For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నచ్చే మన్మధుడు

  By Staff
  |

  Manmadhudu
  -జలపతి
  చిత్రం: మన్మధుడు
  నటీనటులు: నాగార్జున, సోనాలి బెంద్రే, అన్షు,
  తనికెళ్ళ, సుధ, చంద్రమోహన్‌, బ్రహ్మానందం, సునీల్‌, తదితరులు...
  సంగీతం: దేవీశ్రీప్రసాద్‌
  నిర్మాత: నాగార్జున అక్కినేని
  స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: కె.విజయభాస్కర్‌

  దర్శకుడు కె.విజయభాస్కర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ల మధ్య చక్కని అవగహన ఉందని నిరూపించే మరో చిత్రం వచ్చింది. వీరిద్దరూ కలిసి రూపొందించిన నువ్వేకావాలి, నువ్వునాకు నచ్చావ్‌ చిత్రాల మాదిరిగానే నాగార్జున నటించిన మన్మధుడు చిత్రం కూడా ఇంటిల్లిపాది చూసే విధంగా ఉంది. సంతోషం చిత్రం తర్వాత నాగార్జున తన వయసుకు తగ్గట్లుగా నటించిన ఈ చిత్రం పూర్తిగా రచయిత త్రివిక్రమ్‌ డైలాగ్స్‌, విజయభాస్కర్‌ స్క్రీన్‌ ప్లే మీదే నడుస్తుంది. తివిక్రమ్‌ వన్‌ లైన్‌ డైలాగ్స్‌, కొత్త అమ్మాయి అన్షు అందం, దేవీశ్రీప్రసాద్‌ వినసొంపైన సంగీతం..నీటైన దర్శకత్వం..ఇవీ ఈ చిత్రానికి ప్రాణం. కొద్ది సేపు అక్కడక్కడ బోర్‌ అన్పించినా సినిమా ఆసాంతం హాయిగా సాగిపోతుంది. సినిమా మధ్యలో గాడితప్పకుండా బ్రహ్మనందం ఆదుకుంటాడు. క్లైమాక్స్‌ ఒక్కటే కాస్తా సాగదీసినట్లుగా కన్పిస్తుంది. కానీ మొత్తానికి చూడదగ్గ ఎంటర్‌ టెయిన్‌ మెంట్‌ చిత్రం.‌

  హాలీవుడ్‌ చిత్రం వాట్‌ వుమెన్‌ వాంట్‌ లోని ఒక పాయింట్‌ ను మాత్రమే వాడుకొని మిగతా సినిమా అంతా నేటివిటీకి తగ్గట్లు కథ అల్లారు. నాగార్జున ఒక యాడ్‌ కంపెనీలో మేనేజర్‌. కంపెనీ కూడా అతనిదే. ఆడవాళ్ళంటే గిట్టదు. సోనాలిబెంద్రే ఆ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ గా చేరుతుంది. కానీ ఆమె రాజీనామా చేసేలా నాగార్జున అతిగా ప్రవర్తిస్తాడు. నాగార్జున ప్రవర్తనకు కారణం ఏమిటో అతని బాబాయ్‌ తనికెళ్ళ భరణి సోనాలికి చెపుతాడు. ఫ్లాష్‌ బ్యాక్‌..ప్రారంభం..‌

  వారింట్లో పనిచేసే చంద్రమోహన్‌ మేనకోడలు అన్షు(నూతన పరిచయం)ను నాగార్జున చూడగానే ప్రేమిస్తాడు. కానీ వీరి ప్రేమను నాగార్జున కుటుంబం ఒప్పుకోదేమోనని భయపడి చంద్రమోహన్‌ అన్షుకు వేరే సంబంధం చూస్తాడు. దీంతో నాగార్జున గొడవచేసి అన్షును తనతో కార్లో తీసుకొని వస్తుంటాడు. దారిలో యాక్సిడెంట్‌ అవుతుంది. అతను కోలుకున్నాక, అన్షు వేరే పెళ్ళి చేసుకుందని తెలుస్తుంది. దీంతో అప్పట్నుంచి ఆడవాళ్ళను ద్వేషిస్తుంటాడు...‌

  ఈ ఫ్లాష్‌ బ్యాక్‌ తెలిశాక, సోనాలి నాగ్‌ తో సన్నిహితంగా ఉంటుంది. నాగ్‌ కూడా ఆమెతో ప్రేమలో పడుతాడు. కానీ చెప్పలేకపోతాడు. మరోవైపు, సోనాలికి ఇంతకుముందే పెళ్ళిసంబంధం ఖరారు అవుతుంది. ఆ తర్వాత ఏమి జరుగుతుందో అందరూ ఊహించిందే..‌

  కొత్త అమ్మాయి అన్షు చాలా అందంగా ఉంది. అసూయ, చిలిపితనం వంటి ఎమోషన్లను కూడా చక్కగా ప్రదర్శించింది. ఈ అమ్మాయి ఈ సినిమాకు చాలా అందం. ఇక నాగార్జున తన మామూలు పద్దతిలోనే డీసెంట్‌ గా నటించాడు. సోనాలి నటన ఫర్వాలేదు. బ్రహ్మనందం వచ్చాకే సినిమాలో కాస్త స్పీడు పెరుగుతుంది. అతను ఉన్నంత సేపు నవ్వులే. సంతోషం, నువ్వు నాకు నచ్చావ్‌ లలో మాదిరిగా బ్రహ్మనందం కోసమే త్రివిక్రమ్‌ హాస్య సన్నివేశాలను రూపొందించాడు ఈ చిత్రంలోనూ. నర్సాపురం అబ్బాయి సునీల్‌ మంచి నటన ప్రదర్శించాడు. తొలిసారిగా హావభావాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఊరట. దర్శకుడు విజయభాస్కర్‌ కు ప్రత్యేకమైన శైలి అంటూ లేదు. దేవీశ్రీప్రసాద్‌ మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఉన్న యువసంగీత దర్శకుల్లో ఇతను అత్యంత ప్రతిభావంతుడని నిరూపించుకున్నాడు. కథ ఎలా ఉంటే అలా సింపుల్‌ గా తీయడమే అని పద్దతని అర్థమవుతోంది. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం ఇది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X