»   » మంత్రం ఫలించలేదు...(ఛార్మి మంత్ర-2 రివ్యూ)

మంత్రం ఫలించలేదు...(ఛార్మి మంత్ర-2 రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5

హైదరాబాద్: ఛార్మి ప్రధాన పాత్రలో గతంలో వచ్చిన హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ ‘మంత్ర' అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చార్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మంత్ర-2' సినిమాపై ముందు నుండి కాస్త పాజిటివ్ ఓపీనియనే ఉంది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో చూద్దాం...

Mantra 2 movie review

బేనర్: గ్రీన్ మూవీస్
దర్శకత్వం: ఎస్.వి. సతీష్
నిర్మాతలు: శౌరి రెడ్డి, వి యాదగిరి రెడ్డి
సంగీతం: సునీల్ కశ్యప్
నటీనటులు: చార్మి, చేతన, తనికెళ్ల భరణి, మెల్కోటె, రాహుల్ దేవ్, ఉత్తేజ్, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు.


కథ విషయానికొస్తే...
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మంత్ర (చార్మి) హైదరాబాద్ వచ్చి తేజ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాయినవుతుంది. అనాథ అయిన ఆమె వయసు పైబడిన దంపతులు(తనికెళ్ల భరణి, ఢిల్లీ రాజేశ్వరి) ఇంట్లో పెయిన్ గెస్ట్ గా ఉంటూ హ్యాపీ లైఫ్ కొనసాగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తనను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని గ్రహిస్తుంది మంత్ర. ఈ విషయాన్ని తన కాలేజ్ ఫ్రెండ్, ఏసిపి అయిన విజయ్(చేతన్ చీను)కు చెబుతుంది. ఈ కేసును ఇన్వెస్ట్ గేట్ చేయడానికి అక్కడికి వెళ్లిన విజయ్‌కి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. మంత్ర దయ్యాలు తిరిగే ఇంట్లో ఉంటున్నట్లు తెలుసుకుంటారు. తర్వాత ఏమైంది. అసలు మంత్ర ఎవరు? ఆమెను ఎవరు చంపాలనుకుంటున్నారు. చివరకు ఏ మైంది అనేది తర్వాతి కథ.


పెర్ఫార్మెన్స్...
చార్మి పెర్ఫార్మెన్స్ బావుంది. ముఖ్యంగా ఆమె ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఓ సాంగులో సూపర్ హాట్ లుక్ తో కనిపించింది. ఇక ఏసిపి విజయ్ పాత్రలో చేతన చీను మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రాహుల్ దేవ్ పెర్ఫార్మెన్స్ ఓకే. తనికెళ్ల భరణి, ఇతర నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు నటించారు.


టెక్నికల్ అంశాల విషయానికొస్తే...


సునీల్ కశ్యప్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా లేదు. హారర్, సస్పెన్స్ సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ తగిన విధంగా ఉంటేనే ఆఫీల్ వస్తుంది. కానీ ఈ సినిమాలో ఆ ఎపెక్ట్ సరిగా కనిపించలేదు. తనికెళ్ల రాజేంద్ర కెమెరా పనితనం బావుంది. ఎడిటింగ్ సరిగా లేదు.


ఈ సినిమా కోసం దర్శకుడు సతీష్ ఎంచుకున్న కథ ఆకట్టుకునే విధంగా లేదు. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా బాగా లేక పోవడం పెద్ద మైనస్. సినిమాలో అసలు హారర్, సస్పెన్ అంశాలే లేవు. నేరేషన్ కూడా చాలా స్లోగా ఉంది. క్లైమాక్స్ కూడా చాలా ఆర్డినరీగా ఉంది. సినిమా ఫస్టాఫ్ కాస్త ఫర్వలేదు కానీ... రెండో భాగం మాత్రం మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించే విధంగా ఉంది.


చివరగా...
గతంలో ‘మంత్ర' సినిమా చూసి అలాంటి అంచనాలతో ఈ సినిమాకు వెళితే నిరుత్సాహ పడక తప్పదు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu