twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్క్రీన్‌ప్లే మీదే....(ఆర్‌ఎస్‌పి నెట్‌వర్క్‌)

    By Staff
    |

    Nandanavanam 120 KM
    సినిమా: నందనవనం 120 కిమీ
    విడుదల తేదీ: 07-07-2006
    నటీనటులు: అజయ్‌వర్మ, మానస, కోట శ్రీనివాసరావు, నరేష్‌, మొదలైనవారు
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నీలకంఠ

    గతం గుర్తు లేని కుర్రాడికి ఆ గతాన్ని గుర్తు చసేన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'నందనవనం 120 కిమీ' సినిమా. స్క్రీన్‌ప్లేకు జాతీయ అవార్డు తెచ్చుకున్న నీలకంఠ ఈ సినిమా దర్శకుడు. ఆ స్క్రీన్‌ప్లే మీదనే ఆధారపడి చేసిన ప్రయోగం ఈ సినిమా. గ్లాఫ్తోమీనియా మల్టపుల్‌ డిజార్డర్‌ వంటి గంభీరమైన పదాలతో సైకలాజికల్‌గా థ్రిల్‌ కలిగించాలని నీలకంఠ ఈ ప్రయోగం చేశారు. అయితే కొంత కథ ఉంటే బాగుండేది.

    నందనవనం అంటే ఓ ఎస్టేట్‌. అది హైదరాబాద్‌ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. అక్కడ జరిగే సంఘటనల సమాహారమే ఈ చిత్రం. సినిమా చూస్తే వచ్చేదేమీ లేదు, చూడకపోతే పోయేదేమీ లేదని అనిపించకమానదు. పి.జి. విందా కెమెరా చాలా చోట్ల ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. ఏతావాతా చెప్పుకోవాల్సిందేమైనా వుంటే కోట శ్రీనివాసరావు నటన గురించే. విలన్‌గా కనిపిస్తూనే సైకలాజిస్టుగా మలుపు తిరగడం ఓ థ్రిల్‌. ఇంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X