»   » ‘నా లవ్ స్టోరీ’ రివ్యూ: కొత్తదనం లేని ప్రేమకథ

‘నా లవ్ స్టోరీ’ రివ్యూ: కొత్తదనం లేని ప్రేమకథ

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Naa Love Story Movie Review నా లవ్ స్టోరీ రివ్యూ

  Rating:
  1.5/5

  తెలుగు సినిమాల్లో అత్యధిక శాతం ప్రేమకథలను ఆధారంగా చేసుకుని వస్తున్నవే. అవి ప్రేక్షకులకు ఎక్కాలంటే అందులో నూతనత్వం తప్పనిసరి. దాంతో పాటు కట్టిపడేసే స్క్రీన్ ప్లే, యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు ఉంటేనే బాక్సాఫీసు వద్ద వర్కౌట్ అవుతాయి. ప్రతి సంవత్సరం ఎన్నో వందల ప్రేమకథా చిత్రాలు తెలుగులో విడుదవుతున్నాయి. అయితే అందులో సక్సెస్ రేటును రీచ్ అవుతున్నవి చాలా తక్కువ. ఈ క్రమంలో మరో ప్రేమకథా చిత్రం 'నా లవ్ స్టోరీ' పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నూతన నటీనటులు మహీధర్, సోనాక్షి సింగ్ రావత్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా శివ గంగాధర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ రివ్యూలో చూద్దాం...

  కథ విషయానికొస్తే....

  ప్రశాంత్ (మహీధర్) బీటెక్ పూర్తి చేసి లైఫ్ ఎంజాయ్ చేస్తూ తిరిగే కుర్రాడు. అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో తన కొడుకు జాబ్ చేయడం కంటే వయసులో ఉన్నపుడే పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేయడమే ముఖ్యం అని భావించే తండ్రి (తోటపల్లి మధు) సపోర్టు కూడా ఉండటంతో ప్రశాంత్ జీవితం మరింత జాలీగా సాగుతుంది. ఈ క్రమంలోనే వారుండే అపార్టుమెంటులోకి నందిని(సోనాక్షి సింగ్ రావత్) కుటుంబం కొత్తగా దిగుతుంది. నందిని తండ్రి (శ్రీమన్నారాయణ) మహా స్ట్రిక్ట్స్. ప్రేమ అంటనే అస్సలు పడదు. ఆడపిల్లలు పద్దతుల్లో పెరిగాలని, హద్దుల్లో ఉండాలని కోరుకునే మధ్యతరగతి మనస్తత్వం. రెండు విభిన్నమైన కుటుంబాలకు చెందిన ప్రశాంత్-నందిని మధ్య జరిగే ప్రేమకథే ‘నా లవ్ స్టోరీ'.

  కథలో ట్విస్టులు

  ఈ తరం ప్రేమల్లో కలిసి తిరగడాలు, ఎంజాయ్ చేయడాలు, పెళ్లికి ముందే అన్ని అనుభవించడాలు సర్వసాధారణం. అయితే క్రమశిక్షణ గల ఫ్యామిలీలో పెరిగిన నందినికి అలాంటివి నచ్చవు. అయితే ప్రశాంత్ అందరిలాగే మనమూ ఎంజాయ్ చేద్దామని, ఇవేవీ లేక పోతే ప్రేమించుకోవడం అనవసరం అంటూ వాదిస్తాడు. ప్రశాంత్ వాదనతో నందిని విబేధించడంతో ఇద్దరి రిలేషన్ బ్రేకప్ అవుతుంది. చివరకు ఈ ఇద్దరు ఎలా ఒక్కటయ్యారు? అనేది మిగతా కథ.

  టెక్నికల్ అంశాలు

  ఈ చిత్రానికి వై.ఇ. కిరణ్ అందించిన సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. వేద నివాస్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నందమూరి హరి ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. టెక్నిల్ అంశాల పరంగా గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

  నటీనటుల పెర్ఫార్మెన్స్

  హీరోగా మహీధర్ పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదనే విధంగా ఉంది. అయితే అతడి యాక్టింగ్ స్కిల్స్ కథానాయకుడి స్థాయిలో అయితే లేవు. కొత్త నటి సోనాక్షి సింగ్ రావత్ చూడటానికి యావరేజ్‌గా ఉంది. పెర్ఫార్మెన్స్, అందం పరంగా ఆకట్టుకోలేదు. హీరో, హీరోయిన్ తండ్రి పాత్రల్లో తోటపల్లి మధు, శ్రీమన్నారాయణ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు.

  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం

  ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం శివ గంగాధర్ అందించారు. ఈ సినిమాకు పెద్ద మైనస్ ఎంచుకున్న కథే. ఏ మాత్రం కొత్తదనం లేని రోటీన్ పాయింటుతో ప్రేక్షకులకు బోర్ కొట్టించారు. స్క్రీప్లే కూడా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉంది. ఇంతకు ముందు డైరెక్షన్ డిపార్టుమెంటులో పని చేసిన అనుభవం ఉన్న శివ గాంగాధర్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే అంశాలను ఎంచుకోవడంలో విఫలం అయ్యాడు కాబట్టి దర్శకత్వం పరంగా కూడా ఫెయిల్ అని చెప్పకతప్పదు.

  సినిమా ఫస్టాఫ్, సెకండాఫ్

  సినిమా ఫస్టాఫ్ హీరో హీరోయిన్‌ను చూసి మనసు పారేసుకోవడం, ఆమె కూడా తన ప్రేమలో పడేలా చేయడం లాంటి సన్నివేశాలతో రోటీన్‌గా సాగుతుంది. సెకండాఫ్‌లో అయినా కథ ఆసక్తికరంగా సాగుతుంది అనుకుంటే ఎలాంటి కొత్తదనం లేని సీన్లు, పేలవంగా సాగే స్క్రీన్ ప్లేతో మరింత బోర్ కొట్టిస్తుంది.

  ప్లస్, మైనస్ పాయింట్స్

  సినిమాలో చెప్పుకోవడానికి ప్లస్ పాయింట్స్ ఏమీ లేవు. ఈ సినిమాకు ఎంచుకున్న పసలేని ప్రేమకథ, నటనలో మెచ్యూరటీ లేని హీరో హీరోయిన్లు, బోరింగ్‌గా సాగే స్కీన్ ప్లే, ఆకట్టుకోని సంగీతం ఇలా అన్నీ మైనస్‌లే. సినిమాటోగ్రఫీ కాస్త ఫర్వాలేదు. హీరో హీరోయిన్ తండ్రి పాత్రల్లో తోటపల్లి మధు, శ్రీమన్నారాయణ కాస్త బెటర్ అనొచ్చు కానీ ప్లస్ అయితే కాదు.

  ఫైనల్‌‌గా

  ‘నా లవ్ స్టోరీ' కొత్తదనం లేని ప్రేమకథ. అటు యూత్ ఆడియన్స్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే అంశాలు లేక పోవడం పెద్ద మైనస్. క్వాలిటీ కంటెంట్ ఉన్న సినిమా అందించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.

  నటీనటులు

  మహీధర్, సోనాక్షి సింగ్, తోటపల్లి మధు, శివన్నారాయణ, ఛమ్మక్ చంద్ర

  సాంకేతిక నిపుణులు

  సినిమాటోగ్రఫీ : వై.ఇ. కిరణ్, సంగీతం : వేద నివాన్, పిఆర్వో : జి.ఎస్.కే మీడియా, ఎడిటర్ : నందమూరి హరి, మాటలు : మల్కారి శ్రీనివాస్, బ్యానర్ : అశ్వని క్రియేషన్స్, కో డైరెక్టర్ : సేతుపతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కాకర్ల శేషగిరిరావు, నిర్మాత : జి. లక్ష్మి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ గంగాధర్.

  English summary
  Naa Love Story is a romantic entertainer directed by Shiva Gangadhar and jointly produced by Guttikonda Lakshmi under the banner of Aswini Creations while Vedanivaan scored music for this movie. Mahidhar and Sonakshi Singh Rawat are played the main lead role in this movie.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more