Mirai First Review: మిరాయ్ మూవీ ఫస్ట్ రివ్యూ

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం మిరాయ్. పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరోలు తేజా సజ్జా, మంచు మనోజ్, శ్రీయ సరన్ నటించిన ఈ చిత్రం పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ చిత్రానికి కృతి ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 12వ తేదీన పాన్ ఇండియామూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.

మిరాయ్ సినిమా విషయానికి వస్తే.. సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ సరన్ తొలిసారి తల్లి పాత్రలో నటిస్తున్నారు. అఈ సినిమాకు మ్యూజిక్ గౌరా హరి, సినిమాటోగ్రఫి కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్స్ మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల వ్యవహరిస్తున్నారు. ప్రోమోలు, ట్రైలర్‌ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ క్రమంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ సెన్సార్ సర్టిఫికెట్ (CBFC) అధికారులు రివ్యూ చేశారు. ఈ సినిమాపై సెన్సార్ అధికారుల ఫీడ్ బ్యాక్ ఏంటి? ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్, ఈ మూవీ రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Mirai First Review

తెలుగు సినిమా తెరపై ఎపిక్, అడ్వెంచరస్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన హై ఆక్టేన్ యాక్షన్ మూవీలో తేజా సజ్జా హీరోగా నటిస్తుండగా.. తొలిసారి ఈ చిత్రం ద్వారా మనోజ్ మంచు విలన్ పాత్రలో కనిపించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ వేగంగా పూర్తి చేసుకొంటున్న ఈ సినిమాను ఇటీవల సెన్సార్ అధికారులు వీక్షించారు. ఈ సినిమాపై పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. డిఫరెంట్ కథ, కథనాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అనే అభిప్రాయాన్ని సెన్సార్ అధికారులు వెల్లడించారని చిత్ర యూనిట్ తెలిపారు.

సూపర్ యోధగా తేజా సజ్జా పాత్రను కార్తీక్ ఘట్టమనేని డిజైన్ చేసిన విధానం కొత్తగా ఉంది. అలాగే మనోజ్ మంచు కూడా పెర్ఫార్మెన్స్ పరంగా పోటాపోటీగా నటించాడు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ 16+ (UA 16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 16 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఈ సినిమాను చూడటానికి అనుమతి ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమా హీరో తేజా సజ్జాకు రెండో పాన్ ఇండియా సినిమా. ఇటీవల కాలంలో వచ్చిన పాన్ ఇండియా సినిమాల్లో నిడివి కంటే చాలా తక్కువగా ఈమూవీని కట్ చేశారు. ఈ చిత్రం నిడివి 169 నిమిషాలు. అంటే దాదాపు 2 గంటల 49 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. దాంతో ఈ సినిమా ఫ్లో షార్ష్‌గా, ఫాస్ట్‌గా ఉంటుంది. ఎలాంటి ల్యాగ్ లేకుండా ఈ సినిమాను కట్ చేశారు. ఆద్యంతం కొన్ని వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ అంశాలు థ్రిల్లింగ్ గురి చేస్తాయనే అభిప్రాయాన్ని సెన్సార్ వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం.

మదర్ సెంటిమెంట్‌తో సాగే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్బ్‌గా ఉంటాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టాండర్డ్స్‌కు తగినట్టుగా హై రేంజ్‌లో ఉంటాయి. ప్యాన్ ఇండియా ఆడియెన్స్ టచ్ చేసే సబ్జెక్ట్. ప్రేక్షకులు, క్రిటిక్స్ పాజిటివ్‌గా స్పందిస్తే.. బాక్సాఫీస్ వద్ద బిగ్ ర్యాలీ చేసే ఛాన్స్ కూడా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. సెప్టెంబర్ 12వ తేదీన రిలీజయ్యే ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, బాక్సాఫీస్ రిపోర్టు, అలాగే లేటేస్ట్ అప్ డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X