For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మిస్టర్ మజ్ను మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |
  Mr Majnu Movie Review మిస్టర్ మజ్ను మూవీ రివ్యూ | Filmibeat Telugu

  Rating:
  2.5/5
  Star Cast: అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్, హైపర్ ఆది, ప్రియదర్శి, నాగబాబు
  Director: వెంకీ అట్లూరి

  అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని, తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో మిస్టర్ మజ్ను చిత్రం విడుదలకు సిద్ధమైంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, తమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 25న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. తొలిప్రేమ తర్వాత వస్తుండటంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్‌కు సక్సెస్ లభించిందా? వెంకీ అట్లూరి ద్వితీయ విఘ్నాన్ని అధిగమించారా? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా కథ, కథనాలను సమీక్షించాల్సిందే..

   మిస్టర్ మజ్ను కథ

  మిస్టర్ మజ్ను కథ

  విక్కి (అఖిల్ అక్కినేని) అమ్మాయిలతో నిత్యం జల్సా చేసే ప్లేబాయ్. అలాంటి అబ్బాయితో నిక్కి (నిధి అగర్వాల్) లండన్‌లో పరిచయం జరుగుతుంది. తన లైఫ్‌ స్టయిల్, ప్రవర్తన చూసి మొదట ఏవగించుకుంటుంది. ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్‌లో నిక్కీ గురించి తెలుసుకొన్న తర్వాత విక్కీతో నిక్కి ప్రేమలో పడుతుంది. కానీ ప్రేమ పేరుతో విసిగించడాలు నచ్చక నిక్కీ ప్రేమను రిజెక్ట్ చేస్తాడు?

  కథలో మలుపులు

  కథలో మలుపులు

  దాంతో నిక్కీ లండన్‌కు వెళ్లిపోతుంది? నిక్కి లేనిలోటుతో తాను ఏం కోల్పోయాడో విక్కీ తెలుసుకొంటాడు. నిక్కిపై తనలో ఎంత ప్రేమ ఉందో రియలైజ్ అవుతాడు? నిక్కి ప్రేమను గెలుచుకోవడానికి విక్కీ లండన్ చేరుకొంటాడు? లండన్‌లో నిక్కి ప్రేమను ఎలా గెలుచుకొన్నాడు? ఈ కథలో జయప్రకాశ్, నాగబాబు, సుబ్బరాజు, ప్రియదర్శి, హైపర్ ఆది పాత్రలు ఏంటనే అనే సింపుల్ ప్రశ్నలకు సమాధానమే మిస్టర్ మజ్ను సినిమా కథ.

  ఫస్టాఫ్‌ అనాలిసిస్

  ఫస్టాఫ్‌ అనాలిసిస్

  లండన్‌‌లో చదువుకునే విక్కిని ప్రిన్స్‌‌పాల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేసే అంశంతో కథ ప్రారంభమవుతుంది. ప్రొఫెసర్ కూతురుతో బెడ్ రూంలో దొరకడం, దానిపై విచారణకు హాజరవుతాడు. ఆ సమయంలో ఏకంగా కాలేజీ లీగల్ ఆఫీసర్‌ను నిక్కీ బుట్టలో పడేయడమనే పాయింట్‌తో అతడి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌ చేసి కథలోకి వెళ్తాడు. ఆ సమయంలోనే అనుకోకుండా విక్కి గురించి నిక్కికి తెలుస్తుంది. అతడి ప్రవర్తనపై అసహ్యించుకొని ద్వేషం పెంచుకొంటుంది. ఆ తర్వాత విక్కి చెల్లెలితో నిక్కి సోదరుడికి వివాహం అవ్వడం కథలో రొటిన్ పాయింట్‌గా కనిపిస్తుంది. పెళ్లి సందర్బంగా జరిగిన ఓ కీలకమైన అంశం విక్కిపై నిక్కి ప్రేమను పెంచుకొంటుంది. ఆ తర్వాత రెండు నెలల గడువు పెట్టుకొని ప్రేమ పరీక్ష పెట్టుకొంటారు. కానీ ఏ కోణంలోనూ నిక్కిపై ప్రేమ కలగకపోవడంతో తన ప్రేమను విక్కి రిజెక్ట్ చేస్తాడు. దాంతో తొలిభాగం ముగుస్తుంది. కొన్ని ఫీల్‌గుడ్ అంశాలు, ప్రియదర్శి కామెడీ సినిమాపై కొంత పాజిటివ్‌గా మారుతాయి.

   సెకండాఫ్‌ అనాలిసిస్

  సెకండాఫ్‌ అనాలిసిస్

  ఇక రెండో భాగంలో లండన్‌లో నిక్కీ ప్రేమను గెలుచుకోవడానికి విక్కి చేసే ప్రయత్నాలు. అలాగే సుబ్బరాజు కుటుంబం చుట్టు తిరిగే అంశాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సెకండాఫ్‌లో కథ చెప్పే ప్రయత్నంలో దర్శకుడు వెంకీ అట్లూరి తడబాటు కనిపిస్తుంది. సెకండాఫ్‌లో హైపర్ ఆది పేలకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. అలాగే చిన్న పిల్లాడితో కార్టూన్ క్యారెక్టర్‌ను సృష్టించి కామెడీ పండించడానికి చేసిన ప్రయత్నం కొంత హాస్యాన్ని పండించిన కథలో ఉండే ఎమోషన్‌ను ఎత్తి పారేసినట్టు అనిపిస్తుంది. సినిమాకు కీలకమైన రెండో భాగాన్ని ఫీల్‌గుడ్‌గా మలచకపోవడంతో కథ తెలిపోయినట్టు అనిపిస్తుంది. పెద్దగా భావోద్వేగాలు లేకుండా హీరో, హీరోయిన్ల మధ్య సయోధ్యను కుదర్చడంతో కథ చాలా రొటీన్‌గా ముగుస్తుంది.

  దర్శకుడి ప్రతిభ

  దర్శకుడి ప్రతిభ

  వరుణ్ తేజ్‌తో తీసిన తొలిప్రేమకు మంచి రెస్పాన్స్ రావడంతో దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన రెండో చిత్రం మిస్టర్ మజ్నుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా బ్రేకప్‌కు, హార్ట్ బ్రేకప్‌కు తేడా చెప్పడానికి అల్లుకొన్న కథ, కథనాలు నాసిరకంగా కనిపిస్తాయి. అదే సినిమాకు ప్రతికూలంగా మారింది. అఖిల్‌కు తప్పనిసరి హిట్ అందించాల్సిన ఒత్తిడి కూడా వెంకీ ఉండటం వలన సేఫ్ గేమ్ ఆడారనిపిస్తుంది. అయితే తొలి భాగంలో కథ, కథనాలు ఫర్వాలేదనిపిస్తాయి. కొన్ని బలమైన సీన్లు, ఫీల్‌గుడ్, ఎమోషనల్ సన్నివేశాలు రాసుకొని ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా మారేది. అలాగే సెకండాఫ్‌లో కథ తేలిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే సెకండాఫ్‌ తర్వాత డెస్టినేషన్ ఏంటో సాధారణ ప్రేక్షకుడికి సులభంగా అర్ధమవుతుంది. అలాంటి సమయంలో ట్విస్టులు, ఎమోషనల్ సీన్లతో కథ చెప్పి ఉంటే సినిమాకు అదనపు ఆకర్షణగా మారి ఉండేది. అలా కాకుండా అటు ఎమోషనల్ కంటెంట్‌ను, ఇటు కామెడీ అంశాలను పూర్తిగా పట్టుకోలేక కన్‌ఫ్యూజన్‌కు గురయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది.

  అఖిల్ పెర్ఫార్మెన్స్

  అఖిల్ పెర్ఫార్మెన్స్

  అఖిల్‌లో అర్భన్ లుక్‌ బాగుంది. పాత్ర తగినట్టు స్టయిల్, మేకోవర్ అన్ని చక్కగా కుదిరాయి. కాకపోతే నటనపరంగా ఇంకా కొన్ని సమస్యలు కనిపించాయి. కథ, కథనాలు, సన్నివేశాలు బాగా లేకపోవడం వల్ల అఖిల్ ప్రతిభ బయటకు రాలేదా అనేది మరోసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి కనిపించింది. పాటలు, ఫైట్స్ బాగా చేసినప్పటికీ ‌సినిమాను సక్సెస్ దారికి మళ్లించలేకపోయాడు అఖిల్. మూడో సినిమా తర్వాత కూడా అఖిల్ పరిస్థితి క్రాస్‌రోడ్‌కే పరిమితమయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  నిధి అగర్వాల్ యాక్టింగ్

  నిధి అగర్వాల్ యాక్టింగ్

  నిధి అగర్వాల్‌కు మిస్టర్ మజ్ను కొంత నిరాశను కలిగించే ఫలితమే. తన పాత్ర పరిధి మేరకు ఫర్యాలేదనిపించింది. కానీ నిక్కి పాత్రకు నిధి కరెక్ట్ కాదని విషయం కొన్ని సీన్లు చెప్పకనే చెప్పాయి. బేసిగ్గా హీరోయిన్ పాత్ర విషయంలో మళ్లీ కథ, కథనాలనే తప్పు పట్టాల్సిన పరిస్థితి. గ్లామర్‌పరంగా ఆకట్టుకొన్నది. డ్యాన్సులకు పెద్దగా స్కోప్ లేకపోయింది.

  మిగితా పాత్రల్లో

  మిగితా పాత్రల్లో

  మిస్టర్ మజ్ను సినిమా విషయానికి వస్తే తెర నిండా పాత్రలు కనిపిస్తాయి. జయప్రకాశ్, నాగబాబు, రావు రమేష్, సుబ్బరాజు ఇతర పాత్రలు బాగానే ఉన్నాయి. రావు రమేష్ సీన్ బాగా ఆకట్టుకొనేలా ఉంటుంది. మిగితా పాత్రల్లో పెద్దగా ఎలివేషన్ కనిపించవు. పవిత్ర లోకేష్, సితార, విద్యుల్లేఖ పాత్రలు ఆకట్టుకోలేకపోయాయి. పాత్రల మధ్య భావోద్వేగం అంతంత మాత్రంగానే ఉన్నాయి.

   ఆది, ప్రియదర్శి కామెడీ గురించి

  ఆది, ప్రియదర్శి కామెడీ గురించి

  ఇక సినిమాలో కామెడీ విషయానికి వస్తే ప్రియదర్శి, హైపర్ ఆది కామెడీ బాగుంది. కాకపోతే పూర్తిస్థాయిలో పండలేకపోయింది. ప్రియదర్శి విషయానికి వస్తే కనిపించిన ప్రతీసారి కామెడీని పండించడమే కాకుండా కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్‌ను కూడా గుప్పించాడు. ఇక హైపర్ ఆది ఈ చిత్రంలో ఫారిన్‌లో తెలుగు సినిమాల పైరసీ చేసే పాత్రలో కనిపించాడు. అక్కడక్కడా ఆది కామెడీ పంచులు పేలాయి. పైరసీ ద్వారా సినిమాలు ఎలా చనిపోతున్నాయో అనే విషయాన్ని ఆది పాత్ర ద్వారా చెప్పడం కొంత ప్రశంసనీయం.

   తమన్ మ్యూజిక్ ఎలా ఉందంటే

  తమన్ మ్యూజిక్ ఎలా ఉందంటే

  గత కొద్దికాలంగా తమన్ వైవిధ్యమైన తన మ్యూజిక్‌తో ఆకట్టుకొంటున్నాడు. తొలిప్రేమ, అరవింద సమేత చిత్రాలతో మళ్లీ ట్రాక్ మీదకు వచ్చాడనిపించాడు. మిస్టర్ మజ్ను విషయంలో మళ్లీ ఓ అడుగు వెనక్కిపడినట్టు అనిపించింది. పాటలు ఆసక్తికరంగా లేకపోయాయి. మిస్టర్ మజ్ను పాట తప్పా మిగితా పాటలు కనీసం గుర్తు తెచ్చుకొనేలా కూడా లేకపోయాయి. కొన్ని సన్నివేశాల్లో రీరికార్డింగ్ బాగుంది.

   ఇతర సాంకేతిక విభాగాలు

  ఇతర సాంకేతిక విభాగాలు

  సాంకేతిక విభాగాల్లో నవీన్ నూలి ఎడిటింగ్ ఫర్వాలేదు. కానీ ఇంకా కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. పిల్లాడి కామెడీ ఎపిసోడ్స్ బాగానే ఉన్నప్పటికీ కథ వేగాన్ని దెబ్బతీశాయి. వాటి గురించి ఎడిటింగ్ పరంగా ఆలోచించాల్సిందే. ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అనుసరించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. లండన్ లాంటి ప్రదేశాల్లో సినిమాను చాలా రిచ్‌గా తెరకెక్కించారు. సాంకేతిక విభాగాలు, నటీనటులు ఎంపిక బాగుంది. కాకపోతే కథ, కథనాలపైనే చిన్నచూపు చూసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్‌గా తన సంస్థ బ్యానర్ ప్రమాణాలకు లోటులేకుండా సినిమాను తెరకెక్కించారు.

   ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  ప్రేమలో విఫలమైతే జరిగే బ్రేకప్‌కు, హార్ట్ బ్రేకప్‌కు తేడా పాయింట్‌‌తో తెరకెక్కిన చిత్రం మిస్టర్ మజ్ను. కథ పేలవంగా ఉండటం, కథనంలో వేగం లేకపోవడం సినిమాకు ప్రతికూలత. యూత్‌కు నచ్చే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోగలిగితే సానుకూలమైన ఫలితం వచ్చే అవకాశం ఉంది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచి అఖిల్‌ను సక్సెస్ బాట పట్టించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్
  హీరో, హీరోయిన్లు
  ప్రొడక్షన్ వ్యాల్యూస్
  సినిమాటోగ్రఫి
  రీరికార్డింగ్

  మైనస్ పాయింట్స్
  కథ, కథనాలు
  డైరెక్షన్
  పాటలు

   తెర వెనుక, తెర ముందు

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్, వీ జయప్రకాశ్, సితార, ప్రియదర్శి, హైపర్ ఆది, నాగబాబు, సుబ్బరాజు తదితరులు
  రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
  నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
  సంగీతం: ఎస్ఎస్ తమన్
  సినిమాటోగ్రఫి:
  జార్జ్ సీ విలియమ్స్
  ఎడిటింగ్: నవీన్ నూలి
  ఫైట్స్: రామ్ లక్ష్మణ్, దిలీప్
  రిలీజ్ డేట్: 2019-01-25

  English summary
  Young Tiger NTR attended for Mr Majnu pre release event as Chief guest. This movie set to release on January 25th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X