For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సతీ 'సావిత్రి' అంత పాత కథతో... ('సావిత్రి' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.0/5
  విభిన్న చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ అంటూ 'బాణం'తో ఎంట్రీ గంభీరంగా ఇచ్చి టాలీవుడ్ కు వచ్చిన నారా రోహిత్ తర్వాత కాలంలో భిన్నం, విభిన్న అనేవి ఏమీ లేవు...హిట్ సినిమా, ప్లాఫ్ సినిమా అనేవి మాత్రమే ఉంటాయని అర్దం చేసుకుని, జోరు పెంచాడు. తన దగ్గరకు వచ్చిన ప్రతీ కథను, తన బడ్జెట్ కు సరిపోతుందా లేదా, రిలీజ్ చేయగలరా లేదా అనేవి మాత్రమే చూసుకుని అన్ని రకాల చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు.

  నాలుగు సినిమాలు చేస్తే ఒకటన్నా హిట్ కాబోతుందా అనే కాన్సెప్టో మరేమో కానీ నారా రోహిత్ పేరు చెప్పి కుర్ర డైరక్టర్స్ కాస్తంత బిజీ అవుతున్నారు. అయితే ఈ ఊపులో వేరే హీరోకు అనుకుని డేట్స్ దొరకని కథలు కూడా నారా రోహిత్ ఖాతాలో పడిపోతున్నాయి.

  రోహిత్ తన బాడీ లాంగ్వేజ్ కు పడనవి, పడేవి అనే తేడా లేకుండా వరస పెట్టి చేసేసి రెండు వారాలకో సినిమాని ధియోటర్లో దింపేసే పోగ్రాం పెట్టుకున్నాడు. అయితే ఈ జోరులో సక్సెస్ ల శాతం మాత్రం పడిపోతోందనే విషయం మర్చిపోయాడు. అయితే ఈ సారి చిత్రం ప్రోమోలు,ట్రైలర్స్ తో ఖచ్చితంగా హిట్ కొడతాడనే నమ్మకం కలిగించి మరీ వచ్చాడు. మరి ఆ నమ్మకం నిలబడిందా...

  పెళ్లిలోనే పుట్టిన సావిత్రి(నందిత)కు పెళ్లి ఓ అబ్సెషన్. చిన్నప్పటినుంచీ పెళ్లి,పెళ్లి అని కలవరిస్తూ ఇరవై ఏళ్లకు చేరుకుంటుంది. ఆమె పెళ్లి కోసం ఎంతకైనా తెగించే ఆమె తన అక్క గాయిత్రి(ధన్యా బాలకృష్ణన్) కి పెళ్లైతే తనకు లైన్ క్లియర్ అవుతుందని, ఇష్టం లేని పెళ్లికు బలేస్తుంది.ఇంత చేసినా ఆమె పెళ్లి కాదు.. అప్పటికి కూడా ఆమె జీవితంలో రాజకుమారుడు ఎంట్రీ ఇవ్వడు.

  తను ఎంత గాఢంగా పెళ్లి అనుకున్నా దూరం అవుతోందే అనుకుంటున్న సమయంలో ఆమెకు రిషి(నారా రోహిత్) పరిచయమవుతాడు. అతను షిర్డీ వెళ్లై ట్రైన్ లో కో పాసింజర్. అక్కడ నుంచి వీరిద్దరి మధ్యా రొటీన్ రొమాన్స్...పన్. అయితే ఈ లోగా అనుకోని ట్విస్ట్. అసలు సావిత్రి కు పెళ్లవుతుందా...రిషి..ఎలా తను ఇష్టపడ్డ ఆమెను దక్కించుకున్నాడు వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

  నిజానికి డిడీఎల్ జె టైప్ కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు..ఈ మధ్యన కాస్త తగ్గాయి కానీ ఆ మధ్యన వరకూ కుమ్మేసాయి. శ్రీను వైట్ల సినిమా అంటేనే ఈ ఫార్ములా పోస్టర్ మీద జనం ఫిక్స్ వెళ్లి చూసేవారు. దాన్ని మిగతా డైరక్టర్స్ అనుకరించి,అనుసరించి విసిగించేసారు.

  ఇప్పుడు మళ్ళీ దర్శకుడు అదే ఫార్ములాతో గెలుద్దామనుకున్నాడు. కానీ ఇదే హీరో గతంలో సోలో అంటూ దాదాపు ఇలాంటి ట్రీట్మెంట్ తో సినిమా చేసాడని మర్చిపోయినట్లున్నాడు...లేదా జనం మర్చిపోతారులే అనుకున్నాడో...

  మిగతా రివ్యూ స్లైడ్ షోలో

  బిట్లు బిట్లుగా

  బిట్లు బిట్లుగా

  ఈ సినిమా బిట్లు బిట్లుగా బాగున్నట్లు అనిపిస్తుంది. టోటల్ గా చూస్తే ఏముంది అనే సందేహం వస్తుంది..అంటే దర్శకుడు డీల్ చేయగలిగాడు కానీ కధని ఎంచుకోలేకపోయాడని అర్దం అవుతుంది.

  కొత్తగా అనిపించినా

  కొత్తగా అనిపించినా

  విలన్ ధ్రెడ్, హీరోయిన్ క్యారక్టరైజేషన్ వంటివి కొత్త కథ అనిపించినా ట్రీట్మెంట్ ముఖ్యంగా స్క్రీన్ ప్లే మాత్రం పాతగా ఉండటంతో ఆ ఫ్రెషనెస్ పోయింది.

  బాబు బాగానే

  బాబు బాగానే

  నారా రోహిత్ ..కామెడీగా కూడా బాగా చేస్తున్నాడు అనిపించుకోవటానికి తుంటరి, ఈ చిత్రం చేసినట్లు అనిపిస్తాయి. అయితే ఈ సినిమాలో నారా రోహిత్ ని వంక పెట్టడానికి ఏమీ లేదు.

  చేసిందేముంది

  చేసిందేముంది

  నందిత ఈ సినిమాలో పెళ్లి గురించి కల కనటం తప్ప చేసిందేముంది..ఆమె పేరు మీద టైటిల్ పెట్టారు అనే డౌట్ వస్తుంది. మురళి శర్మ..ఇంతకు ముందు నాని చిత్రం ..భలే భలే మొగాడివోయ్ చేసిన పాత్రే కంటిన్యూషన్

  సంగీతం,డైలాగులు

  సంగీతం,డైలాగులు

  పాటలు జస్ట్ ఓకే..వింటున్నంత సేపూ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ గుర్తుండదు.అయితే టైటిల్ ట్రాక్ మాత్రం ఇరగతీసాడు. డైలాగులు బాగున్నాయి కానీ ఈ కథకు సూట్ అయినట్లు అనిపించవు. అంటే ఆ క్యారక్టర్స్ సొంతంగా మాట్లాడినట్లు ఉండవు. డైలాగులు బాగున్నాయి కాబట్టి క్యారక్టర్స్ కావాలని వాటిని మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.

  టెక్నికల్ గా

  టెక్నికల్ గా

  ఎడిటింగ్ మరిన్ని కత్తెరలు పడొచ్చు. ఎందుకంటే రిపీట్ సీన్స్ బోర్ కొట్టించాయి. కెమెరా వర్క్ జస్ట్ ఓకే. విజువల్ గా స్టన్నింగ్ గా ఏమీ లేదు. అయితే కొ్న్ని సన్నివేశాలు మాత్రం విజువల్ గా రిచ్ గా చూపించాడు.

  అక్కడ నుంచే బోర్

  అక్కడ నుంచే బోర్

  ఈ సినిమా ఎత్తుగడ బాగానే ఉంది కానీ ట్రైన్ ఎపిసోడ్ ప్రారంభమైనప్పటినుంచీ బోర్ స్టార్టైంది. అంటే హీరో ఎంట్రీ ఇచ్చినప్పటినుంచీ అన్నమాట. ఇంటర్వెల్ దాకా అదే కంటిన్యూషన్. సెకండాఫ్ మరీ రొటీన్.

  ఎవరెవరు...

  ఎవరెవరు...  బ్యానర్ : విజన్‌ ఫిలింమేకర్స్ పతాకం
  నటీనటులు : నారా రోహిత్, నందిత, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, అజయ్, రవి బాబు, జీవా, వెన్నెల కిషోర్, శ్రీముఖి , ధన్య బాలకృష్ణన్, మధు నందన్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను షకలక శంకర్ తదితరులు.
  సినిమాటోగ్రఫీ: వసంత్
  డైలాగ్స్ : కృష్ణ చైతన్య,
  సంగీతం : శ్రవణ్ ,
  ఎడిటర్ : గౌతం నెరుసు,
  ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ,
  ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్,
  కో డైరెక్టర్: సురేష్,
  ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్: జాబిల్లి నాగేశ్వర రావు,
  నిర్మాత: డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్,
  కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పవన్ సాదినేని
  విడుదల తేదీ: 01--04-2016.

  "ప్రేమ ఇష్క్ కాదల్" అందించిన దర్శకుడు నుంచి ఇలాంటి చిత్రం ఊహించలేము. అలాగే కొత్తదనం పేరుతో నారా రోహిత్ ఒప్పుకునే సినిమాలలో కాస్త కథ కూడా ఉండేటట్లు చూసుకుంటే ప్రతిఫలం ఉంటుంది. లేకపోతే సినిమాల సంఖ్య పెరుగుతుంది కానీ అందుకు తగ్గట్లు సక్సెస్ రేషియో పెరగదు.

  English summary
  Savitri’s an overblown DDLJ with a dash of Srinu Vaitla’s patented offering. It is a routine tale.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X