twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛార్జింగ్ తగ్గిందయా(మిస్టర్ నోకియా రివ్యూ)

    By Srikanya
    |

    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సంస్థ: శ్రీ శైలేంద్ర సినిమాస్‌
    నటీనటులు: మంచు మనోజ్‌, సనాఖాన్‌, కృతికర్బందా, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, మురళీకృష్ణ, భావన తదితరులు
    ఛాయాగ్రహణం: రాజశేఖర్
    ఎడిటింగ్ :నవీన్ కట్స్
    సంగీతం: యువన్‌శంకర్‌ రాజా
    నిర్మాత: డి.ఎస్‌.రావు
    దర్శకత్వం: అని కన్నెగంటి
    విడుదల: 08/03/2012

    ''నో క్యాప్షన్-ఓన్లీ యాక్షన్''అంటూ అర్బన్ స్టైలిష్ డ్రామాగా వచ్చిన మిస్టర్ నూకయ్య టైటిల్ కు తగ్గట్లే.. కొంత కొత్త, మరికొంత పాత అన్నట్లు సాగుతుంది. మొదట మిస్టర్ నోకియా టైటిల్ పెట్టుకుని .. ఆ తర్వాత మిస్టర్ నూకయ్య గా మారి వచ్చిన ఈ చిత్రం నేపధ్యం కొత్తదే.. ట్విస్టులు కొత్తవే. అయితేనేం రెగ్యులర్ పంధాలో హీరో ఓరియంటేషన్ తో కథ నడపాలనుకున్నప్పుడు నలిగిన కథనం తప్పదు అని నిరూపిస్తుంది. మంచు మనోజ్ తనదైన ముద్రను వేయాలని ప్రతీ విభాగంలో కొత్తదనం చూపాలని చేసిన ప్రయత్నం అభినించతగ్గదే.. కానీ అది జనాలకి నచ్చితేనే కదా ప్రయోజనం సిద్దించేది.

    సెల్ ఫోన్ దొంగ నూకయ్య(మంచు మనోజ్) డబ్బు పిచ్చి ఉన్న శిల్ప (సనాఖాన్‌)తో ప్రేమలో ఉంటాడు. పబ్ లో పనిచేసే ఆమె తనని పెళ్లిచేసుకుని సెటిల్ అవ్వాలంటే మంచి ఇల్లు, కారు వంటివి సంపాదించాలని నూకయ్య కి కండీషన్ పెడుతుంది. మరో ప్రక్క బ్యాంక్‌ మేనేజర్‌ అను (కృతికర్బందా) భర్త (రాజా) కిడ్పాప్ కి గురి అవుతాడు. కిడ్నాపర్ రెండు కోట్లు ఇచ్చి విడిపించుకెళ్లమని ఆమెకు కండీషన్ పెడతాడు. దాంతో ఏమి చేయాలో పాలుపోని ఆమె తను చేసే బ్యాంక్ లో ఆ రెండు కోట్లు నొక్కేసి తన భర్తని విడిపించుకు తీసుకెళ్దామని ప్లాన్ చేస్తుంది. కరెక్టుగా అదే సమయంలో ఆ రెండు కోట్లు విషయం తెలుసుకున్న నూకయ్య వాటిని ఆమె దగ్గర నుంచి కొట్టేస్తాడు. అప్పుడు ఏమి జరిగింది. అను తన భర్తను విడిపించుకుందా. నూకయ్య తన గర్ల్ ప్రెండ్ ని పెళ్ళిచేసుకున్నాడా.. వంటి విషయాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

    ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో నడిచే ఈ చిత్రం పూర్తిగా హీరో చుట్టూ తిరుగుతుంది కానీ చిత్రంగా హీరోయిన్ ఎవరో ఎండ్ టైటిల్స్ దాకా స్పష్టం చేయలేకపోతుంది. అలాగే హీరో కి విలన్ ఎవరో తెలిసి, ఎదుర్కొనేసరికి క్లైమాక్స్ కి వచ్చేస్తుంది. దాంతో పస లేక క్యారెక్టర్స్ , సీన్స్ వాటిష్టం వచ్చినట్లు వచ్చి వెళ్లిపోతూంటాయి కానీ కథ అంగుళం కూడా కదలదు. మినిమం ఇంటర్వెల్ కి అయినా కథలో విలన్ ఎవరో తెలిసి,హీరో ఆ సమస్యను ఛేదింటచానికి సవాల్ విసిరితే బాగుండేది. అలా కాకుండా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ని నమ్ముకుని కథని అల్లుకోవటంతో సీన్స్ లేక హీరో ప్రెండ్ వెన్నెల కిషోర్, బ్రహ్మానందం,మరో పాత్ర ఇలా వరసగా వేరే వారితో సీన్స్ వేసుకుంటా వెళ్లారు. దాంతో విలువైన స్క్రీన్ టైం విషయం లేక విసుకు తెప్పించింది. ముఖ్యంగా ఎమోషనల్ ధ్రెడ్ సినిమాలో కృత్రిమంగా ఉన్న ఫీలింగ్ వచ్చింది.

    ఇక మంచు మనోజ్ విషయానికి వస్తే... విభన్నంగా చేయాలి,తెరమీద నిరూపించుకోవాలి అనే తపన అడుగడుగునా కనపడుతూంటుంది. ముఖ్యంగా ఫైట్స్ విషయంలో అతని టాలెంట్ స్పష్పంగా కనపడుతుంది. సనాఖాన్ తన పాత్రకు గ్లామర్ అద్ది బాగానే మెప్పించింది. కృతి సినిమా మొదటి సీన్ నుంచి చివరి దాకా ఏడవటమే పనిగా ఉంది కాబట్టే ఆమెనుంచి పెద్దగా ఎక్సపెక్ట్ చేయటానికి ఏమీలేదు. ఇక వెన్నెల కిషోర్ ని కామెడీ వైపుగా పెద్దగా వినియోగించుకోలేదు. బ్రహ్మానందం ఉన్నకాసేపు బాగా నవ్చించాడు. సినిమాలో ఏకైక రిలీఫ్ ఇదే. దర్శకుడు ఎంతసేపూ స్టైలిష్ టేకింగ్ మీదే దృష్టి పెట్టాడు కాబట్టి అతనికి పెద్ద హీరోలు సినిమాలు రావచ్చు. ఇక నిర్మాతగా డిఎస్ రావు శక్తి వంచన లేకుండా బాగా ఖర్చు పెట్టి చిన్న సినిమాను పెద్ద సినిమా గా చేసిన వైనం ప్రతీ ప్రేమ్ లోనూ కనపడుతుంది. మిగతా కీ డిపార్టమెంట్ లు కెమెరా,ఎడిటింగ్ సినిమాకు బాగా సహకరించాయి. అయితే యవన్ శంకర్ రాజా సంగీతం బాగా నిరాశపరుస్తుంది. లక్ష్మీ భూపాల్ డైలాగులు అక్కడక్కడా పేలాయి.

    ఫైనల్ గా సినిమా నిలబడాలంటే కొత్తగా చూపాలన్న తాపత్రయం ఉంటే సరిపోదు...కథ,కథనం లు కూడ సవ్యమైన రీతిలో సహరించాలని ఈ సినిమా మరో సారి నిరూపిస్తుంది. మిస్టర్ నోకియా చూసాక మిమ్మల్ని మీరు రీ ఛార్జి చేసుకోవాలనిపిస్తే అది మీ తప్పు కాదు.

    English summary
    Manchu Manoj Kumar's Mr Nookayya released with divide talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X