»   »  భావోద్వేగాలే...'ఊపిరి' (రివ్యూ)

భావోద్వేగాలే...'ఊపిరి' (రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5

----సూర్యప్రకాష్ జోశ్యుల

గ్రీకు వీరుడు, భాయ్ చిత్రాల దర్శకులకు ముందుగా నాగార్జున ధాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే రొటీన్ వదిలాలి..లేకపోతే సక్సెస్ మనల్ని వదిలేస్తుంది అనే బలమైన భావన కలిగించిన సినిమాలు అవే. ఆ తర్వాతే మనం, సోగ్గాడే చిన్ని నాయినా, ఊపిరి వంటి సినిమాలు ఇస్తున్నాడు నాగార్జున. ముఖ్యంగా నవ్విస్తూ...అక్కడక్కడా ఎమోషన్ తో కళ్లు చెమ్మగిల్లేలా చేసే సినిమాలు మనకు అరుదు. అలాంటి సినిమాల్లో మొదటి వరసలో నిలిచే చిత్రం ఊపిరి అని చెప్పటానికి సందేహించక్కర్లేదు.

సెకండాఫ్ లో కొద్దిగా డల్ అయినట్లు అనిపించినా, ఫైనల్ గా మంచి సినిమా చూసిన ఫీల్ కలిగించింది. ఫ్రెంచ్ రీమేక్ అయినా అచ్చ తెలుగు కథలా చక్కగా మార్చి అందించిన దర్శక,నిర్మాతలను అభినందించాలి. ముఖ్యంగా సినిమా మొదటి నుంచి చివరి వరకూ వీల్ ఛెయిర్ కూర్చునే పాత్రను ధైర్యంగా ఒప్పుకుని పండించిన నాగార్జున, మాస్ అప్పీల్ తో అదరకొట్టిన కార్తీ సినిమాని ఒంటిచేతలపై మోసారు.

మిలియనీర్ అయిన విక్రమాదిత్య (నాగార్జున)ఓ యాక్సిడెంట్ లో తన రెండు కాళ్లు, చేతులు పనిచేయని స్దితికి చేరుకుంటాడు. వీల్ ఛెయిర్ కే అంకితమైన అతను ఇరవైనాలుగు గంటలూ చాలా ఓపికగా చూసుకునే కేర్ టేకర్ కోసం వెతుకుతూంటారు. ఈ లోగా దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శ్రీను (కార్తీ) ఆ కేర్ టేకర్ పోస్ట్ కు ఇంటర్వూకు వస్తాడు.

అమాయికంగా, అంతకు మించి నిజాయితీగా ఉండే శ్రీను ..మొదటి మాటల్లోనే విక్రమాదిత్యకు నచ్చేస్తాడు. దాంతో ఉద్యోగం ఇస్తాడు...అక్కడ నుంచి విక్రమాదిత్యను కార్తీ ఎలా చూసుకున్నాడు...ఇద్దరి మధ్యా ఎలాంటి బాండింగ్ ఏర్పడింది...అసలు ఈ కథకు ఊపిరి అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


సాధారణంగా రీమేక్ లు ఎప్పుడో కానీ సక్సెస్ కావు..ఎందుకంటే అందులో సోల్ పట్టుకోకుండా చాలా సార్లు సోది పట్టుకుని సాగతీస్తూంటారు. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఒరిజనల్ ని మించారు అని చెప్పవచ్చు. ఫ్రెంచ్ చిత్రం 'ది ఇంటచబుల్స్' కంటే బెటర్ గా ఎమోషనల్ జర్నీని చూపించి ఫీల్ గుడ్ స్టొరీ కు ఫన్ కలిసి జనరంజకంగా 'ఊపిరి'ని అందించారు.

అయితే కేవలం ఇంటర్వెల్ వరకూ మాత్రమే పైన చెప్పిన వాక్యాలు మీరు పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే సెకండాఫ్ లో ముఖ్యంగా ప్యారిస్ ఎపిసోడ్ చాలా డల్ గా నడుస్తుంది. ఫన్ తగ్గిపోతుంది..అప్ కోర్స్ ఫస్టాఫ్ కి భిన్నంగా సెకండాఫ్ లో ఎమోషన్స్ రన్ అయ్యే ఫేజ్ కాబట్టి డైరక్టరు కూడా ఏదైనా చేసే స్కోప్ తక్కువే.

అయితే కాస్త డ్రైగా ఉన్న ఆ ఎపిసోడ్స లెంగ్త్ తగ్గించాల్సి ఉంటే బాగుండేది. అలాగే..కార్తి, తమన్నాల పాట ..కమర్షియల్ యాంగిల్ కోసం పెట్టునట్లున్నారు. కానీ అక్కడే డీవియేట్ అయ్యిపోయింది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎపిసోడ్స్ చూస్తూంటే గ్రీకు వీరుడు సెకండాఫ్ లో నాగార్జన, నయనతార ల మధ్య జర్నీ ఫేజ్ గుర్తుకు వస్తుంది. అలాగే ఒకే విషయం పదే పదే రిపీట్ అవుతున్నట్లు సీన్స్ వస్తూంటాయి సెకండాఫ్ లో.

స్లైడ్ షోలో మిగతా రివ్యూ...

అద్బుతం

అద్బుతం

నాగార్జున వీల్ ఛెయిర్ లో కూర్చుని కేవలం ఫేస్ ఎక్సప్రెషన్స్ తోనే కథ మొత్తం నడపటం అద్బుతమనే చెప్పాలి.

కార్తీ

కార్తీ

గతంలో కార్తీ ఇలాంటి పాత్రలు చేసినా..ఈ పాత్ర మాత్రం అతని కెరీర్ లో నిలిచిపోయే పాత్ర అని చెప్పాలి. అంత బాగా చేసాడు. ముఖ్యంగా అతని కళ్లు బాగా ఎక్సప్రెసివ్.ఇలాంటి లో మిడిలి క్లాస్, మిడిల్ క్లాస్ పాత్రల్లో భలే ఒదిగిపోతాడు.

తమన్నా

తమన్నా

బ్యూటిఫుల్ సెక్రటరీ అంటే తమన్నానే.. అసలే మిల్కీ బ్యూటీ ఏమో...చూసే వారికి కనుల విందే. లవ్ స్టోరీ కాకపోయినా సపోర్టింగ్ క్యారక్టర్ గా చాలా బాగా చేసింది.

ప్రకాష్ రాజ్, జయసుధ

ప్రకాష్ రాజ్, జయసుధ

సీనియర్స్ ప్రకాష్ రాజ్, జయసుధ, తణికెళ్ల వంటివారు గురించి ప్ర్తత్యేకించి చెప్పేదేముంది అనిపించుకోకుండా ప్రకాష్ రాజ్ కొత్తగా ప్రయత్నించాడు ఇందులో అనే చెప్పాలి.

దర్శకుడుగా

దర్శకుడుగా

దర్శకుడు వంశీ పైడిపల్లి...తన విశ్వరూపమే చూపించాడు మేకింగ్ పరంగా, ఎమోషన్స్ ని నీట్ గా తడబడకుండా తెరకెక్కించటంలోనూ...కాస్త సెకండాఫ్ ని మరింత స్ట్రాంగ్ గా చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది.

సాంగ్స్ , రీ రికార్డింగ్

సాంగ్స్ , రీ రికార్డింగ్

పాటలు అద్బుతంగా ఏమీ లేవు. ఒక్కటీ గుర్తు పెట్టుకునే సాంగ్ లేదు. మనంలో ఉన్నట్లు దీమ్ ట్యూన్ కూడా సరైంది సెట్ చేయలేకపోయారు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లలో చాలా బాగుంది.

టెక్నికల్ గా

టెక్నికల్ గా

సినిమాటోగ్రఫీ...చాలా డెప్త్ గా ఎమోషన్ క్యాచ్ చేయటమే కాకుండా కథలో వచ్చే లొకేషన్స్ ని ఎంతో అందం గా చూపించి,ఆ విజువల్స్ గుర్తుండిపోయేలా చేసింది. డైలాగులు అబ్బూరి రవి చాలా క్యాచీగా,సింపుల్ గా రాసారు. ఎడిటింగ్ మాత్రం సెకండాఫ్ మరింత పదనుగా చేసి ఉంటే బాగుండేదనిపించింది.

ఎవరెవరు..

ఎవరెవరు..


నటీనటులు:నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, తనికెళ్ల భరణి, అడవి శేష్‌, గాబ్రియేలా, నోరా ఫతేహి, అనుష్క, శ్రియ తదితరులు
సంగీతం:గోపీసుందర్‌,
ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌,
రచన: అబ్బూరి రవి,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.
నిర్మాణ సంస్థ:పీవీపీ సినిమా
నిర్మాతలు: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె
విడుదల: 25 మార్చి, 2016

English summary
Barring a couple of dull moments, Oopiri is a treat to watch. After all, who does not like feel good comedy- dramas that celebrates life?
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu