»   »  కను రెప్ప వెయ్యినివ్వని ... (మోహన్ లాల్ 'కనుపాప' రివ్యూ)

కను రెప్ప వెయ్యినివ్వని ... (మోహన్ లాల్ 'కనుపాప' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5
-----జోశ్యుల సూర్య ప్రకాష్

ఒక భాషలో హిట్టైన చిత్రాన్ని రీమేక్ చేయటానికి సాధారణంగా ప్రయత్నాలు చేస్తూంటారు. అయితే ఒరిజనల్ లోని మ్యాజిక్ ని తిరిగి రీక్రియేట్ చేయలేమని భావించినప్పుడు డబ్బింగ్ చేసి విజయం సాధిస్తూంటారు. ముఖ్యంగా కంప్లీంట్ యాక్టర్ మోహన్ లాల్ వంటి హీరోలు సినిమాల అయితే అంత అద్బుతమైన నటన చూపించటం కష్టమనిపిస్తుంది. అందుకే డబ్బింగ్ చేయాల్సిందే..వేరే ఆప్షన్ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునో మరేమో కానీ మోహన్ లాల్ రీసెంట్ సూపర్ హిట్ 'ఒప్పం' ని...తెలుగులో 'కనుపాప' టైటిల్ తో డబ్ చేసి మన ముందుకు తీసుకు వచ్చారు.

ఈ మధ్యకాలంలో వరసగా మోహన్ లాల్ తెలుగులో మనమంతా, జనతాగ్యారేజ్ చిత్రాలు చేసారు. అలాగే ఆయన నటించిన పులి మురగన్ చిత్రం మన్యం పులిగా డబ్బింగై ఇక్కడా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా పై మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.

అయితే డబ్బింగ్ వేరే బాషలో హిట్టైన సినిమాలన్నీ ఇక్కడ అదే స్దాయిలో ఆడాలని లేదు. దాంతో ఈ కనుపాప చిత్రం ఏ స్దాయిలో ఇక్కడ విజయం సాధిస్తుంది అనే విషయమై అందరిలో ట్రేడ్ లో రకరకాల లెక్కలు, అంచనాలు ఉన్నాయి. వాటిని నిజం చేస్తుందా. అక్కడమళయాళంలో హిట్ అయిన రేంజిలో మన దగ్గర వర్కవుట్ అవుతుందా... అసలు సినిమా కథ ఏంటి...తెలుగు వాళ్లకు ఎక్కుతుందా అనే విషయాలు క్రింద రివ్యూలో చూద్దాం.

 లిప్ట్ ఆపరేటర్ జయరామ్ ...

లిప్ట్ ఆపరేటర్ జయరామ్ ...

థ్రిల్లర్ కథాంశం కాబట్టి కథని ఎక్కువ రివీల్ చేయలేము...కనుపాప చిత్రం ఓ అంధుడైన జయరామ్ (మోహన్ లాల్) చుట్టూ తిరుగుతుంది. లిప్ట్ ఆపరేటర్ గా పనిచేసే జయరామ్ ...తనకు దృష్టి లేకపోయినా తన కాన్సర్టేషన్, తన మిగతా సెన్సెస్ ని బట్టి కళ్లున్నవాళ్ల కన్నా చక్కగా తన పనులే కాక మిగతా పనులన్ని చేస్తూంటాడు.

క్రిమినల్ కోసం..

క్రిమినల్ కోసం..

రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జి (నెరుముడి వేణు) మన హీరో జయారామ్ పనిచేసే పోష్ అపార్టమెంట్ కాంప్లెక్స్ లోనే ఉంటూంటాడు. జయరామ్ ని నమ్మి తన జీవితానికి సంభందించిన కొన్ని రహస్యాలను షేర్ చేసుకుంటూంటాడు ఆ జడ్జి. ఆయన ఓ వాసు దేవ్ అనే క్రిమినల్ కోసం అన్వేషణ కొనసాగిస్తూంటాడు.

 కథలో మొదటి మలుపు

కథలో మొదటి మలుపు


అయితే ఈ లోగా ఆ సిటీలో కొన్ని మర్డర్స్ జరుగుతాయి. అవన్ని సిమిలర్ గా ఉన్నాయని,వాటికి ఏదో లింక్ ఉందని పోలీస్ డిపార్టమెంట్ లో అనుమానిస్తూంటారు. ఈ లోగా ఆ అపార్టమెంట్ లో ఓ వివాహ నిశ్చితార్దం జరుగుతూండగా... ఆ జడ్జి హత్య చేయబడతాడు.

 జయరామ్ ఫస్ట్ సస్పెక్ట్

జయరామ్ ఫస్ట్ సస్పెక్ట్


అంధుడైన జయరామ్ ...ఎలర్టై ఆ జడ్జి గదిలోకి వెళ్ళేసరికే... ఆ హంతకుడు (సముద్రఖని) దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. ఈ లోగా పోలీస్ లు వస్తారు. జయరామ్ నిఆ హత్యకేసులో ప్రధమ నిందితుడుగా అనుమానిస్తారు.

 మరో మర్డర్ కోసం..

మరో మర్డర్ కోసం..


అక్కడ నుంచి పిల్లి, ఎలుకా గేమ్ లాంటి ది స్టార్ట్ అవుతుంది. జయరామ్ తన నిర్దోషత్వం ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. మరో ప్రక్క ఆ హంతకుడు జయరామ్ నుంచి ఓ ఇన్ఫర్మేషన్ లాగి, మరో మర్డర్ చేయాలని ప్రయత్నం చేస్తూంటాడు. ఆ మర్డర్ చేద్దామనుకునేది మరెవరినో కాదు..జయరామ్ ప్రాణంగా భావించే ఓ చిన్నారి పాపది.

 చక్కటి చిక్కటి మిస్టరీ...

చక్కటి చిక్కటి మిస్టరీ...

ఇంతకీ జయరామ్ కు ఆ చిన్నారి పాపకు ఉన్న రిలేషన్ ఏమిటి..జడ్జి మర్డర్ కేసుకు ఈ కథకు లీడ్ ఏంటి..జడ్జి మర్డర్ కేసులో ఫ్రేమ్ చేయబడ్డ జయరామ్ తప్పించుకోగలడా..అసలు ఏం జరిగింది. ఆ హంతకుడు అసలు మోటో ఏంటి...చివరకు హంతకుడు ఎలా జయరామ్ చేతికి చిక్కాడు వంటి విషయాలు తెలియాలంటే చక్కటి చిక్కటి మర్డర్ మిస్టరీనీ చూడాల్సిందే.

 ఫెరఫెక్టే కానీ..

ఫెరఫెక్టే కానీ..

మోహన్ లాల్, ప్రియదర్శన్ కాంబినేషన్ లో చాలా హిట్స్ వచ్చాయి. దాంతో ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుందామనుకున్నట్లుగా కాకుండా మంచి ఇంట్రస్టింగ్ ప్లాట్ తో మన ముందుకు రావటం జరగింది. అయితే స్లో నేరేషన్ తో కథ,కథనం నడవటం ఎమోషనల్ ప్లాట్ కు ఫెరఫెక్టే కానీ తెలుగులో ఇలాంటి థ్రిల్లర్స్ బాగా తక్కువ కావటంతో కాస్త కొత్తగానూ, స్లో గానూ ఉన్నట్లు అనిపిస్తుంది.

అందుకే అంత గొప్ప దర్శకుడు

అందుకే అంత గొప్ప దర్శకుడు

ఇక ఈ సినిమాలో చాలా హైలెట్ సీన్స్ ఉన్నాయి. అవన్నీ మోహన్ లాల్ నటనను బేస్ చేసుకుని రాసుకుున్న సీన్స్ . ముఖ్యంగా ఓ సీన్ లో లిప్ట్ లో మర్డరర్ ఉన్నట్లు జయరామ్ సెన్స్ చేసే సీన్, అలాగే ఇంటర్వెల్ సీన్ అద్బుతమనిపిస్తాయి. ప్రియదర్శన్ ఎందుకు అంత గొప్ప దర్శకుడు అయ్యారో ఆ సీన్స్ ని చూస్తే అర్దమవుతుంది.

 దృశ్యం సినిమా గుర్తుకు

దృశ్యం సినిమా గుర్తుకు

మోహన్ లాల్, మీనా కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన దృశ్యం ఛాయిలు సినిమాలో కొన్ని చోట్ల కనిపిస్తాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ చూస్తూంటే మళ్లీ దృశ్యం చూస్తున్నామా అనిపిస్తుంది. ప్రియదర్శన్ వంటి దర్శకుడు అలాంటి సీన్స్ చేసేటప్పుడు ఎందుకు ఆ ఛాయిలు రాకుండా జాగ్రత్తుల తీసుకోలేదా అనిపిస్తుంది. అయితే సినిమా లో ఆ సీన్ ని మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావటం ఖాయం.

 సినిమాటోగ్రఫీ, బిజిఎం

సినిమాటోగ్రఫీ, బిజిఎం

సినిమా టెక్నికల్ గా చాలా సౌండ్ గా ఉంది. సినిమోటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని సెట్ చేస్తూ సాగాయి. హీరోకి, విలన్ కు మధ్య సాగే హైడ్ అండ్ సీక్ అన్నట్లుగా సెకండాఫ్ లో సాగే సీన్స్ లో టెంపోని పెంచటంలో సాయిపడ్డాయి.

 చిన్నమ్మా పాట బాగుంది

చిన్నమ్మా పాట బాగుంది


పాటలు విషయానికి వస్తే.. తొలిపాట చిన్నమ్మా ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్టైంది. సినిమాలో ఆ పాటకు చూపిన విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇనిస్టెంట్ హిట్ అన్నట్లుగా ఆ పాట చూడగానే అనిపిస్తుంది. పాటలు రాసిన వాళ్లు కాడా చాలా బాగా రాసారు. పాటల రచయిత అనంత శర్మ కూడా ఎక్కడా డబ్బింగ్ అనిపించకుండా పాటలు తెలుగు నేటివిటీ కి తగ్గట్లు గా రాసారు. డబ్బింగ్ డైలాగులు కూడా బాగా కుదిరాయి. అలాగే మోహన్ లాల్ కు డబ్బింగ్ చెప్పిన శ్రీనివాస మూర్తి కూడా తన గొంతుతో సినిమాకు టెంపో తెచ్చారు.

 పోటాపోటీగా

పోటాపోటీగా

జాతీయ అవార్డ్ విన్నింగ్ నటుడు సముద్ర ఖని సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించాడు అనటం కన్నా జీవించాడు అనటం మేలు. కీలకమైన సన్నివేశాల్లో తప్ప మిగతా చోట్ల పెద్దగా కనపడకపోయినా, లిమిటెడ్ స్క్రీన్ ప్రెజన్స్ ఉన్నా దుమ్ము రేపాడు. నందినిగా చేసిన బేబి మీనాక్షి కూడా ఈ సినిమాకు ఎస్సెట్. మోహన్ లాల్ గురించి కొత్తగా చెప్పేదేముంది

 ఈ సినిమా కు చేసిందెవరంటే..

ఈ సినిమా కు చేసిందెవరంటే..


బ్యానర్ :ఓవ‌ర్ సీస్ నెట్ వ‌ర్క్ ఎంట‌ర్ టైన్మెంట్
నటీనటులు :మోహ‌న్ లాల్, బేబీ మీనాక్షి, విమ‌లా రామ‌న్, అనుశ్రీ, స‌ముద్ర‌ఖ‌ని, నేడుముడి వేణు, రేన్జి ప‌ణిక్క‌ర్, చెంబ‌న్ వినోద్ జోష్ త‌దిత‌రులు
కథ : గోవింద్ విజ‌య‌న్,
సంగీతం :4 మ్యూజిక్ ( ఎల్దోస్, జిమ్, బిబీ, జ‌స్టిన్)
పాటలు : వెన్నెల‌కంటి, వ‌న‌మాలి, అనంత శ్రీరామ్,
డైలాగ్స్ : ఎం.రాజ‌శేఖ‌ర్ రెడ్డి,
సినిమాటోగ్రాఫ‌ర్ :ఎన్.కె.ఏకాంబ‌రం,
ఎడిటింగ్ : ఎం.ఎస్.అయ్య‌ప్ప‌న్ నాయ‌ర్,
నిర్మాత : మోహ‌న్ లాల్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : శ్రీనివాస మూర్తి నిడ‌ద‌వోలు,
స‌మ‌ర్ప‌ణ‌: దిలీప్ కుమార్ బొలుగోటి
స్క్రీప్లే,డైరెక్ష‌న్ :ప్రియ‌ద‌ర్శ‌న్.

ఫైనల్ గా ఈ సినిమా రొటీన్, రెగ్యులర్ సినిమాలు చూడాలని అనుకునేవాళ్ల కోసం మాత్రం కాదు. ఓ విభిన్నమైన కథా చిత్రం, అదీ మంచి విజువల్స్ తో ,అత్యుత్తమమైన నటనతో,మిగతా విభాగాల సమన్వయంతో చూడాలనుకునేవాళ్లకోసం..అలాంటి ఎంత మంది సినీ లవర్స్ ఉన్నారు అనే దానిపై ఈ చిత్రం విజయం ఆధారపడుతుంది.

English summary
Kanupapa is based on a script which is fine at best. But it is the slick presentation and of course, a brilliant performance from Mohanlal that overcomes its minor weaknesses. That could be a reason enough to buy a ticket for this one.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu