»   » ఫన్, ఫాంటసీ కలిసి... ('తుంటరి' రివ్యూ )

ఫన్, ఫాంటసీ కలిసి... ('తుంటరి' రివ్యూ )

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5
ఫెరఫెక్ట్ ఫన్ తో కూడిన స్క్రిప్టుతో చేసే సినిమాలకు ఫలితం ఎప్పుడూ బాగుంటుంది. భాక్సాఫీస్ లు బ్రద్దలు కొట్టేడంత అద్బుతాలు జరగకపోయినా బాగోలేదు అనే టాక్ ను మాత్రం తెచ్చుకోవు,నిర్మాత,దర్శకులకు నీరసం రానివ్వవు. అలాంటి స్క్రిప్టులు ఎక్కడ దొరుకుతాయి. ఖచ్చితంగా మురగదాస్ వంటి ఆరితేరిన స్క్రిప్టు నిపుణుడు చెయ్యి చేసుకోవాల్సిందే. ఆయన వండిన ఓ స్క్రిప్టు ని తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది...ఇదిగో ఇలా తుంటరిలా నవ్విస్తుంది.

ఒక్కొక్కరికీ జీవితంలో ఒక్కోసారి అద్బుతం జరిగి లైఫ్ టర్న్ అయ్యేలా చేస్తాయి. అలాంటి అల్లావుద్దీన్ అద్బుత దీపమే వైజాగ్ టెలికాం కాలనీకి చెందిన రాజు (నారా రోహిత్‌)కు దొరికేసింది. అంటే మరీ దీపం కాదు కానీ...తన కోరికలు తీర్చే ఐదుగురు (కిషోర్ బ్యాచ్ ) దొరికారు. వాళ్లకు బేవార్స్ గా తిరిగే రాజుతో అవసరాలు ఉన్నాయి. ఆ కోరికలు తీరుస్తామంటూ... వాళ్లో కండీషన్ పెట్టారు... భాక్సింగ్ ప్రాక్టీస్ చేసి గెలవాలని. అందుకోసం ట్రైనింగ్ కు అయ్యే ఖర్చుభరిస్తామని, నెలకు లక్ష ఇస్తామని.

తనకు భాక్సింగ్ రాకపోయినా వాళ్లిచ్చే ఎట్రాక్ట్ చేసే ప్యాకేజ్ చూసి ఓకే చేస్తాడు. అప్పటినుంచీ తను భాక్సింగ్ ప్రాక్టీస్ కు వెళ్లాలంటే తన గొంతెమ్మ కోరికలు తీర్చాలంటూ వాళ్లను వేధిస్తాడు. అంతేనా...తను ఇష్టపడ్డ సిరి(లతా హెగ్డే) కు లవ్ సెట్ చేయమంటాడు. ఇలా కోరికలు అన్నీ తీర్చి రాజుని భాక్సర్ గా రెడీ చేస్తున్న సమయంలో వాళ్లకి షాక్ అయ్యే విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏమిటి..ఈ రాజు వెనక వాళ్లు పడటానికి కారణం ఏమిటి...మధ్యలో ఈ భాక్సింగ్ ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

తమిళంలో వచ్చిన మాస్ కరాటే చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం కథ వాస్తవానికి ఐదు గురు కుర్రాళ్లు వాళ్లుకు వచ్చే సమస్యలు క్రింద డవలప్ చేసారు.కానీ మురగదాస్ తెలివి అంతా హీరో పాత్రను వాళ్లకు ఎదురయ్యే సమస్యగా ఇరికించటమే. అయితే ఇది హీరో కథగా కనిపించదు. ఎందుకంటే అతనికి సమస్య వచ్చేది ఎక్కడోగానీ ఉండదు.

అతని కోరికలు తీరటమే సినిమా అంతా ఫస్టాప్ కనిపిస్తుంది. అందుకే ఫస్టాఫ్ ఫన్ తో నడిచిపోయినా సెకండాఫ్ చాలా డల్ గా పరుగెడుతున్నట్లు కనపడుతుంది. ఉషారు ఉండదు. నిజానికి సెకండాఫ్ బాగుంటేనే కదా ఏ సినిమా అయినా బాగుంది అనిపించేది. ఈ సినిమాకు చివరి నలబై నిముషాలే మైనస్ గా ఇంకా చెప్పాలంటే మహా నసగా మారాయి.

మిగతారివ్యూ స్లైడ్ షోలో

తగ్గితే బాగుండేది

తగ్గితే బాగుండేది

సినిమా లెంగ్త్ తగ్గినట్లుగానే నారా రోహిత్ కూడా కాస్త ఒళ్లు తగ్గిస్తే బాగుండేది. కొన్నిచోట్ల ఎబ్బెట్టుగా ఉన్నాడు.

ఎమోషన్స్ లేవు

ఎమోషన్స్ లేవు

ఈ సినిమాను రీమేక్ దర్శకుడు చాలా లైట్ గా తీసుకున్నాడు..ఎమోషన్స్ ని పండనివ్వలేదు

విలనిజం ఏది

విలనిజం ఏది

ఒరిజనల్ లో హైలెట్ గా నిలిచిన విలనిజం ఇందులో డల్ చేసేసారు. దాంతో హీరోకు పెద్ద పనిలేకుండా పోయింది.

హెలెట్

హెలెట్

ఈ సినిమాలో హైలెట్ గా నిలిచిన కామెడీ ..భాక్సీగ్ రిఫరీగా చేసిన అలీ, హీరో ఫ్రెండ్ గా చేసిన షకలక శంకర్ దే అని చెప్పాలి. వీరు కామెడీ లేకపోతేచాలా కష్టమయ్యేది

హీరో వైపు నుంచి కాదు

హీరో వైపు నుంచి కాదు

ఈ కథలో పెద్ద మైనస్ ఏదైనా ఉందీ అంటే అదీ హీరోవైపు నుంచి కథ చెప్పకపోవటం, కేవలం ప్రీ క్లైమాక్స్ లోనే హీరో సమస్యలో పడతాడు

బాగా చేసాడు కానీ

బాగా చేసాడు కానీ

నారా రోహిత్ ఒళ్లు అనేది తప్పిస్తే తుంటరోడు గా బాగా చేసాడు. కాకపోతే సెకండాఫ్ లోనూ ఫస్టాప్ లో చూపిన ఎక్సప్రెషన్సే చూపించాడు.

టెక్నికల్ గా

టెక్నికల్ గా

ఈ సినిమా కెమెరా వర్క్ బాగుంది. సినిమా సాగటంతో మరింతగా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తూంటుంది. డైలాగులు బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ , అలాగే సంగీతం సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి

ఎవరెవరు

ఎవరెవరు

సినిమా పేరు: తుంటరి
తారాగణం: నారా రోహిత్‌.. లతా హెగ్డే.. వెన్నెల కిషోర్‌.. సుదర్శన్‌, పూజిత, అదుర్స్‌ రఘు, అలీ, షకలక శంకర్‌ తదితరులు
కథ:మురుగదాస్‌
మాటలు: లక్ష్మీభూపాల్‌.. శ్రీకాంత్‌రెడ్డి
ఛాయాగ్రహణం: పళనికుమార్‌
సంగీతం:సాయికార్తీక్‌
నిర్మాణ సంస్థ: శ్రీకీర్తి ఫిలింస్‌
స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం: కుమార్‌ నాగేంద్ర
విడుదల:11-03-2016


ఫైనల్ గా సూపర్ హిట్ సినిమాలు రీమేక్ లు కూడా ఓ మాదిరి సినిమాలుగా మారిపోతూంటాయి. దర్శకుడు ఫన్ మీద పెట్టిన దృష్టి ఎమోషన్ మీద కూడా పెట్టి ఉంటే బాగుండేది. అయినా తీసిపారేయాల్సిన సినిమా కాదు..ఓ సారి చూసి రావచ్చు.

English summary
Tuntari, an official remake of the Tamil film Maan Karate. On the whole, the racy first half with a gripping start and some fun elements makes Tuntari watchable, only if you don't mind the plodding second half.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu