటి చిత్రం తర్వాత టాలీవుడ్‌లో బయోపిక్‌ చిత్రాల జోరు పెరిగింది. ఇటీవల వచ్చిన ఎన్టీఆర్: కథానాయకుడు తర్వాత వస్తున్న మరో బయోపిక్ యాత్ర. మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైఎస్ఆర్ మహానేతగా మారడానికి దోహదపడిన అంశాలు ఏమిటో అనే తెలుసుకోవాలంటే యాత్ర సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

  యాత్ర సినిమా గురించి

  యాత్ర సినిమా గురించి

  యాత్ర సినిమా గురించి చెప్పుకోవడానికి కథ ఏమీ ఉండదు. ఓ సుదీర్ఘమైన జీవన ప్రయాణం మాత్రమే కనిపిస్తుంది. అధికారంలో ఉన్న అత్యంత బలమైన ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ ఒంటరిగా ఎదురిస్తూ ప్రజా సమస్యలను ఎలా తెలుసుకొన్నాడనేది యాత్ర సినిమా. అన్ని సినిమాల్లో మాదిరిగా బలమైన ప్రత్యర్థులు ఈ సినిమాలో కనపించరు. కాకపోతే పాదయాత్రలో ప్రజల కష్టాలను గుర్తెరిగి మహానేతగా ఎలా మారాడన్నది ఈ చిత్ర కథ.

  యాత్రలో కీలక అంశాలు

  యాత్రలో కీలక అంశాలు

  మహానేతగా మారే క్రమంలో తాను మారిన విధానం, అంతేకాక మంచి కోసం ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదురించే వైఎస్ఆర్ గుండె నిబ్బరం. పేద ప్రజల కోసం పడే ఆరాటం, పేద ప్రజలు, రైతుల ఆవేదనను అర్ధం చేసుకొనే వైఎస్ గుండెచప్పుడు తెర మీద స్పష్టం కనిపిస్తుంది. 30 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో వైఎస్ ఎలాంటి అవమానాలకు గురయ్యాడు? ఎలాంటి కష్టాలను అనుభవించాడు. అధికారంలోకి కాంగ్రెస్‌ను ఎలా తీసుకొచ్చాడనే విషయాలను అత్యంత భావోద్వేగంగా తెర మీద ఆవిష్కరణ జరిగింది.

  తొలిభాగంలో

  తొలిభాగంలో

  కాంగ్రెస్ పార్టీ బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్‌రరెడ్డి అనుసరించిన విధానాలు, ప్రజల బాగోగుల గురించి ఆలోచనలతో యాత్ర సినిమా మొదలవుతుంది. అధికార పార్టీ వేసే ఎత్తుగడలను, సొంత పార్టీ నేతల నుంచి ఎదురయ్యే అవాంతరాలను తట్టుకొనే అంశాలను తొలిభాగంలో సినిమాపై ఆసక్తిని రేపుతాయి. వైఎస్ఆర్‌గా మమ్ముట్టి ఒదిగిపోవడం సినిమాకు మరింత ఆకర్షణగా మారింది. తొలి భాగంలో రైతులు ఆత్మహత్యల అంశం గుండెను పిండేస్తుంది. అలాగే రాజకీయాల నుంచి నిష్క్రమిద్దామా అని మదన పడుతున్న నేపథ్యంలో ఓ అబ్బాయి కండువా వేసే సీన్‌తో యాత్ర మరో స్థాయికి చేరుకొంటుంది.

   సెకండాఫ్‌లో

  సెకండాఫ్‌లో

  యాత్ర మూవీకి రెండో భాగంలో కథ, కథనాలు ప్రాణంగా నిలిచాయి. వైఎస్ఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన పోలీసు సన్నివేశం, అలాగే హాస్పిటల్‌లో పాప చేత చేయించిన సీన్లు సినిమాకు ఆయువుపట్టుగా మారాయి. ప్రత్యర్థులను (పోసాని, నాగినీడు)ని మనసును గెలిచే సీన్‌ సినిమాకు అదనపు ఆకర్షణగా మారాయి. చివర్లో వైఎస్ మరణం నేపథ్యంలో పెంచల్ దాస్ పాట భావోద్వేగంగా ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది.

  దర్శకుడు మహీ వీ రాఘవ గురించి

  దర్శకుడు మహీ వీ రాఘవ గురించి

  యాత్ర సినిమా క్రెడిట్ విషయంలో 50 శాతం దర్శకుడు మహీ వీ రాఘవకే దక్కుతుంది. కథ, కథనాలను నియంత్రిస్తూ రాసుకొన్న సన్నివేశాలు బాగున్నాయి. సన్నివేశాలకు దర్శకుడు భావోద్వేగాలను అల్లిన తీరు సినిమాను సక్సెస్ బాట పట్టించిందని చెప్పవచ్చు. ప్రేక్షకుడిని గుండెను తట్టే రీతిలో రాసుకొన్న కొన్ని ఎమోషనల్ సీన్లు దర్శకుడి ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. సినిమాకు కావాల్సిన ముడి సరకు లాంటివైన ఫించన్లు, ఫీజు రిఎంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్, రుణమాఫీ తదితర పథకాల పుట్టకకు కారణమైన భావోద్వేగ అంశాలను చక్కగా చూపించారు. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా సినిమాకు కావాల్సిన ఫీల్‌గుడ్ అంశాలను ఎంచుకోవడం మహీ వి రాఘవ విజన్ ‌ఎంటో తెలియజెప్పింది.

  వైఎస్‌గా మమ్ముట్టి పరకాయ ప్రవేశం

  వైఎస్‌గా మమ్ముట్టి పరకాయ ప్రవేశం

  ప్రేక్షకుడిని ఆకట్టుకొనే విధంగా, కట్టిపడేసే రీతిలో యాత్ర సినిమా ఉండటానికి మరో 50 శాతం క్రెడిట్ మమ్ముట్టికే దక్కుతుంది. మమ్ముట్టిని ఎంచుకోవడమే సినిమా విజయానికి తొలి అడుగు. మమ్ముట్టి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన విధానం, కట్టు, ఆహార్యం వైఎస్ఆర్‌ను మరోసారి సజీవంగా తెరపైన చూసే అవకాశం దక్కింది. అలాగే తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం తన రోల్‌కు ప్రాణం పోసినట్టయింది. అలాగే కీలక సన్నివేశాల్లో పలికించిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయి. వైఎస్ పాత్రకు మరెవరిని ఊహించుకొని విధంగా సినిమాను ముందుకు తీసుకెళ్లాడని చెప్పవచ్చు.

  విజయమ్మగా అశ్రిత వేముగంటి

  విజయమ్మగా అశ్రిత వేముగంటి

  విజయమ్మగా అశ్రిత వేముగంటి కనిపించి కొన్ని సీన్లైనా ఫర్వాలేదనించారు. అలాగే జగపతిబాబు పాత్ర చాలా గంభీరంగా కనిపించింది. అయితే పెద్దగా స్కోప్ లేకపోవడం వల్ల ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది. అలాగే నాజర్ విగ్రహంలా కనిపించాడే తప్ప ఓ డైలాగ్ చెప్పించకపోవడం కథనంలో లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒక్క సీన్‌లో కనిపించిన నాగినీడు ఫుల్ మార్కులు కొట్టేశాడు. పోలీసు పాత్రలో కనిపించిన దయానంద్ రెడ్డి మరోసారి ఆకట్టుకొన్నాడు.

  కేవీపీ పాత్రలో రావు రమేష్

  కేవీపీ పాత్రలో రావు రమేష్

  ఇక కేవీపీ రామచంద్రరావు పాత్రలో రావు రమేష్ జీవించాడని చెప్పవచ్చు. వైఎస్‌కు వెన్నంటి ఉంటూ హావభావాలు ప్రకటించిన తీరు చాలా బాగుంది. ఇక అనసూయ (సుచరిత), సుహాసిని ( సబితా ఇంద్రారెడ్డి), కల్యాణి పాత్రలు బాగున్నాయి. వారికి సంబంధించిన సీన్లను మరికొంత పెంచి ఉంటే ఎమోషనల్‌గా సినిమా మరింత పండేది.

  సూర్యన్ సినిమాటోగ్రఫి

  సూర్యన్ సినిమాటోగ్రఫి

  సినిమా టెక్నికల్ విభాగాల విషయానికి వస్తే సత్యన్ సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. ఎమోషనల్ సీన్లను అద్భుతంగా చిత్రీకరించాడు. అలాగే పాదయాత్రలో ఉండే భావోద్వేగాలకు తెర మీద ప్రాణం పోయడంలో సత్యన్ తన వంతు పాత్రను బ్రహ్మండంగా నిర్వహించారు. సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడానికి కావాల్సిన మూడ్‌ను ప్రతీ సన్నివేశంలోనూ పండించాడు.

  తూటాల్లా పేలి.. భావోద్వేగాని గురిచేసిన డైలాగ్స్

  తూటాల్లా పేలి.. భావోద్వేగాని గురిచేసిన డైలాగ్స్

  ‘మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా', ‘చెడ్డపని చేయడానికి శకునాలు ఆలోచించాలి. మంచి పని కోసం ముహూర్తాలతో పని ఏముంది', ‘మీరు ఇప్పుడు ఒక్కరితోనే మాట్లాడుతున్నారు', 'మాట ఇచ్చేముందు ఆలోచించాలి.. ఇచ్చాక చేసేదేముంది ముందుకెళ్లాల్సిందే', 'నేను పార్టీకి విధేయుణ్ని మాత్రమే బానిసను కాదు నేను విన్నాను.. నేనున్నాను', ‘నాకు వినపడుతున్నాయ్', ‘నా కోసం అతని తప్పును పొరపాటుగా భావించి వదిలిపెట్టమనడం' అంటూ చెప్పిన డైలాగ్స్ థియేటర్లో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించడం ఖాయం'

  శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ గురించి

  శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ గురించి

  యాత్ర సినిమాకు శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ మరో ఎస్సెట్ అనిచెప్పవచ్చు. కథలో వేగం, భావోద్వేగాలు ఎక్కడ దారితప్పకుండా బ్యాలెన్స్ చేయడంలో శ్రీకర్ ప్రసాద్ పనితనం కనిపించింది. ఆర్ట్, మిగితా టెక్నికల్ విభాగాల పనితీరు కూడా తెర మీద స్పష్టంగా కనిపించింది. యాత్ర సినిమాకు కృష్ణ కుమార్ (కే) సంగీతాన్ని అందించారు. ఫీల్‌గుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కొన్ని సన్నివేశాలను అద్భుతంగా ఎలివేట్ చేశారు. సెకండాఫ్‌లో నేపథ్య సంగీతం మరింత బాగుంది. పెంచల్ దాస్ పాడిన పాట తప్ప మిగితా పాటలు పెద్దగా గుర్తుంచుకొనేలా లేవు.

  ప్రొడక్షన్ వాల్యూస్

  ప్రొడక్షన్ వాల్యూస్

  యాత్ర మూవీని తెరకెక్కించాలనే విజన్‌కు చేయూతనిచ్చిన నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. మహీ రాఘవ ఆలోచనకు తెర రూపం కల్పించడంలో వారి సహకారం, కష్టం తెర మీద స్పష్టంగా కనిపించింది. పాత్రలకు నటీనటల ఎంపిక, సాంకేతిక నిపుణుల సెలక్షన్ చాలా బాగుంది. కథలో పేదరికం, కష్టాలు ఎక్కువగా ఉన్నప్పటికీ తెర మీద మాత్రం యాత్ర మూవీ మాత్రం చాలా రిచ్‌గా కనిపించింది.

   ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  కడపనే కాదు ప్రతీ గడపను దాటి పేద ప్రజల జీవితంలో గూడుకట్టుకొన్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర భావోద్వేగాలతో సమ్మేళనం. తెరపైన సన్నివేశాలు ప్రతీ గుండెను తట్టుతాయి.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  మహీ వీ రాఘవ టేకింగ్
  మమ్ముట్టి ప్రతిభ
  స్క్రిన్ ప్లే
  సినిమాటోగ్రఫి
  రీరికార్డింగ్

  మైనస్ పాయింట్స్
  వీహెచ్ పాత్రకు డబ్బింగ్
  సుహాసిని పాత్రను మధ్యలోనే వదిలేయడం
  జగపతిబాబు, నాగినీడు, పోసాని, అనసూయ లాంటి
  మిగితా పాత్రలు ఎలివేట్ కాకపోవడం

  తెర వెనుక, తెర ముందు

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: మమ్ముట్టి, సుహాసిని మణిరత్నం, జగపతిబాబు, అనసూయ, సచిన్ ఖేడ్కర్, దయానందరెడ్డి, చత్రపతి శేఖర్ తదితరులు
  నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
  స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహీ వీ రాఘవ్
  సినిమాటోగ్రఫి: సత్యన్ సూర్యన్
  ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
  ప్రొడక్షన్ కంపెనీ: ఏ శ్రీకర్ ప్రసాద్

  English summary
  Yatra a biographical film about former Chief Minister YS Rajasekhara Reddy, who served from 2004 to June, 2009 representing Indian National Congress. The film is written and directed by Mahi V. Raghav and stars Mammootty as YSR. This movie released on Feb 08th. In This occassion, Telugu Filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X