For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చూడ్డమే రిస్క్...('మాస్క్' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  1.5/5
  -సూర్య ప్రకాష్ జోశ్యుల
  సంస్ధ: మెగా సూపర్‌గుడ్ ప్రైవేట్ లిమిటెడ్
  నటీనటులు: జీవా, పూజ హెగ్డే, సెల్వ, నాజర్, గిరీష్ కర్నాడ్ తదితరులు.
  మాటలు: శశాంక్ వెన్నెలకంటి,
  సంగీతం: కె.,
  కెమెరా: సత్య,
  ఎడిటింగ్: గౌగిన్,
  నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పారస్‌జైన్,
  సమర్పణ: ఆర్.బి.చౌదరి,
  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిస్కిన్.

  ఇంతకు ముందు డబ్బింగ్ సినిమా అంటే ఒక భాషలో హిట్టైన సినిమా కదా ఖచ్చితంగా ఏదో ఒక కోణంలో బాగుంటుంది అని ప్రేక్షకులకు కొన్ని అంచనాలు ఉండేవి. అయితే ఇప్పుడు బైలింగ్వుల్ సినిమా అంటూ అక్కడా ఇక్కడా ఒకేసారి విపరీతమైన పబ్లిసిటీతో స్టైయిట్ సినిమాలా భారీగా విడుదల చేయటంతో ప్రేక్షకుడుకి ఆ ఛాయిస్ లేదు. ఆ హీరో, దర్సకుడు లేదా ఇక్కడ విడుదల చేసే నిర్మాత గత సినిమాలు అంచనా వేసుకుని ధియేటర్ కి వెళ్తున్నాడు. ఆ కోవలో విడుదైందే రంగం తో పాపులరైన హీరో జీవా చిత్రం మాస్క్. రిలీజ్ కు ముందు సూపర్ మ్యాన్ తరహా కాన్సెప్టులా ట్రైలర్స్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం సహనానికి పరీక్షలా తయారై ప్రతీ డబ్బింగ్ సినిమా...బాగుండాలనే రూల్ లేదు అనే రూల్ ని మరోసారి గుర్తు చేసింది.

  వైజాగ్ లో ఓ గ్యాంగ్ పక్కా ప్లాన్ తో బ్యాంక్ దొంగతనాలు దొంగతానలు చేస్తూ హంగామా క్రియేట్ చేస్తూంటుంది. అదే వూళ్లో ఆనంద్ అలియాస్ బ్రూస్ లీ(జీవా)కుంగుఫూ నేర్చుకుని రొటీన్ గా ఏ పనీ చేయకూడదని, అసలు ఏ పనిచేయకుండా తన తండ్రి చేత తిట్లు తింటూ రొటీన్ గా జీవితం గడుపుతూంటాడు. ఆనంద్ ఓ రోజు ఆ దొంగలను పట్టుకోవటానికి నియమింపబడ్డ స్పెషల్ ఆఫీసర్ గౌరవ్(నాజర్)కూతురు(పూజ హేడ్గే)ని చూస్తాడు. అయితే తొలి పరిచయంలో ఆమెతో గొడవపడ్డ అతను అదే సమయంలో ప్రేమలో కూడా పడతాడు. ఆమె ప్రేమ కోసం తన ముఖం కనపడకుండా మాస్క్ వేసుకుని ఆమెను వెనకపడుతూంటాడు. అంతేగాక అదే గెటప్ లో ఓ రాత్రి అనుకోని పరస్దితుల్లో ఆ దొంగల బ్యాచ్ ని చూసి వెంటబడి పట్టుకుని పోలీసులకు అప్పచెప్పుతాడు. దాంతో ఆమె కూడా ఈ మాస్క్ మ్యాన్ తో ప్రేమలో పడుతుంది. దాంతో తానే ఆ మాస్క్ మ్యాన్ అని ..ఆనంద్ ఆమెకు చెప్దామని వెళ్ళేసరికి... ఊహించని విధంగా ఆ దొంగలు..ఈ మాస్క్ మ్యాన్ ని ఓ హత్య కేసులో ఇరికించి వాంటెండ్ పర్శన్ గా క్రియేట్ చేస్తారు. ఆ సమస్యనుంచి ఆనంద్ ఎలా బయిటకు వచ్చాడు. ఆ దొంగలపని ఎలా పట్టాడు...తన ప్రేయసి ని ఎలా దక్కించుకున్నాడు అనేది మిగతా కథ.

  ఇప్పటికే హాలీవుడ్ తెరపై బ్యాట్స్ మ్యాన్,సూపర్ మ్యాన్,ఐరన్ మ్యాన్ వంటివి ఎన్నో చూసిన మనకు ఈ కథేం కొత్తకాదు అనిపిస్తుంది. నిజానికి దర్శకుడు ఆ సినిమాలనుంచే ఈ మాస్క్ మ్యాన్ పాత్రను స్పూర్తి పొందినా దానికి సైక్లాజికల్ సెటప్ ఏర్పాటు చేసి,ఇండియనైజ్ చేసే ప్రయత్నం చేసాడు. అయితే అంత సూపర్ మ్యాన్ కి,బ్యాట్స్ మ్యాన్ కి జోకర్ వంటి శక్తి వంతమైన విలన్స్ ఉండి కథను ధ్రిల్లింగ్ గా నపిస్తారనే విషయం మర్చిపోయాడు. సినిమాలో విలన్ పాత్రను తగ్గించేసాడు. ఎంతసేపూ హీరో ఎలా మాస్క్ మ్యాన్ అయ్యాడు..ఎలా సమస్యలో ఇరుక్కున్నాడో చూపించారు కానీ, ఆ సమస్య నుంచి ఎలా సమర్దవంతగా బయిటపడ్డాడు..ఆ సమస్య నుంచి బయిట పడే క్రమంలో విలన్ ఎలా అడ్డుపడ్డాడు..విలన్ కి ఎలా బుద్ది చెప్పాడు వంటి సీన్స్ రాసుకోలేదు. దాంతో సెకండాఫ్ ఈ సినిమాలో చాలా బోర్ గా తయారైంది. మరీ ముఖ్యంగా బ్యాట్స్ మ్యాన్ వంటి పాత్రలు కేవలం ఓ బ్యాంక్ దోపిడిని ఛేదించటానికి పరిమితం చేయరు. అంత పరవ్ ఫుల్ పాత్ర ద్వారా సిటీని దుర్మార్గలనుంచి రక్షించే విధంగా తయారు చేస్తారు. అయితే ఇందులో హీరోకి పర్శనల్ లక్ష్యమే తప్ప ప్రపంచానికి ఏదో చేయాలన్నది ఉండదు. దాంతో ఆ పాత్రకు మాస్క్ మ్యాన్ వంటి ముసుగు అవసరం లేదు. ఇలాంటి లోపాలతో ఈ పాత్ర ఔన్నిత్యం దెబ్బతిని నీరసపడింది. ఇది స్క్ర్ర్రిప్టు ప్లాబ్లం.

  నటీనటుల్లో జీవా చేయటానికి పెద్దగా ఏమీలేదు. ఫస్టాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ లో బాగా చేసినా,సెకండాఫ్ లో తేలిపోయాడు. మాస్క్ మ్యాన్ గా వచ్చేటప్పుడు ఆ బిల్డప్ దర్శకుడు సరిగ్గా ఇవ్వలేకపోయాడు. హీరోయిన్ కొత్త అమ్మాయి..చూడ్డానకి బాగానే ఉన్నా..చేయటానికి ఏమీ లేకుండా దర్సకుడు స్క్రిప్టు రాసి ఆమెకు అన్యాయం చేసారు. నాజర్,గిరీష్ కర్నాడ్ వంటి నటులు ఉన్నా పెద్దగా వారిని వాడుకోలేదు. ఆ పాత్రల్లో ఎవరు చేసినా ఒకేలా తీర్చిదిద్దాడు. దర్శకుడుగా మిస్కిన్ గతంలో అంజాదే,చిత్రం పేసిదే,యుద్దం సేయి వంటి సినిమాలను కేవలం తన టేకింగ్ బలంతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలోనూ షాట్స్ కంపోజింగ్ మీదే మనస్సు పెట్టి సినిమాని దెబ్బకొట్టాడు. సంగీతం ఓ మాదిరిగా ఉంది. రీ రికార్డింగ్ మాత్రం చాలా బాగుంది. కెమెరా వర్క్,ఎడిటింగ్ బాగున్నాయి.

  ఫైనల్ గా ఈ సినిమా కేవలం సాంకేతికతోనే సినిమాలు ఆడవని, కథ, కథనం అనే పదార్దం కూడా సినిమాలకు అవసరమే అని మరో సారి తెలియచెప్తుంది. అలాగే బ్యాట్స్ మ్యాన్ సినిమాలు తరహా టేకింగ్, విజువల్ ఎఫెక్టులు మనవాళ్ళూ చేయగలం అని నిరూపిస్తుంది కానీ, ఆ రేంజి కథలు చేయలేకపోతే ఎలా చతికలపడతాయిని సోదాహణంగా ప్రూవ్ చేస్తుంది.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Tamil super-hero movie and more importantly a Myshkin movie 'Mask' has released with negative talk. For the first time in south India a Super Hero Story has been made. It’s a superhero project starring Jeeva, and Miss Universe India 2010 runner-up Pooja Hegde.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X