twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మ్రోగలేదు('ఢమరకం' రివ్యూ)

    By Srikanya
    |

    -సూర్య ప్రకాష్ జోశ్యుల

    Rating:
    2.0/5
    నటీనటులు: నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, గణేష్, వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, యంఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, జీవా బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు తదితరులు
    కథ: వెలిగొండ శ్రీనివాస్,
    ఆర్ట్: అశోక్,
    ఎడిటింగ్: గౌతంరాజు,
    డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి: చోటా కె.నాయుడు,
    సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
    డాన్స్: రాజు సుందరం,
    సమర్పణ: కె. అచ్చిరెడ్డి,
    నిర్మాత: వెంకట్,
    స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి

    ఒక సినిమా హిట్టైతే అదే తరహా చిత్రాలు మరిన్ని తెలుగు తెరను ముంచెయ్యడం చాలా కాలంగా జరుగుతున్నదే. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆ మధ్యన వచ్చి సూపర్ హిట్టైన అరుంధతిను గుర్తు చేస్తూ ఢమురకం చిత్రం ధియోటర్లలోకి దూకింది. అరుంధతికి ప్లస్ అయిన అనూష్క, భారీ గ్రాఫిక్స్, అఘోరా(ఈ సినిమాలో వందలకొలిది అఘోరాలు ను పెట్టారు). రవి శంకర్ వాయిస్(ఇందులో ఏకంగా రవిశంకర్ నే పెట్టారు) వంటవి కలుపుకుని మరీ వచ్చింది. అంతేగాక అరుధంతిలో లేని నాగార్జున(ఆ సినిమాలో హీరోనే లేడు), ఛార్మి ఐటం సాంగ్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. అయితే అన్ని ఉన్నా... ఏదో లేదన్నట్లు సినిమాకు కీలకమైన కథ,కథనాలు సరిగా పట్టించుకోలేదు. అరుంధతి కి ప్లస్ అయిన స్క్రీన్ ప్లే, ఈ సినిమాలో అసలు లేకుండా పోయింది. హీరో పాత్ర పూర్తి స్ధాయి ప్యాసివ్ గా మారి సహన పరీక్ష పెట్టింది. అయితే నాగార్జున మాత్రం తనదైన శైలిలో సినిమాను భుజాన వేసుకుని మోయటానికి ప్రయత్నించారు.

    రాక్షససంహారం జరిగిన తర్వాత శత్రుశేషంగా మిగిలిన రాక్షసుడు అంధకాసురుడు(రవిశంకర్). ఆ రాక్షసుడికి పంచభూతాలు ఆధీనంలో పెట్టుకుని సృష్టిని ఏలానన్నది జీవితాశయం. అందుకోసం వెయ్యి సంవత్సరాలకొక్కసారి జరిగే పంచగ్రహ కూటిమిలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తెలుసుకుంటాడు. ఆమె మరెవరో కాదు పార్వతీ దేవి అంశంతో పుట్టిన మహేశ్వరి(అనూష్క). అయితే ఆ రాక్షసుడ్ని అడ్డుకోవటానకి, లోక కళ్యాణం చేయటానికి మల్లి కార్జున (నాగార్జున)జన్మిస్తాడు. చిన్నతనంలోనే కుటుంబాన్ని పోగొట్టుకున్న మల్లికార్జున... శివుడుపై ద్వేషం పెంచుకుంటాడు. తిరిగి మల్లికార్జున శివభక్తుడు ఎలా అయ్యాడు...అత్యంత బలశాలి అయిన ఆ రాక్షసుడ్ని ఎలా సంహరించాడు... మహేశ్వరిని ఆ రాక్షసుడు బారినుంచి ఎలా రక్షించాడు అనేది మిగతా కథ.

    మొదటే చెప్పుకున్నట్లుగా ఢమురకం ఓ ప్యాకేజ్ ఫిల్మ్ గా కనిపిస్తుంది. హిట్ అవ్వాలంటే ఫలానావి కావాలి అని ఫిక్సై వాటిని అన్నిటినీ ముందేసుకుని వండిన ప్యాకేజి స్క్రిప్టు గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ వరకూ కథను సెటప్ చేయటమే సరిపోయింది. లెక్కకు మించిన పాత్రలు కావటంతో వాటి పరిచయానికే ఫస్టాఫ్ సరిపోయింది. సెకండాఫ్ సగం అంటే దాదాపు ప్రీ క్లైమాక్స్ వచ్చేవరకూ హీరో సమస్యలో పడడు. దాంతో హీరో పాత్ర పూర్తిగా ప్యాసివ్ గా ఉంటుంది. హీరో సమస్యలో పడి దాని నుంచి ఎలా బయిటకు వచ్చాడన్నట్లుగా కథనం ఉండదు. అదే అరుంధతిలో అయితే హీరోయిన్ మొదటి సీన్ లోనే అఘోరాతో సమస్యలో పడుతుంది. అక్కడనుంచి ఆమె అఘోరానుంచి తప్పుకోవానికి చేసే చర్యలు సినిమాను నిలబెట్టాయి. అదే ఇక్కడ మిస్సైంది.

    అంతేగాక అత్యంత శక్తి సంపర్నుడైన విలన్ కి సైతం ఫలానా హీరో తన లక్ష్యంకు అడ్డుపడుతున్నవాడు అని సెంకండాఫ్ సగం వరకూ తెలియదు. అలాగే హీరోకి ఫలానా వాడు విలన్, అతనో రాక్షసుడు అని తెలిసే సరికే సినిమా ప్రీ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసింది. ఆ తర్వాత అయినా హీరో యాక్షన్ లోకి దిగి ఏదన్నా చేస్తాడా అంటే దైవ శక్తి వచ్చేదాకా ఏం చేయలేని నిస్సహాయ పరిస్ధితి. ఇక క్లైమాక్స్ లో అయితే హీరోని విలన్ కొడితే ఎగురుకుంటూ ఆ ఫోర్స్ తో కైలాసంకు పోతాడు. ఆ సీన్స్ నవ్వు తెప్పిస్తాయి తప్ప ఎమోషనల్ గా ఇన్వాల్వ్ కానివ్వవు. ఇవన్నీ ఎంతో శ్రమకోర్చి చేసిన గ్రాఫిక్స్ ని సైతం నీరు కార్చేలా చేసాయి. ఇదంతా కథన సమస్యే.

    సినిమాకు హైలెట్స్ లో... రవిశంకర్.. విలన్ గా తన వాయిస్ తో సినిమాకు మంచి ఆకర్షణగా నిలిచారు. అలాగే మహేశ్వరిగా అనూష్క ఉన్న సీన్స్ వరకూ బాగా చేసింది. అయితే నటనకు అవకాసం లేకపోవటంతో ఆమెకు పెద్దగా సీన్ లేకుండా పోయింది. నేస్తమా నేస్తమా పాటలో, కన్యాకుమారి పాటలో ఆమె చాలా అందంగా కనిపించి అలరిస్తుంది. నాగార్జున ఎప్పటిలాగేనే ఈ వయస్సులోనూ మన్మధుడుగానూ, మరో ప్రక్క మాస్ కు నచ్చే డైలాగులు చెప్తూనూ తన పాత్రను సమర్దవంతంగా పోషించారు.ఇంటర్వెల్ దగ్గర వచ్చిన అఘోరాల దాడి సన్నివేశం బాగుంది. బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్ ఎస్ నారాయణ,పృధ్వి లపై చేసిన రంగు రాళ్లు టెలీ షాపింగ్ సీన్స్ బాగా పండాయి. కేమిల్స్ మస్ట్ బి ఇన్ డిజర్ట్స్ అంటూ కృష్ణ భగవాన్ వేసే పంచ్ లు బాగానే పండాయి.ఛార్మి ఐటం సాంగ్ బాగున్నా.. మరీ లావు అవటంతో అంత హాట్ గా లేదు. ఛోటా కె నాయుడు కెమెరా వర్క్ సోసో గా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆడియో ఆల్రెడీ హిట్ కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడేలేదు. దర్శకుడుగా శ్రీనివాస రెడ్డి... గ్రాఫిక్స్ మినహా సీన్స్ పండించలేకపోవటం మైనస్ గామారింది. గ్రాఫిక్స్ లో నాగార్జునని... నంది రక్షించే సన్నివేశం బాగుంది. శివుడుగా ప్రకాష్ రాజ్ బాగున్నా... ఆయన కనపడే సీన్స్ చాలా రెగ్యులర్ గా ఉన్నాయి. ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేసి, సెకండాఫ్ ని ట్రిమ్ చేయాలనిపిస్తుంది. డైలాగులు కొన్ని బుకిష్ లాంగ్వేజ్ లో నడవటం, పంచ్ లు పేలకపోవటం జరిగింది.

    ఏదైమైనా నాగ్ వీరాభిమానలుకు మాత్రమే నచ్చే ఈ చిత్రం క్లైమాక్స్ లో వచ్చే గ్రాఫిక్స్ పిల్లలకు హల్క్, షెర్క్ వంటి కొన్ని హాలీవుడ్ యానిమేషన్స్ ని గుర్తు చేసి అలరిస్తుంది. అయితే టోటల్ గా సినిమా మాత్రం సీన్స్ సాగుతూ... నీరసమైన క్లైమాక్స్ తో నిరాసపరుస్తుంది. కథ సరిగా కుదరకపోతే ఎంత అద్బుతమైన గ్రాపిక్స్ అయినా ప్రాణంలేని శరీరానికి అలంకారమే అని మరోసారి నిరూపిస్తుంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Akkineni Nagarjuna's much awaited film Damarukam, whose release was postponed twice earlier, finally releasing today with average talk. It is a socio-fantasy movie, which revolves around the story of a common man, who fights against a Rakshasha with the help of Lord Shiva and saves the world. Directed by Srinivas Reddy, the socio-fantasy film also stars Anushka Shetty. Ganesh Venkatraman plays the antagonist. It's touted to be the most expensive film in Nag's career and the computer graphics running into 70 minutes are a major highlight.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X