For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మేకసూరి 2 రివ్యూ.. మాస్ ఆడియెన్స్ టార్గెట్‌గా క్రైమ్ థ్రిల్లర్

  |

  కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై హంగామా చేసిన చిత్రం మేకసూరి. గ్రామీణ వాతావారణంలో ఫ్యాక్షన్, పగ, ప్రతీకారాల నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం మాస్ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకర్షించింది. దానికి కొనసాగింపుగా మేకసూరి2 సీక్వెల్ నవంబర్ 27వ తేదీన జీ5 యాప్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి పార్ట్ మాదిరిగానే మేకసూరి ప్రేక్షకులను మెప్పించడా అనే విషయాన్ని తెలుసుకుందాం..

  మేకసూరి పార్ట్ 1 కథ ఇలా..

  మేకసూరి పార్ట్ 1 కథ ఇలా..

  మేకసూరి పార్ట్ 1 విషయానికి వస్తే.. సింగరాయకొండ గ్రామంలో జంతువుల పచ్చి నెత్తురు తాగే సూరి (అభినయ్) వృత్తిరీత్యా కసాయి. రాణి (సుమయ) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. అయితే గ్రామీణ పెద్ద అప్పలనాయుడు (శరత్ కుమార్) ఇద్దరు స్నేహితులతో కలిసి తన భార్య రాణిని రేప్ చేసి చంపడంతో సూరి రాక్షసుడిలా మారిపోతాడు.

  మేకసూరి పార్ట్ 2లో

  మేకసూరి పార్ట్ 2లో

  మేకసూరి పార్ట్ 2లో అప్పలనాయుడు, మరో ఇద్దరిపై సూరి ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? సూరిని ఏసీపీ (ప్రమోద్) కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నాలు ఎంత వరకు సఫలమయ్యాయి? నక్సల్ దళంలో చేరిన సూరి తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే మేకసూరి 2 కథ.

  మేకసూరి 2లో విశ్లేషణ

  మేకసూరి 2లో విశ్లేషణ

  గ్రామీణ నేపథ్యంతో ఘాటు, నాటుగా కనిపించే కథ, కథనాలతో మేకసూరి2 కొనసాగుతుంది. కథ, సన్నివేశాల పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. సాంకేతిక అంశాలు వాటిని కనిపించకుండా చేశాయి. నటీనటుల ప్రతిభ, నేటివిటి సినిమాను ముందుకు తీసుకెళ్లాయి. కాకపోతే అసభ్యకరమైన డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ అంతగా రుచించకపోవచ్చు. కేవలం మాస్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మేకసూరి 2 తీశారా అనే సందేహం కలుగుతుంది. క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులు ఎంజాయ్ చేయడానికి అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

  దర్శకుడు, మ్యూజిక్, సినిమాటోగ్రఫి గురించి

  దర్శకుడు, మ్యూజిక్, సినిమాటోగ్రఫి గురించి

  దర్శకుడు త్రినాథ్ వెలిశాల అనుసరించిన స్క్రీన్ ప్లే సినిమాకు బలంగా మారింది. ట్విస్టులను హ్యాండిల్ చేయడంలో తన ప్రతిభను చాటుకొన్నాడు. కథ, కథనాలు, డైలాగ్స్‌పై మరింత దృష్టి పెట్టి ఉంటే ఇటీవల కాలంలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అయి ఉండేది. మేకసూరి2 సినిమాకు ప్రధాన ఆకర్షణ ప్రజ్వల్ క్రిష్ అందించిన మ్యూజిక్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలను బాగా హైలెట్ చేసింది. బలహీనమైన సీన్లను కూడా మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. పార్థూ సైనా అందించిన సినిమాటోగ్రఫి కూడా బాగుంది. సహజ సిద్ధమైన వాతావరణంలో షూట్ చేసిన సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారాయని చెప్పవచ్చు.

   నటీనటులు ప్రతిభ

  నటీనటులు ప్రతిభ

  సూరిగా అభినయ్ స్వీక్వెల్‌లో కూడా విజృంభించాడు. సూరి క్యారక్టర్‌కు డిజైన్ చేసిన గెటప్ పాత్రకు చక్కగా సరిపోయింది. క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడానికి గెటప్ చాలా ఉపయోగపడింది. ఇక వీరభద్రం (నరేష్ బైరెడ్డి) పోలీస్ అధికారి, జర్నలిస్టు రఘురాం (శ్రవణ్) పాత్రలు కూడా బాగున్నాయి. రఘురాం పాత్ర ట్విస్టు బాగుంది. ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  పగ, ప్రతీకారాలే లక్ష్యంగా సాగే ఓ యువకుడి కథే మేకసూరి. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో చేసిన ప్రయోగం ఈ సినిమాకు బలంగా మారింది. నిర్మాత కార్తీక్ కంచెర్ల ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. పాత్రలకు తగినట్టుగా నటీనటుల ఎంపిక తీరు సినిమాపై ఆయనకు ఉన్న అభిరుచికి అద్దం పట్టింది. మాస్ ఆడియెన్స్‌కు ఈ క్రైమ్ థ్రిల్లర్ తప్పక నచ్చుతుంది. మేకసూరి3 స్వీక్వెల్‌పై ప్రేక్షకులకు అంచనాలు పెంచేలా మేకసూరి2 ఉంది.

  Chitram X Movie Trailer | Latest Movie Trailers
  తెర వెనుక, తెర ముందు

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: అభినయ్, శ్రవణ్, నరేష్ బైరెడ్డి, సుమయ సయ్యద్, శరత్ కుమార్ తదితరులు

  దర్శకుడు: త్రినాథ్ వెలిసిలా

  నిర్మాత: కార్తీక్ కంచెర్ల

  మ్యూజిక్: ప్రజ్వల్ క్రిష్

  ఎడిటింగ్: సురేష్ కే కసుకుర్తి

  సినిమాటోగ్రఫి: పార్థూ సైనా

  బ్యానర్: సింబా ఎంటర్‌టైన్‌మెంట్

  రిలీజ్ డేట్: 2020-11-27

  ఓటీటీ రిలీజ్: జీ5

  English summary
  Meka Suri 2 directed by Trinadh Velisala.The film stars Abhinay Reddy, Syed Sumaya Farahath, Sharath Kumar, Byreddy Naresh and Sharavan Sai Tadinada. The film is produced by Simba Entertainment and the movie revolves around a tall butcher. The film premiered through ZEE5 on 27 November 2020
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X