twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్రేట్...ఇప్పట్లోనూ ఇలాంటి సినిమా ఒకటుంది!! (‘అప్పట్లో ఒకడుండేవాడు’ రివ్యూ)

    నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా బాగుంది.

    By Srikanya
    |

    Rating:
    3.0/5
    Star Cast: శ్రీవిష్ణు, నారా రోహిత్, తన్యా హోప్
    Director: సాగర్ కే చంద్ర
    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    కొన్ని సినిమాలు ధియోటర్ గుమ్మందాటగానే మన మనస్సుని వదిలేస్తాయి. మరికొ న్ని ధియోటర్ దాటి మన ఇంటి గుమ్మంలోకి ప్రవేశించినా మన మనస్సు గుమ్మం దాటి పోనంటాయి. అలాంటి అపురూపమైన సినిమాలు ఆవిష్కరించాలంటే ..సినిమాపై ప్రేమ, తపన దర్శకుడుకి ఉండాలి. తన చెప్పే పాయింట్ పై నిబద్దత ఉండాలి. ముఖ్యంగా చెప్పే విధానంలో నిజాయితీ ఉండాలి. అలాంటి నిజాయితీ ఉన్న సినిమా...ఇప్పట్లో వచ్చిందంటే ఆశ్చర్యమే.

    ఈ సినిమాలో విశేషం ఏమిటంటే..ఒక యాంగిల్ లో ఇది స్పోర్ట్స్ సినిమా బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా అనిపిస్తుంది. మరో వైపు నుంచి చూస్తే గతంలో మన సమాజంలో జరుగుతున్న ఎన్నో అమానుష సంఘటనలకు డాక్యుమెంటరీగా అనిపిస్తుంది.

    ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్ లతోనే ఆసక్తి రేపిన ఈ సినిమా ఖచ్చితంగా చర్చకు దారితీసే అనేక విషయాలను మన ముందు ఉంచుతుంది. ఎటు వైపు మనం ఉండాలో అర్దం కానీ పరిస్దితి తెస్తుంది. నక్సలిజం పాయింట్ తో కథ ని చూపిస్తూ, నడిపిస్తూ...ఓ క్రికెట్ పిచ్చోడు కథని చెప్పటం ఆషామాషి విషయం కాదు.

    ఓ నిజాయితీ గల పోలీస్ ని చూపిస్తూ ...ఆ నిజాయితీ మరో జీవితం నాశనం కావటానికి దోహదం చేసిందే అనే విషయం చెప్పి మన ఆలోచనలను డిఫెన్స్ లో పడేయటం యాధృచ్చికం కాదు. ఇంతకీ ఈ సినిమా కథేంటి..దర్శకుడు ఈ సినిమాతో ఏం చెప్పదలిచాడు..ఏం గొప్పతనం ఉంది..ఏం మైనస్ లు ఉన్నాయి..చూద్దాం పదండి.

     రైల్వే రాజు నుంచి రౌడీ రాజు

    రైల్వే రాజు నుంచి రౌడీ రాజు

    తొంభైలలో జరిగే ఈ కథలో రైల్వే రాజు(శ్రీ విష్ణు) ఓ పెద్ద క్రికెటర్ అవ్వాలని నిరంతరం తపించే కుర్రాడు. ఈ కుర్రాడు కు ఓ లవర్ ఉంటుంది. లైఫ్ అంతా ఫుల్ ఖుషీగా బిందాస్ గా నడుస్తుంది అనుకున్న సమయంలో ఓ ఊహించని సంఘటన జరుగుతుంది. అతని క్రిమినల్ గా మారే పరిస్దితులు వస్తాయి. రైల్వై రాజు కాస్తా రౌడీ రాజు గా మారతాడు.

     పోలీస్ అధికారి ..

    పోలీస్ అధికారి ..

    ఇంతియాజ్ (నారా రోహిత్) ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. నక్సల్స్ కు వ్యతిరేకంగా కూంబింగ్ ఆపరేషన్స్ చేస్తూంటాడు. అతి నిజాయితీ పరుడైన అతని ఆలోచనలు, పనులే రైల్వే రాజు జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయి. రైల్వైరాజు హంతకుడుగా మారటానికి, క్రికెట్ కు దూరమవటానికి కారణం అవుతాడు.

     ఇంతియాజ్ ఎందుకలా రెచ్చిపోయాడు

    ఇంతియాజ్ ఎందుకలా రెచ్చిపోయాడు

    రైల్వే రాజుకు ఇంతియాజ్ కు అసలు తగువేంటి..అసలు తన పనేంటో తను చేసుకుబోయే ఓ అతి సాధారణ కుర్రాడు..వెనక ఇంతియాజ్ ఎందుకంత కసిగా పడ్డాడు. రైల్వే రాజు జీవితాన్ని ఎలా అల్లకల్లోలం చేసేసాడు..ఇవన్నీ కథలో మెల్లిగా రివీల్ అయ్యే అంశాలు. ఇవి తెరపై చూస్తేనే బాగుంటాయి.

     ప్రేమ కథ ఏమైంది

    ప్రేమ కథ ఏమైంది

    బద్ద శత్రువులుగా మారిన ఇంతియాజ్, రైల్వే రాజు జీవితాలు చివరకు ఏ టర్న్ తీసుకున్నాయి. రైల్వే రాజు ప్రేమ కథ ఏమైంది. ఈ పోరాటంలో ఎవరు గెలిచారు..ఎవరు ఓడారు...వంటి ఆసక్తికరమైన ప్రశ్నలతో ఈ కథ ఆధ్యంతం సాగుతుంది.

    రెండు కాలాల్లోనూ..

    రెండు కాలాల్లోనూ..

    కొత్త తరహా స్క్రీన్ ప్లే అని చెప్పం కానీ, తెలుగులో రెగ్యులర్ వచ్చే స్క్రీన్ ప్లే కాకుండా కాస్తంత భిన్నంగా వెళ్లి దర్శకుడు ట్రై చేసాడు. కథ ఓ వైపు తొంభైల్లో సాగుతూనే, ఇప్పుడు 2016 లో కూడా రన్ అవుతుంటుంది. అది కథ అవసార్దమే అవటం విశేషం.
     రీసెంట్ టైమ్స్ లో

    రీసెంట్ టైమ్స్ లో

    ఈ సినిమా గురించి హైలెట్ చెప్పాలి అంటే ముందుగా స్క్రిప్టు డిపార్టమెంట్ గురించి చెప్పాలి. రీసెంట్ గా చిత్రాల్లో ఇలాంటి కథ, కథనం,డైలాగులు రాలేదనే చెప్పాలి. కథని చాలా సింపుల్ గా నిజాయితీగా చెప్పటమే సినిమాకు ప్లస్ అయ్యింది. ఆ నిజాయితీనే మనకు నచ్చుతుంది.

     వాస్తవానికి దగ్గరగా

    వాస్తవానికి దగ్గరగా

    ఈ కథ చేసుకునే ముందు దర్శకుడు చాలా రీసెర్చ్ చేసాడని అర్దమవుతుంది. ఎందుకంటే దాదాపు ప్రతీ సన్నివేశం...ఆ టైమ్ లో మన రాష్ట్రంలో చోటు చేసుకున్నదే. ముఖ్యంగా మనకు కనిపించే విషయాలను లోతుగా వెళ్లటం ఆశ్చర్యం అనిపిస్తుంది. హైదరాబాద్ లో జరిగే భారీ వినాయక ఉత్సవాల్లో కొంతమంది రాజకీయ నాయకులు చేపకింద నీరులా చేసిన కుట్రని ఉంచారు.

     అక్కడవరకూ డైరక్టర్ సక్సెసే...

    అక్కడవరకూ డైరక్టర్ సక్సెసే...

    హైదరాబాద్ లో ఒకానొక క్రికెటర్ తన కెరీర్ లో అత్యున్నత శిఖరాలకు వెళ్ళాల్సింది దారి తప్పాడు. ఆ పాత్రే ఈ రైల్వే రాజు పాత్ర అంతా అంటున్నారు. సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ ఇంతకీ ఎవరా క్రికెటర్ అనే సందేహం రాక మానదు. చూసిన వాళ్లు అలా అలోచనలో పడ్డారంటే దర్శకుడు సక్సెస్ అయ్యినట్లే.

    లలితక్కను కూడా

    లలితక్కను కూడా

    ఈ సినిమాలో సత్య ప్రకాష్ పాత్ర ను చూస్తూంటే ఈ మద్యనే చనిపోయిన నయీం గుర్తుకు రాకమానడు. అలాగే...ప్రజా గాయని బెల్లి లలితక్క ను కూడా ప్రేరణగా తీసుకుని ఓ లేడీ నక్సలైట్ పాత్ర చేసారనిపిస్తుంది. అప్పట్లో లలితక్క ప్రజా సంఘాల్లో ఆమె పేరు మారుమోగేది. అయితే నయీమ్ పేరు మొదట వెలుగులోకి వచ్చింది బెల్లి లలితక్క హత్య తోనే. ఆమెను అతిఘోరంగా చంపి, ముక్కలు చేసి వివిధ స్థలాల్లో వేశాడంటారు. దర్శకుడు మనస్సులో ఏముందో కానీ చూసినవారికి అదే సీన్ గుర్తుకు రాక మానదు.

    ఈజీగా అర్దమయ్యేలా

    ఈజీగా అర్దమయ్యేలా

    ఈ సినిమాసెకండాఫ్ లో వచ్చే స్టాంపుల కుంభకోణం ఎపిసోడ్ ని డైరక్టర్ ఎంత చక్కగా తీసాడంటే ..దాని గురించి అసలేమీ తెలియనివారికి కూడా అరటి పండు వలిచి పెట్టినంత ఈజీగా అర్దమయ్యేంతగా. ఈ విషయంలో గ్రేటే.

     రీక్రియేట్ చేయలేదు

    రీక్రియేట్ చేయలేదు

    కథంతా తొంభై ల్లో జరుగుతుంది కదా. ఆనాటి వాతావరణం పూర్తి స్దాయిలో ఈ సినిమాలో రీక్రియేట్ చేసి చూపిస్తారు అని ఆశించవారికి ఈ సినిమా నిరాశే కలిగిస్తుంది. ఎందుకంటే సినిమాలో బడ్జెట్ ఇబ్బంది వచ్చో ..మరేమో కానీ దర్శకుడు ఆ విషయంమీద కాన్సర్టేట్ చేయలేదు.

     కాస్త డల్ అయ్యింది

    కాస్త డల్ అయ్యింది

    ఫస్టాఫ్ ఎంతో స్పీడుగా కథలోకి వచ్చి సింపుల్ గా రైల్వై రాజు ని, ఇంతియాజ్ ని పరిచయం చేసి, వారి మధ్య కాంప్లిక్ట్ ఎస్టాభ్లిష్ చేయటం ముచ్చటేస్తుది. అయితే ఫస్టాఫ్ లో ఉన్న వేగం సెకండాఫ్ కు వచ్చేసరికి మందగిస్తుంది. ముఖ్యంగా రైల్వే రాజు..రౌడీ రాజు అయ్యాక వచ్చే సీన్స్ అన్ని ఎపిసోడిక్ గా అతనికి ఎదురే లేదు అన్నట్లుగా సాగుతాయి. దాంతో అక్కడ డల్ అయ్యిందనిపిస్తుంది.

     ఉన్నతంగా..

    ఉన్నతంగా..

    టెక్నికల్ గా ఈ సినిమా చాలా బాగా రూపొందించారు. అన్ని విబాగాలు సినిమాని ఉన్నతంగా నిలబెట్టడానికి కృషి చేసాయి. ముఖ్యంగా దర్శకుడు...కథకు తగ్గ ఎమోషన్స్ ని ఆర్టిస్ట్ ల నుంచీ ఫెరఫెక్ట్ గా తీసుకోవటం, ఎక్కడా వంక పెట్టలేని విధంగా సాగింది. అలాగే కోటగిరి వెంకటేశ్వరరావు గారు క్రిస్పీ ఎడిటింగ్ సినిమాలో స్పీడు తీసుకొచ్చి, బోర్ కొట్టనివ్వలేదు. లెంగ్త్ ఎక్కువ లేకపోవటం కూడా ప్లస్సే. అలాగే సురేష్ బొబ్బిలి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం. కీ సీన్స్ ని ఎలివేట్ చేసింది. ఇక నిర్మాణ విలువలు విషయానికి వస్తే ...సినిమా స్టాండర్డ్ కు తగ్గట్లే లేవు.

    వర్మ పూనాడు

    వర్మ పూనాడు

    అప్పట్లో ఒకడుండేవాడు చూస్తూంటే దర్శకుడుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రభావం ఉందనిపిస్తుంది. కథని ఎత్తుకోవటం, సీన్లలో, చెప్పే డైలాగుల్లో సహజత్వానికి ప్రయారిటీ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ సినిమా చూస్తూంటే వర్మ సూపర్ హిట్ సత్య గుర్తుకు రావటం ఖాయం. అయితే వర్మ తరహా మేకింగ్ ఎన్నో సార్లు మనం చూసిందే కాబట్టి కొత్తగా అనిపించదు...ఆ మార్గాన్ని వదిలి..సొంత మార్గంలో దర్శకుడు ట్రై చేసి ఉండాల్సిందనిపిస్తుంది.

     అదరకొట్టారంతే...

    అదరకొట్టారంతే...

    శ్రీవిష్ణు, నారా రోహిత్..ఇద్దరూ పోటీ పడి చేసిన సినిమా. ముఖ్యంగా నారా రోహిత్ అయితే షాకిచ్చే ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. అండర్ ప్లేతో తన సీన్స్ ని లేపి కూర్చోబెట్టాడు. శ్రీవిష్ణు అనే హీరో కమ్ ఫెరఫార్మర్ ...ఒకడున్నాడు..అని ఇండస్ట్రీకి ఈ సినిమా ఖచ్చితంగా చెప్తుంది. చాలా సీన్స్ లో శ్రీవిష్ణు అదరకొట్టాడు. మిగతా వాళ్లు బాగా చేసారు.

    ఫైనల్ గా ఇది దర్శకుడి కష్టం ప్రతీ ఫ్రేమ్ లోనూ చూపించే చిత్రం. రియలిస్టిక్ సినిమాలు ఇష్టపడేవారు. ఎప్పుడూ అవే కథలా..వీళ్లు మారరా అనుకునేవాళ్లు, తొంభైల్లో మన కలిసి ఉన్న రాష్ట్రంలో పరిస్దితులను, మనకు తెలియని వాటి వెనక దారుణమైన నిజాలను చూడాలి, లేదా గుర్తు చేసుకోవాలనుకునేవారికి ఈ సినిమా బెస్ట్ ఆఫ్షన్.

    English summary
    Appatlo Okadundevadu: Set between the years, 1992 - 96 and based on real incidents in that time period, the film traces the rivalry between an encounter specialist (Nara Rohith) and a cricketer-turned-naxalite, Railway Raju (Sri Vishnu).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X