»   » నీది నాది ఒకే కథ సినిమా రివ్యూ: ఆలోచింపజేసే అందరి కథ..

నీది నాది ఒకే కథ సినిమా రివ్యూ: ఆలోచింపజేసే అందరి కథ..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nedi Nadi Oke Katha Movie Reveiw నీది నాది ఒకే కథ నీది రివ్యూ

RATING : 3.75/5

ప్రస్తుత విద్యావ్యవస్థలో ర్యాంకులు, మార్కులే విజ్హానికి ప్రామాణికంగా మారాయి. అందుకోసం విద్యార్థులను మరబొమ్మలుగా మార్చేస్తున్నారు. విద్యార్థికి ఏం అభిరుచి ఏంటో తెలుసుకోకుండా.. తల్లిదండ్రులు తమ పరువు ప్రతిష్ఠల కోసం వారిపై తమ సొంత అభిప్రాయాలను రుద్దుతున్నారు. జీవితమంటే కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ విద్య అనే స్థాయికి దిగజారింది. ఇలాంటి దురభిప్రాయం వలన విద్యార్థులు జీవితాలను బలిదానం చేసే పరిస్థితులు నిత్యం మన కళ్లముందు కనిపిస్తున్నాయి. విద్యావ్యవస్థల లోపాలు, పిల్లలపై తల్లిదండ్రుల ఒత్తిడి లాంటి ఓ సున్నితమైన పాయింట్‌ను అందుకొని రూపొందించిన చిత్రమే నీది నాది ఒకే కథ. ర్యాంకులు, మార్కులు రేసులో పరుగెత్తలేని ప్రతీ సగటు విద్యార్థి కథే ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్తాం.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

నీది నాదీ ఒకే కథ స్టోరి

నీది నాదీ ఒకే కథ స్టోరి

రుద్ర రాజు సాగర్ (శ్రీవిష్ణు) అతి సామాన్యమైన సగటు విద్యార్థి. చదువంటే కనీసం ఆసక్తిలేని స్టూడెంట్. ఆటలు, స్నేహితులు తప్ప మరోలోకం లేని యువకుడు. సాగర్ తండ్రిరుద్రరాజ దేవి ప్రసాద్ (దేవి ప్రసాద్) తన కొడుకును యూనివర్సిటీ ఫస్ట్ వస్తే చూసి ఆనంద పడాలనుకొంటాడు. రుద్రసాగార్ పరిస్థితి చూసిన తర్వాత చివరికి డిగ్రీ పాసైతే సంతోషం అనుకునే పరిస్థితి వస్తుంది. కొడుకు పరిస్థితి చూసి తండ్రి ఆందోళనకు గురవుతాడు. తనకు పరిచయమైన ధార్మిక ( సట్నా టైటస్)‌తో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాస్‌కు వెళ్లాడు. కానీ అవేమీ తన సమస్యకు పరిష్కారం కాదని గ్రహిస్తాడు. చివరికి తనకు చదువు అబ్బదని, ఇక పరీక్షలు రాయనని తండ్రికి రుద్రసాగర్ చెప్పేస్తాడు.

ముగింపు ఇలా..

ముగింపు ఇలా..

తన కుమారుడు చదువు ఆపేస్తానని చెప్పిన తర్వాత రుద్రరాజు సాగర్, తన తండ్రికి మధ్య చోటుచేసుకొన్న పరిణామాలు ఏమిటి? చదువు మానేసిన రుద్రసాగర్ ఏం చేయాలనుకొన్నాడు? చివరికి తన తల్లిదండ్రులు రుద్రరాజు సాగర్ ఏ విధంగా కన్విన్స్ చేశాడు? తాను ప్రేమలో పడిన ధార్మిక‌ను పెళ్లి చేసుకొన్నాడా? జీవితంలో స్థిరపడటానికి ధార్మిక ఎలాంటి తోడ్పాటునందించిందనే ప్రశ్నలకు సమాధానమే నీది నాది ఒకే కథ.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

తొలిభాగంలో

తొలిభాగంలో

నీది నాది ఒకే కథ ఓ మధ్య తరగతి కుటుంబ కథతో సినిమా ప్రారంభమవుతుంది. రుద్రసాగర్ పరీక్షల రాసే వ్యవహారంతో ఆసక్తికరంగా సినిమా ఆరంభమవుతుంది. శ్రీవిష్ణు భావోద్వేగాలతో కూడిన ప్రతీ సన్నివేశం ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. తొలిభాగంలో ఓ ఎమోషనల్ సంఘటన‌తో సినిమా ఎమోషనల్‌గా మరో స్థాయి వెళ్తుంది. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంశంతో పోసాని కృష్ణమురళి ఎపిసోడ్ భావోద్వేగాల నుంచి బయటపడి ప్రేక్షకుడు కొంత రిలీఫ్ పొందడానికి వీలుపడుతుంది. ఓ ఆసక్తికరమైన సీన్‌తో ఇంటర్వెల‌్ కార్డు పడుతుంది.

సెకండాఫ్‌లో

సెకండాఫ్‌లో

ఇక రెండోభాగంలో తండ్రి దేవి ప్రసాద్, కొడుకు శ్రీ విష్ణు మధ్య జరిగే సంఘర్షణ అద్భుతంగా సాగుతుంది. సమాజంలో తన పరువు ప్రతిష్టల కోసం పోరాడే ఓ తండ్రి, తన అస్థిత్వం జీవితానికి మధ్య సమస్యగా నిలిచిన తండ్రిని కన్విన్స్ చేసే అంశాన్ని దర్శకుడు వేణు ఊడుగుల హ్యాండిల్ చేసిన విధానం సెకండాఫ్‌లో హైలెట్‌గా మారుతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలతో ఓ అర్ధవంతమైన ముగింపుతో సినిమాకు శుభం కార్డు పడుతుంది.

దర్శకుడు వేణు ఊడుగుల ప్రతిభ

దర్శకుడు వేణు ఊడుగుల ప్రతిభ

విద్యా వ్యవస్థలోని ఓ సున్నితమైన అంశాన్ని టార్గెట్‌గా చేసుకొని దర్శకుడు వేణు ఊడుగుల నిజాయితీతో చేసిన అంటెప్ట్ నీది నాది ఒకే కథ. తాను పడిన వేదనననో లేక సాటి విద్యార్థి పడిన ఆవేదననో, ప్రస్తుత సమాజంలో ప్రతీ విద్యార్థి ఎదుర్కొనే సమస్యను ఆత్మ విశ్వాసంతో తెరకెక్కించిన చిత్రమిది. కథనే నమ్ముకుని సినిమా జిమ్మిక్కులకు దూరంగా చేసిన డేరింగ్ అటెంప్ట్ ఈ సినిమా అని చెప్పవచ్చు. సమాజంలో అతి సున్నితమైన సమస్యను సరిగా హ్యాండిల్ చేయకపోతే అది తెరమీద ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది. అలాంటి సబ్జెక్ట్‌ను అందర్ని మెప్పించేలా చేయడంలో దర్శకుడిగా వేణు నూటికి నూరు మార్కులు సొంతం చేసుకొన్నాడు. కమర్షియల్ అంశాలను అంతర్లీనంగా చూపిస్తూ సమాజాన్ని ఆలోచింపజేయడంలో దర్శకుడు సఫలమయ్యాడని చెప్పవచ్చు.

శ్రీవిష్ణు అద్భుత నటన

శ్రీవిష్ణు అద్భుత నటన

నీది నాది ఒకే కథకు, దర్శకుడికి విజన్‌కు వెన్నెముకగా నిలిచింది నటుడు శ్రీ విష్ణు. నిజాయితీతో కూడిన ఓ కథను అంతే నిజాయితీతో తెరమీద పడించడంలో శ్రీ విష్ణు అద్బుతమైన పరిణతిని ప్రతిభను చూపాడు. గత చిత్రం మెంటల్ మదిలో కంటే విలక్షణమైన నటనను ప్రదర్శించాడు. నాలో అద్భుతమైన ఫెర్ఫార్మర్ ఉన్నాడనే విషయాన్ని రుద్రసాగర్ పాత్ర ద్వారా చాటిచెప్పాడు. మధ్య తరగతి యువకుడి పాత్రకు శ్రీ విష్ణు ప్రాణం పోశాడని చెప్పవచ్చు. కొన్ని కీలకసన్నివేశాల్లో శ్రీ విష్ణు పలికించిన హావభావాలు సూపర్‌గా ఉంటాయి. విలక్షణమైన, భావోద్వేగ అంశాలతో కూడిన పాత్రతో శ్రీ విష్ణు ఆకట్టుకొన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

 హీరోయిన్‌గా సట్నా టైటస్

హీరోయిన్‌గా సట్నా టైటస్

ధార్మికగా, శ్రీ విష్ణు లవర్‌గా నూతన నటి సట్నా టైటస్ కనిపించింది. తొలి చిత్రమైన చాలా మెచ్యురిటీతో కూడిన అభినయాన్ని ప్రదర్శించింది. కథలో కీలకమైన పాత్రను అవలీలగా మెప్పించింది. పాటల్లో సెన్సిటివ్ ఫీలింగ్స్ అమోఘంగా పలికించింది. శ్రీవిష్ణు పాత్రను ఎలివేట్ చేయడంలో ధార్మిక పాత్ర ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకు సట్నా ప్రతిభ పూర్తి సహకారం అందించిందని చెప్పవచ్చు.

నటన దేవి ప్రసాద్ నటన

నటన దేవి ప్రసాద్ నటన

ఇక తండ్రి పాత్రలో దర్శకుడు దేవి ప్రసాద్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. కొడుకు భవిష్యత్ కోసం సగటు తండ్రి పడే ఆవేదన ఆ పాత్రలో కనిపిస్తుంది. కొడుకు ఉన్నతి కోసం ఆరాటపడే ఆ పాత్రలో దేవి ప్రసాద్ ఒదిగిపోయాడు. గతంలో తండ్రి పాత్రల్లో కనిపించిన విశ్వనాథ్, జంధ్యాల లాంటి స్థాయికి కాకపోయినా దేవీ ప్రసాద్ నటన ఆ పాత్రలను గుర్తు చేసేలా ఉంటుంది. నీది నాది ఒకే కథ చిత్రం ద్వారా పరిశ్రమ దేవీ ప్రసాద్ ఓ మంచి నటుడిని గుర్తించినట్లయింది.

తోటరాజు కెమెరా

తోటరాజు కెమెరా

కథలో ఉండే నిజాయితీని తెరమీద ఆవిష్కరించడంలో సినిమాటోగ్రాఫర్ తోట రాజు టీమ్ పనితనం ఆకట్టుకొనేలా ఉంది. అర్జున్‌రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న తోట రాజు మరోసారి కెమెరాతో తన ప్రతిభను రుజువు చేసుకొన్నాడు. డాగ్ మీ 95 (డెన్మార్క్ సినీ మ్యానిఫెస్ట్) ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఎడిటింగ్ వ్యాల్యూస్

ఎడిటింగ్ వ్యాల్యూస్

నీది నాది ఒకే కథ గొప్ప ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా. ఈ సినిమాలో భావోద్వేగాన్ని సజీవంగా నిలపడంలో ఎడిటర్ నాగేశ్వర్‌రెడ్డిది ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. అనవసరమైన సన్నీవేశాలు లేకుండా, ఎక్కువ నిడివి లేకుండా సూటిగా చెప్పే విధంగా ప్రతీ సన్నివేశాన్ని పేర్చిన విధం ఆయన ప్రతిభకు గీటురాయిగా నిలిచింది. జీ నాగేశ్వర్ రెడ్డి ప్రతిభకు సినిమాకు పాజిటివ్‌గా మారింది.

సురేష్ బొబ్బిలి మ్యూజిక్

సురేష్ బొబ్బిలి మ్యూజిక్

నీది నాది ఓకే కథకు బలం, ప్రధాన ఆకర్షణ పాటలు, నేపథ్య సంగీతం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. కొత్తరకం బాణీలు, పద ప్రయోగం చేసిన విధానం, కీలక సన్నివేశాల్లో రీరికార్డింగ్ సినిమాకు ఆయువుగా నిలిచింది. అప్పట్లో ఒకడుండే వాడు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న సురేష్ నీది నాది ఒకే కథతో మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు.

ప్రొడక్షన్ వ్యాల్యూస్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

ఇక నారా రోహిత్ అభిరుచి ఉన్న నటుడే కాదు మంచి నిర్మాత కూడా అని గత చిత్రాలు రుజువు చేశాయి. ప్రస్తుత కమర్షియల్ చిత్రాల జోరులో నీది నాది ఓకే కథ లాంటి సినిమాను రూపొందించే సాహసం చేయడం బోల్డ్ అంటెప్ట్ అని చెప్పవచ్చు. అరన్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ నారా రోహిత్ అభిరుచికి అద్దం పట్టాయి.

 ఫైనల్‌గా

ఫైనల్‌గా

సినీ పరిశ్రమలో కమర్షియల్ చిత్రాలకే పెద్ద పీట. కానీ తెలుగు తెర మీద విజేత, సత్యం లాంటి సినిమాలు అప్పుడు మెరుస్తుంటాయి. చాలా రోజుల తర్వాత అలాంటి మెరుపు మెరిసిన చిత్రం నీది నాది ఒకే కథ. కమర్షియల్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు కొంత నిరాశ కలిగించిన ప్రతీ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు సరైన రితీలో చేర్చితే కమర్షియల్‌గానే కాకుండా మంచి ఫీల్‌గుడ్ చిత్రంగా మిగిలిపోతుంది.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

శ్రీవిష్ణు యాక్టింగ్
దర్శకుడు వేణు ఊడుగుల టేకింగ్
కథ, కథనాలు
సంగీతం
ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్
ప్రొడక్షన్ వ్యాల్యూస్

మైనస్ పాయింట్స్
కమర్షియల్ హంగులకు దూరంగా
సెకండాఫ్‌‌లో రొటీన్‌గా సాగడం
కామెడీ లేకపోవడం

తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

నటీనటులు: శ్రీ విష్ణు, సట్నా టైటస్, దేవి ప్రసాద్, పోసాని తదితరులు
దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాత: ప్రశాంతి, విజయ్
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్: జీ నాగేశ్వరర్ రెడ్డి
కెమెరా: తోట రాజు
బ్యానర్: అరన్
రిలీజ్ డేట్: మార్చి 23, 2018

English summary
Needi Naadi Oke Katha movie gets with a Clean "U" Certification. Cast is the Sree Vishnu and Satna Titus. This movie releasing on 23rd March. A film directed by Venu Vudugula, Nara Rohith producing Aran Media Works. On occassion of movie release, Telugu Filmibeat brings exclusive review for..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X