For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కామెడీనే కానీ.... ('భలే భలే మగాడివోయ్‌' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.5/5
  ---సూర్య ప్రకాష్ జోశ్యుల
  అల్లు అరవింద్ వంటి సీనియర్,సక్సెస్ ఫుల్ నిర్మాతను ఒప్పించి సినిమా చేసాడంటే ఆ కథలో ఏదో విషయం ఉండే ఉంటుందని అంచనాకు వస్తాం. అయితే దర్శకుడు మారుతి మాత్రం కేవలం హీరో క్యారక్టరైజేషన్ లో విషయం ఉండేలా చూసుకున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన గజనీ ని గుర్తు చేసే మతిమరుపు పాత్రతో నవ్వించే ప్రయత్నం చేసాడు. అయితే రచయితగా మారుతి దృష్టి కామెడీ సిట్యువేషన్స్ మీదే ఉంది కానీ కథలో వచ్చే రిపిటీషన్స్ తొలిగించటం మీదా, కథలోపలకి వెళ్లి చేయాల్సిన కథనం మీద పెట్టలేదు. దాంతో సినిమా ధియోటర్ లోఉన్న కాస్సేపు నవ్వుకోవటానికి బాగానే ఉందనిపించి కానీ, తప్పనిసరిగా చూడాలి అనిపించే అవుట్ పుట్ రాలేదు.

  అయితే నాని,మిగతా టెక్నికల్ టీమ్ ఈ సినిమాను తమ ప్రతిభతో స్క్రిప్టు లోపాలు బయిటపడనీయకుండా లాక్కెళ్లే ప్రయత్నం చేసారు. అయితే ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం మాత్రం గీతా ఆర్ట్స్ వంటి రిప్యూటెడ్ బ్యానర్ చిన్న సినిమాలపై దృష్టి పెట్టి తమ కుటుంబ హీరోలతో కాకుండా బయిటి వారితో ఈ చిత్రాన్ని నిర్మించటం. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ...సినిమా చూసిన తర్వాత దర్శకుడు మారుతి అని మాత్రం మరిచిపోతాం..ఎక్కడ బూతులేకపోవటంతో.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  లక్కి(నాని) కు చిన్నప్పటినుంచీ వీర మతిమరుపు. దాన్నే కంటిన్యూ చేస్తూ పెద్దయ్యాక కూడా మతిమరుపుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎదుగుతాడు. దాంతో అతనికి పెళ్లి సైతం ఓ సమస్యగా మారుతుంది. ఈ నేపధ్యంలో అతనికి ఓ సైంటిష్టు పూర్ణ చంద్రరావు (మురళి శర్మ) కుమార్తెతో ఓ సంభంధం చూస్తారు. అయితే నాని..ఆయన్ను తన మతిమరుపుతో ఇబ్బందిపెడతాడు. దాంతో నానికి తన కూతురుని ఎట్టి పరిస్దితుల్లో ఇచ్చేది లేదని తెగేసి చెప్పేస్తాడు. తర్వాత నాని ఓ రోజు నందిన(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతనితో ప్రేమలో పడుతుంది. ఈ లవ్ జర్నిలో ..తన మతిమరుపుతో కొన్నిసార్లు నాని ఆమె దగ్గర దొరికిపోయే సమయంలో తన సమయస్పూర్తితో అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి బయిటపడుతూంటాడు. అయితే ఇక్కడో ట్విస్ట్...నందిన మరెవరో కాదు తనని ఇష్టపడకుండా రిజెక్టు చేసిన సైంటిస్టు కుమార్తే. ఈ విషయం తెలిసిన నాని ఎలా కవర్ చేసి, ఆమెను దక్కించుకున్నాడు..అలాగే ఈ చిత్రంలో అజయ్ పాత్ర ఏమిటి..నానికి ప్రేమకు ఎలా అడ్డుపడ్డాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  మారుతి చిత్రాల్లో మొదటి నుంచి ఫన్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. అలాగే ఆయన టెక్నికల్ వాల్యూస్ కు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. అదే ఈ చిత్రంలోనూ కనపడింది. కెమెరా వర్క్ సినిమాని ఓ మెట్టు పైకి తీసుకు వెళ్లింది. అలాగే మారుతి రాసిన డైలాగులకు ధియోటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఫన్ కు ఇచ్చిన ప్రయారిటీ ఆయన కథనం రాసుకోవటం లో ఇవ్వలేదు. హీరో నాని కు చిన్నప్పటి నుంచి తనకు మతిమరుపు అనే సమస్య ఉందని తెలిసినప్పుడు అందుకు ఎక్కడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు కనపడడు. అలాగే అప్పటికప్పుడు తన మతిమరుపుని కప్పి పుచ్చుకునే చేష్టలు చేస్తూంటాడు, దొరికిపోయినప్పుడు తల వంచుకుంటాడు కానీ దాన్ని అధిగమించటానికి ఏ ప్రయత్నం చేయడు.

  కేవలం తన కథకు కావాల్సినట్లుగానే కామెడీ వచ్చేటట్లుగానే మారుతి వీటిని ఎస్కేప్ చేసారు. ఎంత సినిమాటెక్ లిబర్టీ అనుకుందామనుకున్నా ఇది ఇబ్బందిగానే అనిపిస్తుంది. అంతేకాదు సీన్లు చాలా వరకూ రిపీట్ అవటం మొదలయ్యాయి. హీరోకు మతిమరుపు- దాని వల్ల వచ్చే ఇబ్బందులు అన్నట్లు అదే పాయింట్ మీద సీన్స్ రాసారు కానీ ఆ వచ్చిన సమస్యను ఎలా అధిగమించే ప్రయత్నం చేసాడు అన్నది చూసుకోలేదు. దాంతో మరో స్దాయికి వెళ్ళాల్సిన కాన్సెప్టు, సినిమా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది.

  స్లైడ్ షోలో మిగతా రివ్యూ

  హైలెట్స్

  హైలెట్స్

  హీరోయిన్ కు ధియోటర్ కు వస్తానని చెప్పి..మతిమరుపుతో మర్చిపోయి..దాన్ని కవర్ చేసేటప్పుడు శంకర్ దాదా ఎంబిబిఎస్ లోని అబ్బాజాన్ సీన్ బాగా నవ్విస్తుంది.

  రొటీన్ ఫార్ములా

  రొటీన్ ఫార్ములా

  సెకండాఫ్ లో కథ కదలక దర్శకుడు దాన్ని వెన్నెల కిషర్ ని తన ప్లేస్ లో పెట్టి నాటకం ఆడే కన్ఫూజ్ కామెడీ..పరమ రొటీన్ అనిపిస్తుంది. అదే సెకండాఫ్ కు జస్ట్ ఓకే అనిపించేలా చేసింది.

  ఫ్రీ క్లైమాక్స్

  ఫ్రీ క్లైమాక్స్

  అలాగే ఫ్రీ క్లైమాక్స్ లో హీరోకు ఉన్న మతిమరుపు బయిటపడిపోతుందని, అందరూ ఛీ కొడతారని అంతా ఊహించేదే..దాన్నే రిపీట్ చేసి, పాత చింతకాయపచ్చడి అనిపించాడు.

  సిల్లీగా

  సిల్లీగా

  హీరోయిన్ ...హీరోతో కేవలం బ్లడ్ ఇచ్చాడని ప్రేమలో పడటం, అలాగే హీరోయిన్ తండ్రి కన్వీన్స్ అయ్యానని చెప్పే డైలాగులు,తన కూతురుని ప్రేమించే వాడని ఇంటికి రమ్మనకండా ఎక్కడో బయిట కలవమనటం వంటివి చాలా సిల్లీగా అనిపిస్తాయి.

  బలంగా లేదు

  బలంగా లేదు

  సినిమాలో ఉన్న ఏకైక నెగిటివ్ పాత్ర అజయ్. దాన్ని బలంగా తీర్చిదిద్దలేదు దర్శకుడు. అలాగని దాన్ని కామెడీ చెయ్యలేదు. హాఫ్ బేకెడ్ గా ఈ క్యారక్టర్ ని, అందులోంచి సీన్స్ ని డిజైన్ చేసాడు.

  హీరో,హీరోయిన్స్

  హీరో,హీరోయిన్స్

  ఈ సినిమాకు ఉన్న ప్లస్ హీరో,హీరోయిన్స్ అని చెప్పటంలో సందేహం లేదు. అలాగే హీరోయిన్ తండ్రిగా కూడా మురళి శర్మ కొత్తగా, చక్కగా ఉన్నాడు

  టెక్నికల్ గా

  టెక్నికల్ గా


  ఈ చిత్రం కెమెరాపరంగా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. అలాగే సినిమాను చాలా రిచ్ లుక్ తో ఉండేలా నిర్మాణ విలువలు బాగున్నాయి. డైలాగులు బాగున్నాయి

  ఎవరెవరు

  ఎవరెవరు


  బ్యానర్:గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్
  నటీటులు:నాని, లావణ్య త్రిపాఠి, మురళిశర్మ, సితార, నరేష్, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు
  ఎడిటింగ్: ఉద్ధవ్, కెమెరా: నిజార్ షఫీ,
  సంగీతం: గోపీ సుందర్,
  నిర్మాత: బన్నీవాసు,
  సమర్పణ: అల్లు అరవింద్
  రచన, దర్శకత్వం: మారుతి.
  విడుదల తేదీ: 05,సెప్టెంబర్ 2015.

  ఫైనల్ గా మారుతి తన బ్రాండ్ బూతుని అక్కడక్కడా ప్రదర్శించబోయి కంట్రోలు..కంట్రోలు అనుకుని కొద్దిలోనే ఆగిపోయిన ఈ చిత్రం ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకుండా కేవలం నవ్వుకోవటానికి పెద్ద కథ ఎందుకు అనుకుని వెళితే నిరాశపరచదు. సినిమా చూపిస్తా మామా లాంటి సినిమాలా నవ్వుకోవచ్చు అని ఊహిస్తే మాత్రం దెబ్బతింటారు.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Bhale Bhale Magadivoy comes as a surprisingly 'decent' film from the director unlike his previous works. He managed to stick with the single point he chose but made sure we don't feel dreary roaming around the same point for 144 minutes. Nani plays an absent minded person who forgets the task he sets out for when he is intercepted with something else.Geetha Arts & UV Creations jointly producing the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X