twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాఘవేంద్రుని రెగ్యులర్ నాదం (ఝుమ్మంది నాదం రివ్యూ)

    By Srikanya
    |
    Jhummandi Naadam
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సంస్థ: శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌
    నటీనటులు: మంచు మనోజ్‌ కుమార్‌, తాప్సీ, మోహన్‌ బాబు, సుమన్‌,
    తనికెళ్లభరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు, అలీ తదితరులు.
    మూల కథ: భూపతి రాజా
    ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
    కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి
    సంగీతం: ఎం.ఎం.కీరవాణి
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
    నిర్మాత: మంచు లక్ష్మీ ప్రసన్న
    విడుదల తేదీ: 01, జూలై 2010

    వరసగా ఆధ్మాత్మిక చిత్రాలు తీస్తూ వస్తున్న రాఘవేంద్రరావు చాలా గ్యాప్ తర్వాత తనదైన శృంగార శైలిలో సినిమా తీస్తున్నారనగానే అందరిలో ఓ రకమైన ఆసక్తి బయిలుదేరిందనేది వాస్తవం. దానికి తగ్గట్లు ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతున్న తాప్సి అందాలు గత కొద్ది రోజులుగా మీడియోలో హాట్ గా అందరినీ ఆకట్టుకోవటం ఈ చిత్రానికి మంచి ఓపినింగ్స్ తెచ్చిపెట్టాయి. అయితే రాఘవేంద్రరావు లాంటి సీనియర్ దర్శకుడు కథ, కథనాలు ప్రక్కన పెట్టి కేవలం హీరోయిన్ అందాలపైనా, బూతు హాస్యం పైనా కాన్సర్టేట్ చేస్తారని మాత్రం ఎవరూ ఊహించలేక పూర్తి స్ధాయి నిరాశకు గురి అయ్యారు. అయితే మనోజ్ కి మాత్రం ఈ చిత్రం ఈజ్ ఉన్న నటుడుగా ప్రూవ్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది.టోటల్ గా ఈ చిత్రం హీరోయిన్ గా పరిచయం అయిన తాప్సీ అందాల ఆల్బమ్ అని చెప్పాలి.

    కెరీర్ ముఖ్యమా...ప్రేమ ముఖ్యమా (రెండూ కావలంటే కుదరదు) అనే పాయింట్ చుట్టూ అల్లిన కథ ఇది. తన ఊరు భద్రాచంలో ఛాలెంజ్ చేసి హైదరాబాద్ బయిలుదేరిన ఔత్సాహిక గాయకుడు బాలు(మనోజ్). అయితే ఎక్కడా మచ్చుకైనా ఆ దిసలో అతను చేస్తున్న ట్రైల్స్ కనపడవు..అది వేరే సంగతి. అక్కడ అతని ఎదురింట్లోకి ఓ ఎన్నారై అమ్మాయి శ్రావ్య (తాప్సీ) దిగుతుంది. ఆమె ఆశయం..తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిలపై డాక్యుమెంటరీ చేయాలని. అలాగని ఆమె తెలుగువారి సంస్కృతి, సంప్రదాయలని గౌరవించి పాటిస్తుందని ఫిక్సవకండి. ఎప్పుడూ పై నించి క్రిందదాకా ఎక్సపోజ్ చేసే డ్రస్స్ ల్లో తిరుగుతూంటుంది. ఇక ఆమెకు గార్డియన్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ కెప్టెన్ రావ్(మోహన్ బాబు). ఆయన బాలు ఉన్న ఇంటి ఎదురుగానే ఉంటూంటాడు. మరో ప్రక్క కెప్టెన్ రావ్ కి యంగ్ జనరేషన్ అంటే గిట్టదు..ముఖ్యంగా బాలు అంటే అస్సలు గిట్టదు. ఇక బాలు, శావ్య పరిచయాలు సినిమాటెక్ గా జరిగాక ఆమె చేసే డాక్యుమెంటరీకి మ్యూజిక్ గైడ్ గా బాలు చేరతాడు. అంతేగాక ఆమె అందాలను దగ్గరనుంచి చూసి ప్రేమలో పడతాడు. ప్రేమ ముదిరి పాకాన పడుతుందనగా...బాలుకి జెమినీ మ్యూజిక్ ఛానెల్ కాంపిటేషన్ లో పాల్గొనే ఆఫర్ వస్తుంది. అయితే ఆ పోగ్రామ్ లో పాల్గొనాలంటే ఈ ప్రేమ విషయం తెలిసిన కెప్టెన్ రావు అడ్డుపడతాడు. నీకు ప్రేమ కావాలా లేక కష్టపడి సాధించాలనుకున్న కెరీర్ కావాలా అని పుల్లేస్తాడు. కెరీర్ కావాలన్న బాలుతో శ్రావ్యని వదిలేయానే కంఢీషన్ పెడతాడు. అప్పుడు బాలు ఏం నిర్ణయం తీసుకున్నాడు. కెరీర్, ప్రేమ రెండింటిని ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.

    మొదటే చెప్పుకున్నట్లుగా కేవలం హీరోయిన్ అందాలను నమ్మి తీసినట్లున్న ఈ చిత్రంలో కథ, కథనాలే దెబ్బతీసాయి. హీరో తన ఊళ్ళో అంతలా ఛాలెంజ్ చేసి వస్తాడు (ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ సీన్స్ అస్సులు పండలేదు). దానికి తగ్గరీతిలో దీక్షతో ఎక్కడా ప్రాక్టీస్ చేసినట్లు గానీ, అవకాశాలు కోసం తిరిగినట్లు కనపడడు. అలాగే తాప్సీతో వేసిన లవ్ ట్రాక్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. దాంతో ఇంటర్వెల్ దగ్గర హీరో... కెరీర్ ప్రేమ ఈ రెంటిలో ఏది ఎంచుకోవాలనే పరిస్ధితి వచ్చిందన్నా పెద్దగా ఆసక్తి అనిపించదు. అలాగే జెమినీ మ్యూజిక్ ఛానెల్ సింగర్స్ పోటీలో పాల్గొనపోతే అతను కెరీర్ పూర్తిగా స్పాయిల్ అవుతుందని చెబితే నమ్మబుద్ది కాదు. ఎందుకంటే ఈ రోజున సవాలక్ష ఛానెల్స్..రియాల్టి షోలు పోటీపోడి మరీ టాలెంట్ హంట్ లు జనాల్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇక విలన్ లేడనుకున్నారేమో ఆహుతి ప్రసాద్ ట్రాక్ ని ఫోర్సెడ్ గా ఇమిడ్చారు. ఆయన చేతిలో ఓ తుపాకి పట్టుకుని( సీన్స్ లో టెన్ష్ క్రియేట్ చేస్తుందనుకుని ఉంటారు) కూర్చుంటే సీన్ పండక జనం నవ్వే పరిస్ధితి వచ్చింది. ముఖ్యంగా సెకెండాఫ్ లో కథతో కనెక్టివిటీ తెగిపోయింది.

    ఇక ప్లస్ లలో రాఘవేంద్రరావు మార్కు పాటలు బాగున్నాయి. అలాగే తాప్సీ అందాలని తనివి తీరా చూపించటం కనువిందే. కెమెరా కూడా రాఘవేంద్రరావు గారి విజన్ కి తగ్గట్లు అద్బుతంగా అందాలు పట్టిచ్చింది. కొబ్బరి చిప్పలు, గుమ్మడికాయలు, మామిడికాయలతో కొత్త తరహాలో పాటలు రూపొందించటం రాఘవేంద్రుడికే చెల్లు అనిపించుకున్నారు. అలాగే డైలాగులు బూతుపాళ్ళు ఎక్కువగా ఉన్నా చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేసాయి. బ్రహ్మనందం, ఎమ్.ఎస్.నారాయణ వంటి సీనియర్ కమిడియన్స్ కి పోటీగా మోహన్ బాబు నవ్వులు కురిపించారు. ఎడిటింగ్, సంగీతం ఓకే. నిర్మాణవిలువలు బాగున్నాయి.

    ఏదైమైనా ఝుమ్మందినాదం చిత్రం ఎనభైల్లో వచ్చుంటే గ్యారెంటిగా వర్కవుట్ అయ్యుండేది అనటంలో సందేహం లేదు. ఇప్పటికీ చాలామంది ఆ కాలం ప్రేక్షకులుకి బాగా నచ్చుతుంది. అయితే అప్పటి ప్రేక్షకులు చాలామంది సినిమాలు చూడకపోవటం ఈ సినిమాకు కలిసిరాని అంశం. కాబట్టి రాఘవేంద్రరావు అభిమానులు తప్పని సరిగా చూడాల్సిన ఈ చిత్రాన్ని తాజాగా తాప్సీ అభిమానులుగా చేరిన వారు కూడా చూడవచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X