»   » జస్ట్ ...‘ఓకే’ బంగారం(రివ్యూ)

జస్ట్ ...‘ఓకే’ బంగారం(రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

అతి కొద్ది మంది దర్శకుల చిత్రాలకు మాత్రమే ...హీరోలతో సంభందం లేకుండా థియోటర్లు హౌస్ ఫుల్ అయ్యే మార్కెట్ ఉంది. అటువంటివారిలో ముందు వరసలో ఉన్న దర్శకుడు మణిరత్నం. ఆయన డబ్బింగ్ చిత్రాలు తెలుగులో చాలా సార్లు స్టైయిట్ చిత్రాలుకు పోటీ ఇచ్చాయి. అయితే ఆయన గత సంవత్సరాలుగా విజయం అనే మాటకు దూరంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ సినిమాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా 'కడలి' చిత్రం ఆయన వీరాభిమానులను సైతం భయపట్టేసింది. ఈ నేపధ్యంలో ఆయన మళ్లీ 'సఖి' రోజులను గుర్తు చేసేలా ఓ లవ్ స్టోరీని ఎత్తుకుని...దానికి తగ్గట్లు తన దైన శైలిలో ప్రోమోలు,పోస్టర్స్ క్రియేట్ చేసి 'ఓకే బంగారం' అంటూ ఆశలు రేకిత్తించి థియోటర్ కు వచ్చేలా చేసారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అంతేకాదు ఈ తరం నమ్ముతూ నిరంతంర చర్చకు నిలుస్తున్న లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనే పాయింట్ ని టచ్ చేసి,దాని చుట్టూ కథని అల్లారు. అయితే ఈ రొమాంటిక్ మూవిలో హీరో,హీరోయిన్స్ రిలేషన్ కు సమస్య వచ్చేసరికే... సినిమా క్లైమాక్స్ కు వచ్చేస్తుంది. ఆ సమస్యను కూడా తేలిగ్గా...సినిమాటెక్ గా రొటీన్ గా ముగించేయటం కొద్దిగా నిరాసపరుస్తుంది. ముఖ్యంగా చాలా ప్రెడిక్టుబుల్ గా కథనం నడుస్తుంది.


ఫస్టాఫ్.. నత్తనడకతో ప్రారభైమైనా రొమాన్స్ తో బాగుంటుంది అదే ...సెకండాఫ్ కు వచ్చేసరికి ఇంకా స్లోగా నడుస్తూ..క్లైమాక్స్ కు వచ్చేసరికి ముగించాలి కాబట్టి ఓ ముగింపుని ఉన్నంతలో వెతికేసి అతికేసినట్లు అనిపిస్తుంది. అయితే అద్బుతమైన పాటల చిత్రీకరణ, లీడ్ పెయిర్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ...మణిరత్నం మాత్రమే చేయగలరని మరోసారి అర్దమవుతుంది. స్క్రిప్టు మరింత పగడ్బందీగా ఉంటే...ఓ సెమీ క్లాసిక్ అయ్యే అవకాసం ఉండేది ఖచ్చితంగా.


ముంబైలో కార్పోరేట్ సంస్ధలలో పనిచేస్తున్న ఆది (దుల్కర్ సల్మాన్),తార(నిత్యామీనన్) పోష్ లైఫ్ ని గడుపుతూంటారు. పెళ్లనే కాన్సెప్ట్ ని నమ్మని వీళ్లిద్దరూ ...అనుకోని పరిస్ధితుల్లో పరిచయమై...ఆ స్నేహం అనతికాలంలోనే ఏకాభిప్రాయాలతో బలపడి...సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్ షిప్)గా రూపాంతరం చెందుతుంది. అయితే తమ భవిష్యత్ కోసం వీరిద్దరూ వేరు వేరు దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్ధితి వస్తుంది. ఈ నేపధ్యంలో వీరు తమ బంధానికి ఫుల్ స్టాప్ చెప్తారా..లేక దాన్ని పెళ్లితో బలపరుచుకుంటారా అనేది కథలో కీలకాంశం.


స్లైడ్ షోలో మిగతా రివ్యూ


మేజర్ ప్లస్ పాయింట్

మేజర్ ప్లస్ పాయింట్

పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్. పిసి శ్రీరామ్ ...తన ఛాయాగ్రహణ ప్రతిభను నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లారు. మిడిల్ క్లాస్ యాంగిల్ లో ముంబై ని ఆయన ఆవిష్కరించిన తీరు అబ్బుర పరుస్తుంది. శ్రీకర్ ప్రసాద్ ..క్రిస్ప్ కటింగ్ తో చాలా సీన్స్ కు ప్రాణం పోసారు.


నిత్యామీనన్

నిత్యామీనన్

నిత్యా స్వతహాగా ప్రతిభావంతురాలు. అలాంటి నటి..మణిరత్నం వంటి ప్రతిభా సంపర్నుడు చేతిలో పడితే...ఎలా ఉంటుంది అంటే ఇలాంటి సినిమా అవుట్ పుట్ వస్తుందనిపిస్తుంది. హీరో దుల్హర్ కన్నా ఈమెకే ఎక్కువ మార్కులు పడతాయి. సంతోషం, ఒంటిరితనం వంటి అనేక ఎమోషన్స్ కు ఆమె స్టన్నింగ్ ఎక్సప్రెషన్ ఇచ్చింది.


దర్శకుడుగా ...

దర్శకుడుగా ...

నటీనటుల నుంచి టాప్ నెక్ ఫెరఫార్మెన్స్ లు తీసుకోవటంలో మణిరత్నం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఈసారి కూడా ఆయన మరింతగా ఈ విషయంలో రాణించారు. అలాగే ఎప్పటిలాగే కథ కన్నా ట్రీట్ మెంట్ కే ప్రాధాన్యత ఇచ్చారు. హీరో,హీరోయిన్స్ మధ్య రొమాన్స్ పండించటంతో ఆయనకి ఆయనే సాటి అని మరోసారి అనిపించారు.


సంగీతం

సంగీతం

ఈ ఆస్కార్ విన్నర్ సంగీతం ...మన దేసం ఎల్లలు దాటిపోయిన దగ్గరనుంచి మనకు నచ్చటం మానేసింది. ఆయన ఆల్బమ్ లు క్లిక్ అవటం తగ్గిపోయాయి. అయితే ఈ సారి ఆయన పాటలు నిరాసపరచలేదు. ముఖ్యంగా మాంటేజ్ సాంగ్ లు మణిరత్నం ఎంతబాగా తీస్తారో...రహమాన్ అంతబాగా సంగీతం ఇస్తారు. అలాగే కొన్ని చోట్ల సన్నివేశాల్లో సైలెన్స్ ని బాగా ఉపయోగించుకున్నారు.


వెళ్లితే మాత్రం...

వెళ్లితే మాత్రం...

నిజానికి ఈ చిత్రానికి వెళ్లేవారు..మణిరత్నం సినిమా అని తెలుసు కాబట్టి ...రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ ఆశించరు. ఆశిస్తే మాత్రం భంగపడతారు.


పూర్తిగా..

పూర్తిగా..

ఈ జనరేషన్ యూత్ ని మణిరత్నం తన విజువల్స్ తో బంధించే ప్రయత్నం చేసారు. నిత్యా, దుల్కర్ ఇద్దరూ క్యారక్టరైజేషన్స్ ...మనం నిత్యం చూస్తున్న యువతలో గమనిస్తున్నామనిపిస్తుంది.ప్రీక్వి్ల్

ప్రీక్వి్ల్

ఈ సినిమా చూస్తూంటే..సఖి కు ప్రీక్విల్ లాగ అనిపిస్తుంది. అలాగే... దుల్కర్ పాత్ర...యువ చిత్రంలో సిద్దార్దను గుర్తు చేస్తుంది. డైలాగులు సింపుల్ గా బాగున్నాయి.


ఎవరెవరు

ఎవరెవరు

బ్యానర్: మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సినిమా : ఓకే బంగారం
నటీనటులు:దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్,ప్రభు లక్ష్మన్, రమ్య సుబ్రమణ్యన్, కనిక, బివి దోషి తదితరులు
ఛాయాగ్రహణం: పిసి శ్రీరామ్
పాటలు: సీతారామ శాస్త్రి
సంగీతం: ఎఆర్.రహమాన్
నిర్మాత: దిల్‌రాజు
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మణిరత్నం
సెన్సార్ సర్టిఫికేట్: యు/ఏ


విడుదల తేదీ 17,ఏప్రియల్ 2015.
ఫైనల్ గా...ఎ,మల్టిప్లెక్స్ లకు టార్గెట్ చేసినట్లున్న ఈ చిత్రం మణిరత్నం భక్తులకు,నిత్యామీనన్ అభిమానులకు బాగా నచ్చుతుంది. అలాగని మిగతావాళ్లని అంతలా నిరాశపరచదు. ముఖ్యంగా రొమాంటిక్ చిత్రాలని ఇష్టపడేవారికు ఇది మణిరత్నం కానుకే.(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
After a series of disasters, the master of storytelling, Mani Ratnam, comes back with a contemporary love story, OK Bangaram. Let us see if the legend has lived up to the revere. . The movie is touted to be an urban romantic flick and the director has confirmed that it will stand in resonance with the present generation of urban India.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu