For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఛండాలముఖి ('నాగవల్లి' రివ్యూ)

  By Srikanya
  |

  Nagavalli

  Rating

  -జోశ్యుల సూర్య ప్రకాష్
  బ్యానర్: శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్
  తారాగణం: వెంకటేష్, కమలిని ముఖర్జీ, రిచా గంగోపాధ్యాయ, అనుష్క, శ్రద్దాదాస్ తదితరులు.
  సంగీతం: గురుకిరణ్
  కొరియోగ్రపీ: శ్యాం కె నాయుడు
  ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
  నిర్మాత: బెల్లంకొండ సురేష్
  కధ, స్క్రీన్, ప్లే, దర్శకత్వం: పి.వాసు

  పరాజయాలనుంచి తప్పించుకోవాలంటే మూలాలకి వెళ్ళి సరిచేసుకోవాలి అని వెంకటేష్ నమ్మినట్లున్నాడు. రీమేక్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా వెలిగి, ఎదిగిన వెంకటేష్ వాటికి బ్రేక్ ఇచ్చి స్ట్రైయిట్ సినిమాలు చేసి దెబ్బ తిన్నాడు. దాంతో రీమేక్ లే రక్ష అని చంద్రముఖి వంటి సూపర్ హిట్ కి సీక్వెల్, కన్నడ చిత్రం ఆప్త రక్షకకు రీమేక్ అయిన నాగవల్లి నమ్ముకున్నాడు. అయితే చంద్రముఖి సీక్వెల్ అనే ప్రచారమే ఈ చిత్రాన్ని ఇబ్బందుల్లో పడేసింది. చంద్రముఖిని రేంజిని ఊహించుకుంటూ ధియోటర్ కి వచ్చిన ప్రేక్షకులు ఆ చిత్రంతో పోలుస్తూ నాగవల్లిని చూసి పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా చంద్రముఖిలో హైలెట్ గా నిలిచిన స్క్రీన్ ప్లే, క్లైమాక్సే ఈ చిత్రానికి మైనస్ గా మారింది. ఇక అలాగే చంద్రముఖిలో సక్సెస్ కి కీలకం అయిన 'లకలకలక డైలాగు'..ఈ సారి 'ఔరా...ఔరా..' అంటూ అరిగిపోయిన రికార్డులా విసుగు తెప్పించింది. వెంకటేష్ మూడు గెటప్స్ లో కనిపించినా కిక్కు ఇవ్వలేకపోయాడు. కొద్ది పాటి ధ్రిల్స్ ఉన్న ఈ చిత్రం కొద్ది మందికే నచ్చే అవకాసం ఉంది.

  చంద్రముఖి చిత్రపటం..దాని వల్ల వచ్చిన సమస్యలు అనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. డాన్స్ కాంపిటేషన్ లో గిప్ట్ గా వచ్చిన చంద్రముఖి చిత్రపటం అందుకున్న గాయిత్రీ(కమలినీ ముఖర్జీ) వెంటనే తన భర్తని యాక్సెడెంట్ లో కోల్పోతోంది. అంతేగాక ఆ చిత్రపటం ఎఫెక్టుతో ఆమె ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. అలాగే ఆ ఇంటిలో ఉంటున్న గాయిత్రి చెల్లెళ్ళు గీత( శ్రద్ధ దాస్), గౌరీ(రిచా గంగోపాద్యాయ) విచిత్రంగా బిహేవ్ చేస్తూంటారు. దాంతో పరిశోధనకు సైక్రాటిస్ట్ ఈశ్వర్ (చంద్రముఖి లో రజనీకాంత్) శిష్యుడు విజయ్(వెంకటేష్) అక్కడికి వస్తాడు. అతను..చంద్రముఖి అస్సలు ఆ కుటుంబంలో ఎవరిని ఆవహించింది..అలాగే తన పోలికలతో ఉన్న రాజా నాగభైరవ(వెంకటేష్) ఎవరు..ఆయనకీ, చంద్రముఖికీ, ఈ కేసుకీ ఉన్న సంభందం ఏమిటన్నది తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

  చిత్రపటం మూలంగా సమస్య వచ్చిందని తెలిసినప్పుడు ముందు ఆ చిత్రపటం బయిటపడాయలన్న కామన్ ఆలోచన ఆ ఇంట్లో వాళ్ళకి ఎందుకురాదో అన్న సందేహం ఈ చిత్రం చూస్తూండగా కలిగే మొదటి సందేహం. అలాగే తమ ఇంట్లో పెద్ద పాము తిరిగుతోందని, దాని కుబుసం చూసానని చెప్పే ఇంటి పెద్ద(శరత్ బాబు) అంతగా పాము తిరిగుతున్న ఆ ఇంటిని ఎందుకు వదిలి తన కుటుంబాన్ని ఎందుకు రక్షింకుకోవాలనుకోడో అస్సలు అర్దం కాదు. అయితే హర్రర్ చిత్రాలన్నిట్లోనూ తమ ఇంట్లో సమస్య ఉందని తెలిసినా ఉండేది అద్దె ఇల్లు అయినా వదలకుండా అంటుకుని ఉండి సమస్యలను ఫేస్ చేయటం అనే ఎలిమెంట్ కామన్ కాబట్టి దాన్ని సినిమాటిక్ గా భావించి వదిలేద్దాం.

  కథ విషయానికి వస్తే చంద్రముఖిని అనుసరిస్తూ అల్లకున్న ఈ కథలో మొదటి చిత్రంలో ఉన్నంత డెప్త్ కనిపించదు. అలాగే చంద్రముఖి చివరలో చేసే మానసిక విశ్లేషణ సినిమాను చాలా ఎత్తుకు తీసుకెళ్ళింది. అదే నాగవల్లి లో కరువైంది. మళయాళంలో ఫాజిల్ (చంద్రముఖి ఒరిజనల్ దర్శకుడు) చేసినంత చక్కగా స్క్రిప్టుని పి.వాసు ఈ నాగవల్లిని ఆసక్తిగా మలచలేకపోయారని అర్దమవుతూంటుంది. కొన్ని ట్విస్టులు అనుకుని వాటినే నమ్ముకుని చిత్రం చేసినట్లు కనపడుతుంది. అలాగే క్లైమాక్స్ లో చంద్రముఖి ఆత్మ తన పగ తాను తీర్చుకుంటోంది..అందుకు కారణమైన వాడ్ని చంపేస్తుంది అని చెబుతూ హీరో దూరంగా నిలబడటంతప్ప ఈ సీక్వెల్ లో ఏం చేసిందీ కనపడక ప్యాసివ్ అనిపిస్తాడు. దాంతో క్లైమాక్స్ పూర్తిగా తేలిపోయినట్లైంది. అలాగే రాజా గెటప్ లో వెంకటేష్ కనపడే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్..అరుంధతిలో సోనూసూద్ పాత్రని గుర్తు చేస్తుంది. ఎంతలా అంటే ఇక్కడా అతని కామ వాంఛకి బలైపోయేది కూడా అనూష్క అనే దాకా.

  ఇక ఈ చిత్రంలో బాగున్నవి..వెంకటేష్ నెగిటివ్ పాత్ర చేయటం, రీ రికార్డింగ్, చంద్రముఖిగా చేసిన హీరోయిన్ (ఇదే సస్పెన్స్) నటన, ఆర్ట్ డిపార్టమెంట్. టెక్నికల్ గా ఈ సినిమా అతి సాధారణ స్ధాయిలో ఉంది. అలాగే పి.వాసు దర్శకత్వం చాలా పాతకాలం వ్యవహారంలా అనిపిస్తూంటుంది. పరుచూరి బ్రదర్శ్ డైలాగులు..ఎక్కడా పేలకుండా కధను ముందుకు తీసుకెళ్ళటానికి మాత్రమే ఉపయోగపడుతూంటాయి. ఇక బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రమణ్యం ఇంత బ్యాడ్ కామిడీ ఈ మధ్య కాలంలో ఏ చిత్రంలోనూ చేయలేదేమో అనిపిస్తుంది. హీరోయిన్స్ లో అనూష్క రెగ్యులర్ గా చేస్తే, కమిలినీ ముఖర్జీ, రిచాపోధ్యాయ బాగా చేసారు.

  ఇంతకీ ఈ సీక్వెల్ ఎందుకు చూడాలి అంటే ఈ సారి చంద్రముఖి పాత్రని ఎవరు చేసారు అన్న విషయం తెలుసుకోవటానకే. అలాగే చంద్రముఖి దృష్టిలో పెట్టుకుని ధియోటర్ కి వస్తే ఈ నాగవల్లి నచ్చదు. వెంకటేష్ కొత్త సినిమా అనుకుని చూస్తే కొత్తగా అనిపించే క(అ)వకాశం ఉంది. అలాగే రజనీకాంత్ శిష్యుడు వెంకటేష్ అని చెప్పే ఈ చిత్రంలో వెంకటేష్ శిష్యుడు బ్రహ్మానందంగా చూపారు. అంటే చంద్రముఖి-3 ప్లాన్ చేస్తే బ్రహ్మానందంను హీరోగా పెడతారా అని చాలా మంది ఫిక్సైపోయారు. అప్పుడు బ్రహ్మానందంకు "లకలకలక" లాగా ఏం డైలాగు పెట్టే అవకాసం ఉందో అని కొందరు ఆలోచనలో పడిపోయారు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X