For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేను లేను మూవీ రివ్యూ అండ్ రేటింగ్

By Krishna
|

Rating: 3/5

టాలీవుడ్‌లో రొమాంటిక్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్స్‌ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలుగజేస్తూ కాసుల వర్షాన్ని కూడా కురిపించాయి. RX100 నుంచి ఇటీవల రిలీజైన నిను వీడని నీడను నేనే వరకు రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ల సత్తా ఏమిటో ప్రేక్షకులకు రుచి చూపించాయి. ఇలాంటి నేపథ్యంతో తాజాగా జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నేను లేను. నిర్మాతగా, దర్శకుడిగా రామ్ కుమార్, హీరోగా హర్షిత్ పరిచయం ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. రిలీజ్‌కు ముందే టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకొన్న నేను లేను చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? రామ్ కుమార్‌కు, హర్షిత్‌కు ఏ రేంజ్ సక్సెస్ అందించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

nenu lenu movie review and rating

కర్నూలుకు చెందిన ఈశ్వర్ (హర్షిత్) ఓ వీడియోగ్రాఫర్. తొలిచూపులోనే పార్వతి (శ్రీ పద్మ) అనే యువతి ప్రేమలో పడుతాడు. ఇంట్లో చెబితే తమ పెద్దలు ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరనే ఉద్దేశంతో పారిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేస్తారు. ఆ క్రమంలో ఓ రౌడీ మూక బారిన పడుతారు? తన ప్రేయసి ప్రాణాలకు ముప్పు రావడంతో ఆ గ్రూప్‌ను అంత మొందిస్తాడు ఈశ్వర్. ఆ క్రమంలో మరో గ్యాంగ్ నుంచి హర్షిత్, పార్వతికి ముప్పు ఏర్పడుతుంది? ఈ నేపథ్యంలో ఈశ్వర్ కోటార్డ్ సిండ్రోమ్ అనే డిజార్డర్‌తో బాధపడుతున్నారనే విషయం బయటపడుతుంది?

nenu lenu movie review and rating

కోటార్డ్ సిండ్రోమ్ వల్ల ఈశ్వర్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? పార్వతితో ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులను అధిగమించాల్సి వచ్చింది. తన స్నేహితుడు (వంశీకృష్ణ పాండ్య) నుంచి ఎలాంటి సహకారం అందింది? రౌడీ మూకల ఎలా ఎదురించి తన ప్రేమను, తనకు తాను ఎలా కాపాడుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే నేను లేను.

యాక్షన్, లవ్, రొమాంటిక్ అంశాలతో నేను లేను తొలి భాగం పరుగులు పెడుతుంది. హీరో హర్షిత్, పార్వతి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఫ్రెష్‌గా కనిపిస్తాయి. కర్నూలు పరిసర ప్రాంతాలు సినిమాకు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌గా మారాయి. కథలో హీరోకు ఓ మానసిక వ్యాధితో బాధపడుతున్నారనే ట్విస్ట్ సినిమాలో కొత్తగా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా అనేక ట్విస్టులు, టర్న్‌లతో సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ ముందు, క్లైమాక్స్‌లో కొన్ని ట్విస్టులు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టాయనే విధంగా ఉంటాయి.

nenu lenu movie review and rating

దర్శకుడు రామ్ కుమార్ రాసుకొన్న కథ, కథనాలు, డైలాగ్స్, కొత్తగా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా తెరకెక్కించిన విధానం తెర మీద కొత్తగా కనిపిస్తాయి. యాక్షన్, రొమాంటిక్ సీన్లు, కథలో రాసుకొన్న ట్విస్టులు చాలా నేచురల్‌గా ఉంటాయి. తొలి పరిచయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హర్షిత్, శ్రీ పద్మ నుంచి టాలెంట్‌ను రాబట్టుకొన్న తీరు చూస్తే దర్శకత్వం శాఖపై ఆయనకు ఉన్న పట్టు తెలుస్తుంది. దర్శకుడిగా రామ్ కుమార్ అనుభవం ఉన్న దర్శకుడిగా పరిణతిని చూపించాడు. సెకండాఫ్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ డీల్ చేసిన విధానం చూస్తే.. భారీ బడ్జెట్ చిత్రాలను కూడా హ్యాండిల్ చేయగలడనే ఫీలింగ్‌ను కల్పించాడు.

nenu lenu movie review and rating

ఇక నేను లేను సినిమాలో చెప్పుకోవాల్సింది హీరో హర్షిత్ గురించి. ఫైట్స్, డాన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ విషయంలో పర్‌ఫెక్షన్ కనిపిస్తుంది. కీలక సన్నివేశాల్లో హర్షిత్ నటన హైలెట్‌గా ఉంటుంది. హర్షిత్ ఫెర్ఫార్మెన్స్ చూస్తే నూతన నటుడు అనే ఫీలింగ్ ఎక్కడా కనపడడు. అన్ని అంశాల్లోనూ మెచ్యురిటీ కనిపిస్తుంది. రొమాంటిక్ సీన్లలో మంచి అనుభవం ఉన్న యువ హీరోగా మెప్పించాడు.

హీరోయిన్ శ్రీ పద్మ కూడా పోటీ పడి నటించింది. రొమాంటిక్ సీన్లలోనూ, యూత్‌కు గిలిగింతలు పెట్టే డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పడంలో ఈజ్‌తో కనిపించింది. పాటలు, ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకొన్నది. అటు యూత్‌ను మెప్పించే అంశాలతో, ఎమోషనల్ సీన్లతో కూడిన పాత్రలను పోషించగలననే కాన్ఫిడెన్స్ తెర మీద చూపించింది. ఇక హీరోకు స్నేహితుడిగా నటించిన వంశీకృష్ణ పాండ్య పాత్ర కూడా చివర్లో షాకింగ్‌గా రివీల్ అవుతుంది.

నేను లేను సినిమాకు ప్రధాన బలం సినిమాటోగ్రఫి, మ్యూజిక్. ఏ శ్రీకాంత్ అందించిన సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా అని చెప్పవచ్చు. నైట్ ఎఫెక్ట్ షాట్స్, యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించిన తీరు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలుగుజేస్తుంది. అశ్రిత్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్. రీరికార్డింగ్ చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పలు సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయనే ఫీలింగ్ కలుగుతుంది. ఎడిటింగ్‌ విషయంలో మరికొంత దృష్టి పెట్టాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ భారీ సినిమాను తలపించే రేంజ్‌లో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌తో రిచ్‌గా సన్నివేశాలను తెరకెక్కించారని చెప్పవచ్చు.

ఫైనల్‌గా నేను లేను సినిమా కొత్త రకం జోనర్‌తో వచ్చిన మరో సస్పెన్స్ థ్రిల్లర్. సైన్స్, ఫిక్షన్ అంశాలను జోడించి చేసిన ప్రయోగం ఆకట్టుకొనేలా ఉంటుంది. డిజార్డర్ బేస్డ్ సినిమాల తీయడం ఓ ఛాలెంజ్. అలాంటి ప్రయత్నాన్ని రామ్ కుమార్ 100 పర్సంట్ అధిగమించాడు. యంగ్ టాలెంట్ సినిమాను ఫీల్‌గుడ్‌గా మలిచింది. సస్పెన్స్, థ్రిల్లర్స్, సైన్, ఫిక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే మంచి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

నటీనటులు: హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు

సంగీతం: ఆశ్రిత్‌,

ఛాయాగ్ర‌హ‌ణం: ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ),

నృత్యాలు: జోజో,

నిర్వాహ‌ణ: సురేష్‌కూర‌పాటి,

పి.ఆర్‌.ఓ‌:సాయి స‌తీష్ పాల‌కుర్తి,

విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌,

ఎస్.ఎఫ్.ఎక్స్: పురుషోత్తం రాజు,

ఆడియోగ్ర‌ఫీ: రంగ‌రాజ్‌,

క‌ల‌రిస్ట్: క‌ళ్యాణ్ ఉప్పాల‌పాటి,

ప్ర‌చార చిత్రాలు: శ్రీ‌క‌,

స‌హాయ‌ద‌ర్శ‌కులు: జె.మోహ‌న్‌కాంత్‌, ధర్మేంద్ర‌, సురేశ్‌,

స‌హ‌నిర్మాత : య‌షిక,

నిర్మాత : సుక్రి ,

రచన- దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె.

English summary
Nenu lenu is different Psychological Thriller film with crazy love story. Directed by Ram Kumar. This movie's trailer got huge response in youtube and achieved 7.5 million views very few days. Now this movie getting ready for July 26th release.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more