twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mishan Impossible Review: 'తాప్సీ; మిషన్ ఇంపాజిబుల్ ఎలా ఉందంటే?

    |

    Rating:
    2.0/5

    Recommended Video

    John Abraham కామెంట్స్ పై South Indian ఫ్యాన్స్ ఫైర్ | Filmibeat Telugu

    నటీనటులు - తాప్సీ, మాస్టర్ హర్ష రోషన్, మాస్టర్ భాను ప్రకాష్, మాస్టర్ జయతీర్థ మొలుగు, హరీష్ పేరడి
    దర్శకుడు - స్వరూప్ ఆర్ఎస్ జే
    నిర్మాతలు - నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
    బ్యానర్ - మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్
    సంగీతం - మార్క్ రాబిన్


    తెలుగు సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన తాప్సీ తర్వాత బాలీవుడ్ వెళ్లి ఎన్నో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఒకరకంగా తెలుగులో సినిమాలు మానేసిందా అనుకుంటున్న తరుణంలో ఆమె చేసిన తాజా తెలుగు చిత్రం మిషన్ ఇంపాజిబుల్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు అందరి దృష్టి తన మీదకు మళ్లించుకున్న స్వరూప్ దర్శకత్వంలో సినిమా కావడం, చేసిన ప్రతి సినిమా విభిన్నంగా చేసిన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్ లో సినిమా అనగానే అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగిన విధంగా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడంతో సినిమా మీద కాస్త బజ్ ఏర్పడింది. అలా ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు ఏర్పడిన తర్వాత RRR హౌస్ ఫుల్ నడుస్తున్నా ధైర్యం చేసి థియేటర్స్ లోకి వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.

    కథ ఏమిటి?

    కథ ఏమిటి?

    చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలో ఉన్న వడమాలపేటకు చెందిన రఘుపతి(హర్ష రోషన్), రాఘవ(భాను ప్రకాష్), రాజారామ్(జయతీర్థ) లకు చదువు మీద ఏమాత్రం ఆసక్తి ఉండదు. రఘుపతి ఎప్పటికైనా రాంగోపాల్ వర్మ లాంటి దర్శకుడు అవ్వాలని కలలు కంటూ ఉంటే రాఘవ మాత్రం ఎప్పటికైనా కౌన్ బనేగా కరోడ్పతి లో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకోవాలని కలలు కంటూ ఉంటాడు. రాజా రామ్ కి ఎప్పటికైనా ఫాస్ట్ బౌలర్ అవ్వాలని కల. చదువు మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టని వీళ్ళు డబ్బు సంపాదించాలంటే దావూద్ ఇబ్రహీంను పోలీసులకు పట్టిస్తే సులభంగా సంపాదించవచ్చు అని భావిస్తారు. అలా బొంబాయి వెళ్దామని బయలు దేరిన వీళ్ళు అనుకోని పరిస్థితుల్లో బెంగళూరు వెళతారు. వీళ్లకు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శైలజ(తాప్సీ) కనపడుతుంది. వీరిలో రాజారామ్ కిడ్నాప్ కాగా వీరి ద్వారా శైలజ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా ఆట ఎలా కట్టించింది అనేదే ఈ సినిమా కథ.

    ఫస్ట్ హాఫ్

    ఫస్ట్ హాఫ్


    సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదా సరదాగా సాగిపోతుంది ముగ్గురు పిల్లల పరిచయాలతో దర్శకుడు ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఒక్కో పిల్లవాడు జీవితంలో ఏం కావాలి అనుకుంటున్నాడు? దాని కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు అనే విషయాన్ని కామెడీతో చెప్పించే ప్రయత్నం చేశారు. చదువు మీద ఆసక్తి లేని పిల్లల ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులతో ప్రవర్తన ఎలా ఉంటుంది? తల్లిదండ్రుల మాటలను ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు అనే విషయాలను ప్రేక్షకులలో రిజిస్టర్ చేయడానికి ప్రయత్నించాడు. న్యూస్ లో దావూద్ ఇబ్రహీం ఫోటో చూసి తండ్రిని అతని వివరాలు అడిగిన క్రమంలో అతని పట్టిస్తే యాభై లక్షల ప్రైజ్మనీ వస్తుందని తెలుసుకుని చిత్తూరు జిల్లా నుంచి బెంగళూరు వెళ్ళేదాకా ఫస్ట్ హాఫ్ సాగుతుంది.

    సెకండ్ హాఫ్

    సెకండ్ హాఫ్

    సెకండ్ హాఫ్ ప్రారంభం నుంచి చైల్డ్ ట్రాఫికింగ్ మీద దృష్టి పెట్టిన దర్శకుడు చైల్డ్ ట్రాఫికింగ్ వల్ల జరుగుతున్న అనర్ధాలు, దేశవ్యాప్తంగా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ఎలా జరుగుతోంది? ఏం జరుగుతోంది అనే విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు. అలా చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడుతున్న ఒక బడా వ్యక్తిని ఈ ముగ్గురు పిల్లలతో కలిసి తాప్సీ ఎలా పట్టుకుంది ఎలా పోలీసులతో అరెస్ట్ చేయించింది అనే విషయాన్ని రెండో భాగంలో చూపించారు. కొన్ని లాజిక్కులు పక్కన పెడితే చిన్న పిల్లలతో సరదాగా సరదాగా సినిమా మొత్తం సాగిపోతుంది. ఏ మాత్రం జీవితం మీద అవగాహన లేని ముగ్గురు చిన్న పిల్లలు ఒక మాఫియా డాన్ లాంటి వ్యక్తిని ఎలా పట్టించారు అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

    దర్శకుడి టేకింగ్

    దర్శకుడి టేకింగ్

    ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా చేసి కేవలం ప్రేక్షకులనే కాదు సినీ పరిశ్రమ మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు దర్శకుడు స్వరూప్. అలాంటి దర్శకుడు చాలా గ్యాప్ తర్వాత మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో వచ్చాడు. అయితే మొదటి సినిమా అంతటి సూపర్ హిట్ కావడంతో కచ్చితంగా రెండో సినిమా మీద అంచనాలు ఉంటాయి అని స్వరూప్ లెక్క వేసుకోలేనట్లు కనిపించింది. సినిమా మొత్తం సరదా సరదాగా సాగిపోతుంది కానీ ఎక్కడా కూడా ఎమోషన్స్ ను బలంగా చూపించడంలో స్వరూప్ సఫలం కాలేదు. సోషల్ మీడియాలో కనిపించే జోకులతో చిన్నపిల్లలు కామెడీ చేయించాడానికి ప్రయత్నించారు కానీ ఇంకా బలమైన ఎమోషన్స్ తో కూడిన స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే బాగుండేది. తక్కువ నిడివిలో సినిమా పూర్తి చేయాలి అని భావించి ఏమైనా సీన్స్ కట్ చేశారేమో తెలియదు కానీ ఒక బలమైన హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా ముగ్గురు చిన్న పిల్లల కారణంగా పట్టుబట్టడం అనే పాయింట్ ను సిల్లీగా చూపించారు.. తన మొదటి సినిమాతో చేసిన మ్యాజిక్ స్వరూప్ మరోసారి రిపీట్ చేయలేకపోయాడు.

    నటీనటులు

    నటీనటులు


    చాలా కాలం తర్వాత తాప్సీ తెలుగు సినిమా చేయడంతో దాదాపు అందరిలో కూడా ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి కానీ తాప్సీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ. అయితే కనిపించిన సీన్స్ లో మాత్రం తాప్సీ నటనతో ఆకట్టుకోగలిగింది. అయితే పిల్లల పాత్రలో నటించిన ముగ్గురు మాత్రం తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. అందులో ఒకటే ప్రేక్షకులకు తెలిసిన ముఖం కానీ ముగ్గురు కూడా చాలా ఈజ్ తో ఎప్పటినుంచో నటనలో మునిగి తేలినట్టు నటించారు. మలయాళ నటుడు హరీష్ పిరాడీ కూడా విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక రవీంద్ర విజయ్ కూడా ఎక్కడా తగ్గకుండా ఆకట్టుకున్నారు. ఇక చిన్న చిన్న పాత్రలలో కనిపించిన మధుసూదన్, రిషబ్ శెట్టి, సుహాస్, సందీప్ రాజ్, పద్మ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు కనిపించి వెళ్ళిపోయారు.. ముందు నుంచి పిల్లలతో చేస్తున్న సినిమా అని చెప్పడంతో పిల్లల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపించింది అయితే వారు మాత్రం ది బెస్ట్ ఇవ్వగలిగారు.

    సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే :

    సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే :


    సాంకేతికంగా చూస్తే.. సినిమా ఫర్వాలేదు అనిపిస్తుంది. సినిమాకు సంగీతం అందించిన మార్క్ రాబిన్ ఆకట్టుకున్నారు. సినిమాకు ఆయన అందించిన నేపధ్య సంగీతం ప్రాణం పోసింది. ఇక చిన్న సినిమా అని అంటున్నారు కానీ భారీగానే ఖర్చు పెట్టారని సినిమా చూసిన అందరికీ అనిపిస్తుంది. ఇక ఎడిటర్ పనితీరు కూడా సినిమాలో కనిపించింది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    విశ్లేషణ :

    విశ్లేషణ :

    ముగ్గురు పిల్ల‌లు... తెలియ‌ని త‌నంతో ఏదో చేద్దామని బ‌య‌ల్దేరి, ఇంకోటేదో సాధించుకుని రావ‌డం అనే కాన్సెప్టు బాగుంది కానీ దాని కోసం ఎంచుకొన్న నేప‌థ్యంలోనే బలం లేదు. ఇక సినిమాలో అస్సలు లాజిక్కులనేవే లేవు. కొన్ని చోట్ల కామెడీ బాగుంది కానీ కొన్ని చోట్ల అదే వెగటు పుట్టించింది. సినిమా చూస్తున్నంత సేపు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలు గుర్తుకు రాక మానవు. అక్కడక్కడా విడివిడిగా కొన్ని సీన్లు బాగున్నాయి కానీ సినిమా పరంగా చూస్తే మాత్రం మిషన్ సక్సెస్ అవలేదు.

    ఫైనల్ గా :

    ఫైనల్ గా :

    మిషన్ ఇంపాజిబుల్.. మంచి కాన్సెప్ట్ కానీ సక్సెస్ అవ్వలేదు.

    English summary
    Mishan Impossible Movie is directed by Swaroop RSJ starring Taapsee, Master Harsh Roshan, Master Bhanu Prakash, Master Jayatheertha in crucial roles. bankrolled by matinee entertainments film hits screens on april 1st 2022. here is the review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X