For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మంచు కురిసే వేళలో మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating: 2.5/5

  చిన్న చిత్రాలు, కంటెంట్ రిచ్‌గా ఉన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ పుష్కలంగా కనిపిస్తున్న నేపథ్యంలో చక్కటి ఫీల్‌గుడ్‌తో వచ్చిన చిత్రం మంచు కురిసే వేళలో. ఈ చిత్రానికి హరి బాల సుబ్రమణ్యం బోడెపూడి దర్శకత్వం బాధ్యతతోపాటు నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. టీజర్, ట్రైలర్లతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకొన్న చిత్రంలో రామ్ కార్తీక్, ప్రణాళి ఘోగారే, యశ్వంత్, చమ్మక్ చంద్ర నటించారు. డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాలాకు ఎలాంటి సక్సెస్‌ను అందించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే...

  మంచు కురిసే వేళలో స్టోరి

  మంచు కురిసే వేళలో స్టోరి

  ఇంజినీరింగ్ చదువుకొనే ఆనంద్ కృష్ణ (రామ్ కార్తీక్) రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. వైజాగ్ సముద్ర తీరంలో గీత (ప్రణాళి గోఘరే)‌ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. రేడియో చాట్ షోలో లవ్ బ్రేకప్ అయిన శ్రీను ( కీ. శే.సాయి విజయ్) ఆత్మహత్య చేసుకోవాలనుకొంటాడు. కానీ లవ్ ఫెయిల్యూర్ అసలు ఉండదు. ప్రేమకు వైఫల్యం ఉండదు అని తన ఆలోచనను మార్చుకొనేలా చేస్తాడు. అందుకు ఉదాహరణగా తన ప్రేమ కథను రేడియోలో వినిపిస్తాడు. తనను అమితంగా ఇష్టపడే గీతకు తన లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేయడం గురించి చెబుతాడు. అప్పటికే ప్రకాష్‌తో ప్రేమలో ఉన్న గీత ఓ విషాదంలో కూరుకుపోతుంది.

  మంచు కురిసే వేళలో మలుపులు

  మంచు కురిసే వేళలో మలుపులు

  ఆనంద్ కృష్ణ లవ్ ప్రపోజల్‌ను గీత ఎందుకు రిజెక్ట్ చేసింది. గీత రిజెక్ట్ చేస్తే ఆనంద్ పరిస్థితి ఎలా మారింది? గీతకు తన లవర్ ప్రకాశ్‌ ఎందుకు దూరమయ్యాడు? గీత జీవితంలో చోటుచేసుకొన్న విషాదం ఏమిటి? లవ్ ఫెయిల్యూర్ అయిన శ్రీను ప్రేమ ఫలించిందా? ఆనంద కృష్ణ, ప్రకాశ్‌లలో గీత ఎవరికి దక్కింది అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే మంచు కురిసే వేళలో చిత్రకథ.

  ఫస్టాఫ్‌లో

  ఫస్టాఫ్‌లో

  రేడియో జాకీగా ఆనంద్ కృష్ణ ఎంట్రీతో కథ ప్రారంభమవుతుంది. రేడియో జాకీ చాట్‌తో సరదాగా సాగిపోయే కథలో చమ్మక్ చంద్ర మార్క్ కామెడీ ఆసక్తిని రేపుతుంది. ఇక విజయ్ సాయి ఎంట్రీతో కథ వేగం పుంజుకొని మరో మలుపు తిరుగుతుంది. కానీ కథ రొటీన్, రెగ్యులర్ ఫార్మాట్‌లో సాగడం, నూతన నటీనటుల ప్రతిభ కథను మరో మెట్టు ఎక్కించలేకపోయింది. ఆనంద్ లవ్‌ను గీత తిరస్కరించే అంశం, ప్రకాశ్‌తో గీత లవ్ ఫ్లాష్ బ్యాక్‌తో తొలిభాగం ముగుస్తుంది.

  సెకండాఫ్‌లో

  సెకండాఫ్‌లో

  ఇక రెండో భాగంలో గీత ఇంజినీరింగ్ చదువుకోవడానికి వెళ్లడంతో కథ ఊటికి మారుతుంది. ఊటీలో ప్రకాశ్‌ను చూసి ప్రేమలో పడటం, వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఆసక్తికరంగా సాగుతుంది. తాము తల్లిదండ్రులు లేకుండా ఎలా ఒంటరివాళ్లం అయ్యామని ప్రకాశ్, ఆయన సోదరి చెప్పిన ట్రాక్ బాగుంది. ప్రీ క్లైమాక్స్‌లో ప్రకాశ్ యాక్సిడెంట్ గురికావడంతో కథ భావోద్వేగం మారుతుంది. చివరి ఆనంద్ ప్రేమ విషయంలో గీత తీసుకొన్న నిర్ణయం సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చింది. భావోద్వేగాలు ఉన్న కథను చాలా నీరసంగా, నెమ్మదిగా చెప్పడంతో ఫీల్‌గుడ్ ఫ్లేవర్ ఎస్టాబ్లిష్ కాకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారడానికి అవకాశం ఏర్పడింది.

  దర్శకుడు బాలా ప్రతిభ

  దర్శకుడు బాలా ప్రతిభ

  ఫీల్ గుడ్ అంశాలు ఉన్న పాయింట్‌ను ఎత్తుకొన్న తీరుతో దర్శకుడు బాలా తొలి సక్సెస్‌ను సొంతం చేసుకొన్నాడని చెప్పవచ్చు. కానీ బలమైన సన్నివేశాలు, కాలేజ్ కామెడీ ట్రాక్‌ను ప్రభావవంతంగా రాసుకోలేకపోవడం ఆయన అనుభవ లేమి కనిపిస్తుంది. కాకపోతే కథకు ఎంచుకొన్న బ్యాక్ డ్రాప్, లోకేషన్లు అద్భుతంగా ఉన్నాయి. స్క్రీన్ ప్లేలో వేగం లేకపోవడం వల్ల కథ అక్కడక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది. కాకపోతే తొలి చిత్రం దర్శకుడు అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. దర్శకుడిగా బాలా తొలి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. సినిమాను పోయెటిక్‌గా తీరు ఆకట్టుకొంటుంది. సినిమాకు క్లైమాక్స్ ఆయువుపట్టుగా మారిందడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

   నటీనటుల ఫెర్ఫార్మెన్స్

  నటీనటుల ఫెర్ఫార్మెన్స్

  ఆనంద్‌గా రామ్ కార్తీక్, గీతగా ప్రణాళి, ప్రకాశ్‌గా యశ్వంత్ నటన వారి పాత్రల పరిధి మేరకు భేష్ అనే రీతిలో ఉంది. కొత్తవారైనా తొణుకు బెణుకు లేకుండా తెరపైన ఉత్తమ నటనను ప్రదర్శించారు. ఇక గీతగా ప్రణాళి చలాకీతనం, అమాయకత్వం ఆకట్టుకొంటాయి. అలానే సెకండాఫ్‌లో భావోద్వేగమైన నటనను పండించింది. చమ్మక్ చంద్ర కామెడీ అక్కడక్కడా ఆకట్టుకొన్నది. మిగితా పాత్రలు పెద్దగా చెప్పుకొనే రేంజ్‌లో లేకపోయాయి.

  అద్భుతంగా సినిమాటోగ్రఫి

  అద్భుతంగా సినిమాటోగ్రఫి

  సాంకేతిక విభాగాల్లో తిరుగ్నన సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. ఇటీవల కాలంలో చిన్న చిత్రాల్లో అంత విజువల్ క్వాలిటి, రిచ్‌నెస్ ఉన్న సినిమాటోగ్రఫిని చూడలేమనే చెప్పాలి. తిరుగ్నన ఫ్రేమింగ్, ఎంచుకొన్న లొకేషన్లు, కలర్ ప్యాటర్న్ అద్భుతమనే చెప్పాలి. సినిమా ఓ దృశ్యకావ్యంగా ఉందంటే అది తిరుగ్నన ప్రతిభ వల్లే అని చెప్పాలి. ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా చెక్కినట్టు తెరకెక్కించాడు. కంటెంట్ లేని సీన్లను తన ప్రతిభతో బలం చేకూర్చిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.

   శ్రవణ్ భరద్వాజ్ సంగీతం

  శ్రవణ్ భరద్వాజ్ సంగీతం

  శ్రవణ్ భరద్వాజ్ భరద్వాజ్ అందించిన సంగీతం సూపర్‌గా ఉంది. ప్రధానంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకొన్నది. చాలా సన్నివేశాలకు శ్రవణ్ సంగీతం జీవం పోసింది. కీలక సన్నివేశాల్లో సీన్లు మరింత ఎలివేట్ అయ్యాయి. సన్నివేశాల్లో బలం ఉండి ఉంటే మ్యూజిక్ మరింత ఎలివేట్ అయ్యేదని చెప్పవచ్చు.

  ప్రొడక్షన్ వాల్యూస్

  ప్రొడక్షన్ వాల్యూస్

  ప్రణతి ప్రోడక్షన్ బ్యానర్‌పై మంచు కురిసే వేళలో చిత్రం రూపొందింది. ఈ చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల ఎంపికపై కొంత శ్రద్ధ, కథ, కథనాలపై కసరత్తు చేసి ఉంటే యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గానే కాకుండా ఫీల్‌గుడ్ మూవీగా మారి ఉండేది. సాంకేతిక నిపుణుల ఎంపిక సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  మంచు కురిసే వేళలో చక్కటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరి అనిచెప్పవచ్చు. కాకపోతే ఫ్రెష్‌నెస్ లోపించింది. అందమైన లోకేషన్లు, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఎలాంటి హంగామా, కలుషితం లేని ప్రేమకథలు చూసే వారికి, స్లో నేరేషన్‌తో సాగిపోయే సినిమాలను రిలాక్స్‌డ్‌గా ఎంజాయ్ చేసేవారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది. లిప్‌లాక్‌‌లు లేకుండా స్వచ్ఛమైన ప్రేమకథతో వచ్చిన ఈ చిత్రాన్ని వీకెండ్‌లో ఫ్యామిలీ అంతా చూసే విధంగా రూపుదిద్దుకొన్నది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  • సినిమాటోగ్రఫి
  • మ్యూజిక్
  • డైరెక్టర్ ప్రతిభ
  • ప్రొడక్షన్ వాల్యూస్
  • మైనస్ పాయింట్స్

   • కథ, కథనం
   • స్లో నేరేషన్
   • నటీనటులు ఎంపిక
   • కామెడీ ఎస్టాబ్లిష్ కాకపోవడం
   • బలమైన సన్నివేశాలు లేకపోవడం
   • తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: రామ్ కార్తీక్, ప్రణాళి గోగ్రే, యశ్వంత్, చమ్మక్ చంద్ర, కీ.శే. సాయి విజయ్, మహేష్ కత్తి, టీఎన్నాఆర్ తదితరులు
    దర్శకుడు: బాల బోడెపూడి
    నిర్మాత: హరి బాల సుబ్రమణ్యం బోడెపూడి
    సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
    సినిమాటోగ్రాఫర్: తిరుగ్నన
    రిలీజ్ డేట్: 2018-12-28

  English summary
  Manchukurisevelalo is a youthful love story, which directed by Hari Bala Subrahmanyam Bodepudi. Ram Karthik, Pranali Ghogare, Yashwanth, Chammak Chandra are lead actors. This movie released on December 28th. In this occassion, Telugu Filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X