»   » మామ్ సినిమా రివ్యూ: అమ్మ ప్రేమకు ప్రతిరూపం

మామ్ సినిమా రివ్యూ: అమ్మ ప్రేమకు ప్రతిరూపం

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Rating:
  3.0/5
  Star Cast: శ్రీదేవి, అక్షయ్ ఖన్నా, అద్నాన్ సిద్ధిఖీ
  Director: రవి ఉద్యవార్

  సిల్వర్ స్క్రీన్‌పై గ్లామర్, యాక్టింగ్‌తో ఆకట్టుకున్న అద్భుతమైన నటి శ్రీదేవి అంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. తన 53 ఏళ్ల వయసులో శ్రీదేవి నట జీవితం 50 ఏళ్లు. మూడేళ్ల వయసులో 1967 జూలై 7వ తేదీన శ్రీదేవి తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఐదు దశాబ్దాలపాటు వెండితెర దేవతగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకొన్నారు. బాలీవుడ్ నిర్మాత బోనికపూర్‌తో వివాహం తర్వాత కొన్ని సంవత్సరాలు నటజీవితానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పిన శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించింది.

  MOM movie review: Sridevi performance, gripping story makes worth watch

  50 ఏళ్ల నటప్రస్థానాన్ని పురస్కరించుకొని శ్రీదేవి భావోద్వేగమైన కథతో మామ్‌గా జూలై 7వ తేదీన మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మామ్ చిత్రం శ్రీదేవికి 300వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో మానసిక సంఘర్షణ గురైన తల్లి పాత్రను ధరించింది. భర్త బోని నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకొన్న ఈ చిత్రంలో శ్రీదేవి ప్రేక్షకులను ఏలా మెప్పించింది అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  భావోద్వేగమైన కథ ఇది..

  భావోద్వేగమైన కథ ఇది..

  దేవిక (శ్రీదేవి) ఢిల్లీలోని ఓ స్కూల్‌లో టీచర్. సవతి తల్లి అయిన దేవకి అంటే కూతురు ఆర్య సభర్వాల్ (సజల్ అలీ)కు ఇష్టముండదు. తల్లిగా ఆమెను అంగీకరించదు. ఇద్దరి మధ్య ఓ రకమైన విభేదాలు ఉంటాయి. ఈ క్రమంలో వాలైంటైన్స్ డేను పురస్కరించుకొని ఓ ఫామ్ హౌస్‌లో జరిగే పార్టీకి ఆర్య వెళ్తుంది. ఆ పార్టీలో నుంచి ఆర్యను జగన్ (అభిమన్యు సింగ్) గ్యాంగ్ (మరో ముగ్గురు) ఎత్తుకెళ్లి కారులో సామూహిక మానభంగం చేస్తారు. తన కూతురుకు జరిగిన దారుణాన్ని చూసిన దేవకి తీవ్రమైన భావోద్వేగానిక గురవుతుంది. పోలీసుల కేసు నమోదు, కోర్టు విచారణలో తప్పుడు సాక్ష్యాలతో నిందితులు కేసును సురక్షితంగా తప్పించుకొంటారు.

  దారుణానికి గురైన కూతురికి..

  దారుణానికి గురైన కూతురికి..

  అన్యాయానికి గురైన కూతురికి న్యాయం జరుగుతుందని భావించిన దేవకి కుటుంబం ఊహించని షాక్ గురవుతుంది. ఆ పరిస్థితుల్లో దేవకి కుటుంబం ఎలా రియాక్టైంది? నిందితులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది. లైంగిక దాడి దారుణానికి గురైన ఆర్య పరిస్థితి ఏమిటి? ఆర్యపై దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులపై దేవకి ఏమి చేసింది. తన పగ, ప్రతీకారంలో డీకే (నవాజుద్దీన్ సిద్ధిఖీ) ఎలా

  తోడ్పాటునందించాడు. ఈ కథలో సీబీఐ అధికారి ఫ్రాన్సిస్‌గా నటించిన అక్షయ్ ఖన్నా పాత్ర ఏమిటి. భావోద్వేగమైన కథకు దర్శకుడు రవి ఉద్యవార్ ఎలాంటి ముగింపు ఇచ్చాడు. దేవకిని ఆర్య అమ్మా అని పిలువడానికి దారితీసిన పరిస్థితులేంటి అనే ప్రశ్నలకు సమాధానమే మామ్ చిత్ర కథ.

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

  మామ్ చిత్ర తొలిభాగంలో దేవకి, ఆర్య, ఇతర పాత్రల పరిచయంతో సాగుతుంది. ఆర్య, దేవకి మధ్య సంఘర్షణ. సవతి తల్లిని ఆర్య అమ్మగా గుర్తించపోయే విధానంతో ఆకట్టుకొన్నాడు. ఇక ఆర్య లైంగిక దాడి ఘటన నుంచి కథలో వేగం పెరుగుతుంది. భావోద్వేగమైన సన్నివేశాలను హృదయాన్ని పిండేస్తాయి. తొలిభాగంలో ఆర్య, దేవకి పడే మానసిక సంఘర్షణ ప్రేక్షకుడిని ఆవేదనకు గురిచేస్తాయి. కోర్టులో న్యాయం జరుగుతుందని భావించిన బాధిత దేవకి కుటుంబానికి చుక్కెదురు కావడమనే అంశం న్యాయ, పోలీసు వ్యవస్థల తీరుపై ప్రేక్షకుడిని ఆలోచింపచేస్తుంది. వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయిన దేవకి.. తన కూతురికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకోవడంతో ఇంటర్వెల్ పడుతుంది.

  సెకండాఫ్‌ కథనం ఇలా..

  సెకండాఫ్‌ కథనం ఇలా..

  రెండో భాగంలో పగ, ప్రతీకారం లక్ష్యంగా కథను ఎలా ముగిస్తాడు అనే అంశంపై ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది. ఊహించిన కథ ఎలా మలుపులు తిరుగుతుందనే విషయంలో ప్రేక్షకుడు కథలో లీనమవుతాడు. దారుణమైన దాడికి గురైన కూతురికి న్యాయం చేయడానికి ఎలాంటి ఎత్తులు వేసింది. దేవకి చేసిన సాహసాన్ని దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించాడు. భావోద్వేగమైన కథకు చక్కటి ముగింపునిచ్చి దర్శకుడు శెభాష్ అనిపించుకొన్నాడు. రెండో భాగంలో కథలో వేగం తగ్గడం, ప్రతీకారం తీర్చుకొనే అంశాలు మరింత థ్రిల్లింగ్‌గా లేకపోవడం లోపాలుగా అనిపించినా అవేమీ కథ వేగానికి కళ్లెం వేయకపోవడం పాజిటివ్ అంశం

  దర్శకుడి ప్రతిభ అమోఘం..

  దర్శకుడి ప్రతిభ అమోఘం..

  మామ్ చిత్ర కథను చూస్తే ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను గుర్తు చేస్తుంది. ఆ దారుణ సంఘటనను కథగా ఎంచుకొని దానికి భావోద్వేగాలు జోప్పించడంలో దర్శకుడు రవి చక్కటి పరిణతిని ప్రదర్శించాడు. రవికి మామ్ తొలి చిత్రమైన ఎక్కడ తడబాటుకు గురికాకుండా చక్కగా తెరకెక్కించాడు. తల్లిగా శ్రీదేవి పడిన మానసిక సంఘర్షణను అద్భుతంగా చిత్రీకరించాడు. శ్రీదేవిలో నటనను రాబట్టడానికి చక్కటి సన్నివేశాలను అల్లుకొని కథకు న్యాయం చేకూర్చాడు. టోటల్‌గా మామ్‌ను ఎమోషనల్ మూవీగా రూపొందిచడంలో వంద శాతం సక్సెస్ అయ్యాడు.

  శ్రీదేవి అద్భుత నటన

  శ్రీదేవి అద్భుత నటన

  ఇక దేవకి పాత్రలో శ్రీదేవి నటన ఈ సినిమాకే హైలెట్. 300 చిత్రాల్లో నటించి వెండితెర దేవతగా ఎందుకు కీర్తించబడిందో మామ్ చూస్తే మరోసారి అర్థమవుతుంది. సవతి తల్లిగా ఓ పాజిటివ్ పాత్రను అద్భుతంగా పోషించింది. కూతురికి ప్రేమను పంచాలని పడే పాత్రలో ఆమె నటన మరోస్థాయికి తీసుకెళ్లింది. ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే మహిళ పాత్రలో చక్కగా రాణించింది. కొన్ని సందర్భాల్లో ఆమె నటన రోమాలు నిక్కపొడుస్తాయి. కంటతడి పెట్టిస్తాయి. ప్రేమను పంచే తల్లిగా, ప్రతీకారం తీర్చకొనే సమయంలో కాళికాదేవిగా కనిపిస్తుంది. శ్రీదేవి నటనలో ఫర్‌ఫెక్షన్‌ను చూడటానికి మామ్ చక్కటి అవకాశం.

  మెప్పించిన సజల్ అలీ

  మెప్పించిన సజల్ అలీ

  శ్రీదేవి కూతురిగా ఆర్య పాత్రలో పాకిస్థానీ నటి సజల్ అలీ నటించింది. కీలక సన్నివేశాల్లో ఆర్య పాత్రకు సజల్ ప్రాణం పోసింది. ఆర్యగా ఆమె చాలా ఫ్రెష్‌గా కనిపించింది. లైంగిక దాడి ఘటన తర్వాత వచ్చే సన్నివేశాల్లో ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసే విధంగా నటించి మెప్పించింది. సజల్ యాక్టింగ్ ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించిందని చెప్పవచ్చు.

  పర్వాలేదనిపించిన అద్నాన్

  పర్వాలేదనిపించిన అద్నాన్

  శ్రీదేవి భర్తగా పాకిస్థాని నటుడు అద్నాన్ సిద్ధిఖీ నటించాడు. కూతురుకు జరిగిన అన్యాయానికి వేదనకు గురైన తండ్రిగా చక్కగా నటించాడు. ఈ సినిమాకు దేవకి, ఆర్య పాత్రలకు సపోర్ట్ నిలిచాడు. కోర్టు సన్నివేశాలు, మరికొన్ని సన్నివేశాలో మెరుగైన ప్రతిభను కనబరిచాడు.

  నవాజ్ మరోసారి మెరుపులు

  నవాజ్ మరోసారి మెరుపులు

  మామ్ చిత్రంలో శ్రీదేవి పాత్ర తర్వాత గొప్పగా చెప్పుకొనే పాత్ర నవాజుద్దీన్ సిద్ధిఖీ. డీకే పాత్రను తినిపడేశాడు. తనదైన శైలిలో యాక్టింగ్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాడు. పాత్ర కోసం తన గెటప్ మార్చుకోవడం ఆయన నిబద్దతకు అద్దం పట్టింది. ఈ చిత్రంలో ఏ సన్నివేశంలో నవాజుద్దీన్ ఎక్కడ కనిపించడు. కేవలం డీకే పాత్రనే కనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత డీకే పాత్ర వెంటాడం ఖాయం.

  అభిమన్యు మరోసారి పవర్ ఫుల్

  అభిమన్యు మరోసారి పవర్ ఫుల్

  విలన్‌గా అభిమన్యు సింగ్‌ది ప్రత్యేకమైన శైలి. రక్త చరిత్ర, గబ్బర్ సింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. మామ్ చిత్రంలో జగన్ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషించాడు. పాత్ర నిడివి పరిమితమైనా చాలా ప్రభావవంతమైన పాత్ర. ఆయన పాత్ర చుట్టే కథ తిరుగుతూ ఉండటంతో అభిమన్యు పాత్రకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. తనకు దక్కిన పాత్రకు అభిమన్యు పూర్తిగా న్యాయం చేశాడు.

  అక్షయ్ ఖన్నా సీరియస్ లుక్స్

  అక్షయ్ ఖన్నా సీరియస్ లుక్స్

  అక్షయ్ ఖన్నా చాలా రోజుల తర్వాత మామ్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. ఇన్వెస్టిగేషన్ అధికారిగా సీరియస్ లుక్స్ పాత్రకు వన్నెతెచ్చాయి. ఫ్రాన్సిస్ పాత్రకు అక్షయ్ జీవం పోశాడు. ప్రధాన సన్నివేశాల్లోనూ, క్లైమాక్స్‌లోనూ గుర్తుండిపోయే నటనను ప్రదర్శించాడు.

  అదరహో ఏఆర్ రెహ్మాన్

  అదరహో ఏఆర్ రెహ్మాన్

  మామ్ సినిమాకు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించాడు. రెహ్మాన్ సంగీతం లేకుంటే ఈ సినిమాను ఊహించలేం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఆయన అందించిన మ్యూజిక్ కథకు జీవం పోసింది. బ్యాక్ గ్రౌండ్‌లో పాటలు ఉద్వేగానికి గురిచేస్తాయి. మామ్ చిత్రానికి రెహ్మాన్ ఓ అసెట్ అని చెప్పవచ్చు.

  ఆడపిల్ల బాగోగులను ఆకాక్షించే

  ఆడపిల్ల బాగోగులను ఆకాక్షించే

  ప్రస్తుతం ఏ టెలివిజన్ చూసినా, పేపర్ తిరిగేసినా మహిళలపై యాసిడ్ దాడులు, లైంగిక దాడులు, సామూహిక మానభంగాలు ప్రతినిత్యం కనిపిస్తాయి. ఈ క్రమంలో ఓ ఆడపిల్ల తల్లి పడే ఆవేదనను ఈ చిత్రం గుర్తు చేస్తుంది. తన పిల్లలు దారుణాలకు గురికాకుండా చర్యలు తీసుకోవడానికి ఈ సినిమా చక్కటి ఉదాహరణ. కేవలం తల్లికే కాదు.. బాధ్యతాయుతమైన తండ్రికి, అంతా మాకు తెలుసు అనుకొనే ఆడపిల్లలకు ఈ చిత్రం చక్కటి మార్గదర్శకం.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్
  కథ, కథనం
  శ్రీదేవి, నవాజుద్దీన్, సజల్ అలీ, అక్షయ్ ఖన్నా నటన
  ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్
  డైరెక్టర్ రవి ప్రతిభ
  బోని కపూర్ నిర్మాణ విలువలు

  మైనస్ పాయింట్స్

  సెకండాఫ్‌లో కథావేగం మందగించడం
  ప్రతీకార అంశాలు థ్రిల్‌‌కు గురిచేయకపోవడం
  కమర్షియల్ అంశాలు లేకపోవడం

  తెర ముందు.. తెర వెనుక

  తెర ముందు.. తెర వెనుక

  నటీనటులు: శ్రీదేవి, సజల్ అలీ, నవాజుద్దీన్ సిద్దిఖీ, అక్షయ్ ఖన్నా, అభిమన్యు సింగ్, అద్నాన్ సిద్దిఖీ

  దర్శకత్వం: రవి ఉద్యవార్
  నిర్మాత: బోనికపూర్
  కథ: రవి ఉద్యవార్, గిరిష్ కోహ్లి, కోన వెంకట్
  సంగీతం: ఏఆర్ రెహ్మన్
  ఫొటోగ్రఫి: అనయ్ గోస్వామి
  సౌండ్ డిజైనర్: నిహర్ రంజన్ సమల్
  సినిమా నిడివి 2 గంటల 27 నిమిషాలు

  English summary
  MOM is 300th movie for actor Sridevi. She completed 50 years in film industry. She started her career in 1967 July 7th when she was three years old. So this is a special movie for silver screen diva. This movie directed by Ravi udyawar, music by AR Rahman.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more