»   » మెర్కురీ సినిమా రివ్యూ: ‘సైలెంట్‌‘ థ్రిల్లర్‌తో ప్రభుదేవా

మెర్కురీ సినిమా రివ్యూ: ‘సైలెంట్‌‘ థ్రిల్లర్‌తో ప్రభుదేవా

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Rating:
  2.5/5
  Star Cast: ప్రభుదేవా, సనంత్ రెడ్డి, దీపక్ పరమేష్
  Director: కార్తీక్ సుబ్బరాజ్

  Mercury Movie Twitter Review మెర్క్యురీ ట్విట్టర్ రివ్యూ: సైలెంట్ థ్రిల్లర్!

  దక్షిణాదిలో సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలు రూపొందించే డైరెక్టర్లలో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకు మంచి క్రేజ్ ఉంది. షార్ట్‌ ఫిలింలతో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టిన కార్తీక్ పిజ్జా చిత్రంతో మంచి పేరు సంపాదించుకొన్నాడు. ఆ తర్వాత తమిళంలో జిగర్తాండా, ఇరైవీ చిత్రాలు ఆయనకు మంచి పేరు సంపాదించిపెట్టాయి. త్వరలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకొన్నాడు కార్తీక్ సుబ్బరాజు.

  ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కార్తీక్ అందించిన తాజా చిత్రం మెర్కురీ. ఇది పుష్పక్ లాంటి మూకీ (మాటలు) చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో ప్రభుదేవా ఓ కీలకపాత్రలో నటించాడు. సామాజిక, సందేశంతోపాటు థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దెయ్యం పాత్రలో కనిపించిన ప్రభుదేవా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచాడో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  మెర్కురీ సినిమా కథ..

  మెర్కురీ సినిమా కథ విషయానికి వస్తే.. నలుగురు అబ్బాయిలు, ఓ అమ్మాయి (దీపక్ పర్మేశ్, అనిష్ పద్మనాభన్, సనంత్ రెడ్డి, శశాంక్ పురుషోత్తం, ఇందూజ) మంచి స్నేహితులు. అయితే అందరూ మూగ, చెవిటి వాళ్లు. అమ్మాయి (ఇందూజ) పుట్టిన రోజును పురస్కరించుకొని సరదాగా గడుపుతుంటారు. ఆ వేడుకలో భాగంగా అర్ధరాత్రి అందరూ వాహనంలో బయటకు వెళ్లారు. ఆ క్రమంలో వారికి శవం (ప్రభుదేవా) కనిపిస్తుంది. ఏం చేయాలో తెలియక అక్కడే మూసేసిన ఓ ఫ్యాక్టరీలో పూడ్చిపెట్టి అక్కడి నుంచి జారుకొంటారు.

  ఎందుకు? ఏమిటి? ఎలా?

  ఓ కారణంగా శవాన్ని పూడ్చి పెట్టిన చోటుకి అందరూ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా అక్కడి వచ్చిన వారికి ఏం జరిగింది. ఐదుగురు సభ్యుల బృందానికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఏ పరిస్థితుల్లో అమ్మాయి తన నలుగురు స్నేహితులను కోల్పోతుంది. నలుగురు అబ్బాయిలను దెయ్యం రూపంలో ఉన్న ప్రభుదేవా ఎందుకు చంపాడు? ప్రభుదేవా చనిపోయి దెయ్యంగా మారడానికి కారణాలేంటి అనే ప్రశ్నలకు తెరపైనే సమాధానం దొరుకుతుంది.

  మెర్కురీ ఫస్టాఫ్‌లో

  ఇది పక్కాగా మూకీ సినిమా. మాటలు లేకుండా పాత్రల భావోద్వేగం, హావభావాల ద్వారా కథ చెప్పడం ప్రారంభమవుతుంది. తొలి భాగంలో మూగ, చెవిటి వారైనా నలుగురు యువకులు, ఓ యువతి కథ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. కాకపోతే మాటలు లేకపోవడం వల్ల కథను ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రథమార్థంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కాస్త ఎక్కువ సమయాన్నే తీసుకొన్నాడు. ఓ ఆసక్తికరమైన అంశంతో ప్రభుదేవాను ఇంట్రడ్యూస్ చేసి ఇంటర్వెల్ వరకు తీసుకెళ్లారు.

  మెర్కురీ సెకండాఫ్

  మెర్కురీ సినిమా సెకండాఫ్‌లో అసలు డ్రామా మొదలవుతుంది. ఆత్మ రూపంలో ఉండే ప్రభుదేవా ఐదుగురిలో ఒక్కొక్కరి మట్టుపెట్టడం ప్రారంభిస్తాడు. అయితే ప్రభుదేవా గుడ్డివాడు కావడం కథలో పాయింట్ ఇంట్రస్ట్‌ను క్రియేట్ చేస్తుంది. చివర్లో ప్రభుదేవా మరణానికి కారణం ఐదుగురే అని చెప్పిన విధానంతో సినిమా కొత్త మలుపు తిరుగుతుంది. చివర్లలో ఎమోషన్ దట్టించిన సీన్లతో కథకు దర్శకుడు చక్కటి ముగింపునివ్వడంతో ప్రేక్షకుడు ఓ చక్కటి ఫీలింగ్‌తో బయటకు వచ్చే అవకాశం కలిగింది.

  చివరి 15 నిమిషాలు మాత్రమే

  మెర్కురీ చివరి 15 నిమిషాల కథ సినిమాకు ఆయువు పట్టు. క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం దాదాపు రెండు గంటలపాటు ప్రేక్షకుడు సహనంతో ఎదురు చూడాల్సిన పరిస్తితి కొంత ప్రతికూలం అని చెప్పవచ్చు. ఈ సినిమా నేరేషన్ స్లోగా ఉండటం మరో మైనస్ పాయింట్‌గా నిలిచింది.

  దర్శకుడి ప్రతిభ

  కార్పోరేట్ వ్యవస్థ దందా, రసాయన పరిశ్రమల ద్వారా పర్యావరణం, ప్రజల ఆరోగ్యంపై పడుతున్న దుష్ర్పభావం లాంటి అంశాలను మేలవించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు మరోసారి విభిన్నమైన ప్రయత్నం చేశాడు. ఐదుగురు శారీరక వికలాంగుల కథతో కార్పోరేట్ పరిశ్రమల వల్ల ప్రజలు శారీరకంగా ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారనే పాయింట్‌కు మెర్కురీ రూపం కల్పించాడు. ఉన్నతమైన సాంకేతిక అంశాలను జోడించి కథ చెప్పడంలో సఫలమయ్యాడు.

  ప్రభుదేవా నటన

  ఈ సినిమాలో నటుడు, కోరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా పోషించిన రోల్ అతిథి పాత్ర లాంటింది. ఆత్మరూపంలో కనిపించి ప్రభుదేవా అద్భుతమైన హావభావాలను ప్రదర్శించాడు. భయంకరమైన లుక్‌తో నటనపరంగా ఆకట్టుకొన్నాడు. ప్రభుదేవా నటన సెకండాఫ్‌కు హైలెట్ నిలిచింది. ఎమోషన్ టచ్ ఉన్న పాత్రతో ప్రేక్షకులకు మరోసారి దగ్గరయ్యాడని చెప్పవచ్చు.

  యువ నటుల ప్రతిభ

  ఐదుగురు స్నేహితుల బృందంలో ఇందుజా, సనంత్ రెడ్డిలే కీలకం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందజా నటన ఆకట్టుకునేలా ఉంది. చివరి పది నిమిషాల్లో ఇందూజా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రభుదేవా, ఇందూజ మధ్య సీన్లు ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. మూగపాత్రలో ఇందూజా ఒదిగిపోయింది.

  తిరు సినిమాటోగ్రఫి

  మెర్కురీ సినిమాకు సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ. ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. డార్క్ అండ్ లైట్ ఎఫెక్ట్‌లో ప్రతీ ఫ్రేమ్‌ను ఆసక్తికరంగా మలిచాడు. ఎడిటింగ్ విభాగం పనితీరు బాగుంది.

  సంతోష్ మ్యూజిక్

  మూకీ సినిమా కావడంతో సంగీతానికి పెద్ద పీట దక్కింది. నటీనటులు ఎమోషన్ ఎలివేట్ చేయడానికి సంతోష్ నారాయణ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా తోడ్పాటునందించింది.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న భోపాల్ దుర్ఘటన, ఇతర సంఘటనల అంశాలను అల్లుకొని రూపొందించిన చిత్రానికి జయంతిలాల్ గడా, ధవాల్ గడ, కార్తీకేయన్ సంతానం నిర్మాతలుగా వ్యవహరించారు. సామాజిక అంశంతో రూపొందించిన ఈ చిత్రానికి నిర్మాణపరంగా మంచి సాంకేతిక విలువలను అద్దడంలో నిర్మాతలకు సినిమా పట్ల ఉన్న అంకితభావం కనిపించింది.

  ఫైనల్‌గా

  మెర్కురీ చిత్రం భావోద్వేగ అంశాలు కలబోసిన ఓ మూకీ చిత్రం. పాత్రధారుల నటనే ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పవచ్చు. కమర్షియల్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకుల అభిరుచికి ఈ సినిమా దూరంగా ఉంటుంది. అన్నివర్గాలను ఈ సినిమా ఆకట్టుకోలేకపోవచ్చు. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఆదరించే కొంత మంది ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. తప్పకుండా చూడాల్సిన సినిమా మాత్రం కాదని చెప్పవచ్చు.

  బలం, బలహీనతలు

  • ప్రభుదేవా
  • కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్
  • సినిమాటోగ్రఫి
  • మ్యూజిక్
  • సెకండాఫ్

  మైనస్ పాయింట్స్

  • స్లో నేరేషన్
  • ఫస్టాఫ్

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: ప్రభుదేవా, సనంత్ రెడ్డి, దీపక్ పరమేష్, శశాంక్ పురుషోత్తం, అనిష్ పద్మనాభన్, ఇందూజ తదితరులు
  కథ, డైరెక్టర్: కార్తీక్ సుబ్బరాజ్
  నిర్మాతలు: జయంతిలాల్ గడా, ధవాల్ గడ, కార్తీకేయన్ సంతానం
  సంగీతం: సంతోష్ నారాయణ్
  సినిమాటోగ్రఫీ: ఎస్ తిరు
  ఎడిటింగ్: వివేక్ హర్షన్
  రిలీజ్: ఏప్రిల్ 13, 2018

  English summary
  Mercury is an 2018 Indian silent horror thriller film written and directed by Karthik Subbaraj. It stars an ensemble cast including Prabhu Deva, Sananth Reddy, Deepak Paramesh, Shashank Purushotham, Anish Padmanabhan, Indhuja and Gajaraj. Tirru was hired as the cinematographer after his recent work on Vanamagan, his first collaboration with Karthik Subbaraj. The trailer of the movie released on 10th April 2018. In this occassion, Telugu filmibeat brings you exclusive review
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more