»   » జస్ట్ టైమ్ పాస్... (‘నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్’ రివ్యూ)

జస్ట్ టైమ్ పాస్... (‘నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ల‌క్కీ మీడియా బ్యానర్‌పై భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాత‌గా రూపొందిన చిత్రం నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌. రావు ర‌మేష్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్ సేన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా, సాయి కష్ణ కథ సమకూర్చారు. స్క్రీన్ ప్లే, మాటలు ప్రసన్న కుమార్.

హిట్ చిత్రాల నిర్మాతగా ప్రఖ్యాతిగాంచిన దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' సినిమా ఎలా సాగింది, సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా? అనేది ఓ లుక్కేద్దాం...

కథ విషయానికొస్తే....రాఘవరావు (రావు రమేష్)కు లేక లేక కలిగిన సంతానం పద్మావతి (హెబ్బా పటేల్). కూతరంటే రాఘవరావుకు ప్రాణం. జాతకాలను నమ్మే రాఘవరావు .... జాతకాల ప్రకారం తండ్రీ కూతుళ్లకి అస్సలు పడదని పురోహితడు చెప్పడంతో.... ముందు నుండీ జాగ్రత్తగా ఉంటాడు. తన ప్రాణానికి ప్రాణమైన కూతురికి నచ్చినట్లే తాను నడుచుకుంటూ పెంచుతాడు. పెళ్లీడు రావడంతో పద్మావతికి పెళ్లి చేయాలని డిసైడ్ అయిన రాఘవరావు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఉంటలాడు. అయితే ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం కాకుండా తాను ఇష్టపడ్డవాడినే చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న పద్దూ.... తను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు అబద్దం చెబుతుంది. ఆ తర్వాత ముగ్గురు ఓ అబ్బాయిల్లో తనకు సెట్టయ్యేవాడిని సెలక్ట్ చేసుకోవాలని భావిస్తుంది. దీనికి తండ్రి ఎలా స్పందించాడు, చివరకు పద్మావతి ఎవరిని పెళ్లి చేసుకుంది అనేది... తర్వాత జరిగే స్టోరీ.

రావు రమేష్

రావు రమేష్

పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే... సినిమాలో హైలెట్ అయింది తండ్రి పాత్రలో నటించిన రావు రమేష్. సినిమాకు ఆయన నటనే ప్రధాన బలం. కూతురు భవిష్యత్తు బావుండాలని తపించే తండ్రి పాత్రలో జీవించాడు. రావు రమేష్ లేకుండా సినిమా చూడలేం అనే ఫీలింగ్ కలిగించాడు.

హీరోయిన్, ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్

హీరోయిన్, ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్

హెబ్బ పటేల్ తన బబ్లీ పెర్ఫార్మెన్స్, క్యూట్ లుక్ తో ఆకట్టుకుంది. రావు రమేష్ తర్వాత సినిమాలో ఆకట్టుకునే క్యారెక్టర్ హెబ్బ పటేల్. బాయ్ ఫ్రెండ్స్ పాత్రల్లో అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్ సేన్ తమ తమ పాత్రల్లో ఓకే అనిపించారు. ఈ ముగ్గురిలో పార్వతీశం తన కామెడీ టైమింగుతో కాస్త బెటర్ అనిపించాడు.

కథ కొత్త గా ఏమీ లేదు

కథ కొత్త గా ఏమీ లేదు

కథలో కొత్తదనం ఏమీ లేదు. గతంలో వచ్చిన చుక్కల్లో చంద్రుడు మూవీ కాన్సెప్టు ఇందులో వాడానే ఫీలింగ్ కలుగుతుంది. ఇంట్లో వాళ్లు చూసిన పెళ్లిని తప్పించుకోవడానికి హీరోయిన్ ప్రేమలో పడ్డట్లు బద్దం చెప్పడం... తర్వాత ముగ్గురిని ఎంచుకుని వారిలో తనకు తగిన వాడిని ఎంచుకోవాలనే కాన్సెప్ట్ రొటీన్ గా అనిపిస్తుంది.

దర్శకుడు సినిమాను నడిపించిన తీరు

దర్శకుడు సినిమాను నడిపించిన తీరు

కథ కాస్త రోటీన్ గా అటూ ఇటుగా ఉన్నప్పటికీ..... రావు రమేష్ పాత్రతో సినిమా ఆరంభం, ముగింపు ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. కూతురు కోసం సగటు తండ్రి పడే తపన, భావోద్వేగాలను దర్శకుడు బాగా చూపించాడు. అయితే సినిమా ఆరంభం, ముగింపు విషయాలను వదిలేస్తే.... మధ్యలో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్స్, ప్రేమాయణాలు సో సో గా సాగింది. మధ్యలో గ్యాపును పూడ్చాలి అన్నట్లుగా కథతో సంబంధం లేని కామెడీని జోడిచినట్లు అనిపిస్తుంది.

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాల పరంగా చూస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. సంగీతం యావరేజ్. డైలాగులు అక్కడక్కడ బావున్నాయి. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. ఎడిటింగ్, ఇతర టెక్నికల్ విభాగాలు ఫర్వాలేదు.

rn

ఫైనల్‌గా...

సినిమా గురించి ఫైనల్ గా చెప్పాలంటే యూత్ కు నచ్చే యావరేజ్ టైమ్ పాసింగ్ మూవీ. రావు రమేష్ పాత్ర ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.

English summary
Nanna Nenu Na Boyfriends is a routine romantic drama which has some comedy moments.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu