TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
సరుకున్న మారాజు
నటీనటులుః రాజశేఖర్, లయ, ఆషాసైనీ, మనోరమ, కోట శ్రీనివాసరావు
మాటలుః తోటపల్లి మధు
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నిర్మాతలుః భగవాన్, దానయ్య
స్క్రీన్ ప్లే, దర్శకత్వంః ముత్యాల సుబ్బయ్య
'శివయ్య', 'సూర్యుడు' చిత్రాల తర్వాత సరైన హిట్ లేకపోవడమే కాకుండా వివాదాస్పద నిర్ణయాలతో కొట్టుమిట్టాడుతున్న హీరో రాజశేఖర్ కెరీర్ కు 'మనసున్న మారాజు' చిత్రం కొత్త ఊపిరి పోసేదిగా వుంది. ఈ చిత్రం నిర్మాణంలో వుండగా రషెస్ బాగాలేదని, తన తదుపరి చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర దర్శకుడు ముత్యాల సుబ్బయ్యను మార్పించాడు రాజశేఖర్. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంతో మార్కెట్ లో మనసున్న మారాజు చిత్రంపై ఎటువంటి అంచనాలు లేకుండా పోయాయి.
అయినా నిర్మాతలు గట్టివారు కావడంతో వత్తిళ్ళనన్నింటినీ అధిగమించి చిత్రాన్ని సక్రమంగా విడుదల చేయగలిగారు. సెంటిమెంట్ కు పెద్దపీట వేసే ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రంలో తనదైన ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు వినోదానికి కూడా పెద్ద పీట వేశారు. దీనితో సినిమా బాగుంది అనే టాక్ ను మొదటి రోజునే సంపాదించుకో గలిగింది 'మనసున్న మారాజు' సినిమా.
కధ విషయానికి వస్తే దోసకాయల పల్లి జమిందారు దొరబాబు(రాజశేఖర్). ఆయన బామ్మ ఊరు ప్రెసిడెంట్ మనోరమ. ఆ ఊళ్ళో ఎవరికి ఏ ఆపద వచ్చినా దొరబాబు దేవుడిలా ఆదుకుంటాడు. అమృత (లయ) తాగుబోతు భరణి కూతురు. ఆమె తల్లి అన్నపూర్ణ. చదువులో స్టేట్ ఫస్ట్ సాధించిన లయకు డాక్టర్ కావాలనే ఆశ వున్నా స్థోమత లేకపోవడంతో చదువుకు స్వస్తి చెప్పాలను కుంటుంది.
అయితే ఆమె చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని ముందుకు వస్తాడు దొరబాబు. దీనితో అమృత దొరబాబును దేవుడిగా ఆరాధిస్తుంది. అయితే అమృత తన పట్ల చూపుతున్న ఆరాధనా భావాన్ని ప్రేమగా భావించి ఆమెను గాఢంగా ప్రేమిస్తాడు. అమృత చదువు పూర్తయ్యాక ఆమె పేరిటే ఒక ఆస్పత్రి కట్టించి ఆమెనే అక్కడ డాక్టర్ గా నియమిస్తాడు.
ఒక సందర్భంలో అమృతకు తన ప్రేమ విషయాన్ని దొరబాబు చెబుతాడు. ఆమె షాక్ తింటుంది. ఈ లోగా పట్నంలో ఎం.ఎల్.ఎ. కొడుకుతో భరణి తన కూతురు వివాహం నిశ్చయిస్తాడు. ఇది తెలుసుకున్న మనోరమ అమృత ఇంటికి వచ్చి తగాదాకు దిగుతుంది. తన కూతురి పెళ్ళి చెడగొట్టవద్దని లయ తల్లి అన్నపూర్ణ దొరబాబును కోరుతుంది. పైగా నీవే నా కూతురిని ఎమ్మెల్ల్యే కొడుకుతో పెళ్ళికి ఒప్పించాల్సిందిగా ప్రాధేయపడుతుంది.
దీనికి దొరబాబు సరే అని, అమృతను ఒప్పిస్తాడు. అయితే అమృతను పెళ్ళి చేసుకోవడం వెనుక ఆస్పత్రిని కబళించాలనే కుట్ర వున్నట్లు తెలుసుకున్న దొరబాబు ఉగ్రుడు కావడం....వాళ్ళకు బుద్ధి చెప్పడం, దొరబాబు పట్ల తనకు వున్నది ప్రేమే అనే విషయం అమృత గ్రహించండం..చివరకు దొరబాబు, అమృత ఒకటి కావడం జరుగుతుంది.
కధలో నూతనత్వం లేకున్నా కథనంలో మంచి బిగువు వుంది. ముఖ్యంగా పెళ్ళిళ్ళ పేరయ్యగా ఎల్.బి. శ్రీరాం పండించిన హాస్యం చిత్రానికి ఆయువుపట్టుగా చెప్పుకోవచ్చు. ప్రతిసీన్ లో హాస్యం బాగా పండింది. ఇక రాజశేఖర్ కు ఇటువంటి పాత్రలు కొట్టిన పిండి. లయ అమృత పాత్రకు చక్కగా సరిపోయింది. మనోరమ, కోట, బ్రహ్మానందం సంగతి సరేసరి.
ఆషాసైనీ పాత్ర పాటకు మాత్రమే పరిమితమైంది. వందేమాతరం సంగీతం ఈ చిత్రానికి గ్లామర్ తెచ్చిపెట్టింది. 'మాఘమాసమా...మంచు ముత్యమా', 'నేను తెల్ల కాగితం నీవు గాలిగోపురం' పాటలు క్యాచీగా వున్నాయి. సినిమా ద్వితీయార్థం మంచి పట్టుమీద నడవడం సినిమా విజయానికి కారణంగా చెప్పుకోవచ్చు. క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం చూశామన్న భావం ప్రేక్షకులకు మిగుల్చే చిత్రం 'మనసున్న మారాజు'.