»   » మైండ్ గేమ్ తో ఫైట్ (‘డైనమైట్‌’ రివ్యూ)

మైండ్ గేమ్ తో ఫైట్ (‘డైనమైట్‌’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

తెలుగులో ఫెరఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్స్ తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల తరహాలో మొదటి సీన్ నుంచి కథలోకి వెళ్తూ...ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ యాక్షన్ మోతాదు పెంచేవి పూర్తిగా అరుదు. అయితే అలాంటి థ్రిల్లర్ ని తెలుగుకు అందించాలని దర్శకుడు దేవకట్టా ఫిక్సయ్యినట్లున్నాడు. మంచు విష్ణుతో కలిసి తమిళ చిత్రం ‘అరీమా నంబి ‌'చిత్రం ని మన నేటివిటికు మార్చి అందించారు. ఫస్టాఫ్ ఫాస్ట్ పేసెడ్ గా నడిచి, సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ దాకా రేసిగానే నడిచింది. అక్కడ నుంచి రొటీన్ గా, ప్రెడిక్టుబుల్ గా మారింది. ఫోర్స్ డ్ గా ప్లేస్ మెంట్ లేని చోట సాంగ్స్ పెట్టడం, కామెడీ రిలీఫ్ లేకపోవటం, హింస ఎక్కువ ఉండటం వంటివి ఉన్నా ఓ కొత్త తరహా చిత్రం అందించాలనే దర్శకుడు, విష్ణు ప్రయత్నం ముందు అవి చిన్నబోతాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


భాధ్యతగల పౌరుడుగా అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే ఈ తరం కుర్రాడుశివాజీకృష్ణ అలియాస్ శివ(మంచు విష్ణు). అతను ఓ రోజు రోడ్డుమీద ఓ అమ్మాయిని పోకిరీలనుంచి రక్షించి, అనామిక దాసరి(ప్రణీత)దృష్టిలో పడతాడు. ఆమె చాలా ఇంప్రెస్ అయ్యి...అతనితో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ తర్వాత రెస్టారెంట్ లో కలుసుకుని, ఆమె ప్లాట్ కు వెళతారు. అక్కడ ఆమె రిఫ్రెష్ అవుతున్నప్పుడు ఆమె కిడ్నాప్ కు గురి అవుతుంది. వెంటనే ఎలర్టైన శివ..వెంటనే పోలీసులుకు ఇన్ ఫార్మ్ చేసినా ఫలితం లేకపోవటంతో తనే రంగంలోకి దిగి ఆమెను వెతకటం మొదలెడతాడు.


ఆ క్రమంలో ఆమె ఛానెల్ 24 సీఈవో రంగనాధ్ దాసరి (పరుచూరి వెంకటేశ్వరరావు)కూతురు అని తెలుస్తుంది. ఆమె ఇంటికి వెళ్లి ఆమె తండ్రిని విషయం ఏంటి అని అడుగుదామనుకునేలోపు ఆయన హత్యకు గురి అవుతాడు. అక్కడ కొన్ని విషయాలు రివీల్ అవుతాయి. అసలు ఈ కిడ్నాప్ కు, ఆమె తండ్రి హత్యకు అసలు కారణమేంటి..దీనికి యూనియన్ మినిస్టర్ రిషిదేవ్ (జెడి చక్రవర్తి) కి సంభంధం ఏమిటి... ఎలా ఈ విషయాలన్నీ సామాన్యుడైన శివ ఇన్విస్టిగేట్ చేసి తెలుసుకుని, ఆమెను ఎలా రక్షించాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


వాస్తవానికి మొదటే చెప్పుకున్నట్లు ఇది తెలుగులో రెగ్యులర్ గా వచ్చే చిత్రాలకు భిన్నమైనదే. ఒకే పాయింట్ తో ప్రక్కకు డీవియేట్ అవ్వకుండా కథ నడపటం కత్తి మీద సామే. ఎందుకంటే బోర్ కొట్టకుండా, చెప్పే విషయం రిపీట్ అవ్వకుండా ఎంగేజ్ చేయాలి. ఈ విషయంలో చాలా వరకూ డైనమేట్ సక్సెస్ అయ్యింది. అయితే ట్విస్ట్ లు పూర్తిగా రివీల్ అయిన ప్రీ క్లైమాక్స్ దశలో మాత్రం ఇక ఎంత తర్వగా సినిమా అయిపోతే బాగుండును అనిపించింది. దానికి కారణం ఎక్కడా రిలీఫ్ ఇవ్వకపోవటమే. పాటలు ఉన్నా అవి రిలీఫ్ కు కాకుండా కథనానికి బ్రేక్స్ వేసాలే తయారయ్యాయి. అవి తీసేస్తే బాగుండును అనిపించింది.


అదే సమయంలో తమిళ ఒరిజనల్ ని చెడకొట్టకుండా మార్పులు చేయటం కూడా అభినందించదగ్గదే. దేవకట్టా ఆ విషయంలో ఈ కథకు ప్లస్ అయ్యాడు. తన మేకింగ్ స్టైల్ తో సినిమాని స్టైలిష్ థ్రిల్లర్ గా మార్చగలిగాడు. విష్ణు కూడా యాక్షన్ సన్నివేశాల్లో తనదైన ముద్ర వేయగలిగాడు.


స్లైడ్ షోలో మిగతా రివ్యూ


క్రెడిట్ లో ఎక్కువ భాగం

క్రెడిట్ లో ఎక్కువ భాగం

ఈ సినిమా క్రెడిట్ లో ఎక్కువ భాగం ఫైట్ మాస్టర్ విజయన్ మాస్టర్ కు చెందుతుంది. ఆయన ఫైట్స్ కంపోజ్ చేసిన విధానం చాలా చోట్ల సూపర్బ్ అనిపించేలా సాగిందిఫిజిక్

ఫిజిక్

ఈ సినిమాలో విష్ణు ఫిజిక్ పై చూపిన శ్రద్ద ఆశ్చర్యం వేస్తుంది. క్యారక్టర్ కు ఫెరఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా ఆయన తనను తాను డిజైన్ చేసుకున్నారు.ప్రారంభమే కాస్త

ప్రారంభమే కాస్త

ఫస్టాఫ్ లో ప్రారంభమే కాస్త స్లోగా ప్రారంభమయినట్లు అనిపిస్తుంది. ఒక్కసారి యాక్షన్ లోకి కథ ప్రవేశించాక ..పరుగెడుతుంది.జెడిని తీసుకోవటమే

జెడిని తీసుకోవటమే

ఈ సినిమాలో ఒరిజనల్ లో చేసిన జెడి చక్రవర్తిని అదే పాత్రకు తీసుకోవటమే హైలెట్. ఆయన పాత్రకు పూర్తి న్యాయం చేసారు.ఉన్నది కాస్సేపయినా

ఉన్నది కాస్సేపయినా

నిజానికి ఈ సినిమాలో ప్రణీత కనిపించేది చాలా కొద్దిసేపే. రొమాంటిక్ ట్రాక్ కూడా కొద్దిగానే ఉంటుంది. అయితేనేం సినిమాలో ఆమె తన పాత్రకు న్యాయం చేసి తనదైన ముద్ర వేయగలిగింది.


కొత్తేగానీ...

కొత్తేగానీ...

హాలీవుడ్ లో ఇలాంటి థ్రిల్లర్స్ చాలా చాలా వచ్చాయి. ముఖ్యంగా Breakdown (1997) వంటి సినిమాలు ఇదే ప్రాట్రన్ తో సాగుతాయి.సంగీతం, డైలాగ్స్

సంగీతం, డైలాగ్స్

ఈ సినిమాకు పాటలు మైనస్ అయినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యింది. డైలాగులు మాత్రం సీన్ కు తగ్గట్లు ఫెరఫెక్ట్ గా ఉన్నాయి.టెక్నికల్ గా...

టెక్నికల్ గా...

సినిమాలో కెమెరా వర్క్ సినిమాకు తగినంతగా లేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. ఎడిటింగ్ కూడా ఫాస్ట్ ఫేస్ గా రన్ అయ్యేలా డైరక్టర్ డిజైన్ చేయించుకున్నారు.ఎవరెవరు

ఎవరెవరు

బ్యానర్: 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకం
నటీనటులు: మంచు విష్ణు, ప్రణీత, జెడి చక్రవర్తి, తదితరులు
కెమెరా: సతీశ్‌ ముత్యాల,
సంగీతం: అచ్చు,
ఆర్ట్‌: రఘు కులకర్ణి,
ఫైట్స్‌: విజయ్ మాస్టర్
ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌ శేఖర్‌.
సమర్పణ‌: అరియానా, విరియానా
డైలాగ్స్‌: బి.వి.ఎస్‌.రవి,
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : దేవ కట్టా
నిర్మాత : మంచు విష్ణుఫైనల్ గా రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా కాకుండా ఓ విభిన్నమైన ధ్రిల్లర్ చిత్రం చూడాలి అనుకునే వారికి ఈ చిత్రం మంచి ఎక్సపీరియన్స్ ఇస్తుందనటంలో సందేహం లేదు.


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Manchu Vishnu's 'Dynamite' movie released today with decent talk. It’s the remake of Tamil hit “Arima Nambi” and directed by Deva Katta.
Please Wait while comments are loading...