twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెల్లని ‘పైసా’ (సినిమా రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    --సూర్య ప్రకాష్ జోశ్యుల

    ఒకప్పుడు కృష్ణ వంశీ చిత్రాలంటే తన దైన సృజనాత్మకతతో , ఎంతో కొంత సామాజిక స్పృహతో,వినోదాత్మకంగా ఉంటాయని ఆశించేవారు. అయితే ఆయన క్రియేటివిటీని మూలనబెట్టి, వరస ఫ్లాపుల బాట పట్టి,ఇష్టం వచ్చినట్లు తీసి అదే అద్బుతం అనుకోమంటూంటే మాత్రం ఎవరికీ నచ్చటం లేదు. ఇక పైనాన్స్ ఇబ్బందులతో గత కొంతకాలంగా వాయిదాలు పడుతూ లేస్తూ వచ్చిన 'పైసా'కూడా అదే రూట్ లో ప్రయాణం పెట్టుకుంది. హిందీ సినిమా కమీనాని గుర్తు చేసే ఈ సినిమా అంతా పాత్రల హడావిడి, అరుపులతో కంగాళి సినిమాలా మారిపోయింది. దానికి తోడు కెమెరా ఏంగిల్స్,రీరికార్డింగ్ కూడా చాలా ఇబ్బంది పెట్టి టిక్కెట్ పైసలు దండుగ అనిపించేలా చేసాయి.

    పాత బస్తీలోని షేర్వాణీ దుకాణంలో మోడల్‌ ప్ర'క్యాష్' (నాని)కి డబ్బంటే పిచ్చి. ఎలాగైనా కోటీశ్వరుడు అయిపోవాలనుకునే అతన్ని ఓ పేద ముస్లిం అమ్మాయి నూర్జహాన్‌ (కేథరిన్‌) ప్రేమిస్తుంది. అయితే డబ్బే ముఖ్యం అనుకునే ప్రకాష్ ఆమెను నిర్లక్ష్యం చేయటంతో ఆమె ఓ ముసలి షేక్ ని వివాహం చేసుకోవానికి సిద్దపడుతుంది. అది తెలిసిన ప్రకాష్ ఆమెను సేవ్ చేసే ప్రాసెస్ లో ఓ వెహికల్ తో పారిపోతాడు. ఆ వెహికల్ లో ఓ మినిస్టర్ (చరణ్ రాజ్) ఎన్నికల కోసం పంపిన హవాలా డబ్బు 50 కోట్లు ఉంటుంది. అక్కడ నుంచి కథ మలుపు తిరిగుతుంది. చివరకు నూర్జహాన్ ప్రేమను ఒప్పుకున్నాడా... ఆ డబ్బు ఏమైంది అనేది మిగతా కథ.

    డబ్బు అనే పిచ్చి పట్టకూడదనే మెసేజ్ తో వచ్చిన ఈ చిత్రం కథ కొత్తేమీ కాదు. అలాగే కథలో మెయిన్ ప్లాట్,సబ్ ప్లాట్ రెండు సరిగ్గా కలిసినట్లు కనపడవు. హవాలా డబ్బు ...డబ్బు అంటే పిచ్చి ఉన్న హీరోకి దొరకటం, మరో ప్రక్క అతను తనను ప్రేమించే అమ్మాయి పేద అనే కారణంతో రిజెక్టు చేయటం రెండు సమాంతరంగా కలవవు. దీనికి తోడు ఈ సబ్ ప్లాట్ కి ముక్కో ణపు ప్రేమ కథలా మరో అమ్మాయి ...సిద్దికా (మినిస్టర్ కూతురు)ని పెట్టారు. దాంతో సినిమా కాసేపు ప్రేమ కథలా,మరి కాసేపు డబ్బు దొరికిన తర్వాత హీరో పడే ఇబ్బందులు అన్నట్లు జరుగుతుంది. అలాగే సెకండాఫ్ మొత్తం ఛేజింగ్ లతో నింపేసారు. ఎక్కడా కథ ఆగి మనకు అర్దమయ్యే పరిస్ధితి కనపడదు.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో....

    నాని నటన

    నాని నటన

    నాని నటన పరంగా బాగా ఓవర్ గా చేసాడనిపిస్తుంది. ముఖ్యంగా మోహన్ బాబుని గుర్తుచేసే మాడ్యూలేషన్ తో డైలాగులు చిరాకు పుట్టిస్తాయి.

    కామెడీ

    కామెడీ

    ప్రస్తుతం సినిమాలకు యుఎస్ పి గా కామెడీ మారింది. అదే ఈ సినిమాలో మిస్సైంది. సెపరేట్ ట్రాక్ లేకున్నా ఉన్నంతలో కూడా హీరో,హీరోయిన్స్ చేత హాస్యాన్ని పండించి రిలీఫ్ ఇవ్వలేకపోయారు.

    దర్శకత్వం

    దర్శకత్వం

    కృష్ణవంశీ దర్శకుడుగా బాగా వెనక్కి వెళ్లిపోయాడనిపిస్తుంది. స్టోరీ టెల్లింగ్ లో స్పష్టత కొరవడింది. అలాగే మేకింగ్ పరంగానూ పెద్ద మెరుపులు లేవు. కెమెరా యాంగిల్స్ సైతం కళ్లకు ఇబ్బంది కలిగేలా చాలా కాంప్లిక్స్ గా ఉన్నాయి.

    స్క్రీన్ ప్లే

    స్క్రీన్ ప్లే


    సినిమాకు ప్రాణమై నిలిచే స్క్రీన్ ప్లే నే సరిగ్గా లేకపోవటం సినిమాకు మైనస్ గా మారింది. సెటప్ పూర్తయ్యి హీరో యాక్షన్ లోకి వచ్చే సరికే ఇంటర్వెల్ వచ్చేసింది. అక్కడ నుంచి అన్ని సీక్వెన్స్ లు యాక్షన్ తో నింపేసారు. ఎక్కడా ఎమోషన్ లేకుండా చేసేసారు.

    టెక్నికల్ గా...

    టెక్నికల్ గా...

    సినిమాటోగ్రఫి చాలా వీక్ గా ఉంది. అలాగే డి.ఐ వర్క్ కూడా చాలా సీన్స్ కు చేసినట్లు లేరు. ఎడిటింగ్ కూడా బాగోలేదు. అదీ చాలా ఇబ్బంది పెట్టింది. సీజీ షాట్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి.

    సంగీతం

    సంగీతం

    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా హడావిడి వాతావరణం క్రియోట్ చేసి విసిగించింది....పాటల్లో టైటిల్ సాంగ్,మరొకటి బాగుంది. అలాగే సంగీతానికి తగినట్లు సాంగ్స్ మేకింగ్ కూడా పూర్ గా ఉంది.

    హీరోయిన్స్

    హీరోయిన్స్

    సెక్సీ హీరోయిన్ కేధీరిన్ ని పూర్తి బురాఖాలో పెట్టి కథ నడిపేసారు. అలాగే సాథికా శర్మ కేవలం గ్లామర్ మాత్రమే. నటన శూన్యం. సినిమాకు హీరోయిన్స్ ప్లస్ కాలేకపోయారు.

    కాన్సెప్టు,డైలాగ్స్

    కాన్సెప్టు,డైలాగ్స్

    సినిమాకు ఎత్తుకున్న హవాలా కాన్సెప్టు పరంగా చాలా బాగుంది. అలాగే హీరోకి డబ్బు దొరికినప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అదే పంచ్ ని మిగతా సీన్స్ లో మెయింటైన్ చేయలేకపోయారు. డైలాగ్స్ మాత్రం సోసోగా ఉన్నాయి.

    నిర్మాణ విలువలు

    నిర్మాణ విలువలు

    కొంతవరకూ బాగానే డబ్బు ఖర్చు పెట్టి సినిమాని చేసారని అర్దమవుతుంది. అయితే సినిమా పూర్తయ్యాక చెయ్యాల్సిన డి.ఐ వంటి వాటికి చేతులు ఎత్తిసినట్లు అనిపిస్తుంది. ఎక్కువ ఖర్చు ఛేజ్ లపై పెట్టారు.

    ఎవరెవరు...

    ఎవరెవరు...

    చిత్రం: పైసా
    సంస్థ: ఎల్లో ఫ్లవర్స్‌
    తారాగణం: నాని, కేథరిన్‌, సిద్దికా, భరత్‌రెడ్డి, చరణ్‌రాజ్, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, ఆర్కే, తబర్, లోబో, రాజు శ్రీవాస్తవ తదితరులు.
    రచన: కె.కె. బినోజీ, శ్రీనివాస్‌రెడ్డి, పాత్రికేయ,
    పాటలు: సీతారామశాస్త్రి, అనంత శ్రీరామ్,
    ఛాయాగ్రహణం: సంతోష్‌కుమార్ రాయ్,
    సంగీతం: సాయికార్తీక్‌
    నిర్మాత: రమేష్‌ పుప్పాల
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ.
    విడుదల: 07,పిభ్రవరి,2014

    ఏదైమైనా క్రియేటివ్ డైరక్టర్ గా ముద్రపడ్డ కృష్ణ వంశీ నుంచి ఆశించే చిత్రం ఏ మాత్రం కాదు. హింస ఎక్కువ అవటం,వినోదం చాలా తక్కువగా ఉండటంతో ఓ వర్గం ప్రేక్షకులు చాలా దూరంగా ఉండే అవకాసం ఉంది. అలాగే నాని హీరో అని ఓ తరహా చిత్రం ఆశించి వచ్చే కుటుంబ ప్రేక్షకులుసైతం ఇలాంటి సినిమాని ఊహించరు కాబట్టి... భాక్సాఫీస్ వద్ద ఎంతమేరకు విజయం సాధిస్తుందనేది ప్రశ్నార్దకమే.

    English summary
    Nani, Catherine Tresa's ‘Paisa directed by Krishna Vamsi is finally released today(Feb 7th)with negitive talk. Sai Karthik scored music for the film which is touted to be a political entertainer. Ramesh Puppala is producing this film under Yellow Flower banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X