twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓకే రీమేక్.....(‘తడాఖా’ రివ్యూ)

    By Srikanya
    |

    --జోశ్యుల సూర్య ప్రకాష్

    Rating:
    2.0/5

    హిట్ అత్యవసరమైన ఇద్దరు హీరోలు, ఓ దర్శకుడు కలిసి ఓ రీమేక్ ని ఎన్నుకుని సేఫ్ గేమ్ ఆడారు...ఫలితం ఓకే అనిపించింది. ఫస్టాఫ్ కామెడీ,రొమాన్స్ తో పరుగులు ఎత్తినా,సెకండాఫ్ లో కథ కాస్త నత్త నడక నడిచి,క్లైమాక్స్ కు పుంజుకుంది. ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ బ్లాక్స్ పండటంతో సినిమాకు ఊపిరి వచ్చినట్లయింది. చిన్న చిన్న మార్పులతో వెట్టై చిత్రాన్ని తెలుగు తెరకు రీమేక్ చేసినా నేటివిటీ సమస్య రాకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకోవటం కలిసి వచ్చింది. అలాగే నాగచైతన్య కూడా గత సినిమాలకన్నా మెరుగైన నటన కనపర్చాడు. తమన్నా ఈ సినిమా కు పెద్ద ప్లస్.

    శివరామకృష్ణ(సునీల్) చిన్నప్పుడు నుంచి భయస్దుడు. అతనికో వీర ధైర్య సాహసాలు కల తమ్ముడు కార్తీక్ (నాగచైతన్య). తండ్రి నాగబాబు(పోలీస్)...డ్యూటీలో ఉండగా చనిపోవటంతో పెద్ద కొడుకైన శివరామకృష్ణ కు జాబ్ ఇచ్చి...ఎప్పుడూ గ్యాంగ్ వార్స్ జరిగే ప్రాంతంలో పోస్టింగ్ వేస్తారు. మొదట ఆ ఉద్యోగానికి ఆసక్తి చూపని...శివరామకృష్ణ..తమ్ముడు ఇచ్చిన ధైర్యంతో వెళ్లి జాబ్ లో జాయిన్ అవుతాడు. అక్కడ నుంచి అన్నను ఆ గ్యాంగ్ ల నుంచి కాపాడుతూ..ఎలా అతనిలో ధైర్య సాహసాలునింపాడన్నది మిగతా కథ.

    ఇద్దరు అన్నదమ్ములు....అందులో పెద్దోడు పిరికి అయితే చిన్నోడు చిలిపి మరియు విపరీతమైన ధైర్య సాహసాలు కలవాడు. వాళ్లతో ఫైట్ చేయటానికి సిటీలో రెండు గ్యాంగ్ లు... ఈ అన్నదమ్ములు లైన్ వేసుకోవటానికి ఇద్దరు అక్క చెళ్లుల్లు ..వెరిసి ఓ ఫైట్...ఓ పాట..ఓ సెంటిమెంట్ సీను... ఇదే తడాఖా స్క్రీన్ ప్లే... ఇంటర్వెల్ దగ్గరకి వచ్చేసరికి పెద్దోడు పాత్రని సమస్యలో పాడేసి..సెకండాఫ్ లో ఏక్టివ్ చేసి ఉంటే ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ డల్ అయ్యి ఉండేవి కాదు. అలాకాకుండా ఒకే పాయింట్ ని పట్టుకుని ప్రీ క్లైమాక్స్ దాకా సాగ తీసాడు. దానికి తోడు..విలన్ ఎప్పుడూ..అలా చేస్తా. ఇలా చేస్తా అంటూ ప్రగల్బాలు పలకటమే కానీ ఏదీ చేయడు..

    కథను కొంచెం కూడా కతల్చడు....అటువంటి సమస్యాత్మక పరిస్ధితుల్లో ... వచ్చే తమన్నా,నాగచైతన్య మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ సినిమాని నిలబెట్టాయి. దర్శకుడు డాలీ ...తన మొదటి సినిమా కొంచెం ఇష్టం..కొంచెం కష్టం లాగే టెక్నికల్ గా మంచి మార్కులు వేయించుకున్నాడు. బ్రహ్మానందం కామెడీ కూడా బాగానే పండింది.

    విశ్లేషణతో కూడిన మిగతా రివ్యూ, స్లైడ్ షోలో...

    ఓకే రీమేక్.....(‘తడాఖా’ రివ్యూ)

    నాగచైతన్య ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించాడు. అతని కొత్త హెయిర్ స్టైల్ బాగుంది. సునీల్ అయితే పిరికి పోలీస్ పాత్రకు కరెక్టుగా సూట్ అయ్యాడు. ఇద్దరూ సీతమ్మ వాకిట్లో ...అన్న దమ్ములను మరిపించారు.

    ఓకే రీమేక్.....(‘తడాఖా’ రివ్యూ)

    ఫైట్స్ లోనూ, ఎమోషన్స్ పలికించటంలోనూ నాగైచతన్య పరిణితి చెందిన నటనను ప్రదర్శించాడు. రొమాంటిక్ సీన్స్ కు విజిల్స్ పడ్డాయి.

    ఓకే రీమేక్.....(‘తడాఖా’ రివ్యూ)

    సునీల్ మీద మరింత కామెడీ చేస్తే బాగుండేది..సునీల్ నుంచి హాస్యం ఎక్సపెక్ట్ చేసేవారికి పండుగగా ఉండేది.

    ఓకే రీమేక్.....(‘తడాఖా’ రివ్యూ)

    సినిమాకు మొదటే చెప్పుకున్నట్లుగా తమన్నా గ్లామర్ ప్లస్. ఆండ్రియా మాత్రం సునీల్ కి పెయిర్ సెట్ కాలేదనిపించింది. సెకండాఫ్ లో అయితే తమన్నా చాలా సేపు వరకూ కనపడలేదు.

    ఓకే రీమేక్.....(‘తడాఖా’ రివ్యూ)

    పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో సీన్స్ ప్రెడిక్టుబల్ గా ఉండటం మైనస్... ముఖ్యంగా లింగు స్వామి స్క్రీన్ ప్లే హిట్ కథ ని యావరేజ్ సినిమాగా మార్చేలా ఉంది. పిరికి పోలీస్ నుంచి ...ధైర్యవంతుడుగా సునీల్ మారే సీన్స్ మరీ సినిమాటెక్ గా ఉన్నాయి.

    ఓకే రీమేక్.....(‘తడాఖా’ రివ్యూ)

    సాంగ్స్ బాగానే ఉన్నా ప్లేస్ మెంట్ సరిగ్గా లేదు. రెండు పాటలు బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా ఈ పాటలకు కలిసివచ్చింది.

    ఓకే రీమేక్.....(‘తడాఖా’ రివ్యూ)

    ఫైట్స్ మరీ ఎక్కువయ్యాయి. రెండు ఫైట్స్ ని తీసేయచ్చు...ఎడిటర్ ఈ విషయం పట్టించుకుని ఉంటే బాగుండేది. అలాగే నాగచైతన్య.. వేగంగా వెళ్లే ట్రైన్ కన్నా స్పీడుగా పరుగెట్టడం వంటివి అతిగా ఉన్నాయి.

    ఓకే రీమేక్.....(‘తడాఖా’ రివ్యూ)

    దర్శకుడుగా డాలి...సినిమాని బాగా తీర్చిదిద్దాడు. రీమేక్ కాకుండా ఉంటే అతని పనితనానికి మరింత పేరు వచ్చేది. డైలాగులు బాగున్నాయి. హీరోల నుంచి మంచి నటనే రాబట్టాడు.

    ఓకే రీమేక్.....(‘తడాఖా’ రివ్యూ)

    సినిమాలో మిగతా సీనియర్ నటీనటులు, ముఖ్యంగా రమాప్రభ వంటివారు తమ పాత్రలకు బాగా న్యాయం చేసారు. బ్రహ్మానందం సీన్స్ కొంత పాతవాసన కొట్టినా ఓకే. వెన్నెల కిషోర్ పాత్ర కూడా ప్రెడిక్టబుల్ పాత్ర.

    ఓకే రీమేక్.....(‘తడాఖా’ రివ్యూ)

    బ్యానర్ :సాయి గణేశ్ ప్రొడక్షన్స్
    నటీనటులు : నాగచైతన్య, సునీల్ , తమన్నా, ఆండ్రియా, అశుతోష్ రాణా, నాగబాబు, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రఘుబాబు, రమాప్రభ, జయప్రకాష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు
    కథ:లింగుస్వామి,
    మాటలు:వేమారెడ్డి,
    స్క్రీన్‌ప్లే:దీపక్‌రాజ్,
    సంగీతం:తమన్,
    కెమెరా:ఆర్డర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతంరాజు,
    పాటలు:రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల,
    నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు,
    మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కిషోర్ పార్థాసాని (డాలి).

    కామెడీ,కొద్దిగా రొమాన్స్, ఇంకొంచెం సెంటిమెంట్, ఎక్కువ యాక్షన్... కొలతలు ప్రకారం వేసినట్లు ఉన్న ఈ చిత్రం ఒరిజనల్ చిత్రం వెట్టై చూడని వారికి ఫరవాలేదనిపిస్తుంది. నిరాసపరచదు. కామెడీ,యాక్షన్ బాగానే పండాయి కాబట్టి బి,సి సెంటర్స్ లో కూడా వర్కవుట్ అయ్యే అవకాసం ఉంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Budding actor Naga Chaitanya, has taken a break for nearly one and half year after the failure of Bejawada. He has teamed with actor Sunil for his latest outing Tadakha (Thadaka). Although it is remake of N Linguswamy's mass entertainer Vettai, it is not a scene-to-scene copy of the original.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X