For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నవీన్ చంద్ర ‘నా రాకుమారుడు’ రివ్యూ

  By Srikanya
  |

  Rating:
  1.5/5
  పెద్ద సినిమాల పోటీ లేకపోవటంతో ఆగిపోయిన చిన్న సినిమాలన్నీ వరసగా రిలీజ్ అవుతున్న తరుణమిది. అయితే కథ,కథనాలు సినిమా బడ్జెట్ కి తగ్గట్లే చాలా క్రింద స్ధాయిలో ఉండటంతో వెయిట్ చేసినంత కాలం కూడా థియోటర్ లో ఉండటం లేదు. ఈ చిన్న చిత్రాల దర్శకులు ఎక్కువ మంది కొత్త వాళ్లే. తమ తొలి ప్రయత్నంతో ఆకట్టుకుని తర్వాత పెద్ద హీరోల, బ్యానర్స్ కి ఎదుగుదామనుకునేవాళ్లే. అయితే దురదృష్టవశాత్తు కొత్త దర్శకులు చాలా మంది తమ కథలకు ఆసక్తిగా చివరి వరకూ కూర్చోబెట్టే కథనం తయారు చేసుకోవటంలో విఫలమవుతున్నారు. దాంతో స్టార్ కాస్టింగ్ లేక,ప్రొడక్షన్ విలువలులేక, చివరకు కథ,కథనాలు కూడా లేకపోవటంతో దైర్యం చేసిన ప్రేక్షకులు బలి అవుతున్నారు. ఈ సినిమాదీ ఇదే పరిస్ధితి. దర్శకుడు ఇంకాస్త శ్రద్ద కథ ...ముఖ్యంగా స్క్రీన్ ప్లే పై పెట్టి ఉంటే సెకండాఫ్ అంత బోర్ గా తయారయ్యేది కాదు.

  కోటీశ్వరుడు కొడుకైన వైష్ణవ్‌ (నవీన్‌ చంద్ర) మరో రెండు నెలల్లో అమెరికా వెళ్తాడు. ఈ గ్యాప్ లో తనని ప్రేమించే వాళ్లని కాకుండా తనకి నచ్చిన అమ్మాయి ఎవరైనా తారసపడుతుందేమో చూస్తూంటాడు. ఆ క్రమంలో వైష్ణవ్‌కి బిందు (రీతూ వర్మ) పరిచయం అవుతుంది. ఆమెకు చదువంటే ఇష్టం ఉండదు. అమ్మ (సితార)బలవంతం మీద కాలేజీ వెళ్తుందంతే. వైష్ణవ్‌ని ఇష్టపడుతుంది. అది ప్రేమగా మారుతుంది. అయితే వైష్ణవ్ మాత్రం ఆమెను వదిలేసి అమెరికా వెళ్లిపోతాడు. ఆ బాధతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు ఏమైంది. చివరకు వీళ్లద్దరూ కలిసారా...అనేది మిగతా కథ.

  పూరీ జగన్నాథ్ అంటే తెలుగు సినిమాల్లో ఓ బ్రాండ్ నేమ్. ఆయన శిష్యుడుని,ఆయనలా డైలాగులు రాసానని చెప్పుకుంటూ ఓ కొత్త దర్సకుడు వస్తున్నాడంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. అయితే ఓ కొరియా సినిమా (100 Days with Mr. Arrogant) దింపుతూ థియోటర్స్ లో దిగుతాడని ఎవరూ ఊహించరు. పోనీ దాన్ని అయినా చూడటానికి పనికి వచ్చేలా ప్రెజెంట్ చేసారా అంటే రొటీన్ సీన్స్ తో సాగతీస్తూ,మెసేజ్ ఇవ్వాలన్న తాపత్రయంలో అంతకన్నా పరమ రొటీన్ క్లైమాక్స్ తో ముగించారు. 'అందాల రాక్షసి','దళం' చిత్రాల్లో రఫ్ లుక్ తో కనిపించిన నవీన్ చంద్ర లుక్ మార్చటమొకటే ఇందులో మనకు దర్శకుడు వైపు నుంచి కనపడే క్రియేటివిటీ అనిపిస్తుంది.

  టెక్నికల్ గా చిత్రం మంచి స్టాండర్డ్స్ లోనే ఉందనాలి. ముఖ్యంగా కుమార స్వామి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. రిచ్ లుక్ తో సినిమా గ్రాండ్ గా ఉంది. అలాగే అచ్చు సైతం మంచి పాటలు కంపోజ్ చేసి తన పాత్రకు న్యాయం చేసారు. అయితే చిత్రం చూస్తుంటే ఎడిటర్ పై మాత్రం పిచ్చ కోపం వస్తుంది. చాలా దారుణంగా,ప్రేక్షకులు విసుగు,బోర్ ఫీలవుతారనే విషయం పట్టించుకోకుండా సీన్స్ పేర్చుకుంటూ పోయారు. అసలే కథ...కదల కుండా నసపెడుతోందంటే మధ్యలో పాటలు విసిగిస్తూంటాయి. దర్శకుడుగా సత్య అనుభవమున్న డైరక్టర్ లాగానే చాలా సీన్స్ డీల్ చేసారు. నిర్మాణ విలువలు కూడా అద్బుతం కాకపోయినా బాగానే ఖర్చు పెట్టారనిపిస్తుంది. నటీనటుల్లో నవీన్ చంద్ర బాగా చేసారు. రీతూవర్మ ఓకే. మిగతా సీనియర్స్ అలవాటుగా చేసుకుపోయారు. డైలాగులు మరీ దారుణంగా ఉన్నాయి. పూరి ని అనుకరించారు కానీ ఆ క్వాలిటీ లేదు.

  ఎన్ని లోపాలు ఉన్నా ఎంటర్టైన్మెంట్ ఉంటే సినిమాలని ప్రేక్షకుడు క్షమించేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో అది కూడా బాగా మిస్ అయింది. ఓపినింగ్స్ కూడా రాబట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందనేది వేచి చూడాల్సిందే.

  చిత్రం: నా రాకుమారుడు,
  సంస్థ: హరివిల్లు క్రియేషన్స్‌
  నటీనటులు: నవీన్‌ చంద్ర, రీతూవర్మ, సితార, ఎమ్మెస్‌ నారాయణ, కృష్ణభగవాన్‌, కొండవలస, మిక్కీ, సునీల్‌హార్స్‌, దీక్షాపంత్‌, రాధికారెడ్డి, భార్గవి తదితరులు.
  సంగీతం: అచ్చు,
  నిర్మాతలు: వజ్రాంగ్‌ (పి.ఎస్‌.రెడ్డి), కోడి వంశీ
  దర్శకత్వం: సత్య,
  విడుదల: శుక్రవారం

  English summary
  Filmmaker Puri Jaganandh's protege T Satya is turning independent director with the movie Naa Rakumarudu relesed with divide talk.Produced by Vajrang under Harivillu Creations, the film stars Andala Rakshasi fame actor Naveen Chandra and Prema Ishq Kadhal fame actress Ritu Varma in leads.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X