»   »  మనకి కిక్ ఇవ్వలేనోడు ('లక్కున్నోడు' రివ్యూ)

మనకి కిక్ ఇవ్వలేనోడు ('లక్కున్నోడు' రివ్యూ)

Posted By: Super Admin
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

సినీ పరిశ్రమలో హిట్ కొట్టడమే లక్ అన్న పరస్దితి వచ్చేసింది. ఎందుకంటే కొత్త కథలు పుట్టడం లేదు, అరుదుగా అలాంటివి వస్తున్నా హీరోలకు ధైర్యం చాలటం లేదు. దాంతో పాత కధలతోనే తమ లక్ ని పరీక్షించుకునే హీరోలు ఎక్కువయ్యారు. ముఖ్యంగా స్టార్ హీరోలు కాని మధ్యతరగతి హీరోల పరిస్దితి మరీ దారుణంగా ఉంది. జనాలను ఎట్రాక్ట్ చేసే స్టార్ పవర్ అంతగా లేని వీరికి కథే స్టార్ గా నిలిచినప్పుడే వీరికి లక్ కలిసి వస్తుంది. అలాంటి లక్కీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ వరస ప్రయత్నాలు చేస్తున్న హీరోలలో మంచు విష్ణు ఒకరు.

దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి హిట్ల త‌ర్వాత విష్ణు న‌టించిన ఐదారు సినిమాలు ప్లాప్ అయ్యాయి. గ‌తేడాది 'ఈడో రకం ఆడో రకం' సినిమాతో హిట్ కొట్టి స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చినా అది అనుకున్నంత లక్ తెచ్చిపెట్టలేదు.

ఈ క్ర‌మంలోనే విష్ణు త‌న‌కు బాగా క‌లిసొచ్చిన కామెడీ...ఫ్యామిలీ జాన‌ర్‌లోకి వెళ్లి ల‌క్కున్నోడు అంటూ వచ్చి తన లక్ ని పరీక్షించుకోదలిచాడు. అప్పటికీ ఎందుకైనా మంచిదని , త‌న‌కు క‌లిసొచ్చిన హీరోయిన్ హ‌న్సికతోనే ఈ ల‌క్కున్నోడు జతకట్టాడు. మరి లక్ ఇంతకీ కలిసి వచ్చిందా..కేవలం టైటిల్ లోనే లక్ ఉందా అనే విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

బ్యాంక్ నుంచి దొంగతనం

బ్యాంక్ నుంచి దొంగతనం

రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి బ్యాంకుల‌కు స‌ర‌ఫ‌రా అవుతున్న రూ.25 కోట్ల నోట్ల‌ని దొంగతనం చేస్తాడు జీకే. అయితే అతను డైరక్ట్ గా ఇన్వాల్స్ కాకుండా...త‌ను వేసిన ప్లాన్ ప్ర‌కారం ఆంటోనీ ఆ సొమ్ము దొంగతనం చేయిస్తాడు. అయితే... జీకేకి వాటా ఇవ్వ‌కుండా ఆ డ‌బ్బుతో ప‌రార‌వుతాడు. అప్ప‌టి నుంచీ.. ఆంటోనీ కోసం జీకే వేటాడుతుంటాడు.

 అతనో దురదృష్టవంతుడు

అతనో దురదృష్టవంతుడు


పుట్టిన దగ్గరనుండీ...లక్కీ(విష్ణు)ని దురదృష్టం వెంటాడుతూంటుంది. కుటుంబానికి కూడా అతని దురదృష్టం పట్టుకునేసరికి...లక్కీ తండ్రి భక్త వత్సలం (జయప్రకాష్‌) కూడా అతనితో మాట్లాడడు...ద్వేషం పెంచుకుంటాడు. అంతెందుకు పేరు పెట్టేడప్పుడు కూడా ఇబ్బంది రావటం వల్ల పేరు కూడా పెట్టకుండా వదిలేస్తారు. అలా అవమానపడుతూ పేరు లేకుండానే పెరిగిన లక్కీ, ఉద్యోగం కోసం హైదరాబాద్ బయిలుదేరుతాడు.

 హీరోయిన్ తో ...

హీరోయిన్ తో ...


హైదరాబాద్ వచ్చేసి ఫ్రెండ్ (సత్యం రాజేష్) దగ్గరికి వస్తాడు. కానీ అతని దురదృష్టం వల్ల...లక్కీ రాగానే ఆ ఫ్రెండ్ దివాలా తీసి వీధిన పడతాడు. అలాంటి పరిస్దితుల్లో ...పాజిటివ్ పద్మ (హన్సిక) పరిచయమవుతుంది. ఆమె కుటుంబం అంతా పాజిటివ్ నెస్ తో కళకళ్లాడుతుంది. తమ ఇంట్లో అందరూ కీడు జరిగినా పాజిటివ్ గానే ఆలోచించే రకం. అయితే పాజిటివ్ పద్మ లక్కీకి పరిచయమైనా అతడిని దురదృష్టం వెంటాడటం మానదు. తనకి రావాల్సిన ఉద్యోగం ఆమెకొస్తుంది.

 ఇరవై ఐదు లక్షలు

ఇరవై ఐదు లక్షలు


ఈ లోగా ఇలావుండగా, చెల్లెలి నిశ్చితార్థానికి ఇంటికి వెళ్తాడు లక్కీ. అక్కడ కట్నం డబ్బు రూ.25లక్షలు ఇవ్వడానికి వెళ్తే బ్యాగ్‌ ఎక్కడో పోతుంది. దీంతో చెల్లి పెళ్లి ఆగిపోతుంది. దాంతో తండ్రి కోప్పడటంతో లక్కీ ఆత్మహత్యకు యత్నిస్తాడు.

 లక్ ఓ దారిలో పడింది

లక్ ఓ దారిలో పడింది


ఈ లోగా... ఒక క్రిమినల్ వచ్చి, తన దగ్గరున్న బ్యాగు ఓ రోజు అతని దగ్గర పెట్టుకుంటే కోటి రూపాయలిస్తానని ఆఫర్ చేస్తాడు- లక్కీ తన లక్ దారిలో పడిందని ఓకే అంటాడు. అక్కడ నుంచి అతని కష్టాలు మొదలవుతాయి.

అదే మిగతా కథ

అదే మిగతా కథ

ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏమున్నాయి అంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి దొంగతనం చేసిన పాతిక కోట్లు. ఆ ఆంటోనీ త‌న ద‌గ్గ‌రున్న పాతిక కోట్లు ల‌క్కీ చేతిలో పెట్టి చ‌నిపోతాడు. పాతిక కోట్లు ల‌క్కీకే ఇవ్వ‌డానికి కార‌ణం ఏమిటి? ఆ డ‌బ్బు చేతికి చిక్కాక ల‌క్కీ జీవితం ఎలా మారిపోయింది? అనేదే క‌థ‌.

మోహన్ బాబు కూడా...

మోహన్ బాబు కూడా...

ఈ క్రైమ్ కామెడీ సినిమా ...ఫస్టాఫ్ మొత్తం ఫన్నీగా సాగిపోయింది. ముఖ్యంగా లక్కీ ఫ్లాష్‌ బ్యాక్‌.. అందులో అతని బ్యాడ్‌లక్‌ సీన్లు.. లవ్‌ ట్రాక్‌ చూపించడంతోనే ఫస్టాఫ్ మొత్తం గడిచిపోయింది. కామెడీ సన్నివేశాలు బాగానే నవ్విస్తాయి. ఓ పాటలో మోహన్‌ బాబు కనిపించి విష్ణుతో డాన్సులు చేయడం అలరిస్తుంది. ఇంటర్వెల్ సమయానికి వచ్చే ట్విస్ట్‌తో ఆసక్తి పెరుగుతుంది.

 సెకండాఫే దెబ్బ కొట్టింది

సెకండాఫే దెబ్బ కొట్టింది


సెకండాఫ్ లో హీరో.. విలన్‌ మధ్య నడిచే గేమ్‌ మరింత ఇంట్రస్టింగ్ గా ఉంటే బాగుండేది. కానీ విలనీ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. ఒకే పాయింట్‌ చుట్టూ కథ తిరగడంతో ప్రేక్షకుడికి ఇబ్బంది కలిగిస్తుంది. క్లైమాక్స్‌ రొటీన్‌గా ఉంది. దర్శకుడు కథా.. స్క్రీన్ ప్లే పై మరింత కసరత్తు చేయాల్సింది.

 టెన్షన్,ధ్రిల్ ఏమీ లేదు

టెన్షన్,ధ్రిల్ ఏమీ లేదు

హీరో చేతిలో డ‌బ్బున్న సంగ‌తి విల‌న్‌కి తెలిసిపోయిన దగ్గర్నుంచి కథలో టెంపో పడిపోయింది. అక్క‌డి నుంచి... సినిమాలో ఎలాంటి టెన్షన్ గానీ, థ్రిల్ క‌లిగించే స‌ీన్స్ గానీ ఉండ‌వు. మ‌ధ్య‌లో పోసానికి కాసేపు బ‌క‌రాని చేసి ఆడుకోవ‌డం మిన‌హా.. హీరోగారు చేసిందేం లేదు. హీరో విల‌న్ల మ‌ధ్య గేమ్ స‌రిగా పండ‌కపోవటమే మైనస్ గా నిలిచింది.

 టైమింగ్ బాగుంది కానీ...

టైమింగ్ బాగుంది కానీ...


మంచు విష్ణు తనదైన నటనతో లక్కీ పాత్రలో బాగానే పెర్‌ఫార్మెన్స్‌ చేశాడనే చెప్పాలి. అతని కామెడీ టైమింగ్‌ బాగుంది కానీ కథే కలిసి రాలేదు. బాడీ లాంగ్వేజ్‌లోనూ మార్పు కనిపిస్తుంది. మోహన్‌బాబును ఇమిటేట్‌ చేయడం ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. విష్ణు నోటి వెంట మ్యావ్‌ మ్యావ్‌ అనే వూతపదం ఎక్కువగా వస్తుంది.

 సాంకేతికంగా..

సాంకేతికంగా..

ఇక మాటలు రచయిత డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు ఉన్నంతలో ప్లస్ అయ్యారు. అయితే స్క్రీన్ ప్లే పరంగా దెబ్బ కొట్టారు. ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే బాగున్నా సినిమాకు సెకండాఫ్ కు ఆయన అందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేకపోయింది. పి.జి.విందా సినిమాటోగ్రఫీ బాగుంది. అచ్చు, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజుల సంగీతం పర్వాలేదు. ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడుగా ...గీతాంజ‌లితో ఆక‌ట్టుకొన్న రాజ‌కిర‌ణ్‌... స్క్రిప్ట్ పై మ‌రింత వ‌ర్క్ చేయాల్సిందనిపిస్తుంది. అక్క‌డ‌క్క‌డ త‌న‌దైన మార్క్ క‌నిపించినా.. ఓవ‌రాల్‌గా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.

 సినిమాకు పని చేసిన టీమ్

సినిమాకు పని చేసిన టీమ్

నిర్మాణ సంస్థ:ఎం.వి.వి.సినిమా
తారాగణం: మంచు విష్ణు, హన్సిక మోత్వాని, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్‌, పోసారి కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, సత్యంరాజేష్‌ తదితరులు
సంగీతం: అచ్చు, ప్రవీణ్‌ లక్కరాజు
కళ: చిన్నా
సినిమాటోగ్రఫీ: పి.జి.విందా
స్క్రీన్‌ప్లే, మాటలు: డైమండ్‌ రత్నబాబు
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రెడ్డి విజయ్‌కుమార్‌
నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ
కథ, దర్శకత్వం: రాజ్‌కిరణ్‌
విడుదల: 26-01-2017

ఓవరాల్ గా ఈ సినిమా హీరోగా మంచు విష్ణుకు, దర్శకుడుగా రాజ్ కిరణ్ కు ఎంతవరకూ లక్ కలిసి వచ్చిందో కానీ, చూసేవాడికి మాత్రం లక్ దక్కనివ్వలేదనే చెప్పాలి.

English summary
Vishnu Manchu is back with yet another commercial entertainer called Lakkunnodu,directed by Raj Kiran.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu