»   » నెక్ట్స్ ఏంటీ? మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నెక్ట్స్ ఏంటీ? మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Rating:
  1.0/5
  Star Cast: తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవ్‌దీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్
  Director: కునాల్ కోహ్లీ

  ఆధునిక సమాజంలో యువత పోకడలు మారుతున్నాయి. సహజీవనం లాంటి అంశాలు సొసైటీలో భాగమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో సహజీవనం, పెళ్లికి ముందు రిలేషన్స్ లాంటి బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన చిత్రం నెక్ట్స్ ఏంటీ?. మిల్కి బ్యూటీ తమన్నా భాటియా, సందీప్ కిషన్ జంటగా నటిస్తుండటం, బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ నేరుగా తెలుగులో నిర్మించడంతో సినిమాపై యూత్‌లో కొంత ఆసక్తి పెరిగింది. నెక్ట్స్ ఏంటీ మూవీ తమన్నా, సందీప్‌కు సక్సెస్‌ను అందించిందా? అనే విషయాలను తెలుసుకోవాలంటే నెక్ట్స్ ఏంటీ కథ ఏంటో తెలుసుకోవాల్సిందే.

  నెక్ట్స్ ఏంటీ? కథ ఇదే

  లండన్‌లో పెరిగినప్పటికీ భారతీయ సంప్రదాయాలకు విలువనిచ్చే యువతి టామీ (తమన్నా భాటియా). తల్లి చిన్నతనంలో మరణించడంతో తండ్రి పెంపకంలోనే పెరుగుతుంది. అలాంటి టామి సంజు (సందీప్) అనే యువకుడితో ప్రేమలో పడుతుంది. ఆర్నెళ్ల తర్వాత పెళ్లికి ముందే సెక్స్ విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోతారు. ఆ తర్వాత క్రిష్ (నవదీప్) అనే పారిశ్రామిక వేత్తతో రిలేషన్ పెట్టుకోవడం అది కూడా బ్రేకప్ కావడంతో మగవాళ్లపై ఓ రకమైన విద్వేషం పెంచుకొంటుంది?

  నెక్ట్స్ ఏంటీ? మలుపులు

  సంజుతో బ్రేకప్ వల్ల టామీలో ఎలాంటి మార్పులు వచ్చాయి? పెళ్లికి ముందు సెక్స్ విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకొన్నదా? భార్యతో విడాకులు పొందిన క్రిష్‌తో టామీ ఎలా ప్రేమలో పడింది? క్రిష్‌తో రిలేషన్ ఎందుకు బ్రేకప్ అయింది? టామీకి తన తండ్రి (శరత్ బాబు)కి ఎలాంటి అనుబంధం ఉంది అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే నెక్ట్స్ ఏంటీ మూవీ.

  తొలిభాగంలో

  నెక్ట్స్ ఎంటీ మూవీ ఆరంభమే ప్రేక్షకులకు విసుగుపుట్టించే విధంగా ప్రారంభమవుతుంది. విపరీతమైన డైలాగ్స్ వెర్షన్‌తోనే మూవీ పసలేదని తెలుస్తుంది. లెంగ్తీ సీన్లతో విసుగుపుడుతుంది. ఇక శరత్ బాబు, తమన్నా ఎపిసోడ్ కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఎప్పటి మాదిరిగానే మారుతుంది. యూత్‌ఫుల్ లవ్‌స్టోరిలో రోమాన్స్ మిస్ కావడం సినిమాకు మైనస్‌గా మారిందని చెప్పవచ్చు. తొలిభాగంలో ఎలాంటి కథ లేకుండానే అర్ధాంతరంగా ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

  రెండో భాగంలో

  నవదీప్ ఎంట్రీతో మరో లవ్ స్టోరి ప్రారంభమవుతుంది. కానీ అందులో యూత్‌కు గిలిగింతలు పెట్టే అంశాలు ఎక్కడా కనిపించవు. చివర్లో అదే సాగదీత కనిపిస్తుంది. సందీప్, తమన్నా మధ్య వచ్చే సన్నివేశాల్లో ఎలాంటి ఎట్రాక్షన్ కనిపించదు. చాలా రొటీన్‌గా సినిమా ముగుస్తుంది.

  దర్శకుడు కునాల్ కోహ్లీ

  హమ్ తుమ్ లాంటి ఫీల్‌గుడ్ రొమాంటిక్ సినిమాను అందించిన దర్శకుడు కునాల్ కోహ్లీ నుంచి నెక్ట్స్ ఏంటీ సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ కథ, కథనాలు పేలవంగా ఉండటంతో ప్రేక్షకుల రుచించలేదు. ఎలాంటి రొమాంటిక్ మూడ్ లేకుండా సినిమాను ఫ్లాట్‌గా నడిపించడం ఆయన డైరెక్షన్‌లో లోపాలుగా చెప్పవచ్చు. యూత్‌ను ఆకట్టుకొనే విధంగా సినిమాను తెరకెక్కించలేకపోవడంతో నెక్ట్స్ ఎంటీ మూవీ చతికిలపడింది.

  తమన్నా హాట్‌ హాట్‌గా

  నెక్ట్స్ ఎంటీ మూవీలో తమన్నా మంచి ఈజ్‌తో నటించింది. కొన్ని సన్నివేశాల్లో సున్నితమైన హావభావాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. డైలాగ్ డెలివరీ కూడా బాగా ఉంది. పొట్టి దుస్తుల్లో తమన్నా హాట్ హాట్‌గా కనిపించింది. గ్లామర్‌తో తమన్నా ఆకట్టుకొన్నది. ఈ సినిమాకు తమన్నా వెన్నుముకగా నిలిచింది.

  ఆకట్టుకొని సందీప్ కిషన్

  సందీప్ కిషన్ సంజూ పాత్ర అసంబంద్ధంగా ఉంది. ఆ పాత్రలో మ్యాజిక్ ఏమీ కనిపించదు. సంజూ పాత్రకు సందీప్ సరికాదు అనే ఫీలింగ్ ప్రతిక్షణం అనిపిస్తుంది. సందీప్ గెటప్ గానీ, లుక్ గానీ యూత్‌ను పెద్దగా ఆకట్టుకొనే విధంగా లేకపోవడం ప్రధానమైన లోపం.

  మెప్పించని నవదీప్

  నవదీప్ పాత్ర చాలా చిన్నదే. పెద్దగా ప్రభావం చూపనటువంటి రోల్‌లో అదీ.. డీ గ్లామరైజ్డ్ రోల్ నటించాడు. క్రిష్ పాత్రను నవదీప్ ఎందుకు ఒప్పుకొన్నాడో అర్ధంకాని పరిస్థితి కనిపిస్తుంది.

  లియాన్ మ్యూజిక్

  అర్బన్ రొమాంటిక్ కామెడీ కచ్చితంగా సరిపడే విధంగా లియాన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. సినిమా కథా పరిధి మేరకు, మూడ్‌ను ప్రతిబించించే విధంగా సంగీతం వినిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.

  సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్

  నెక్ట్స్ ఏంటీ మూవీకి ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫి. లండన్ నగరంలో సాగే కథలో అందమైన లోకేషన్లు, బీచ్ ఏరియాలు అత్యంత సుందరంగా కనిపిస్తాయి. లైటింగ్, ఆర్ట్ వర్క్‌కు సంబంధించిన బ్యూటీ తెరపైన రిచ్‌గా కనిపిస్తుంది.

  ఎడిటింగ్‌ పేలవంగా

  నెక్ట్స్ ఎంటీ సినిమాకు తగినట్టే ఎడిటింగ్‌ కూడా పేలవంగా ఉంది. నిడివి ఎక్కువగా ఉన్న సన్నివేశాలు కథా వేగానికి కళ్లెం వేసినట్టు కనిపిస్తాయి. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కంటే డైలాగ్స్‌తోనే నసపెట్టించారు. నాసిరకమైన ఎడిటింగ్ కారణంగా తమన్నా, సందీప్ మధ్య కెమిస్ట్రీ సరిగా పండలేకపోయింది.

  ప్రొడక్షన్ వాల్యూస్

  నెక్ట్స్ ఏంటీ మూవీకి సచిన్ జోషి, రైనా జోషి, ఆకాష్ పూరి నిర్మాతలుగా వ్యవహరించారు. వెన్ హ్యారీ మెట్ సాలీ అనే కథను ఆధారంగా చేసుకొని సినిమాను రూపొందించారు. కానీ కథ, కథనంలో పస లేకపోవడం ఈ బ్యానర్‌లో వచ్చిన సినిమాకు ప్రతికూలమని చెప్పవచ్చు. కాకపోతే నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా రిచ్‌గా కనిపించేలా రూపొందించారు.

  ఫైనల్‌గా

  ఎలాంటి రొమాంటిక్, యూత్ అంశాలు లేని అర్బన్ కోటెడ్ లవ్ స్టోరి నెక్ట్స్ ఏంటీ మూవీ. పేలవమైన కథ, కథనాలు సినిమాకు ప్రధానమైన లోపం. డైలాగ్స్ పార్ట్ ఈ సినిమాకు లోపంగా మారింది. బీ, సీ సెంటర్లను పక్కన పెడితే మల్టీప్లెక్ష్, ఏ సెంటర్లను ఆకట్టుకొనే అంశాలు లేకోవడం మైనస్.

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  • తమన్నా భాటియా, సందీప్ యాక్టింగ్
  • ఫాదర్, డాటర్ రిలేషన్
  • సినిమాటోగ్రఫి
  • మ్యూజిక్

  మైనస్ పాయింట్స్

  • స్క్రీన్ ప్లే
  • తొలిభాగంలో ఆరంభం
  • సెకండాఫ్‌లో కొంత స్లో నేరేషన్

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవ్‌దీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్ తదితరులు

  స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కునాల్ కోహ్లీ
  నిర్మాత: సచిన్ జోషి
  సంగీతం: లియాన్ జేమ్స్
  సినిమాటోగ్రఫి: మనీష్ చంద్ర భట్
  ఎడిటర్: అనిల్ కుమార్ బొంతు
  రిలీజ్: 2018-12-07

  English summary
  Next Enti? romantic comedy film directed by Kunal Kohli. The film stars Tamannaah, Sundeep Kishan and Navdeep in the lead roles. This movie released on December 7th. In this occassion, Telugu Filmibeat brings exclusive review.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more