»   » బై..బై... ('భాయ్‌' రివ్యూ)

బై..బై... ('భాయ్‌' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:
1.5/5

వరసగా రెండు హిట్స్ (అహనా పెళ్లంట, పూల రంగడు) అందించిన దర్శకుడు కొత్త చిత్రం అంటే అందరికీ క్రేజే. దానికి తోడు కామెడీ తో వస్తున్న 'భాయ్‌' అంటూ పబ్లిసిటీ చేయటం కూడా సినిమా ఓపినింగ్స్ కు కలిసి వచ్చింది. అయితే ఎంతో నమ్మకం పెట్టుకుని థియోటర్ కి వెళ్ళి న ప్రేక్షకుడుకి మాత్రం పూర్తి నిరాశే ఎదురౌతోంది. మళయాళ సూపర్ హిట్ 'పొక్కిరి రాజా' మెయిన్ ప్లాట్ తీసుకుని చేసిన ఈ చిత్రం కథన లోపమే ప్రధానంగా బోర్ కొట్టించింది. ముఖ్యంగా నెగిటివ్ క్యారెక్టర్స్ కు తమని దెబ్బ తీస్తున్నది హీరో అని తెలిసేటప్పడికే క్లైమాక్స్ వచ్చేయటంతో ఈ యాక్షన్ మసాలా కథ లో కాంప్లిక్ట్ లేకుండాపోయి చప్పటి సీన్స్ తో ..విసుగెత్తించింది. సినిమాలో ఉన్న కొద్ది పాటి కామెడీ కూడా పెద్దగా పేలలేదు...అంటే బ్రహ్మానందం కూడా ఒక్కోసారి సినిమాని రక్షించలేడని తేలిపోయింది.

హాంకాంగ్‌ డాన్ డేవిడ్‌ (ఆశిష్‌ విద్యార్థి) కి కుడి భుజం.. విజయ్‌ (నాగార్జున). హైదరాబాద్ లో దందా నడుపుతున్న తన బ్యాచ్ ని అక్కడ పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ లేపేస్తున్నారని డేవిడ్ కు తెలుస్తుంది. తన బ్యాచ్ ని సేవ్ చేసుకోవటానికి ఆ అండర్ కవర్ కాప్ ని లేపేయమని విజయ్ ని పంపుతాడు. ఆ అండర్ కవర్ కాప్ కష్టపడి ఎడ్రస్ ట్రేస్ చేసి కాల్చే సమయంలో విజయ్ కు ఓ నిజం తెలుస్తుంది. దాంతో కాల్చలేకపోతాడు. ఏమిటా నిజం...ఆ అండర్ కవర్ కాప్ ఎవరు...హీరోయిన్ తో పరిచయం ఎలా జరిగింది. అసలు విజయ్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చివరి దాకా చూడాల్సిందే.


2010 లో వచ్చిన Pokkiri Raja లో ముమ్మట్టి మాస్ లుక్ తో వచ్చీ రాని ఇంగ్లీష్ మాట్లాడుతూ..చాలా నాటుగా బిహేవ్ చేస్తూ లోకల్ రౌడీగా నవ్విస్తూ హీరోయిజం పండిస్తాడు. కథ అదే అయినా ఈ భాయ్ లో ఆ మాస్ స్టైయిల్ లోపించింది. ఓ వారం క్రిందట ఈ చిత్రం రీమేక్ గా హిందీలో అక్షయ్ కుమార్ తో వచ్చిన బాస్ చిత్రంలోనూ అదే సమస్య. ముమ్మట్టి సినిమాని తీసుకుని చేసినప్పుడు అక్కడ ఏయే ఎలిమెంట్స్ హైలెట్ అయ్యాయో వాటినే లోకలైజ్ చేసుకుని మరింత ఇంప్రవైజ్ చేసుకుంటే బాగుండేది. అలా కాకుండా కేవలం ప్లాట్ తీసుకుని వాటికి అతిథి కబ్ జావోగీ లో...ట్విస్ట్ ని తీసుకొచ్చి బ్రహ్మానందం ని మరొకటి తీసుకువచ్చి ఇంకో థ్రెడ్ ని కలిపే ప్రయత్నం చేయటంతో అది అతుకుల బొంతలా తయారైంది. దానికి తోడు క్లైమాక్స్ ,సెంటిమెంట్ సీన్స్ మరీ ఎనభైల నాటిలా తయారయ్యి...తెరపై ఎమోషన్ సీన్ నడుస్తూంటే జనాలు నవ్వటం జరిగింది. అలాగే హీరో కనిపించిన ప్రతీసారి ఇంట్రడక్షన్ సీన్ లాగ బిల్డప్..పంచ్ డైలాగులు వేసి విసిగించారు.

ముఖ్యంగా హీరో పాత్ర ప్యాసివ్ కాకుండా జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. సినిమా ప్రారంభంలో ఎత్తుకున్న ఎత్తుగడని ఫాలో అవుతూ కథ నడవదు. హీరో...ఓ అండర్ కవర్ కాప్ ని చంపాలని హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఆ పని మానేసి ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలుతూంటాడు. ఇంటర్వెల్ కు గానీ తాను వచ్చిన పని గుర్తుకు రాదు. పోనీ సినిమా సెకండాఫ్ లో అయినా ఈ లోపాన్ని సరిదిద్దుకున్నారా అంటే అదీ లేదు. తన తమ్ముడుకి విలన్స్ తో థ్రెడ్ ఉందని తెలిసినా ... హీరో తన తమ్ముడుని సేవ్ చేసుకునేందుకు ప్రయత్నాలు ఏమీ చేయడు. వెడ్డింగ్ ప్లానర్ గా కామెడీ చేయటానికి ప్రయత్నిస్తూంటాడు. ఇలా ఏమీ చేయని హీరో విసుగు తెప్పించంటం తప్ప ఏం చేస్తాడు.

పండని లవ్ స్టోరీ

పండని లవ్ స్టోరీ

ఈ టైప్ సినిమా లో లవ్ స్టోరీ సబ్ ప్లాట్ అయినా గ్లామర్ తో ముడి పడి ఉండే ఎలిమెంట్ కావటంతో చాలా ప్రాముఖ్యత ఇస్తారు. కానీ ఈ చిత్రంలో ఆ జాగ్రత్తలు ఏమీ తీసుకున్నట్లు కనపడదు.రొమాంటిక్ ట్రాక్ చాలా వీక్ గా ఉంది. హీరో,హీరోయిన్స్ మధ్య ఏ కాంప్లిక్ట్ ఉండదు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ హీరోయిన్ వెనక పడటం తప్ప మరేమీ ఉండదు.

నాగ్ కూడా..

నాగ్ కూడా..

నాగార్జున ఈ చిత్రంలో ఎప్పటిలాగే గ్లామర్ గా కనిపించారు. అయితే నాగార్జున ఈ తరహా పాత్రలు గతంలో డాన్, కింగ్ చిత్రాల్లో చేసారు...దాంతో వైవిధ్యం లేకుండా పోయింది. మూడు గెటప్స్ లో కనిపించినా అవి పెద్ద వేరియేషన్ కనిపించకుండా పోయాయి. దానికి కారణం సహకరించని స్క్రిప్టు మాత్రమే.

రిచా గంగోపాధ్యాయ కి అంత సీన్ లేదు

రిచా గంగోపాధ్యాయ కి అంత సీన్ లేదు

ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ రాధిక పాత్రలో ...నాగార్జున కి లవ్ ఇంట్రెస్ట్ గా కనిపించింది. పాటల్లో తప్ప ఎక్కడా ఆమెకు ప్రయారిటీ ఉండదు. కానీ ఉన్న కాసేపూ నాగార్జునకి కరెక్టు పెయిర్ గా కనపడింది. తర్వాత సినిమాల్లో కూడా ఆమెను నాగార్జున సరసన తీసుకోవచ్చు.

కామెడీ...సపోర్టింగ్ రోల్స్

కామెడీ...సపోర్టింగ్ రోల్స్

బ్రహ్మానందం, ఎమ్.ఎస్ నారాయణ కామెడీ సినిమాలో చాలా ఇరిటేటింగ్ గా ఉంది.ముఖ్యంగా బ్రహ్మానందం సెకండాఫ్ లో వచ్చి...అస్తమానం ఎవరినో ఒకరిని కొడుతూ హడావిడీ చేస్తూంటే నవ్వు రాకపోగా వెగటు పుడుతుంది. ఇక సపోర్టింగ్ పాత్రల విషయానికి వస్తే సోనూ సూద్,ఆషిష్ విద్యార్ధి ఓకే అనిపిస్తారు. అజయ్ పాత్ర ఎందుకు వస్తుందో ఎందుకుపోతుందో అర్దం కాదు. మిగతా పాత్రలూ అంతంత మాత్రమే. వేటీకీ డెప్త్ లేదు.

పాటలు

పాటలు

సంగీతం బాగానే ఉన్నా సినిమాలో పాటల ప్లేస్ మెంట్ చాలా బ్యాడ్ గా ఉంది. నాగార్జున మాత్రం రెండు పాటల్లో బాగా స్టెప్స్ వేసారు. అవి నాగార్జున అభిమానులకు పండుగ లా ఉంటాయి. అలాగే భాయ్ టైటిల్ సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది.

టెక్నికల్ గా ...

టెక్నికల్ గా ...

సమీర్ రెడ్డి కెమెరా పనితనం పాటల్లో కనిపించినంతగా మిగతా భాగాల్లో కనిపించలేదు. పాటల్లో మాత్రం నాగార్జునని మరింత గ్లామర్ గా చూపించాడు. లొకేషన్స్ లో బ్యూటీ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసారు. ఎడిటింగ్ విషయానకి వస్తే మరింత ట్రిమ్ చేయాలి. చాలా సీన్స్ హఠాత్తుగా వచ్చినట్లు అనిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్ ఇచ్చి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్ లో తేలిపోయింది.

డైలాగులు-స్క్రిప్టు

డైలాగులు-స్క్రిప్టు

సినిమాకి స్క్రిప్టే ప్రధాన లోపం అని మొదటే చెప్పుకున్నాం. ఇక డైలాగులు విషయానికి వస్తే అవి వినటానికి బాగున్నా...తెరపై తేలిపోయాయి. ప్రతీసారి సీన్ కి సంభంధం లేకుండా హీరో కి బిల్డప్ డైలాగులు రాసారు. అవి పంచ్ లు బాగానే ఉన్నా...అనవసరంగా హీరో ప్రతీ సారి సంభంధం లేకుండా కంటిన్యూగా పంచ్ లు వేస్తున్న ఫీలింగ్ వచ్చింది. హీరో ...భాయ్ కాకుండా ఏ పంచ్ డైలాగులు రాసుకునో...డైలాగుల రైటరో అనే డౌట్ వస్తుంది. ఇంట్రడక్షన్ అయ్యోలోగానే బోల్డు పంచ్ డైలాగులు మనల్ని నిర్ధాక్ష్యణంగా తాకుతాయి. పంచ్ ల మీద పెట్టిన శ్రద్ద ..కథ,కథనం పై పెడితే బాగుండేది.

సెకంఢాఫే ...

సెకంఢాఫే ...

సినిమాకు ప్రాణమైన సెకండాఫ్,క్లైమాక్స్ సినిమాని బాగా దెబ్బ తీసాయి. ముఖ్యంగా చాలా స్లోగా నేరేట్ చెయ్యటం, విషయం లేని సీన్స్ ఇబ్బంది పెట్టాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా...అసలైన విషయం లేకపోవటం జరిగింది. ఫస్టాఫ్ ఓకే అనిపించుకున్నా... కలిసిరాలేదు.

దర్శకుడుగా...

దర్శకుడుగా...

దర్శకుడుగా వీరభధ్రం తన గత రెండు చిత్రాలలో కామెడీ తో గెలుస్తూ వచ్చాడు. అయితే ఈ సారి యాక్షన్ కూడా డీల్ చేయాలన్న తపనతో తన బలం అయిన కామెడీని వదిలేసాడు. మాఫియా కామెడీ మీద, మరింత హోమ్ వర్క్ చేయాల్సింది. అలాగే ప్లాట్ ని మరింత డవలప్ చెయ్యాల్సింది. సినిమా రిజల్ట్ ఏలా ఉన్నా...డైరక్టర్ గా సీన్స్ మేకింగ్ లో పాస్ అయ్యాడు..ఏ రేంజి హీరోని అయినా డీల్ చేయగలను అనిపించుకున్నాడు.

ఎవరెవరు...

ఎవరెవరు...

సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్‌
నటీనటులు: నాగార్జున, రిచా గంగోపాధ్యాయ, సోనూ సూద్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, షాయాజీ షిండే, ఆదిత్య మీనన్, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, ప్రసన్న, జయప్రకాష్ రెడ్డి, అజయ్, నథాలియా కౌర్, కామ్న జఠ్మలానీ, హంసా నందిని, నాగినీడు, జారాషా, వినయప్రసాద్, సంధ్యా ఝనక్, చలపతిరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, పృథ్వి, దువ్వాసి మోహన్, శ్రావణ్, సుప్రీత్, ప్రభాస్ శ్రీను, కాశీ విశ్వనాథ్, హేమ, రజిత, గీతాంజలి, టార్జాన్, నర్సింగ్ యాదవ్, ఫిష్ వెంకట్ తదితరులు .
కెమెరా: సమీర్ రెడ్డి,
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్.సాయిబాబు,
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్,
మాటలు: సందీప్, రత్న బాబు,
కళ: నాగేంద్ర, యాక్షన్: విజయ్ డ్రాగన్ ప్రకాష్,
నృత్యాలు: బృందా, గణేష్ స్వామి,
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్,
మాటలు: రత్ బాబు, సందీప్,
కథ-దర్శకత్వం: వీరభద్రం చౌదరి.
నిర్మాత: నాగార్జున
విడుదల: 25-10-2013.

ఫైనల్ గా ఈ చిత్రం నాగార్జున అభిమానులుకు నచ్చే అవకాసం ఉంది. ఆయన స్టెప్స్ బాగున్నాయి కాబట్టి ఎంజాయ్ చేయవచ్చు. అలాగే ఇప్పటికీ ఎనభై ల నాటి సినిమాలే నచ్చి వాటినే చూడాలనుకునేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్

(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Nagarjuna's "Bhai" released today(25 October) with negitive talk.The story of Bhai has nothing new to offer, but a few interesting twists and sound filmmaking techniques make the movie grand and lavish. The director has done good job in some parts, but he should have done more homework on a few mafia and comedy scenes, which look mediocre.The movie hits a rough patch due to some sentimental sequences in the second half, which is dragging and boring. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu