»   »  సాహసమే...!! (చైతూ 'సాహ‌సం శ్వాస‌గా సాగిపో'‌ రివ్యూ)

సాహసమే...!! (చైతూ 'సాహ‌సం శ్వాస‌గా సాగిపో'‌ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

గౌతమ్ మీనన్ ..గతంలో 'ఏ మాయ చేసావె' అంటూ ఓ లవ్ స్టోరీతో తమిళ,తెలుగు ప్రేక్షకులను మాయ చేసారు. ఆ తర్వాత వెంకీతో ఘర్షణ అనే యాక్షన్ చిత్రం చేసి బాగుందనిపించుకున్నారు. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు కలిపితే ఎలా ఉంటుందనే ఆలోచన ఆయనకు వచ్చినట్లుంది. ఐడియా వచ్చిందే తడువుగా పనిలోకి దిగిపోయి ఓ యాక్షన్ ,లవ్ స్టోరీ కథ అల్లేసారు.

మధ్యలో ఎందుకైనా మంచిదని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని కలిపి ,వండేసి ఈ సినిమాని మన ముందుకు తీసుకు వచ్చేసారు. అయితే ప్రేమ కథలు స్లోగానే నడపాలి అనే రూల్ ఆయన పెట్టుకుని ఉన్నారో ఏమో కానీ... ఈ మధ్యకాలంలో ఎవరూ నడపనంత స్లోగా సినిమా నడిపిన క్రెడిట్ సాధించేలా చేసారు. అలాగే ఎంటర్టైన్మెంట్ ని కలిపితే సినిమా రొటీన్ అవుతుందనుకున్నారో, ఏమో కానీ దాన్ని వదిలేసారు. దాంతో సినిమా చూడాలంటే కాస్తంత సాహసం అవసరం అన్నట్లు తయారైంది.


రీసెంట్ గా ప్రేమమ్ సినిమాతో హిట్ కొట్టిన నాగచైతన్య ఈ సినిమాని ఎప్పుడో పూర్తి చేసి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రేమమ్ కన్నా ముందే రిలీజ్ కావాల్సి ఉన్నా తమిళ వర్షన్ షూటింగ్ ఆలస్యం కావటంతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే గతంలో గౌతమ్ మీనన్, నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన ఏంమాయ చేసావే ఘనవిజయం సాధించటంతో సాహసం శ్వాసగా సాగిపో సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి వీటిని ఈ కాంబో రీచ్ అయ్యారా..లేదా అన్న విషయం చూద్దాం.


సినిమాలంటే పిచ్చి ఉన్న అమ్మాయి

సినిమాలంటే పిచ్చి ఉన్న అమ్మాయి

సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఉన్న లీలా (మంజిమ మోహన్‌) వైజాగ్‌కి చెందిన తన ప్రెండ్ మైత్రేయితో కలిసి స్క్రిప్ట్‌ రైటర్‌గా చిత్ర పరిశ్రమలో స్థిరపడాలని ప్లాన్‌ చేస్తుంది. కొన్ని రోజులు గడిపేందుకు మైత్రేయి ఇంటికి వస్తుంది. అక్కడే మైత్రేయి సోదరుడైన రజనీకాంత్‌(నాగచైతన్య)కి దగ్గరవుతుంది.


జాబ్ కోసం వెయిట్ చేస్తున్న హీరో

జాబ్ కోసం వెయిట్ చేస్తున్న హీరో

రజనీకాంత్ మురళీధర్ (నాగచైతన్య).. ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైన ఉద్యోగం రాకపోవటంతో ఎంబిఏ చేస్తూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. ఏదైనా మంచి ఆఫర్ వచ్చేవరకూ ఖాళీగానే కాలం వెళ్ళదీయాలనుకొని వెయిట్ చేస్తున్న సమయంలో తన చెల్లెలి కాలేజ్ ఫంక్షన్ లో లీలా సత్యమూర్తి(మంజిమా మోహన్) అనే అమ్మాయిని చూసి పడిపోతాడు. ఆ తర్వాత ఆమెను పడేయాలని ఫిక్స్ అవుతాడు.


పరిచయం టు ప్రేమ

పరిచయం టు ప్రేమ

ఎలా పడేయాలని అనుకుంటున్న సమయంలో ... తను ఇష్టపడ్డ లీల.. కోర్సు చేయటం కోసం తన చెల్లితో కలిసి తన ఇంట్లోనే ఉండటంతో ఆనందపడిపోతాడు. కొద్ది రోజుల్లోనే లీలాతో రజనీకాంత్ కు మంచి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారినా చెప్పడు.


వైజాగ్ టు కన్యాకుమారి

వైజాగ్ టు కన్యాకుమారి

రజనీకాంత్‌కు బైక్‌పై ప్రయాణమంటే చాలా ఇష్టం. కన్యాకుమారికి బైక్‌పై వెళ్లాలనుకొంటాడు. తాను కన్యాకుమారిలో సూర్యోదయం చూడటానికి బైక్ మీద వెళుతున్న విషయం లీలాతో చెప్తాడు రజనీకాంత్. లీలా కూడా ప్రయాణమవుతుంది. ఈ జర్నిలోనే వీరి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది.


యాక్సిడెంట్...లీల ఏమైంది

యాక్సిడెంట్...లీల ఏమైంది

ఇద్దరూ కన్యాకుమారి వెళ్లి తిరిగొచ్చే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురవుతారు. ఇక తను బతకనేమో అనే భయంతో లీలతో తాను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాడు రజనీకాంత్. తరువాత కళ్లు తెరిచే చూసేసరికి హాస్పిటల్ లో ఉంటాడు. ప్రక్కన లీల ఉండదు.


హత్యాయత్నమే..యాక్సిడెంట్ కాదు

హత్యాయత్నమే..యాక్సిడెంట్ కాదు

అక్కడ ఏం జరుగుతుందంటే.. హాస్పటిల్ లో రజనీకాంత్‌ని చేర్పించిన లీలా.. మహారాష్ట్రలో ఉన్న తన అమ్మానాన్నలపై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లిపోతుంది. మూడు రోజుల తరువాత హస్పిటల్ కు ఫోన్ చేసిన లీలా, తమ కుటుంబం ప్రమాదంలో ఉందని, బైక్ యాక్సిడెంట్ కూడా తనను చంపాడానికి కావాలని చేయించిందే అని చెపుతుంది.


వెంటనే రజనీకాంత్ అక్కడికి

వెంటనే రజనీకాంత్ అక్కడికి

తాను, లీలా కన్యాకుమారి నుంచి తిరిగి వస్తుండగా జరిగింది ప్రమాదం కాదని, లీలాని అంతం చేయాలనే పథకం తెలుసుకున్న రజనీకాంత్... వెంటనే ఆమెకు తోడుగా ఉండటానికి ఆమె ఊరు మహారాష్ట్ర బయిలుదేరతాడు. అప్పటికే లీలా తల్లిదండ్రుల మీద హత్యా ప్రయత్నం జరగటంలో వాళ్లు హాస్పిటల్ లో ఉంటారు.


మళ్లీ ఎటాక్

మళ్లీ ఎటాక్

రజనీకాంత్ ... అక్కడ చేరుకున్న తరువాత మరోసారి లీలా, ఆమె కుటుంబం మీద ఎటాక్ జరుగుతుంది. మొదటి అప్పుడు చైతూ కాపాడిన తరువాత జరిగిన ఎటాక్ లో లీలా కుటుంబంతో పాటు రజనీకాంత్ ఫ్రెండ్ మహేష్ కూడా చనిపోతాడు.


లీలాని ఎందుకు చంపాలనుకుంటున్నారు

లీలాని ఎందుకు చంపాలనుకుంటున్నారు

ఆ ఎటాక్ చేసిందెవరు? లీలాపై వారెందుకు దాడి చేశారు? ఇంతకీ లీలాని చంపాలనుకొన్నది ఎవరు? రజనీకాంత్‌.. మహేష్‌గా ఎలా మారాడు? దీనికి పోలీసులు కూడా ఎందుకు సహకరిస్తున్నారు..? లాంటి విషయాలన్ని తెలుసుకోవాలనుకుంటాడు రజనీకాంత్. వీటన్నింటిని తెలుసుకుని రజనీ, లీలాలు ఎలా ఎదుర్కున్నారన్నదే సినిమా. తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


కొత్త కథేం కాదు

కొత్త కథేం కాదు

‘ద గాడ్‌ఫాదర్‌' చిత్రం ప్రేరణతో కథ రాసుకొన్నట్టు టైటిల్‌ కార్డ్స్‌లో వేశారు గౌతమ్‌మేనన్‌. హీరో పాత్రని ఈ కథలో హీరోయిన్ చేసారు. కానీ వర్మ ఇప్పటికే చాలా సార్లు ఇదే కథని వండి వార్చేయటంతో...పెద్ద కొత్తగా అనిపించదు.


చివరిదాకా వెయిట్ చెయ్యాలి

చివరిదాకా వెయిట్ చెయ్యాలి

సినిమాలో హీరోయిన్ ని ఎదుకు విలన్స్ చంపాలనుకుంటున్నారనే విషయం చివరి నిముషం వరకూ బయిటపెట్టకుండా స్క్రీన్ ప్లే చేసారు గౌతమ్ మీనన్. అయితే అదే విసుగుతెప్పించింది. ఎందుసేపూ వన్ సైడ్ వార్ లాగ అనిపిస్తుంది. అలాగే లాస్ట్ టెన్ మినిట్స్ లో పజిల్ మొత్తం కొన్ని డైలాగ్స్ లో రివీల్ చేసేయటం కూడా ఆకట్టుకోదు.


పండలేదు, అదే మైనస్

పండలేదు, అదే మైనస్

వాస్తవానికి థ్రిల్లింగ్‌ ఫార్మెట్ లో స్క్రీన్ ప్లే చేసిన ఈ కథకి ఓ రేంజి విలనిజం అవసరం. కానీ అది కూడా బలంగా ఏమీ పండలేదు. చాలా వీక్ గా అనిపించి, హీరోకు ఛాలెంజ్ లాగ కనపడదు. ఆ పాత్రలో బాబా సెహగల్‌ బాగానే నటించాడు కానీ... ఆ పాత్రలో విలనిజం మాత్రం పండకపోవటం మైనస్ అయ్యింది.


రొమాన్స్ అదరకొట్టాడు కానీ..

రొమాన్స్ అదరకొట్టాడు కానీ..

గతంలో దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య అంటూ వరస పెట్టి యాక్షన్ సినిమాలు చేసిన నాగచైతన్య, మరోసారి యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కాకపోతే రొమాంటిక్ సన్నివేశాలు చేసినట్లుగా , యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇమడలేకపోయాడనిపిస్తుంది. కాకపోతే అంతకు ముందు చేసిన యాక్షన్ సినిమాలతో పోలిస్తే వెయ్యిరెట్లు బెస్ట్.


సరదా..సరదాగా వెళ్లి..

సరదా..సరదాగా వెళ్లి..

ఫస్టాఫ్ అంతా గౌతమ్ మీనన్ తను మాస్టరీ చేసిన రొమాన్స్‌ ఎపిసోడ్స్ తో, రోడ్ ట్రిప్‌తో సరదాగా నడిపేసాడు, అలాగే ఇంటర్వెల్‌లో ట్విస్ట్ వేసి కథని లాక్ చేసాడు. అయితే అక్కణ్ణుంచి సినిమానంతా ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా మారిపోయి..జానర్ ఛేంజ్ అయ్యి...ఇబ్బందిగా అనిపించింది. అలాగే.. ఫస్టాఫ్‌లో గౌతమ్ మీనన్ స్టైల్ మేకింగ్, రొమాంటిక్ సీన్స్ నుంచి పుట్టే ఫన్‌తో చాలా బాగుంది. స్లో నేరేషన్, వెంట వెంటనే వచ్చే పాటలు ఫస్ట్ హాప్ లో కాస్త బోర్ కొట్టిస్తాయి.


ప్లేస్ మెంట్ సరిగ్గా లేదు

ప్లేస్ మెంట్ సరిగ్గా లేదు

యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని సెంకడ్ హాఫ్ బాగుందనిపిస్తుంది. అయితే పూర్తి స్దాయి సీరియస్ నెస్ తో సాగుతుంది. అలాగే...తాను... నేను, చకోరి... పాటలు బాగున్నాయి. వెళ్లిపోమాకే పాట బాగున్నప్పటికీ అది ప్లేస్‌మెంట్‌ సరిగ్గా కుదర్లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా స్థాయిని పెంచాడు. సెకండాఫ్ లో మరింత జాగ్రత్తలు తీసుకుని ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదనిపిస్తుంది.


టెక్నికల్ గా..

టెక్నికల్ గా..

మేకింగ్ పరంగా గౌతమ్ మీనన్ మార్క్‌ను సినిమాలో స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఏ.ఆర్.రహమాన్ అందించిన పాటలు ఇప్పటికే మంచి హిట్ అవటం కలిసొచ్చింది. ఇక సినిమాటోగ్రాఫీ అదరకొట్టారనే చెప్పాలి. ఎడిటింగ్ ఇంకెంచెం లాగ్ లు తగ్గించేలా చూస్తే బాగుండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కి వంక పెట్టడానికి లేదు.


టోటల్ గా ఇలా..

టోటల్ గా ఇలా..

గౌతమ్‌మేనన్‌ మార్క్‌ సినిమా ఇది. ఫస్టాఫ్ మొత్తం ‘ఏమాయ చేసావె' తరహాలోనే ఓ పక్కింటి కుర్రాడి ప్రేమకథని చూపించారు. కానీ ఇక్కడ ఆ ప్రేమకథని ఓ రోడ్‌ట్రిప్‌ నేపథ్యంలో చూపించడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. రోడ్డుపై ప్రమాదం జరగడం, అది కూడా ఓ ప్లాన్ ప్రకారమే అన్న విషయం తెలియడంతోనే అసలు కథ మొదలవుతుంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరిగిన ఓ కుర్రాడికి అనుకోని కష్టం ఎదురైనప్పుడు ఎలా స్పందించాడు? ఎలా ధైర్యం కూడగట్టుకొన్నాడు? అనే విషయాల్ని సహజంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.


ఈ సినిమాకు పనిచేసినవాళ్లు

ఈ సినిమాకు పనిచేసినవాళ్లు

బ్యానర్: ద్వారకా క్రియేషన్స్‌
నటీనటులు: నాగచైతన్య, మంజిమ మోహన్‌, బాబా సెహగల్‌, రాకేందుమౌళి, సతీష్‌ కృష్ణన్‌, అజయ్‌ గొల్లపూడి తదితరులు
సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌,
సినిమాటోగ్రఫీ: డాన్‌మాక్‌ ఆర్థర్‌,
ఎడిటింగ్‌: ఆంటోని,
ఆర్ట్‌: రాజీవన్‌,
ఫైట్స్‌: సిల్వ,
రచన: కోన వెంకట్‌,
నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌.
విడుదల తేదీ:11, నవంబర్ 2016.నిజానికి ప్రధాని నోట్ల రద్దుతో ...ధియోటర్స్ కు జనం రారని బావించి ఈ సినిమా రిలీజ్ వాయిదావేస్తారనుకున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన చిత్రం కావటంతో మరోసారి వాయిదా ఎందుకని, నిర్మాతలు సాహసమే చేసి విడుదల చేసారు. అయితే ఆ సాహసంకు రివార్డ్ వస్తుందా అంటే అనుమానంగానే ఉంది. ఎందుకంటే... ఈ సినిమా కేవలం చైతూ అబిమానులను మాత్రమే మెప్పించేలా కనపడుతోంది.

English summary
Naga Chaitanya’s most anticipated movie Sahasam Swasaga sagipo released today. Accumulating tremendous hype and curiosity as Naga Chaitanya is once again collaborating with Gautham Menon, sahasam swasaga sagipo is romantic thriller film. Expectations on Sahasam swasaga sagipo Box Office Collection are skyrocketing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu